Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కీళ్లనొప్పులు నివారించడానికి పవర్ ఫుల్ హోం రెమిడీస్
ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న సమస్య కీళ్లనొప్పులు. వయసు పెరిగే కొద్దీ కీళ్లు అరగడం కారణంగా.. కీళ్ల నొప్పులు వస్తుంటాయి. దీనివల్ల మనుషులు చాలా బలహీనమవుతాయి. కొన్ని సందర్భాల్లో బలహీనంగా ఉండేవాళ్లకు కూడా కీళ్లనొప్పుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. వయసు పెరిగేటప్పుడు వచ్చే మార్పులు కూడా కీళ్ల నొప్పులు, అరుగుదలకు కారణమవుతాయి.
కొన్ని రకాల బ్యాక్టీరియా, వైరస్, ఇన్ఫెక్షన్లు కూడా కీళ్ల నొప్పులకు కారణమవుతాయి. అలాగే హార్మోన్ల అసమతుల్యత , థైరాయిడ్ ప్రభావం, సొరియాసిస్, రోగనిరోధకశక్తి తగ్గిపోవడం, సైనోవియల్ ద్రవంలో తేడాలు ఏర్పడటం వంటి సమస్యలు కూడా కీళ్లనొప్పులు రావడానికి కారణమవుతాయి. అధిక బరువు, ఎక్కువ సేపు కూర్చోవడం, లేదా నిలబడటం, ఆహార విధానంలో మార్పుల వంటి అలవాట్లు కూడా కీళ్లనొప్పుల సమస్యకు కారణమవుతాయి.

అయితే కీళ్లనొప్పులు ఉన్న వాళ్ల సమస్య అంతా ఇంతాకాదు. ఎన్ని మందులు వాడుతున్నా.. కదల్లేని పరిస్థితి ఉంటుంది. కూర్చోలేరు. నిలబడలేరు. ఎక్కువగా నడవలేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్లు హోం రెమిడీస్ ఫాలో అవడం వల్ల మంచి ఫలితం పొందవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
ఆవనూనెను రోజుకి రెండుసార్లు మసాజ్ చేయడం వల్ల ఉపశమనం పొందవచ్చు. అయితే మసాజ్ చేసేటప్పుడు కాస్త నొప్పిగా ఉన్నప్పటికీ.. తర్వాత చాలా ఉపశమనంగా ఉంటుంది.
ఉల్లిపాయ, ఆవాలు సమ భాగాలుగా తీసుకుని బాగా నూరి నొప్పిగా ఉన్న కీళ్ళమీద మర్దన చేసుకుంటే వెంటనే నొప్పులు తగ్గుతాయి.
జిల్లేడు వేరు చూర్ణాన్ని వేప నూనెలో బాగా కలిపి మర్దన చేసుకుంటే కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. లేదా 10 గ్రాముల తులసి రసాన్ని, 10 గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే.. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

నువ్వుల నూనె ఒక కప్పు, నాలుగు వెల్లుల్లిపాయ రేకులను చిన్న ముక్కలుగా చేసి నూనెలో వేసి బాగా మరిగించి, చల్లారిన తర్వాత వడగట్టి నొప్పి ఉన్న ప్రాంతంలో మసాజ్ చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications