Latest Updates
-
సాయంత్రం చిరుతిళ్లకి ఏం చేయాలో తెలియట్లేదా.. చిరు చినుకుల్లో ఈ సింపుల్, హెల్తీ స్నాక్స్‌పై ఓ లుక్కేయండి.! -
తొలి ఏకాదశి పర్వదినం.. విష్ణుమూర్తికి ప్రీతికరమైన తులసీ పూజ ఇలా చేస్తే కష్టాలు తొలగిపోతాయి.! -
లంచ్ తర్వాత విపరీతంగా నిద్ర మత్తు.. వీటిని అలవాటు చేసుకుంటే ఇక కునుకు మాటే ఉండదు.! -
వాతావరణ మార్పులతో మోకాళ్ల నొప్పుల బాధలు.. ఉపశమనం కోసం ఇంట్లోనే ఇలా చేయండి.! -
తిరోగమనం నుంచి బయటపడ్డ బుధ గ్రహం.. ఇక ఈ రాశుల వారి దశ తిరిగినట్లే.! -
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక!
కేవలం నెలరోజుల్లో డయాబెటిస్ ని నయం చేసే.. మామిడాకుల రెమిడీ..!!
డయాబెటిస్ అనేది.. ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధి. ఒకవేళ మీలో ఎవరైనా డయాబెటిస్ తో బాధపడుతుంటే...న్యాచురల్ రెమిడీస్ ద్వారా నయం చేసుకోవడం మంచిది. డయాబెటిస్ అనేది సీరియస్ మెటబాలిక్ డిజార్డర్. ఇది.. వయసు, జెండర్ తో సంబంధం లేకుండా.. ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా 50 ఏళ్లు దాటిన వాళ్లలో డయాబెటిస్ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది.
బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్ వస్తుంది. శరీరం సరైన మోతాదులో ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు, శరీర కణాలు ఇన్సులిన్ కి స్పందించనప్పుడు ఈ సమస్య ఎదురవుతుంది. డయాబెటిస్ ఉన్న వాళ్లలో తరచుగా యూరినేషన్, ఎక్కువ దప్పిక, అలసట, వెయిట్ లాస్, కంటిచూపు సమస్యలు, గాయాలు నెమ్మదిగా నయం అవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

డయాబెటిస్ తో బాధపడేవాళ్లు డైట్ ఫాలో అవ్వాలి. మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల డయాబెటిస్ లక్షణాలను కంట్రోల్ చేయవచ్చు. అయితే.. హోం రెమిడీస్ కూడా.. డయాబెటిస్ ని ఎఫెక్టివ్ గా నివారిస్తాయి. ముఖ్యంగా మామిడి ఆకులు డయాబెటిస్ ని చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తాయి.

కావాల్సిన పదార్థాలు
మామిడి ఆకులు 2
పాలు 1 టేబుల్ స్పూన్
మామిడాకులు డయాబెటిస్ లక్షణాలను చాలా ఎఫెక్టివ్ గా కంట్రోల్ చేస్తాయని, రెగ్యులర్ గా తీసుకుంటూ.. డైట్, వ్యాయామం చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చని అధ్యయనాలు నిరూపించాయి. మామిడాకులలో అనేక ఔషధ గుణాలు దాగుంటాయి.
ఆయుర్వేదం ప్రకారం మామిడాకులు డయాబెటిక్ పేషంట్స్ బాగా ఉపయోగపడతాయి. మామిడి ఆకుల్లో మినరల్స్, యాంటి ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండటం వల్ల.. ఇన్సులిన్ ని గ్రహించే సత్తా కణాలకు మెరుగవుతుంది. అలాగే ఇన్సులిన్ ఉత్పత్తిని రెగ్యులేట్ చేసి.. డయాబెటిస్ ని నివారిస్తుంది.

తయారు చేసుకునే విధానం
మామిడి ఆకులను శుభ్రం చేసి.. 15 నిమిషాలు ఉడికించాలి. ఆకులు రాత్రంతా.. ప్యాన్ లోనే ఉంచాలి. ఉదయాన్నే ఆ నీటిని మళ్లీ మరిగించి.. ఆకులు తీసేయాలి. మరిగించిన పాలు మిక్స్ చేయాలి. ఒక కప్పులోకి తీసుకుని డయాబెటిస్ తో బాధపడేవాళ్లు రెగ్యులర్ గా ఉదయం బ్రేక్ ఫాస్ట్ కి ముందు తీసుకోవాలి. అంతే ఇలా ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటే.. డయాబెటిస్ నెలరోజుల్లో కంట్రోల్ అవుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications