For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీళ్ల నొప్పులు నివారించే.. అమేజింగ్ సొల్యూషన్: నిమ్మ తొక్క..!!

By Swathi
|

నిమ్మకాయను రకరకాలుగా ఉపయోగిస్తారు. ఆరోగ్యానికి, చర్మ, జుట్టు సౌందర్యంలో కూడా నిమ్మకాయ కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే.. చెడ్డ కన్ను సోకకుండా.. కూడా నిమ్మకాయను ఉపయోగిస్తాయి. అయితే.. నిమ్మ తొక్కను కీళ్ల నొప్పులు నివారించడానికి ఉపయోగిస్తారంటే ఆశ్చర్యంగా ఉంది కదూ.

నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి.. జలుబు, అజీర్ణం, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వంటి రకరకాల సమస్యలను నివారిస్తాయి. ఇందులో పోషకాలు.. ఇమ్యునిటీని కూడా మెరుగుపరుస్తాయి.

lemon peel to cure joint pain

నిమ్మతొక్క విషయానికి వస్తే.. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. చేదుగా ఉన్నప్పటికీ.. నిమ్మతొక్కలో సిట్రిక్ యాసిడ్, ఫోర్మిక్ యాసిడ్, సిట్రోనెల్లా, పెక్టిన్స్ వంటి పోషకాలు.. అనేక అనారోగ్య సమస్యలను నివారించడానికి సహాయపడతాయి.

నిమ్మతొక్కలో యాంటీ ఇన్ల్ఫమేటరీగా కూడా పనిచేయడం వల్ల కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది. ఇది..కీళ్ల నొప్పులు తగ్గించి.. కూలింగ్ ఎఫెక్ట్ ని ఇస్తుంది. మరి నిమ్మతొక్కను కీళ్ల నొప్పులు నివారించడానికి ఎలా ఉపయోగించాలో చూద్దామా..

lemon peel

కొన్ని నిమ్మ కాయలు తీసుకోని.. నిమ్మ తొక్కను మాత్రమే.. తురుము కోవాలి. కేవలం ఎల్లో కలర్ లో ఉన్న తొక్క మాత్రమే వచ్చేలా జాగ్రత్తపడాలి. ఇలా తురుముకున్న తొక్కను కీళ్ల నొప్పులు ఉన్న ప్రాంతంలో రాసుకుని.. బ్యాండేజ్ కట్టుకోవాలి. ఇలా 2 నుంచి 3 గంటలు అలాగే పెట్టుకుంటే.. కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి.

lemon olive oil

కొన్ని నిమ్మతొక్కలను ఒక గాజు డబ్బాలో వేయాలి. కొన్ని యూకలిప్టస్ ఆకులు, ఆలివ్ ఆయిల్ కలిపి.. ఇప్పుడు మూతపెట్టి బాగా టైట్ గా తిప్పాలి. రెండు వారాలు అలాగే ఉన్న తర్వాత.. కీళ్లనొప్పులపై అప్లై చేసుకోవాలి. కాస్త నొప్పిగా ఉంటుంది. కానీ రాత్రంతా అలానే పెట్టుకోవాలి. ఇది నొప్పిను తగ్గిస్తుంది.

lemon tea

టీరూపంలో నిమ్మతొక్కను తీసుకోవడం వల్ల కూడా.. కీళ్ల నొప్పులను ఎఫెక్టివ్ గా తగ్గించవచ్చు. కొన్ని నిమ్మతొక్కలను వేడినీటిలో ఉడికించాలి. కొన్ని నిమిషాలు ఉడికిన తర్వాత.. కొద్దిగా తేనె కలుపుకుని.. తాగాలి. అంతే.. ఇలా చేయడం వల్ల కూడా..కీళ్ల నొప్పులు, వాపు ఎఫెక్టివ్ గా తగ్గుతుంది.

English summary

Surprising ! This Is How Lemon Peel Helps Cure Joint Pain

Surprising ! This Is How Lemon Peel Helps Cure Joint Pain. But surprisingly the lemon peel which we generally throw away helps in curing joint pain.
Story first published: Wednesday, October 5, 2016, 16:26 [IST]
Desktop Bottom Promotion