For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ లక్షణాలు ప్రాణాంతక వ్యాధి‘‘టీబి(ట్యుబర్ క్యులోసిస్)’’ని సూచించిస్తాయి..!

|

ట్యూబర్ కులోసిస్ లేదా టిబి ఇది బ్యాక్టీరియల్ ఎయిర్ బోర్న్ గా సూచిస్తారు. దీన్ని తెలుగులో క్షయ అని కూడా పిలుస్తారు. క్షయ రోగాన్ని ఒకప్పుడు ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణించేవారు . కానీ క్రమేపీ దాన్ని నిరోధించటం, నివారించటం మొదలైంది . అసలు టి.బి అంటే ఏమిటి? అదెలా సోకుతుంది?ఇది మైక్రో బాక్టీరియా టుబరంక్యులోసిన్ అనే బాక్టీరియా వలన వచ్చే అంటువ్యాధి. ఈ క్షయ క్రిములు ముఖ్యంగా ఊపిరితిత్తులలో ప్రవేశించి శ్వాసకోశ క్షయవ్యాధిని కలుగచేస్తాయి. ఈ శ్వాసకోశ క్షయ చాలా తీవ్రమైన అంటువ్యాధి.

ట్యుబర్ కులోసిస్ శరీరంలోని ఇతర భాగాలకి కూడా క్షయ వ్యాధి రావచ్చు. అనగా శ్వాసకోశేతర భాగాలు ఎముకలు, కీళ్ళు, లింపు గ్రంధులు, మెదడు పొరలు, మూత్ర పిండాలు, గర్భ సంచి మొదలైనవి వాటికి కూడా టీబీ సోకవచ్చు . అయితే ఈ వ్యాధి ఇమ్యూనిటి పవర్ ఎక్కువగా ఉన్న వారిలో అంత తర్వగా వ్యాప్తిం చెందదు. అయితే ఒక సారి అనారోగ్యానికి గురైతే మాత్రం దీన్ని నుండి బయటపడటానికి చాలా పోరాడాల్సి వస్తుంది. టుబర్ క్యులోసిస్ ను రెండు బాగా క్యాటగిరీలుగా వర్గీకరిస్తారు.

అందులో ఒకటి , టీబి. మరొకటి యాక్టివ్ టిబి. యాక్టివ్ లేదా టాలెంట్ టిబి ట్యుబర్ క్యులోసిస్ లక్షణాలను సూచిస్తుంది, ఇన్ యాక్టివ్ బ్యాక్టీరియా ఉన్న వ్యక్తి లో లక్షణాలు అంత త్వరగా భయటపడవు. అంటే ఈ లక్షణాలను నిర్ల్యం చేయడం కాదు, టిబి లక్షణాలను ప్రారంభ దశలో నిర్లక్ష్యం చేడయం వల్ల టీబి బ్యాక్టీరియా శరీరం మీద దాడిచేసి, ప్రాణాపాయానికి గురిచస్తుంది. టిబి ఉన్న వారిలో సాధారణంగా కనిపించే కొన్ని లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇన్ఫెక్షన్ సోకిన ఒక వారంలోనే దీన్ని గుర్తించి వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడంతో పెద్ద ప్రమాధం నుండి బయటపడవచ్చు.

వ్యక్తిలో టీబికి సంబంధించిన బ్యాక్టీరియా చెరిన ఒక వారంలోనే వ్యక్తి చాలా బలహీనంగా మారుతాడు, ఇమ్యూనిటి కోల్పోతాడు. బయటకు ఏలక్షణాలు కనబడకపోయినా, ఇవి కొన్ని సంవత్సరాల పాటు శరీరంలో ఉంటాయి.

మూడు వారాలకి పైగా దగ్గు, కఫం

మూడు వారాలకి పైగా దగ్గు, కఫం

టిబికి ఒది ఒక ముఖ్యమైన సంకేతం. ఒక నెలకు పైన నుండి మీరు దగ్గుతూనే ఉంటే, మందులు సిరఫ్ లు తీసుకున్నా ప్రయోజనం కనబడకపోతే, యాంటీబయోటిక్ ఉపయోగించిన లాభం లేకపోతే వెంటనే డాక్టరు కలిసి టీబి టెస్ట్ చేయించుకోవాలి.

దగ్గినప్పుడు రక్తం పడుట:

దగ్గినప్పుడు రక్తం పడుట:

ఇతర కారణాల వల్ల దగ్గినప్పుడు, రక్త పడదు. దగ్గుతో పాటు, రక్తం కూడా పడితే అది ట్యుబర్ క్యులోసిస్ కు సంకేతంగా గుర్గించాలి. డాక్టర్ ను తప్పనిసరిగా కలవాలి.

చెస్ట్ పెయిన్ :

చెస్ట్ పెయిన్ :

చెస్ట్ పెయిన్ కు వివిధ రకాల కారణాలున్నాయి. అయితే, టిబి కూడా ఒక ముఖ్య కారణం. శ్వాస తీసుకున్నప్పుడు అసౌకర్యంగా ఉన్నా, లేదా నొప్పిగా అనిపించినా, ఖచ్చితంగా అది టిబికి సంబంధించిన లక్షణంగా గుర్గించాలి.

సెడెన్ గా బరువు తగ్గడం:

సెడెన్ గా బరువు తగ్గడం:

టిబికి ముఖ్య లక్షణాల్లో ఇది కూడా ఒకటి, ఈ జనరల్ సింప్టమ్ ను ఓ కంట కనిపెట్టుండాలి. సెడన్ గా బరువు తగ్గుతారు. కాబట్టి, బరువు తగ్గకుండా హెల్తీ డైట్ , వ్యాయామంను మెయింటైన్ చేయాలి. ఇలా చేస్తుంటే కూడా బరువు క్రమంగా తగ్గుతుంటే వెంటనే డాక్టర్ ను కలవండి.

జ్వరం:

జ్వరం:

దగ్గు, చెస్ట్ పెయిన్ తో పాటు, జ్వరం కూడా విడవకుండా వస్తుంటే టీబిలోకి ప్రాధాన సంకేతం. టెంపరేచర్ పెరగదు, కానీ, లోగ్రేడ్ లోనే రోజూ ఫీవర్ వస్తుంటుంది. అందుకు సరైన చికిత్సతో పాటు, మెడిసిన్స్ ఉపయోగించాలి.

రాత్రుల్లో చెమటలు:

రాత్రుల్లో చెమటలు:

టీబి పేషంట్స్ లో దగ్గు, జ్వరం వల్ల నిద్రలేమి సమస్యలు, రాత్రుల్లో చెమటలు ఎక్కువగా పట్టడం, యాక్టివ్ టీబి ఉన్నప్పుడు చెమటలు ఎక్కువ పడుతాయి.

అలసట:

అలసట:

టీబి ఉన్న వారిలో అలసట, నీరసం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు చూసిన పడుకోనుండాలనిపిస్తుంది. ఎనర్జీ లేకుండా చేస్తుంది. టీబికి అలసట కూడా ఒక ముఖ్య కారణం.

English summary

What Are The Signs And Symptoms Of Tuberculosis

What Are The Signs And Symptoms Of Tuberculosis,Tuberculosis or TB is a bacterial air-borne disease that can affect people at large. You should not neglect the symptoms of tuberculosis; and you also must be aware of the ways to treat yourself in case you are suffering from the symptoms.
Story first published: Saturday, September 3, 2016, 11:00 [IST]