For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నొప్పితో ఇబ్బందిపెట్టే కాన్ట్సిపేషన్ ను తక్షణం తగ్గించే రెమెడీ..!

కాన్ట్సిపేషన్ సమస్య ఉందంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. బయటకు చెప్పలేని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. ఈ సమస్య నివారించుకోవడానికి న్యాచురల్, హెర్బల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది.

By Swathi
|

మూత్రవిసర్జనకు చాలా ఇబ్బంది పడుతున్నారా ? కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగించే రెమెడీ ఉంటే బావుంటుందని భావిస్తున్నారా ? ఒకవేళ అవును అయితే.. మీకు చక్కటి రెమెడీ అందుబాటులో ఉంది. అది కూడా చాలా సింపుల్ తయారు చేసుకుని తీసుకోవచ్చు.

కాన్ట్సిపేషన్ పొట్టనొప్పికి, గ్యాస్ట్రిక్స్, బ్లోటింగ్, జీర్ణసమస్యలకు కారణమవుతుంది. చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి.. కాన్ట్సిపేషన్ ని వెంటనే నివారించుకోవాలి. లేదంట,.. సమస్య మరింత తీవ్రమవుతుంది.

constipation

బోవెల్ మూవ్మెంట్స్ తక్కువగా ఉన్నప్పుడు.. కాన్ట్సిపేషన్ సమస్య వస్తుంది. అలాగే.. ఆహారంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, వ్యాయామం చేయకపోవడం కూడా.. కాన్ట్సిపేషన్ కి సమస్యగా మారుతుంది.

కాన్ట్సిపేషన్ సమస్య ఉందంటే.. చాలా నొప్పిగా ఉంటుంది. బయటకు చెప్పలేని ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి.. ఈ సమస్య నివారించుకోవడానికి న్యాచురల్, హెర్బల్ రెమిడీస్ ఫాలో అవడం మంచిది. కెమికల్ మెడిసిన్స్ కంటే.. హోం రెమిడీస్ ద్వారా చాలా ఎఫెక్టివ్ సమస్య నుంచి బయటపడవచ్చు.

lemon juice

కావాల్సిన పదార్థాలు
నిమ్మరసం 2టేబుల్ స్పూన్లు
ఆలివ్ ఆయిల్ 1టేబుల్ స్పూన్

ఈ రెండింటితో తయారు చేసుకునే హోం రెమిడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి.. కాన్ట్సిపేషన్ నుంచి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. దీంతోపాటు ఫైబర్ ఫుడ్స్ తీసుకుంటే.. సమస్యను మరింత వేగంగా నివారించుకోవచ్చు.

olive oil

నిమ్మరసం, ఆలివ్ ఆయిల్ కాంబినేషన్.. పేగుల్లో ల్యూబ్రికేట్ అయి.. స్టూల్ ని సాఫ్ట్ గా మార్చి.. తేలికగా జరిగేలా చేస్తుంది. అలాగే ఈ న్యాచురల్ రెమెడీ.. మస్కస్ ఉత్పత్తిని మెరుగుపరిచి.. కాన్ట్సిపేషన్ ని ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

తయారు చేసుకునే విధానం
1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, 2టేబుల్ స్పూన్ల నిమ్మరసంను ఒక కప్పులో కలుపుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. అంతే ఈ మిశ్రమాన్ని ప్రతిరోజూ ఉదయం, రాత్రి.. భోజనానికి ముందు తీసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కాన్ట్సిపేషన్ నుంచి బయటపడవచ్చు.

English summary

Try This Magical Home Remedy For Instant Constipation Relief!

Try This Magical Home Remedy For Instant Constipation Relief! Constipation can be quite frustrating! And, if you want to chuck those laxatives, try this easy home remedy to treat constipation for an instant relief.
Story first published: Thursday, October 20, 2016, 16:47 [IST]
Desktop Bottom Promotion