For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గౌట్ పెయిన్, ఇన్ఫ్లమేషన్ తగ్గించే ఒకే ఒక మెడిసినల్ డ్రింక్ ...

By Super Admin
|

'గౌట్’ అనేది ఒక రకమైన ఆర్థరైటీస్, దీన్నే ఆయుర్వేదంలో 'వాత రక్తం’ అంటారు. మగవారిలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ఆడవారిలో మోనోపాజ్ దశ తర్వాత కనిపిస్తుంది. శరీరంలో జరిగే జీవనక్రియల సమతుల్యతలోపం వల్ల ఉత్పత్తి అయ్యే యూరిక్ యాసిడ్ రక్తంలో అధిక మోతాదులో చేరటం వల్ల కణజాలం వాపు ఏర్పడుతుంది. ముఖ్యంగా కాలి వేళ్ళ వద్ద ఈ గౌట్ లక్షణాలు ఎక్కువగా కనబడుతాయి .

సాధారణంగా కాలి బొటనవేలు గౌట్‌కి గురవుతుంది. దీనివల్ల జాయింట్లు, కణజాలం దెబ్బ తింటాయి. రాత్రి సమయంలో ఆకస్మికంగా తీవ్రమైన నొప్పి, వాపు, మంట, వేడి, ఎరుపుదనంతో కాలి బొటనవేలు బాధిస్తుంది. మోకాళ్ళు, చీలమండలు, పాదాలు కూడా బాధిస్తాయి. ముట్టుకుంటే భరించలేనంత నొప్పి, వేడిగా ఉండటం, వాపు లక్షణాలు ఉంటాయి. ఇది చేతివేళ్ళు, మణికట్టుకు కూడా వ్యాపిస్తుంది. అలసట, జ్వరం లక్షణాలుగా ఉంటాయి. జనటిక్ ప్యాక్టర్స్ కాకుండా, మనం తీసుకునే ఆహారం మరియు జీవనశైలి కూడా గౌట్ కు కారణమవుతుంది. ఈ సమస్యకు వెంటనే జాగ్రత్తలు తీసుకోకపోతే పరిస్థితి మరింత తీవ్రమవుతుంది. ఈ వ్యాధి ముదిరితే కీళ్ల దగ్గర చిన్న చిన్న స్ఫటికాలుగా కనిపిస్తుంది. కదలడానికి కూడా వీలుకాకుండా చేస్తుంది .

One Drink That Helps Cure Gout Pain

ఇది కొన్నిసార్లు అనువంశికంగా రావచ్చు. కుటుంబంలో ఒకరికి ఉన్నట్లయితే భావితరాలకు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ వ్యాధులు, కొన్ని రకాల ఔషధాలు వాడటం వల్ల, మాంసాహారం అధికంగా తినడం వల్ల, అధిక బరువు, ఆల్కహాలు ఎక్కువగా తాగడం వల్ల, క్షయ నివారణ మందుల వల్ల, కేన్సర్ వ్యాధుల వల్ల యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ఆయుర్వేదం ప్రకారంన గౌట్ వ్యాధి, వాతదోషం, పిత్తదోషం, రక్తధాతువు మోతాదులో లవణం, ఆమ్లం, క్షార, ఉష్ణపదార్థాలు తీసుకోవటం వల్ల, నిల్వ పదార్థాలు తినడం వల్ల, పుల్లని పెరుగు, మజ్జిగ వాడటం, నిల్వచేసిన చేపలు, మాంసం తినడం వల్ల, ఉలవలు, అనుములు తీసుకోవటం వల్ల వస్తుంది.
One Drink That Helps Cure Gout Pain

గౌట్ వ్యాధిని నయం చేసుకోవడానికి ప్రస్తుతం వైద్యపరంగా చాలా మందులు అందుబాటులో ఉన్నాయి.

రసాయనిక మందుల కంటే, నేచురల్ గా ఇంట్లో తయారుచేసుకునే ఒకే ఒక పానీయంతో గౌట్ వ్యాధి నుండి ఉపశమనం పొందవచ్చు. పచ్చిబొప్పాయి, మరియు గ్రీన్ టీ లీవ్స్ ఈ రెండు పదార్థాల మిళితం గౌట్ వ్యాధి, నొప్పిని నివారించడంలో గొప్పగా సహాయపడుతుందని నిరూపించబడినది

పచ్చిబొప్పాయిలో విటమిన్స్, పొటాషియం, మెగ్నీషిం, ఎంజైమ్స్ మరియు ఫైటోన్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి . ఇది పొట్టకు మరియు జీర్ణవ్యవస్థకు చాలా మంచిది, గౌట్ పెయిన్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది.

One Drink That Helps Cure Gout Pain

గౌట్ వ్యాధి వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్, తగ్గించి, నొప్పి నుండి ఉపశమనం పొందేలా చేస్తుంది . ఇంకా గౌట్ సంబంధిత ఆర్థరైటిస్ మరియు ఆస్త్మా వంటి సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది

కోలన్ శుభ్రం చేస్తుంది, వికారం, మలబద్దకం, మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది .

మరో పదార్థం, గ్రీన్ టీ లీప్ లో యాంటీ ఆక్సిడెంట్ అధికంగా ఉంటుంది. ఇంకా ఇందులో ఉండే ఫాలీ పినాల్స్ మరియు గాలిక్ యాసిడ్స్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

గౌట్ పెయిన్ నివారించుకోవడానికి తయారుచేసి ఈ డ్రింక్ కోసం ఉపయోగించే పచ్చిబొప్పాయి మరియు గ్రీన్ టీ లీవ్స్ సహజసిద్దంగా మనకు లభించినవి మరియు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.

One Drink That Helps Cure Gout Pain

గౌట్ నివారణకు ఔషధ తయారీ :

1. రెండు లీటర్ల నీరు తీసుకొని, గిన్నెలో పోసి బాగా మరిగించాలి.

2. పచ్చిబొప్పాయిని తీసుకుని శుభ్రంగా తొక్కతీసి కడిగేసుకోవాలి.

3. లోపల విత్తనాలు తొలగించి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

4. బాయిలింగ్ వాటర్ లో బొప్పాయి ముక్కలు వేసి 5 నిముషాలు ఉడికించుకోవాలి.

5. తర్వాత అందులో గ్రీన్ టీ లీవ్స్ వేసి బాగా మరిగించాలి.

6. గ్రీన్ టీ బొప్పాయి ను వేసి ఉడికించిన ఈ నీటిని వడగట్టి చల్లార్చాలి.

7. గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగడం వల్ల గౌట్ నొప్పి, వాపు నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

English summary

One Drink That Helps Cure Gout Pain

Are you experiencing pain in your joints and have those areas also turned tender, red and swollen? This should not be ignored for long, as it might be the symptoms of gout.It is most commonly seen around the joints of the big toe and is extremely painful. Other joints where gout affects are especially around one's toes, knees, fingers and heels.
Story first published:Wednesday, June 29, 2016, 7:10 [IST]
Desktop Bottom Promotion