For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జ్వరం వచ్చిందా? అయితే ఈ సింపుల్ హోం రెమెడీస్ ను ట్రై చేయండి..

ఒక సీజన్ నుంచి మరో సీజన్ లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్ లో వైరల్ ఇన్ ఫెక్షన్లు, జ్వరాల ఉదృ

By Mallikarjuna
|

ఒక సీజన్ నుంచి మరో సీజన్ లోకి ప్రవేశించే ముందు రకరకాల ఇన్ ఫెక్షన్లు సులభంగా దాడిచేస్తాయి. చల్లగా ఉన్న వాతావరణం వైరస్ ల పెరుగుదలకు అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈ సీజన్ లో వైరల్ ఇన్ ఫెక్షన్లు, జ్వరాల ఉదృతి ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో ప్రతి పదిమందిలో ఒకరికి జలుబు, జ్వరంతో కూడిన వైలర్ ఇన్ ఫెక్షన్లు కనిపిస్తుంటాయి. ఎక్కువ మందిని బాధించే వైరల్ ఇన్ ఫెక్షన్లలో ఫ్లూ జర్వం కూడా ఒకటి.

వాతావరనం చల్లగా ఉన్నప్పుడు రక్తనాళాలు కుచించుకుపోతాయి. దాని వల్ల రక్తసరఫరా నెమ్మదిస్తుంది. రక్తంలో ఉండే తెల్లరక్త కణాల సంఖ్య క్రమంగా తగ్గడం వల్ల శరీరంలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతుంది. ఈ ఇన్ ఫెక్షన్లు, జ్వరాలు, పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. ఎక్కువమంది గుమిగూడి ఉండే చోట్లలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అందుకే జ్వరాలు పిల్లల్లో చాలా త్వరగా వ్యాప్తి చెందుతాయి. అదే విధంగా రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు కూడా ఫ్లూ జ్వరం బారిన పడే అవకాశం ఉంటుంది.

Indian home remedies for fever

ఇంకా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఇయర్ ఇన్ఫెక్షన్, మరికొన్ని ఇన్ఫ్లమేటరీ వ్యాధుల లేదా వాతావరణంలో వచ్చే అకస్మిక మార్పులు మరియు అపరిశుభ్రమైన లైఫ్ స్టైల్ మొదలగు కారణాల వల్ల కూడా ఫీవర్ రావచ్చు.

శరీర ఉష్ణోగ్రత నార్మల్ కంటే ఎక్కువ రేంజ్ లో ఉంటే , ఫీవర్ గా గుర్తించాలి,. పెద్దవారిలో శరీర ఉష్ణోగ్రత 99 నుండి 99.5 డిగ్రీల ఫారన్ హీట్ లేదా 37.2 నుండి 37.5 డిగ్రీ సెంటీగ్రేట్ సూచిస్తే జ్వరం ఉన్నట్లు సూచన.

జర్వరం వచ్చినప్పుడు వీక్ నెస్, స్వెట్టింగ్, తలనొప్పి, కండరాల నొప్పులు, డీహైడ్రేషన్, ఆకలి తగ్గిపోవడం, కొంచెం వణుకు లక్షణాలు కనబడుతాయి.

జ్వరం వల్ల అసౌకర్యంగా అనిపిస్తుంటే , ఈ క్రింది సూచించిన 10 సింపుల్ అండ్ ఈజీ ఇండియన్ హోం రెమెడీస్ ను ట్రై చేయండి...

1. తులసి

1. తులసి

ఫీవర్ తగ్గించడంలో తులిసి గ్రేట్ రెమెడీ. తులసి ఆకులలో పవర్ ఫుల్ యాంటీబయోటిక్స్, యాంటీ బ్యాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలున్నాయి. ఫీవర్ నుండి తక్షణ ఉపశమనం పొందడానికి తులసి ఆకు టీ, లేదా తులసి తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

ఒక టీస్పూన్ తులసికి, అరటి టీస్పూన్ పెప్పర్ కలపాలి, ఈ రెండూ ఒక కప్పు నీటిలో వేసి బాగా ఉడికించాలి.

ఉడికించిన తర్వాత ఒక 5 నిముషాలు అలాగే ఉంచి, 5 నిముషాల తర్వాత నీళ్ళు వడగట్టి తాగాలి. రోజులో రెండు మూడు సార్లు తాగితే వెంటనే జ్వరం నుండి ఉపశమనం కలుగుతుంది.

2. వెల్లుల్లి

2. వెల్లుల్లి

వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలున్నాయి. ఇవి శరీరంలోని ఉష్ణోగ్రతను తగ్గించి జ్వరం తగ్గించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిలో ఉండే అల్లీసిన్ అనే కాంపౌండ్ కెంటెంట్ శరీరంలో ఇన్ఫెక్షన్ కు కారణం అయిన క్రిములను నాశనం చేస్తుంది.

ఒక వెల్లుల్లి రెబ్బను తీసుకుని మెత్తగా పేస్ట్ చేసి, అరకప్పు వేడి నీటిలో కలిపి, కొద్దిసేపటి తర్వాత వడగట్టి, రోజుకు రెండు సార్లు తాగాలి.

3. అల్లం

3. అల్లం

అల్లంలో అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలున్నాయి. ఇవి ఫీవర్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి, ఇందులో ఉండే ఏజాయినే అనే కంటెంట్ బ్యాక్టీరియా మరియు వైరల్ ఇన్ఫెక్షన్స్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది.

ఒక అంగుళం పొడవు అల్లం ముక్క తీసుకుని, అరకప్పు నీటిలో వేసి బాగా ఉడికించాలి.

తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల్ లెమన్ జ్యూస్ ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.

4. యాపిల్ సైడర్ వెనిగర్

4. యాపిల్ సైడర్ వెనిగర్

ఫీవర్ తగ్గించడానికి యాపిల్ సైడర్ వెనిగర్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. యాపిల్ సైడర్ వెనిగర్ లో కనుగొన్న ఆల్కలైన్ లక్షణాలు, శరీరంలో పిహెచ్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది. ఫీవర్ తో పోరాడుతుంది. ఇందులో మినిరల్స్ ఎక్కువ, అందువల్ల శరీరానికి మినిరల్స్ ను తిరిగి జోడిస్తుంది.

రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను ఒక టేబుల్ స్పూన్ తేనెతో కలిపి రోజుకు రెండు సార్లు తాగాలి.

5. దాల్చిన చెక్క

5. దాల్చిన చెక్క

దాల్చిన చెక్క మరో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు యాంటీ వైరల్ లక్షణాలు కలది. ఈ మసాలా దినుసు, ఫీవర్, దగ్గు, మరియు జలుబు తగ్గిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ తేనెలో అర టీస్పూన్ దాల్చిన చెక్క పౌడర్ కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.

6. తేనె

6. తేనె

తేనె మరో నేచరల్ గిఫ్ట్ , వివిధ రాకలుగా ఉపయోగపడే తేనె ముఖ్యంగా ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతుంది. జ్వరం తగ్గిస్తుంది, ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు జ్వరంను తక్షణం తగ్గిస్తుంది.

ఒక టేబుల్ స్పూన్ తేనెకు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి, ఈ రెండూ ఒక గ్లాసు వేడి నీటిలో కలిని గోరువెచ్చగా తాగాలి.

7. ఎండు ద్రాక్ష

7. ఎండు ద్రాక్ష

ఎండు ద్రాక్ష చాలా ఆరోగ్యకరమైన స్నాక్, వీటి అలాగే పచ్చిగా తినవచ్చు లేదా వంటల్లో జోడించి తినొచ్చు. ఎండు ద్రాక్షలో ఫినోలిక్ ఫైటో న్యూట్రీయంట్స్ అధికంగా ఉన్నాయి, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.

20-25 ఎండు ద్రాక్షను అరకప్పు నీటిలో వేసి కొద్దిసేపు నానబెట్టాలి.

తర్వాత మెత్తగా పేస్ట్ చేసి, ఈ నీటిని వడగట్టుకోవాలి.

దీనికి కొద్దిగా నిమ్మరసం జోడించాలి.

దీన్ని రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

8. పసుపు

8. పసుపు

పసుపులో యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి, అలాగే పసుపులో ఉండే కుర్కిమిన్ కాంపౌండ్ యాంటీ వైరల్ మరియు యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్ గా పనిచేసి, జ్వరంతో పోరాడుతాయి.

2 టీస్పూన్ల పసుపు పౌడర్ ను ఒక గ్లాసు వార్మ్ వాటర్ తో మిక్స్ చేసి తాగాలి.

9. గ్రీన్ టీ

9. గ్రీన్ టీ

గ్రీన్ టీలో బహు ప్రయోజనాలున్నాయి. గ్రీన్ టీలో ఉండే ఫాలీఫినాల్స్ మరియు ఫ్లెవనాయిడ్స్ వ్యాధినిరోధకశక్తిని పెంచుతాయి. అరకప్పు బాయిలింగ్ వాటర్ లో ఒక టీ బ్యాగ్ ను డిప్ చేయాలి. ఒక టీస్పూన్ తేనె కలిపి తీసుకోవాలి.

10. నైట్ జాస్మిన్

10. నైట్ జాస్మిన్

మరో న్యాచురల్ రెమెడీ నైట్ జాస్మిన్, ఈ నైట్ జాస్మిన్ చెట్టు ఆకుల్లో యాంటీ వైరల్ యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల జ్వరానికి సంబంధించిన బ్యాక్టీరియా మరియు వైరస్ తో పోరాడుతుంది.

తాజాగా ఉండే ఆకులను తీసుకుని, మెత్తగా పేస్ట్ చేసి, నీళ్ళు కలిపి జ్యూస్ తీసి , ఒక టీస్పూన్ తేనె కలిపి తాగాలి.

English summary

10 Indian Home Remedies For Fever

Fever is a symptom of another condition or illness. It occurs when your body is fighting an infection caused by a cold or flu. Some of the common symptoms of fever include weakness, sweating, headache, muscle ache, dehydration, loss of appetite and a slight shivering.
Story first published:Friday, December 22, 2017, 11:02 [IST]
Desktop Bottom Promotion