For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మలేరియాను నేచురల్ గా నివారించే 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

|

ఎండాకాలం అయిపోయి వర్షాకాలం మొదలయ్యిందంటే అప్పుడు మొదలయ్యే ఆరోగ్య సమస్యల గురించి ముందే అవగాహన కలిగి ఉంటే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొవడానికి అవకాశం ఉంటుంది. అందుకే వర్షాకాలం మొదలు కాక ముందే వర్షాల్లో వచ్చే జబ్బుల గురించి తెలుసుకొని జాగ్రత్త పడడం అవసరం. మండు వేసవిలో మలేరియా విశేషాలు ఎప్రిల్ 25 వరల్డ్ మలేరియా డే సందర్భంగా ఈ ఆర్టికల్ ను మీకు అందిస్తున్నాము.

మలేరియా వర్షాకాలంలో ఎక్కువగా కనిపించే ఒక ఆరోగ్య సమస్య. ఇది దోమ కాటువల్ల వ్యాపిస్తుంది. మలేరియాను కలుగజేసే పరాన్న జీవి ప్లాస్మోడియం. ఇది దోమ నుంచి మనిషిలోకి చేరి మలేరియాకు కారణమవుతుంది. మలేరియా పరాన్నజీవికి అనాఫిలిస్ జాతికి చెందిన ఆడ దోమ వాహకంగా ఉంటుంది. మలేరియా ప్రాణాంతక వ్యాధి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల సంఖ్యలో మలేరియాతో చనిపోతున్నట్లు ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తుంది.

10 Effective Home Remedies For Malaria

మలేరియాతో నిర్లక్ష్యం తగదు
దోమకాటుకు గురైన వ్యక్తిలో దాదాపు 10-15 రోజుల్లోపు మలేరియా లక్షణాలు బయటపడతాయి. మలేరియా వ్యాధిలో ముఖ్యంగా తీవ్రమైన జ్వరం, చలి, వణుకు, వికారం, వాంతులు, తీవ్రమైన తలనొప్పి, మోషన్ లో రక్తం పడటం, రక్తహీనత, మరియు విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు సాధారణంగా ఏ జ్వరంలో నైనా కనిపించేవే. ఈ లక్షణాలను బట్టి మలేరియాను నిర్ధారించడం కష్టమే. మాములు జ్వరమే కదా అని ఏ పారాసిటమాల్ టాబ్లెటో వేసుకుంటే అప్పటికి జ్వరం, ఇతర లక్షణాలు తగ్గినప్పటికి రెండు మూడు గంటల వ్యవధిలో తిరిగి జ్వరం వస్తుంది. మలేరియా జ్వరం రాత్రుళ్లు ఎక్కువగా ఉంటుంది. చెమటలతో జ్వరం తగ్గి కొంత విరామంతో తరచుగా జ్వరం వస్తూ ఉంటే మాత్రం ఏ మాత్రం నిర్లక్ష్యం చెయ్యకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. మలేరియాను క్లినికల్‌గా నిర్ధారించి ప్రత్యేక చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతకంగా పరిణమిస్తుంది.

మలేరియాలో రకాలు
మలేరియా కలుగజేసే ప్లాస్మోడియం పరాన్న జీవి నాలుగు రకాలు. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్, ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఓవలే, ప్లాస్మోడియం మలేరియే. వీటిలో మన దేశంలో ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ కనిపించే రకాలు. వీటిని ప్రత్యేకంగా నిర్ధారించడానికి యాంటిజెన్, స్మియర్ టెస్ట్‌లు తప్పనిసరి. యాంటిజెన్ పరీక్షల్లో చాలా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ప్లాస్మోడియం ఫాల్సిఫెరమ్ చాలా ప్రమాదకరమైన సెరిబ్రల్ మలేరియాకు కారణమవుతుంది.

మలేరియా నివారణకు మందులున్నా, వీటిని ఎక్కువగా ఉపయోగించడం వల్ల డ్రగ్ రెసిస్టెన్స్ సమస్యలను మొదలవుతాయి. ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ కూడా అధికంగా ఉంటాయి. అందువల్ల నేచురల్ హోం రెమెడీస్ ను ఎంపిక చేసుకోవడం ఉత్తమం. మరి ఆ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం...

అల్లం:

అల్లం:

మలేరియాను నివారించడంలో అల్లం ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది ఇమ్యూనిటిని పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇన్ఫెక్షన్స్ కు వ్యతిరేఖంగా పోరాడుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల మలేరియా లక్షణాలను దూరం చేస్తుంది. కాబట్టి రోజు అల్లం టీ, జింజర్ వాటర్ తాగడం మంచిది.

గ్రేప్ ఫ్రూట్ :

గ్రేప్ ఫ్రూట్ :

మలేరియాను నేచురల్ గా నయం చేయడంలో గ్రేప్ ఫ్రూట్ గ్రేట్ గా పనిచేస్తుంది. మలేరియాకు కారణమయ్యే ప్యారాసైట్స్ తో ఇది పోరాడుతుంది. కాబట్టి, రెగ్యులర్ డైట్ లో గ్రేప్ ఫ్రూట్ చేర్చుకోవడం వల్ల మలేరియాను నివారించుకోవచ్చు.

ఫీవర్ నట్ :

ఫీవర్ నట్ :

మలేరియాను నివారించడంలో ఫీవర్ నట్స్ మరో హోం రెమెడీ. ఇది తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 6 గ్రాముల విత్తనాలు తీసుకుని, వాటర్ తో మిక్స్ చేయాలి. రెండు మూడు గంటలు మిక్స్ చేసి పెట్టాలి. తర్వాత వడగట్టి తాగాలి. తిరిగి రెండు మూడు గంటల తర్వాత కొద్దిగా తాగాలి.

మెంతులు:

మెంతులు:

మెంతులు మలేరియాను నివారించడం మాత్రమే కాదు, ఇది వ్యాధినిరోధకతను పెంచడంలో కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. మెంతులను రెగ్యులర్ వంటల్లో చేర్చడం లేదా నేరుగా తీసుకోవడం చేయాలి. లేదా నీళ్ళలో వేసి రాత్రంతా నానబెట్టి, ఉదయం వడగట్టి తాగాలి.

నిమ్మరసం:

నిమ్మరసం:

మలేరియాను నేచురల్ గా నివారిచండంలో లైమ్ అండ్ లెమన్ రెండూ గ్రేట్ రెమెడీ. లైమ్ అండ్ లెమన్ ను వాటర్ తో మిక్స్ చేసి తాగడం వల్ల మలేరియాల లక్షణాలను దూరం చేస్తుంది.

దాల్చిన చెక్క :

దాల్చిన చెక్క :

మలేరియాను నివారించడంలో దాల్చిన చెక్క వండర్ ఫుల్ హోం రెమెడీ. అందుకు మీరు చేయాల్సిందల్ల దాల్చిన చెక్కను పౌడర్ చేసి ఒక స్పూన్ తీసుకోవాలి. ఒక గ్లాస్ వేడినీటితో మిక్స్ చేయాలి. అలాగే అందులో చిటికెడు పెప్పర్ పౌడర్ , తేనె మిక్స్ చేసి రెగ్యులర్ గా రోజూ తాగాలి. ఇలా చేస్తుంటే మలేరియా లక్షణాలు ధరి చేరవు .

ఆలమ్:

ఆలమ్:

ఆలమ్ ను ఎండబెట్టి, రోస్ట్ చేసి, పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఈ రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఫీవర్ లక్షణాలు కనబడకు ముందే 1/4స్పూన్ ఆలమ్ పౌడర్ ను తినాలి. అలాగే ఫీవర్ వచ్చిన ఒకటి రెండు గంటల తర్వాత కూడా దీన్ని తినవచ్చు .

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ జ్యూస్ :

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధకతను పెంచడంలో గొప్పగా సహాయపడుతుంది. వ్యాధినిరోధక శక్తిని పెంచుకోగలిగినట్లైతే మలేరియాకు కారణమయ్యే ప్యారా సైట్స్ ను నివారించుకోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు . అందువల్ల డైలీ డైట్ లో తప్పనిసరిగా ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవాలి.

తులసి ఆకులు :

తులసి ఆకులు :

మలేరియాను నివారించడంలో తులసి ఆకులు గొప్పగా సహాయపడుతాయి. కొన్ని తులసి ఆకులను తీసుకుని అందులో 3 బ్లాక్ పెప్పర్ మిక్స్ చేసి తినాలి. ఇలా రెగ్యులర్ గా తింటుంటే మలేరియ అస్సలు ధరి చేరదు.

స్వీట్ వార్మ్ ఉడ్:

స్వీట్ వార్మ్ ఉడ్:

స్వీట్ వార్మ్ ఉడ్ లేదా ఆర్టిమిషియా మలేరియాను నివారించడంలో ఎఫెక్టివ్ హోం రెమెడీ. దీన్ని రెగ్యులర్ గా తింటుంటే మంచి ఫలితం ుంటుంది. మలేరియాకు నివారణకు ఇది ఒక బెస్ట్ హోం రెమెడీ .

English summary

10 Effective Home Remedies For Malaria

10 Effective Home Remedies For Malaria,Malaria can turn fatal if not taken care of on time. Listed here are a few of the exceptional home remedies that help to cure malaria.
Story first published: Monday, April 24, 2017, 17:41 [IST]
Desktop Bottom Promotion