For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెయిట్ లాస్, ఎసిడిటీ, కిడ్నీల్లో స్టోన్స్ సమస్యలకు పరిష్కారం..! అరటి కాండం !!

By Swathi
|

అరటిపండ్లు తినడం వల్ల రకరకాల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. అలాగే అరటిపండ్లను ఉపయోగించి చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. అలాగే జుట్టు సంరక్షణలోనూ అరటిపండ్లకు సాటిలేదు. అరటిపండ్లు అందరికీ అందుబాటులో ఉండే.. అద్భుతమైన పండు.. తక్కువ ధరలో తినగలిగే హెల్తీ ఫ్రూట్.

అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు అరటిపండ్లు తినడానికి 25 ఖచ్చితమైన కారణాలు

అలాగే అరటి ఆకులను కూడా భోజనం తినడానికి ఉపయోగిస్తాం. ఇక అరటితొక్క కూడా పళ్లు తెల్లగా మారడానికి సహాయపడుతుంది. అరటిపువ్వులోనూ అనేక హెల్త్ బెన్ఫిట్స్ దాగున్నాయి. ఇక మిగిలిన అరటి కాండాన్ని కూడా ఉపయోగించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు నివారించవచ్చని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. మొత్తానికి అరటిచెట్టు నుంచి మనం పొందే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అరటి ఆకు నుంచి పువ్వు, కాండం వరకు.. ప్రతీదీ ఆరోగ్యదాయకమే.

అరటిపండుతో సొగుసూ, సోయగం రెట్టింపు అరటిపండుతో సొగుసూ, సోయగం రెట్టింపు

అయితే అరటి కాండం వండుకోవడానికి సమయం తీసుకుంటుంది. దీన్ని శుభ్రం చేయడం అంతా పెద్ద పనితో కూడినది కావడంతో.. దీన్ని చాలామంది ఉపయోగించరు. కానీ.. దీన్ని కాస్త ఓపిక చేసుకుని వండుకోవడం వల్ల.. అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి అరటి కాండాన్ని డైట్ లో చేర్చుకోవడం వల్ల పొందే హెల్త్ బెన్ఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

అరటికాండం ఎలా ఉపయోగించాలి ?

అరటికాండం ఎలా ఉపయోగించాలి ?

అరటికాండంను కట్ చేయడం, క్లీన్ చేయడం శ్రమతో కూడిన పని కావడం వల్ల చాలా మంది దీనికి దూరంగా ఉంటారు. కాబట్టి.. దీన్ని ఎక్కువ మొత్తంలో కట్ చేసి.. మజ్జికలో నానబెట్టి ఫ్రిడ్జ్ లో నిల్వ ఉంచుకోవచ్చు. అయితే మజ్జిగని రెండు మూడు రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి.

అరటి కాండం జ్యూస్ 1

అరటి కాండం జ్యూస్ 1

అరటి కాండం, ఉప్పు, కాస్త వేయించిన జీలకర్ర, మిరియాలు, పెరుగు మిక్సీలో వేసి.. మెత్తగా పేస్ట్ చేయాలి. నచ్చితే అలానే తాగవచ్చు. అవసరమైతే నీళ్లు కలుపుకుని తాగవచ్చు.

అరటి కాండం జ్యూస్ 2

అరటి కాండం జ్యూస్ 2

ఒక యాపిల్, ఒక కప్పు ఉడికించిన అరటి కాండం, ఒక కప్పు నీళ్లు కలిపి.. బాగా పేస్ట్ చేయాలి. దీనివడకట్టి తీసుకోవచ్చు. లేదా ఐస్ క్యూబ్స్ మిక్స్ చేసి తాగవచ్చు.

కిడ్నీ స్టోన్స్

కిడ్నీ స్టోన్స్

అరటి కాండంలో డ్యురెటిక్ గుణాలుంటాయి. ఇవి కిడ్నీల్లో ఏర్పడే స్టోన్స్ కి కారణమయ్యే క్యాల్షియం లంప్స్ లేదా క్రిస్టల్స్ ని బయటకు పంపడానికి సహాయపడతాయి. వీటిని బయటకు పంపడం వల్ల కిడ్నీల్లో స్టోన్స్ ఏర్పడే అవకాశం ఉండదు.

స్టోన్స్ కరగడానికి

స్టోన్స్ కరగడానికి

అరటి కాండం గుజ్జు కిడ్నీల్లో స్టోన్స్ కరిగించడానికి కూడా సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎవరైనా గాల్ బ్లాడర్ స్టోన్స్, కిడ్నీ స్టోన్ సమస్యతో బాధపడుతుంటే.. వారానికి ఒకసారైనా వాళ్ల డైట్ లో అరటి కాండం చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

బరువు తగ్గడానికి

బరువు తగ్గడానికి

అరటికాండంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఒక కప్పు అరటికాండం జ్యూస్ తాగితే.. ఎక్కువ సేపు పొట్టనిండిన ఫీలింగ్ ఉంటుంది. కాబట్టి డైలీ డైట్ లో ఈ జ్యూస్ ని చేర్చుకుంటే.. బరువు తగ్గడం తేలికవుతుంది.

ఎసిడిటీ

ఎసిడిటీ

ఉదయాన్నే ఖాళీ కడుపుతో అరటికాండం జ్యూస్ తాగితే.. ఎసిడిటీ వల్ల పొట్టలో ఏర్పడే అసౌకర్యం నుంచి ఈజీగా బయటపడవచ్చు.

కాన్స్టిపేషన్

కాన్స్టిపేషన్

అరటి కాండంలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల.. కాన్స్టిపేషన్ ను నివారిస్తుంది. కాన్స్టిపేషన్ నివారించడానికి అరటికాండం జ్యూస్ తీసుకునేటప్పుడు వడకట్టకుండా తీసుకుంటే.. ఎక్కువ మొత్తంలో ఫైబర్ పొందవచ్చు.

డయాబెటిస్

డయాబెటిస్

అరటికాండం జ్యూస్ లో ఎలాంటి పంచదార ఉండదు. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచదు. ఈ జ్యూస్ ని వడకట్టకుండా తాగితే.. డయాబెటిక్ పేషంట్స్ కి మంచిది.

యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్

యురినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్

అరటి కాండం జ్యూస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందులో విటమిన్ బి6, పొటాషియం ఉండటం వల్ల ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది.

English summary

Lose weight, treat hyperacidity and get rid of kidney stones with banana stem

Lose weight, treat hyperacidity and get rid of kidney stones with banana stem. There are several benefits of eating bananas. Adding banana stem to your diet for the following benefits:
Story first published:Tuesday, April 26, 2016, 15:29 [IST]
Desktop Bottom Promotion