For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కీళ్ల నొప్పులను శాశ్వతంగా నివారించే ఆవాల రెమిడీ..!

By Swathi
|

కొన్నేళ్లుగా మీరు కీళ్లనొప్పులతో బాధపడుతున్నారా ? అయితే మీరు చాలా మందులు, వ్యాయామాలు ప్రయత్నించి ఉంటారు. అలాగే ఫ్రెండ్స్, రిలేటివ్స్ చెప్పిన సలహాలు పాటించే ఉంటారు. ఆర్థరైటిస్ (కీళ్ల నొప్పులు) తగ్గించుకోవడానికి చేయని ప్రయత్నం అంటూ ఉండదు.

అయితే ఇలాంటి అన్ని ట్రీట్మెంట్ పద్ధతులు మెరుగైన ఫలితాలు అందించలేకపోయి ఉండవచ్చు. దీనివల్ల మళ్లీ కీళ్ల నొప్పులతో బాధపడే ఉంటారు. అప్పుడు పెయిన్ కిల్లర్స్ ద్వారా నొప్పి నుంచి తాత్కాలిక ఉపశమనం పొందడం అలవాటు పడతారు.

చాలా తీవ్రమైన నొప్పి ఉన్నప్పుడు.. ముఖ్యంగా మోకాళ్ల చుట్టూ ఎక్కువగా కీళ్లనొప్పులు వస్తుంటాయి. మోకాళ్ల జాయింట్స్ మాత్రమే కాకుండా.. శరీరంలోని ఇతర కీళ్లలో కూడా నొప్పులు బాధిస్తాయి. చాలా వరకు.. ఈ కీళ్లనొప్పులు తగ్గించుకోవడానికి న్యాచురల్ రెమిడీస్ ఫాలో అవడం వల్ల దీర్ఘకాలిక ఉపశమనం పొందవచ్చు.

ఒకసారి కీళ్ల నొప్పుల బారిన పడిన తర్వాత.. మెడికేషన్ ద్వారా ఇన్ల్ఫమేషన్ కాస్త నివారించుకోవచ్చు. కానీ సైడ్ ఎఫెక్ట్స్ మెడిషన్స్ వల్ల చాలా ఇబ్బందిపెడతాయి. కానీ న్యాచురల్ హోం రెమిడీస్ ఫాలో అయితే.. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ మీ దరిచేరవు.

ఆవపిండి ఉపయోగించి చాలా సింపుల్ గా ఆర్థరైటిస్ కి ఆయింట్ మెంట్ మీరే తయారు చేసుకోవచ్చు. ఆవాలలో సెలీనియం, మెగ్నీషియం ఉంటుంది. ఇవి.. యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్స్ లా పనిచేస్తాయి. మరి ఆవపిండితో.. కీళ్లనొప్పులు నివారించుకోవడం ఎలాగో చూద్దామా..

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఒక టీస్పూన్ ఆవాల పేస్ట్ తీసుకోవాలి. దీన్ని తాజాగా తయారు చేసి ఉండాలి.

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఒక టీ స్పూన్ తేనె తీసుకోవాలి.

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఒక టీస్పూన్ ఉప్పు తీసుకోవాలి.

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఒక టీస్పూన్ సోడియం బికార్బొనేట్ తీసుకోవాలి. దీన్ని బేకింగ్ పౌడర్ లో ఉపయోగిస్తారు.

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఒక గ్లాసు బౌల్ తీసుకుని ముందుగా ఆవాలపేస్ట్ వేయాలి. ఇప్పుడు తేనె, ఉప్పు, సోడియం బికార్బొనేట్ కలిపాలి.

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

అన్ని పదార్థాలను బాగా మిక్స్ చేయాలి. బాగా పేస్ట్ లా తయారు అయ్యేంతవరకు కలపాలి.

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఆవపిండితో కీళ్ల నొప్పులు దూరం

ఈ మిశ్రమాన్ని కీళ్ల నొప్పులు ఉన్న భాగాల్లో అప్లై చేయాలి. అంతే చాలా సింపుల్ గా తయారు చేసిన ఈ మిశ్రమం అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది.

English summary

This One Natural Rub Helps Treat Arthritis; Check It Out!

This One Natural Rub Helps Treat Arthritis; Check It Out! Take a look at this step-by-step procedure to prepare the mustard rub.
Story first published: Tuesday, September 20, 2016, 14:46 [IST]
Desktop Bottom Promotion