For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మౌత్ అల్సర్ ఎఫెక్టివ్ గా నివారించే సింపుల్ హోం రెమెడీస్

By Super Admin
|

మౌత్ అల్సర్లను నోటిపుండ్లు లేదా ఆఫ్తస్ అల్సర్స్ అంటారు. ఇవి చాలా చిన్నవిగా నోటి లోపల వైపు వస్తుంటాయి. ఇది వంశపారంపర్యమైనదీ కాదు, అలా అని ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందే సమస్యా కాదు. ఈ మౌత్ అల్సర్ పిల్లల్లోనూ.. పెద్దల్లోనూ ఇద్దరిలోనూ కనిపిస్తుంటాయి. ఇవి ముఖ్యంగా పెదాల లోపల చర్మానికి అంటి పెట్టుకొని పుండులా ఏర్పడుతూ భయంకరమైన నొప్పి లేదా మంటను కలిగిస్తాయి.

అంతే కాదు ఏదైనా ఆహారాన్ని మింగాలన్నా లేదా తాగాలన్నా, చాల పెయిన్ ఫుల్ గా ఉంటుంది. ఈ రకమైన మౌత్ అల్సర్లు రావడం చాలా సాధారణం. కొన్నిసార్లు దంతాలు నోటి లోపల చర్మానికి గుచ్చుకోవడం, బ్రష్ చేసేటప్పుడు టూత్‌బ్రష్ తగిలి గాయం కావడం, నాలుకను లేదా చెంప లోపలి వైపున పొరపాటున కొరుక్కోవడం, లేదా శరీరం బాగా వేడి చేసినప్పుడు, నోటిని శుభ్రం ఉంచుకోకపోవడం, విటిమిన్స్ లోపం, ఒత్తిడి, నిద్రలోపం, డీహైడ్రేషన్ వంటి కారణంగా ఈ రకమైన అల్సర్లు వస్తుంటాయి. వీటి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు.

ఈ నోటి అల్సర్లు ఒక్కసారి వచ్చిందంటే చాలు....24గంటలు నొప్పి, మంటను భరిస్తూనే ఉండాలి. ఎంతటి తీపిపదార్థాలు తిన్నా, నోట్లో కారం వేసినట్టు మంట పుడుతుంది. అందుకే ఇలాంటి సమస్యకు చెక్ పెట్టడానికి సహజపద్దతుల్లో ఏమేం చేయచ్చో ఓసారి చూద్దామా...

కొబ్బరి పాలు:

కొబ్బరి పాలు:

మొదట కొబ్బరిని తురమాలి. దాని నుంచి పాలు వేరు చేయాలి. టంగ్ అల్సర్ నివారించడానికి ఈ కోకనట్ మిల్క్ నేచురల్ అండ్ సింపుల్ హోం రెమెడీ. ఇలా తీసిన కోకనట్ మిల్క్ ని నోట్లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి. టంగ్ అల్సర్ నివారించుకోవడంలో ఇది గ్రేట్ గా పనిచేస్తుంది. ఈ చిట్కాను రోజులో కనీసం మూడు సార్లైనా చేస్తే త్వరగా ఉపశమనం కలిగిస్తుంది.

కొత్తిమీర:

కొత్తిమీర:

మౌత్ అల్సర్ ను నివారించడానికి కొత్తిమీర గ్రేట్ రెమెడీ. కొత్తిమీరను నీటిలో వేసి ఉడికించి ఆ నీటితో గార్గిలింగ్ చేయడం వల్ల మౌత్ అల్సర్ నివారించుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ కూడా నివారిస్తుంది.

హాట్ అండ్ కోల్డ్ వాటర్:

హాట్ అండ్ కోల్డ్ వాటర్:

హాట్ వాటర్, కోల్డ్ వాటర్ ను మార్చిమార్చి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల మౌత్ అల్సర్ నివారించబడుతుంది. ఇది ఇన్ఫమేషన్ తగ్గిస్తుంది.

మెంతులు:

మెంతులు:

నీటిలో కొద్దిగా మెంతులను మిక్స్ చేసి ఉడికించాలి. తర్వాత ఆ నీటిని వడగట్టి, గోరువెచ్చగా చేసి నోట్లో పోసుకుని గార్గిలింగ్ చేయడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా సమస్యను నివారిస్తుంది.

అలోవెర:

అలోవెర:

ఇది ఎఫెక్టివ్ నేచరల్ హోం రెమెడీ . అలోవెర జెల్ ను రెండు టేబుల్ స్పూన్స్ రోజులో మూడుపూటలా తీసుకోవడం వల్ల మౌత్ అల్సర్ తగ్గించుకోవచ్చు .

తులసి:

తులసి:

తులసిలోని ఔషధగుణాలపై చేసిన పరిశోధనల్లో ఇందులో నోటి అల్సర్లను తగ్గించే లక్షణం కూడా ఉందని నిరూపితమైనది. దీనికోసం కొన్ని తులసి ఆకులను తీసుకొని, రోజుకు నాలుగైదు సార్లు వీటిని నమలడం వల్ల సులభంగా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. ఆకులను నమిలేటప్పుడు వాటికి కొన్ని నీళ్లు కూడా జతచేస్తే ఆ ద్రావణం నోరంతా వ్యాపించి, సమస్యను త్వరగా తగ్గిస్తుంది.

టమోటోలు:

టమోటోలు:

పచ్చిటమోటోలు ముక్కలు ఒకటి తినాలి లేదా 5 బేబీ టమోటోలను తింటుండాలి. వీటిని తినేటప్పుడు నిదానంగా మౌత్ అలర్స్ ఉన్న ప్రక్క కాకుండా రెండో పక్క బాగా నమిలి ఆ జ్యూసును నోట్లో ఉండేలా తినాలి.

English summary

Simple Home Remedies For Mouth Ulcers, That Really Work!

Simple Home Remedies For Mouth Ulcers, That Really Work! If you have ever suffered from ulcers in your mouth, you will definitely know how horribly painful they can be, right?
Story first published: Saturday, September 3, 2016, 15:52 [IST]
Desktop Bottom Promotion