Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
టంగ్ అల్సర్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్
మన శరీరంలో నాలుక చాలా సెన్సిటివ్ మరియు స్ట్రాంగెస్ట్ మజిల్ . మరి ఇంత సెన్సిటివ్ ఆర్గాన్ కు అల్సర్ వస్తే..!అబ్బో ఆ బాధ వర్ణనాతీతం . చాలా నొప్పిగా మరియు మంటగ ఉండటమే కాదు అసౌకర్యంగా కూడా ఉంటుంది. టంగ్ అల్సర్ నాలుక చుట్టు లేదా నాలుక మీద చిన్న బంప్స్ (పింపుల్స్ )వంటివి ఏర్పడుతాయి. లేదా నాలుక చుట్టు నాలుక బార్డర్ వద్ద ఎర్రగా ఉండే ప్రదేశంలో ఈ బుడిపెలు వంటివి ఏర్పడుతాయి.
వీటినే కాంకర్ సోర్స్ లేదా ఆప్థస్ స్టొమటైటిస్, టంగ్ అల్సర్ అని అంటుంటారు. ఈ బంప్స్ వైరస్ వల్ల వస్తుంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఏదో ఒక సందర్భంలో అనుభవం కలిగి ఉంటారు . ఈ టంగ్ అల్సర్ వచ్చిందంటే కనీసం 7 నుండి 10 రోజుల పాటు బాధించే సమస్య. మరి ఇలాంటి ఇబ్బంది కలిగించే టంగ్ అల్సర్ కు కారణమేంటి..?
ఈ బాధకరమైన టంగ్ పింపుల్స్ కు ప్రత్యేకంగా కారణాలంటూ లేవు. కానీ కొన్ని సందర్భాల్లో ఫుడ్ సెన్సిటివిటి మరియు అండర్ లైయింగ్ డిజార్డ , ప్రమాదవశాత్తు నోటి లోపలి భాగంలో బుగ్గులు లేదా నాలుక లేదా పెదాలను కొరుక్కోవడం . ఇంకా ప్రేగు లేదా స్టొమక్ డిజార్డర్స్ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంది .
ఇంకా చెప్పాలంటే వైరస్ కారణంగా కూడా రావచ్చు మరియు మరికొంత మంది విషయంలో సరైన నోటి శుభ్రత పాటించకపోవడం వల్ల , డెంటల్ కండీషన్స్ వల్ల , విటమిన్ 12 లేదా విటమిన్ సి లోపం వల్ల , హార్మోనుల అసమతుల్యత వల్ల, జన్యు పరంగా , ఫోలిక్ యాసిడ్ లోపం సోడియం లర్లీ సల్ఫేట్ ఉన్న టూత్ పేస్ట్ ను వాడటం వల్ల మరియు నాలుక కొరుక్కోవడం లేదా మింగడానికి గాయం అయినప్పుడు టంగ్ అల్సర్ వచ్చే అవకాశం ఉంది.
ఈ టంగ్ అల్సర్ ఇన్ఫ్లమేషన్ ను వైద్యపరిబాషలో గ్లాసిస్ట్స్ అని పిలుస్తుంటారు , అదే సమయంలో నొప్పి ఉంటే గ్లాసోడినియా అని కూడా చెబుతారు .ఈ ఇన్ఫ్లమేషన్ నాలుకు చివర్లు లేదా నాలుక చుట్టూ లేదా నాలుకు చివరి బాగంలో బాధిస్తుంటుంది . వాపు నాలుకు వెనుక వైపు కూడా ఉంటుంది లేదా నాలుక మొత్తం ఉంటుంది. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటి అంటే ?కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి....
అవేంటంటే...

కొబ్బరి:
మొదట కొబ్బరిని తురమాలి . అందు నుండి పాలు వేరు చేయాలి. టంగ్ అల్సర్ నివారించడానికి ఈ కోకనట్ మిల్క్ నేచురల్ మరియు సింపుల్ హోం రెమెడీ . ఇలా తీసిన కోకనట్ మిల్క్ ని నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి . టంగ్ అల్సర్ నివారించుకోవడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది . ఈ చిట్కాను రోజులో కనీసం మూడు సార్లైనా చేస్తే త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

బేకింగ్ సోడా:
ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా మరియు ఒక టీస్పూన్ వాటర్ తో మిక్స్ చేసి , ఈ మిశ్రమాన్ని నేరుగా నాలుక మీద, ఎఫెక్టెడ్ ప్రదేశంలో నేరుగా అప్లైచేయాలి . నాలుక మీద ఉండే వివిధ రకాల బ్యాక్టీరియాను తొలగించడంలో బేకింగ్ సోడా గ్రేట్ గా పనిచేస్తుంది .అలాగే ఒక చెంచా బేకింగ్ సోడాని గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి రాత్రి నిద్రించడానికి ముందు నోటిని శుభ్రం చేసుకోవాలి.

చమోలి టీ:
చమోలీటీ ఇది ఒక ట్రెడిషినల్ మెడిస్ . ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది టంగ్ అల్సర్ ను నివారించడంలో గ్రేట్ గా పనిచేస్తుంది . ఇది చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి టంగ్ అల్సర్ నివారిస్తుంది.

అలోవెర:
అలోవెర నుండి తీసిన జ్యూస్ ఒక బెస్ట్ హోం రెమెడీ. ఇది కాంకర్ సోర్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది .అలోవెర జ్యూస్ తో నోటిని శుభ్రం చేసుకుంటుంటే మంచి ఫలితం ఉంటుంది.

పసుపు మరియు తేనె:
కాంకర్ సోర్స్ చాలా బాధిస్తుంటాయి . ఇది బాడీని బ్యాలెన్స్ చేయలేదని సూచన కూడా. కాబట్టి పసుపులో కొద్దిగా నీరు మిక్స్ చేసి నేరుగా నాలుక చుట్టూ అప్లై చేయాలి . మరో హోం రెమెడీ ఒక టీస్పూన్ తేనెకు 1/4టీస్పూన్ పసుపు మిక్స్ చేయాలి . ఈ పేస్ట్ ను నాలుక మీద ప్రభావితమైన ప్రదేశంలో అప్లై చేయాలి. కొద్ది సమయం తర్వాత కాటన్ తో తుడిచేయాలి.

లవంగం నూనె:
పెయిన్ ఫుల్ టంగ్ అల్సర్ నివారించడంలో ఫర్ఫెక్ట్ హోం రెమెడీ .లంగం నూనెలో ఓరల్ పెయిన్ మరియు కాంకర్ సోర్స్ నివారించే లక్షణాలు ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి . అరటీస్పూన్ ఆలివ్ ఆయిల్ మరియు 5చుక్కల లవంగం నూనె మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమంలో కాటన్ బాల్ డిప్ చేసి నేరుగా ఎఫెక్టెడ్ ప్రదేశంలో అప్లై చేయాలి ., 10 నిముషాల తర్వాత శుభ్రం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వేపాకు:
వేప ఆకు కూడా ఒక మంచి మెడీసినల్ రెమెడీ . టంగ్ అల్సర్ నివారించడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది . వేపఆకులను నీటిలో వేసి 30 నిముషాలు మరిగించాలి . తర్వాత నీటిని వడగట్టుకోవాలి . భోజనానికి ముందు , భోజనం తర్వాత ఈ నీటితో నోరు శుభ్రం చేసుకోవాలి . ఇంకా వేప ఆకును రోజూ నమలడం వల్ల కాంకర్ సోర్ చాల వేగంగా తగ్గిపోతుంది.

ప్లమ్:
పెయిన్ ఫుల్ టంగ్ అల్సర్ నివారణకు ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ. ప్లమ్ జ్యూస్ తో నోటిని గార్గిలింగ్ చేయాలి . కాటన్ బాల్ ను ప్లమ్ జ్యూస్ లో డిప్ చేసి నోటిలోపల చుట్టూ, నాలుక చుట్టూ అప్లై చేయాలి . టంగ్ అల్సర్ నుండి వేగంగా ఉపశమనం కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications