వరల్డ్ క్యాన్సర్ డే 2020 : క్యాన్సర్ మహమ్మారిని హాంఫట్ చేసే ఆహారం...

క్యాన్సర్ మహమ్మారిని హాంఫట్ చేసే ఆహారం...

వరల్డ్ క్యాన్సర్ డే 2016 : ప్రపంచవ్యాప్తంగా కూడా క్యాన్సర్‌ బాధితుల సంఖ్య క్రమంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఏటా ఫిబ్రవరి 4న వరల్డ్‌ క్యాన్సర్‌ డే నిర్వహించడం ఆన వాయితీగా వస్తోంది. ఆ రోజున క్యాన్సర్‌ పై అవగాహన పెంచే పలు కార్యక్రమాలను వివిధ సంస్థలు నిర్వ హిస్తుంటాయి. ఈ కార్య క్ర మం కింద క్యాన్సర్‌ లక్షణాలు, దాన్ని నిరోధిం చడం, సకాలంలో గుర్తించడం, సరైన చికిత్స చేసుకో వడం వంటి అంశాలపై పలు అవగాహన కార్యక్ర మాలను నిర్వహిస్తుంటారు.

ప్రపంచ వ్యాప్తంగా కూడా మరణాలకు కారణమవుతున్న ప్రధాన వ్యాధుల్లో క్యాన్సర్‌ ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచ నాల ప్రకారం 2005-2015 మధ్య కా లంలో సు మారు 8.4 కోట్ల మంది క్యాన్సర్‌ కార ణంగా చనిపోనున్నారు. ఈ వ్యాధిపై పోరాటం చేసి దాన్ని రూపు మాపడం ఏ ఒక్కరి వల్లనో సాధ్యం కాదు. అందుకే అంతా కలసి దాన్ని రూపుమాపుదాం అనే థీమ్‌ను ఈ ఏడాదికి ఎంచుకున్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు.

మహిళలూ.. ప్రాణాంతకమైన ఈ క్యాన్సర్లతో బీ అలర్ట్

వ్యాధికి కారణమయ్యే అంశాలు
పర్యావరణ, జీవనశైలి సంబంధిత అంశాల కారణంగానే పలువురు క్యాన్సర్‌ బారిన పడు తున్నారు. 80-90 శాతం క్యాన్సర్‌లు ఈ కార ణంగా వచ్చేవే అని రీసెంట్ గా జరిపిన ఓ అధ్యయనంలో వెల్లడైనది. పొగాకు, మద్యపానం వినియోగం, ఇన్‌ ఫెక్షన్లు, ఆహారపుటలవాట్లు, ప్రవర్తన తీరుతెన్నులు లాంటి క్యాన్సర్‌ వ్యాధికి కారణమవుతున్నాయి. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడుతున్న పురుషుల్లో 50 శాతం మంది పొగాకు వినియోగం కారణంగా ఈ వ్యాధి బారిన పడ్డవారే. జీవనశైలిలో తగు మార్పులు చేసుకోవడం కారణంగా క్యాన్సర్‌ వ్యాధికి గురి కాకుండా ఉండవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.

క్యాన్సర్ : సాధారణంగా వచ్చే వివిధ రకాల క్యాన్సర్లు

ఆరోగ్యం విషయంలో అతి ముఖ్యమైన అంశం ఆహారం. తీసుకునే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. పండ్లు... ఆకుకూరలు... ఆహారపదార్థాలు... ఇలా మనం రోజూ తినే పదార్థాలతోనే క్యాన్సర్లను నివారించుకోవడం సాధ్యమా? చాలా సులభంగా సాధ్యమనే అంటున్నారు ఆహారనిపుణులు. ఫలానా ఆహారంలోని నిర్దిష్టమైన పోషకాలు శరీరంలోని వివిధ అవయవాలకు చెందిన క్యాన్సర్ల నివారణకు ఎలా పనిచేస్తాయన్న అంశంపై 'వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్' ఆధ్వర్యంలో ఇప్పటికీ పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని క్యాన్సర్ల నివారణకు కొన్ని ఆహారాలు సమర్థంగా పనిచేస్తాయని ఆ పరిశోధనల్లో తేటతెల్లమైంది. మనం రోజూ తినే ఆహారాలతోనే క్యాన్సర్లను సులభంగా, ఆరోగ్యకరంగా ఎలా నివారించగలమో తెలుసుకుందాం...

ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు...

ప్రోస్టేట్ క్యాన్సర్ నివారణకు...

లైకోపిన్ అనే పోషకం ఎక్కువగా ఉండే టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. అలాగే పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ, దానిమ్మ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అదుపు చేస్తాయి. ఇక క్రూసిఫెరస్ జాతి శాకాహారాలైన బ్రొకోలీ, కాలీఫ్లవర్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చుని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

బోన్ క్యాన్సర్ నివారణకు...

బోన్ క్యాన్సర్ నివారణకు...

యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే పండ్లు, ఆకుకూరలు... ఉదాహరణకు బెర్రీలు, చెర్రీలు, టొమాటో, బ్రాకోలీతో పాటు ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే ఆహారాలైన సాల్మన్ చేపలు, వాల్‌నట్‌లతోపాటు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే మాంసాహారం, చేపలు, గుడ్లతోనూ ఎముక క్యాన్సర్ నివారితమవుతుంది.

బ్రెయిన్ క్యాన్సర్ నివారణకు...

బ్రెయిన్ క్యాన్సర్ నివారణకు...

వెల్లుల్లి జాతికి చెందిన ఆహారాలతో పాటు ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే వాల్‌నట్, లిన్‌సీడ్ ఆయిల్‌తో మెదడు క్యాన్సర్‌లను నివారించవచ్చు. పైన పేర్కొన్న పదార్థాలు మనిషిలో సాధారణ రోగనిరోధక శక్తిని కూడా పెంపొందిస్తాయి.

పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ క్యాన్సర్ నివారణకు...

పెదవులు, నోరు, ఫ్యారింగ్స్ క్యాన్సర్ నివారణకు...

బాగా ముదురురంగుతో ఉన్న అన్ని పండ్లు, ఆకుకూరలతో పాటు విటమిన్ ఏ ఎక్కువగా ఉండే బొప్పాయి, క్యారట్, మామిడి వంటి తాజాపండ్లతో నోరు, ఫ్యారింగ్స్, క్యాన్సర్లను నివారించవచ్చు. ఇక టొమాటోలోని లైకోపిన్ కూడా ఈ తరహా క్యాన్సర్ల నివారణకు ఉపయోగపడుతుంది.

మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ల నివారణకు...

మూత్రాశయ (బ్లాడర్) క్యాన్సర్ల నివారణకు...

క్రూసిఫెరస్ వెజిటబుల్స్ జాతిగా పేరుపడ్డ క్యాబేజీ, బ్రకోలీ వంటి శాకాహారాలతో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్‌లోని యాండర్సన్ క్యాన్సర్ సెంటర్‌లో తేలిన అంశాలను బట్టి విటమిన్-ఇలోని ఆల్ఫాటోకోఫెరాల్ అనే రసాయనం... బ్లాడర్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. మిరియాలు, పాలకూర, బాదంలతో పాటు పొద్దుతిరుగుడునూనె, కుసుమ నూనెలోనూ విటమిన్-ఇ ఎక్కువ.

తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ నివారణకు...

తల, మెడ (హెడ్ అండ్ నెక్) క్యాన్సర్ నివారణకు...

పసుపు, నారింజ, ఎరుపు, ఆకుపచ్చ, తెల్లటి తోళ్లు ఉన్న బాగా బ్రైట్ రంగుల్లో ఉండే పండ్లలో ఉండే ఫైటోకెమికల్స్ వల్ల ఈ క్యాన్సర్లు నివారితమవుతాయి. ఉదాహరణకు నారింజ, కివీ, జామ, పైనాపిల్ పండ్లతో తల, మెడ క్యాన్సర్లను నివారించవచ్చు.

పెద్దపేగు-మలద్వార (కోలో-రెక్టల్) క్యాన్సర్ నివారణకు...

పెద్దపేగు-మలద్వార (కోలో-రెక్టల్) క్యాన్సర్ నివారణకు...

మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చేసుకోవడం వల్ల కోలోరెక్టల్ క్యాన్సర్‌ను నివారించవచ్చు. ఉదాహరణకు నిమ్మజాతి పండ్లు, బెర్రీ పండ్లు, ఎర్ర ఉల్లిగడ్డలు, నట్స్‌లో బాదంతో పాటు క్రూసిఫెరస్ జాతి శాకాహారాలైన క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రకోలీలతో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. అలాగే ఉల్లి, వెల్లుల్లి కూడా పెద్దపేగు-మలద్వార క్యాన్సర్లను సమర్థంగా అరికడతాయి. విటమిన్-డి ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు కూడా ఇందుకు తోడ్పడతాయి.

గాల్‌బ్లాడర్ క్యాన్సర్ నివారణకు...

గాల్‌బ్లాడర్ క్యాన్సర్ నివారణకు...

స్థూలకాయం రాకుండా ఆరోగ్యకరమైన పరిమితిలో బరువును నియంత్రించుకోవడం గాల్‌బ్లాడర్ క్యాన్సర్ నివారణకు తోడ్పడే అంశం. ఇలా చేయడం వల్ల ఒక్క గాల్‌బ్లాడర్ క్యాన్సర్‌ను మాత్రమే గాక పెద్దపేగు, ప్రోస్టేట్, ఎండోమెట్రియమ్, మూత్రపిండాలు, రొమ్ము క్యాన్సర్లను నివారించవచ్చు. ఇందుకోసం కొవ్వులు తక్కువగానూ, ఆకుకూరలు ఎక్కువగానూ తీసుకోవాలి.

జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు...

జీర్ణాశయ (స్టమక్) క్యాన్సర్ నివారణకు...

కాప్సికమ్ (కూరగా వండటానికి ఉపయోగించే మిరప)లో ఉండే ఫైటోకెమికల్... స్టమక్ క్యాన్సర్ నివారణకు ఉపయోగపడుతుంది. ఇక దీంతోపాటు పరిమితంగా మిరపకాయలు వాడటం, మిరియాల వాడకం కూడా స్టమక్ క్యాన్సర్‌ను నివారిస్తాయి. ఆకుకూరలు, పొట్టుతో ఉండే ధాన్యాలు, తాజాపండ్లు కూడా నివారణకు తోడ్పడుతూ జీర్ణాశయ క్యాన్సర్ రిస్క్‌ను తగ్గిస్తాయి. ఉప్పు బాగా తగ్గించడం కూడా అవసరం.

 మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు...

మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు...

నారింజ రంగులో ఉండే కూరగాయలు (ఉదాహరణ క్యారట్)తో పాటు టొమాటో, అల్లం, ఆప్రికాట్... మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి. బెర్రీ పండ్లు కిడ్నీల వాపును తగ్గిస్తాయి. పొట్టు తీయని ధాన్యాలు, బఠాణీ, చిక్కుళ్ల వంటి ఫైటైట్ అనే పోషకం ఉన్న ఆహారాలు మూత్రపిండాల క్యాన్సర్ నివారణకు తోడ్పడతాయి.

 కాలేయ క్యాన్సర్ నివారణకు...

కాలేయ క్యాన్సర్ నివారణకు...

పాలీఫీనాల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే బ్లూబెర్రీ, విటమిన్-ఇ పుష్కలంగా ఉండే బాదం వంటి ఆహార పదార్థాలతో పాటు... నూనెల్లో పొద్దుతిరుగుడు, కుసుమనూనెలు కాలేయ క్యాన్సర్ నివారణకు దోహదపడతాయి.

రొమ్ము క్యాన్సర్ నివారణకు...

రొమ్ము క్యాన్సర్ నివారణకు...

ఎలాజిక్ ఆసిడ్ అనే పోషకంలో ఉండే పాలీఫినాల్ ఎక్కువగా ఉండే దానిమ్మతో రొమ్ముక్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. కెరొటినాయిడ్ ఎక్కువగా ఉండే బ్రకోలీ, క్యారట్, పాలకూరలతో రొమ్ము క్యాన్సర్ నివారితమవుతుంది. ఇక ప్రైమరీ యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ కూడా రొమ్ము క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది.

 గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ నివారణకు...

గర్భాశయ ముఖద్వార (సర్విక్స్) క్యాన్సర్ నివారణకు...

ఆహారంలో విటమిన్-ఇ, విటమిన్-సి ఎక్కువగా ఉండేలా చూసుకోవడం సర్విక్స్ క్యాన్సర్‌ను నివారిస్తుంది. ఉదాహరణకు క్యారట్, చిలగడదుంప, గుమ్మడి వంటి ఆహారాలతో దీన్ని సమర్థంగా నివారించవచ్చు. ఎలాజిక్ ఆసిడ్స్ అనేవి క్యాన్సర్ పెరుగుదలను అరికడతాయి కాబట్టి ఈ పోషకం ఎక్కువగా ఉండే స్ట్రాబెర్రీ, రాస్ప్‌బెర్రీ, వాల్‌నట్, దానిమ్మ, ద్రాక్ష, ఆపిల్, కివీ పండ్లతో దీన్ని నివారించవచ్చు. అయితే చక్కెర పాళ్లు తక్కువగా ఉండే ‘లో-గ్లైసీమిక్ పండ్లు, ఆహారాలతో దీని నివారణ మరింత సులభమవుతుంది.

ఒవేరియన్ క్యాన్సర్ నివారణకు...

ఒవేరియన్ క్యాన్సర్ నివారణకు...

క్యారట్, పసుపు రంగులో, నారింజరంగులో ఉండే శాకాహారాలతో (ఉదాహరణకు బెల్‌పెప్పర్) ఒవేరియన్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. కెరొటినాయిడ్స్ ఎక్కువగా ఉండే క్యారట్ వంటివి రోజూ అరకప్పు మోతాదులో రెండుసార్లు తీసుకోవడం వల్ల ఒవేరియన్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ అధ్యయానాల్లో తేలింది.

కంటి క్యాన్సర్ నివారణకు...

కంటి క్యాన్సర్ నివారణకు...

ఒమెగా 3-ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువగా ఉండే సాల్మన్ చేపలు, వాల్‌నట్‌తో పాటు గ్రీన్-టీ, బెర్రీ పండ్లు, పసుపు, విటమిన్-ఇ, విటమిన్-సి, విటమిన్-ఏ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలతో కంటి క్యాన్సర్లను సమర్థంగా నివారించవచ్చు. సెలీనియమ్, పీచుపదార్థాలు ఫైటోకెమికల్స్ ఎక్కువగా ఉండే బ్రెజిల్-నట్స్ కూడా కంటి క్యాన్సర్ నివారణకు తోడ్పతాయి.

Desktop Bottom Promotion