Latest Updates
-
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్!
పొటాటో, హానీ -ఒక్క డ్రింక్ చాలు ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి...!
పూర్వకాలంలో పోల్పుకుంటే, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో ఆహారపు అలవాట్లు, జీవనశైలిలో అనేక మార్పులు వచ్చాయి. అంతే కాదు, పండించే ఆహారాలు, మనం తినేఆహారాల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఆర్గానిక్ ఫుడ్స్ కంటే, రసాయనికంగా పండించే ఆహారాలు ఎక్కువైనాయి. ఈ మార్పుల వల్ల పూర్వకాలం కంటే ప్రస్తుత కాలంలో ఎక్కువగా వివిధ రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.
హెల్త్ కాన్షియస్ నెస్ ఉన్నవారు , ముందు జాగ్రత్తగా ఫ్యూచర్ లో ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా, ఆరోగ్యం కోసమని కొంత డబ్బును పొదుపు చేస్తుకుంటున్నారు. కొన్ని సందర్భాల్లో మనం ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, ఎంత మంచి ఫుడ్స్ తీసుకున్నా వ్యాధులనేటివి వస్తుంటాయి. ముఖ్యంగా సీజనల్ గా వచ్చే వ్యాధులు మనం ఆహ్వానించకనే వచ్చే మన శరీరంలో తిష్టవేస్తుంటాయి. అటువంటప్పుడు మనం ఖరీదైన ట్రీట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తుంది . అటువంటి పరిస్థితిలో మన చేతిలో చిల్లిగవ్వ కూడా లేనప్పుడు, ఖరీధైన హాస్పిటల్ కు వెళ్లి, బెటర్ ట్రీట్మెంట్ తీసుకోలేనప్పడు మన పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా హోం రెమెడీస్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. హోం రెమెడీస్ ప్రక్రుతి పరంగా మనకు దేవుడిచ్చిన వరం !
కరెక్ట్ మీరు విన్నది నిజమే..పూర్వకాలంలో ఇలాంటి ఖరీదైన హాస్పిటల్స్, ట్రీట్మెంట్స్ లేవు. అన్నీ ఆయుర్వేద పరంగా, హోం రెమెడీస్ తోటే నయం చేసుకునే వారు?ఖచ్చితంగా అవుననే అంటున్నారు ప్రస్తుత జనరేషన్ లోని వారు కూడా. ఎందుకంటే నేచురల్ రెమెడీస్ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఎఫెక్టిగ్ గా పనిచేస్తాయి. వ్యాధులను నివారిస్తాయి!
ఖచ్చితంగా, మన వంటగదిలో, పవర్ ఫుల్ నేచురల్ రెమెడీస్ ఉన్నాయి, ఇవి చూడటానికి చాలా సింపుల్ గా కనిపించవచ్చు. కానీ వీటిలో ఉండే ఔషధ గుణాలు ..వివిధ రకాల వ్యాధులకు చికిత్సనందిస్తాయి, వ్యాధులను నివారిస్తాయి. వ్యాధులను నయం చేస్తాయి.
పొటాటో జ్యూస్ మరియు తేనె మిశ్రమం తయారుచేసే డ్రింక్ వల్ల 7 రకాల వ్యాధులను నయం చేసుకోవచ్చన్న విషయం మీకు తెలుసా!?మరి ఈ జ్యూస్ ను ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం...
కావల్సినవి:
బంగాళదుంప - ½
తేనె - 1 tablespoon
తయారుచేయు విధానం :
ముందుగా బంగాళదుంపకు తొక్క తీయ్యాలు, దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, మిక్సీలో వేసి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. దీన్ని కొద్దిగా వేడి నీళ్ళు సోసి మరో సారి బ్లెడ్ చేయాలి.
తర్వాత జ్యూస్ ఒక గ్లాసులోనికి తీసుకుని అందులో కొద్దిగా తేనె మిక్స్ చేయాలి. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తాగాలి.
ఈ పొటాటో హనీ జ్యూస్ తాగడం వల్ల పొందే ప్రయోజనాలేంటో..వివిధ రకాల వ్యాధులను ఏవిధంగా నివారిస్తుంది..!

డయాబెటిస్
పొటాటో జ్యూస్ మరియు తేనె మిశ్రమంలో ఇన్సులిన్ మరియు రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ను రెగ్యులేట్ చేసే లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది డయాబెటిస్ ను అండర్ కంట్రోల్లో ఉంచుతుంది.

గ్యాస్ట్రిక్:
ఈ నేచురల్ జ్యూస్ లో పొట్టలో అసిడిక్ లెవల్స్ ను పెంచుతుంది . దాంత జీర్ణ వ్యవస్థ చురుకుగా పనిచేస్తుంది, దాంతో గ్యాస్ట్రిక్ మరియు ఎసిడిటి వంటి సమస్యలను దూరం చేస్తుంది

కిడ్నీ స్టోన్స్:
పొటాటో మరియు తేనె కాంబినేషన్ డ్రింక్ శరీరంలోటాక్సిన్స్ మరియు కిడ్నీలో టాక్సిన్స్ , అత్యధికంగా ఉండే నైట్రిక్ యాసిడ్స్ ను తొలగిస్తుంది, దాంతో కిడ్నీ స్టోన్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

లివర్ డ్యామేజ్:
ఈ హోం మేడ్ జ్యూస్ లో లివర్ డిటాక్సిఫై చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు లివర్ ఫంక్షన్ మరింత బెటర్ గా పనిచేయడానికి సహాయపడుతుంది. దాంతో లివర్ డ్యామేజ్ కాకుండా ప్రమాధకర స్థితి నుండి కాపాడుతుంది.

స్కిన్ ఎలిమెంట్స్:
బంగాళదుంప జ్యూస్ మరియు తేనె మిశ్రమంతో తయారుచేసిన జ్యూస్ చర్మం ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది . చర్మానికి మాయిశ్చరైజర్ ను అందిస్తుంది. స్కిన్ డ్రైనెస్ మరియు పోరియోసిస్ ను నివారిస్తుంది.

బ్రెయిన్ డిజార్డర్స్:
పొటాటో , హనీ కాంబినేషన్ జ్యూస్ లో విటమిన్ బి 6 పుష్కలంగా ఉంది, ఇది బ్రెయిన్ ఫంక్షన్స్ ను మెరుగుపరుస్తుంది. నాడీవ్యవస్థను బలోపేతం చేస్తుంది, డిప్రెషన్, ఆందోళన మరియు ఎడిహెచ్ డి వంటి సమస్యలను నివారిస్తుంది.

కార్డియో వ్యాస్కులర్ డిజార్డర్స్ :
ఈ కాంబినేషన్ డ్రింక్ లో విటమిన్ సి మరియు విటమిన్ బి6 అధికంగా ఉన్నాయి. ఈ నేచురల్ రక్త నాళాల్లో కొలెస్ట్రాల్ చేరకుండా క్లియర్ చేస్తుంది. కార్డియో వ్యాస్కులర్ సిస్టమ్ ను ఆరోగ్యంగా ఉంచుతుంది.



Click it and Unblock the Notifications











