For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్క రోజులో మలబద్దక సమస్యను నివారించే లాక్సేటివ్ ఫుడ్స్ ..!

|

మల విసర్జన సహజమైన కాలకృత్యాలలో ఒకటి. మామూలుగా ప్రతి మనిషికీ ఒక పద్ధతిలో మల విసర్జన జరుగుతుంది. కొందరిలో రోజుకు రెండు సార్లు జరిగితే, కొందరిలో రెండు-మూడు రోజులకొకసారి అవుతుంది. ఎవరిలోనైనా వారికి సహజమైన పద్ధతిలో మార్పు సంభవించి, జరగాల్సిన సమయంలో మల విసర్జన జరగనట్లయితే దానిని మలబద్దకం (Constipation) గా భావించాలి. సాధారణంగ మూడు రోజులకు మించి మలవిసర్జన కాకుండ ఉంటే దానికి కారణం తెలుసుకోవడం మంచిది.

నేటి ఆధునిక సమాజంలో చాలామందిని వేధిస్తున్న సమస్య మలబద్ధకం. దీనికి ప్రధాన కారణం- మారిన జీవన విధానం, సమయానికి ఆహారం, నీరు తీసుకోకుండా పోవడం. ఒకవేళ తీసుకున్నా హడావుడిగా ముగించడం, ఎసిడిటి, అజీర్తి, ఇన్ యాక్టివ్ లైఫ్ స్టైల్, నిత్యం చిరాకు, కోపం- వీటితోపాటు తీవ్ర మానసిక ఒత్తిడి, కొన్ని రకాల మందులు, కోలన్ క్యాన్సర్, పైల్స్ ఫలితంగా మలబద్ధకం నేడు ప్రధాన సమస్యగా తీవ్ర రూపం దాల్చుతుంది. మలబద్ధకమే కదా అని తేలికగా తీసుకుంటే.. మానవునికి వచ్చే చాలా రకాల వ్యాధులకు 'మలబద్ధకమే' మూల కారణంగా ఉంటుంది.

మలవిసర్జన సమయంలో నొప్పి వస్తున్నట్టయితే ఖచ్చితంగా మీకు మలబద్దకం సమస్య ఉన్నట్టు గుర్తించాలి. అయితే, ఈ సమస్య పట్ల నిర్లక్ష్యం చేయడం తగదు. తీవ్రమైన నొప్పితో బాధపడే వరకు డాక్టరు దగ్గరకు వెళ్లకుండా ఉండకూడదు. మలద్వారానికి పగుళ్ళు ఏర్పడాన్ని మలబద్దకం ఫిషర్‌గా కూడా పిలుస్తారు. మలబద్ధకంతో ముఖ్యంగా జీర్ణాశయ వ్యాధులు, హైపర్‌టెన్షన్, పైల్స్, ఫిషర్స్, తలనొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశం కలదు. ఒక సర్వే ప్రకారం యునైటెడ్ స్టేట్స్ లో మలబద్దకం అత్యంత సాధారణ జీర్ణ సమస్య. ఇది జనాభాలో 2 % నుండి 20 % సంభవిస్తుంది. ఇది మహిళల్లో ఎక్కువగా పెద్దలు మరియు పిల్లల్లో సాధారణంగా కనిపిస్తుంది. ఇది పెద్దవారిలో వ్యాయామము చేయకపోవడము వలన మరియు వయసుతో పాటు వచ్చే ఇతర ఆరోగ్య సమస్యల వలన తరచుగా సంభవిస్తుంది.

మలబద్దక సమస్యలకు కొన్ని ముఖ్య లక్షణాలు స్టూల్ పాస్ చేసేప్పుడు ఎక్కువగా నొప్పిగా అనిపించడం, గ్యాస్ట్రిస్టైటిస్, పొట్ట ఉదరంలో వాపు, నొప్పి, రెక్టమ్ లో నొప్పి, వికారం, వాంతులు కూడా ఉంటాయి. మలబద్దక సమస్యను నివారించుకోవడానికి స్ట్రాంగ్ లాక్సేటివ్స్ తీసుకుంటుంటారు. లాక్సేటివ్ ప్రేగులకు హాని కలిగిస్తాయి . దాంతో ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మలబద్దక సమస్యను నివారించుకోవడానికి నేచురల్ గా ఫుడ్ రూపంలో నేచురల్ లాక్సేటివ్ అందించే ఆహారాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

 వాటర్ మెలోన్:

వాటర్ మెలోన్:

మలబద్దక సమస్యను నివారించే ఆహారాల్లో వాటర్ మెలోన్ ఒకటి. వీటిలో ఫైబర్లు అధికంగా ఉంటాయి. బౌల్ మూమెంట్ సులభంగా జరుగుతుంది.

ఓట్ మీల్:

ఓట్ మీల్:

ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఓట్ మీల్ తీసుకోవడం వల్ల మలబద్దక సమస్యలు నివారించబడుతాయి. ఓట్ మీల్లో ఫైబర్ అత్యధికంగా ఉండటం వల్ల ఇది మలబద్దక సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.

 స్ట్రాబెర్రీ:

స్ట్రాబెర్రీ:

మలబద్దకం నివారించడంలో స్ట్రాబెర్రీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. స్ట్రాబెర్రీస్ లో పెక్టిన్ అనే కాంపౌండ్ ప్రేగుల్లో మ్యూకస్ ను పెంచుతుంది. దాంతో స్టూల్ సులభంగా పాస్ అవుతుంది.

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్:

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ లో డైటరీ ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఇది మలబద్దకంను గ్రేట్ గా నివారిస్తుంది.

 ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్ష:

ఎండు ద్రాక్షల్లో స్టూల్ సాప్ట్ గా మార్చే ఫైబర్, మెగ్నీషియంలు అధికంగా ఉన్నాయి. రెగ్యులర్ గా వీటిని తింటుంటే మలబద్దక సమస్య ఉండదు.

పెరుగు :

పెరుగు :

పెరుగులో నేచురల్ ల్యాక్సేటివ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి హెల్తీ గౌట్ బ్యాక్టీరియాను పెంచుతుంది. మలబద్దక సమస్యను నివారిస్తుంది.

యాపిల్స్ :

యాపిల్స్ :

ఆపిల్స్ లో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఫైబర్ తో పాటు యాంటీఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండటం వల్ల బౌల్ మూమెంట్ ను ప్రోత్సహిస్తుంది.

 ఫ్లాక్స్ సీడ్స్ :

ఫ్లాక్స్ సీడ్స్ :

మలబద్దక సమస్యను నివారించడంలో నేచురల్ రెమెడీ ఫ్లాక్స్ సీడ్స్. వీటిలో ఓమేగా 3ఫ్యాటీయాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

కాలీఫ్లవర్ :

కాలీఫ్లవర్ :

మలబద్దకం ను నివారించే హోం రెమెడీస్ లో కాలీఫ్లవర్ ఒకటి. దీన్నీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల సమస్య నుండి త్వరగా ఉపశమనం పొందుతారు. కాలీఫ్లవర్ లో ఉండే ఫైబర్ బౌల్ మూమెంట్ ను ప్రోత్సహిస్తుంది.

ఆరెంజ్

ఆరెంజ్

ఆరెంజ్ లో విటమిన్ సి అత్యధికంగా ఉంటుందిజ ఇది మలబద్దక సమస్యను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

స్వీట్ పొటాటో :

స్వీట్ పొటాటో :

స్వీట్ పొటాటో నేచురల్ ల్యాక్సేటివ్. ఇందులో ఫైబర్ అత్యధికంగా ఉంటుంది. ఫైగర్ తో పాటు, వాటర్ కంటెంట్, మెగ్నీషియంలు కూడా ఎక్కువే..

దాంతో మలబద్దక సమస్యలను నివారించుకోవచ్చు.

గుమ్మడి:

గుమ్మడి:

రెగ్యులర్ డైట్ లో గుమ్మడిని ఎక్కువగా చేర్చుకోవడం వల్ల, గుమ్మడిలో ఉండే ఫైబర్ , ఎలక్ట్రోలైట్స్ మలబద్దక సమస్యను నివారించడంలో గ్రేట్ గా సమాయపడుతుంది. బౌల్ మూమెంట్ ను ప్రోత్సహిస్తుంది.

English summary

These Foods Can Cure Constipation In A Day!

Have you been having "toilet troubles" lately? Are you finding it difficult to pass stools with ease? If yes, then you should try certain foods that can help provide relief from constipation and reduce it.
Story first published: Wednesday, October 5, 2016, 11:08 [IST]
Desktop Bottom Promotion