For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సైకో అని డౌటా? ఈ 10ల‌క్ష‌ణాలున్నాయేమో చూడండి!

By Sujeeth Kumar
|

10 Warning Signs You Are Dealing With a Psychopath

సైకాల‌జీ రెండు ప‌దాలు జ‌నాల‌ను బాగా క‌న్‌ఫ్యూజ్ చేస్తాయి. అవే సైకోపాత్‌, సోషియోపాత్‌. ఇవి త‌ర‌చూ ఒక‌దానికి బ‌దులుగా మ‌రొక‌టి వాడినా సైకోపాత్ చాలా డేంజ‌ర్‌.


సైకోపాత్ అంటే ఎవ‌రు?

స‌మాజానికి హాని త‌ల‌పెట్టే వ్య‌క్తి, ఎలాంటి నీతి నియమాలు లేకుండా, ఎప్పుడూ చెడు త‌ల‌పెట్టాల‌ని చూసే వ్య‌క్తినే సైకోపాత్‌గా వ్య‌వ‌హ‌రిస్తారు. సీరియ‌ల్ కిల్ల‌ర్‌లుగా మారేది సైకోపాత్‌లే.

వీళ్లు ఎమోష‌న్ల‌కు త‌క్కువ‌గా రియాక్ట‌వుతారు. సామాజిక ప‌రంగా భావోద్వేగాల‌ను పండించి న‌మ్మ‌కం క‌లిగేలా చేసుకోవ‌డంలో సిద్ధ‌హ‌స్తులు. వీళ్లు చెడ్డ‌వార‌ని గుర్తించ‌డం చాలా క‌ష్టం. న‌టించ‌డంలో వీరిని మించిన‌వారులేరు.

సైకోపాత్‌ల గురించిన కొన్ని హెచ్చ‌రిక‌లు, వారు న‌మ్మ‌క‌స్తులు కార‌ని చెప్ప‌డానికి కొన్నిసాక్ష్యాలు.

1. అలాంటి ఫీలింగ్స్ ఉండ‌వు

1. అలాంటి ఫీలింగ్స్ ఉండ‌వు

స్పంద‌న లేన‌ట్టు న‌టించేవాళ్ల‌కి, స్పందించ‌లేని వారికి తేడా ఉంది. ఎవ‌రైనా ఎమోష‌న‌ల్‌గా ఫీల్ అవుతుంటే వాళ్ల‌ను ఓదార్చుతారు. సైకోపాత్‌ల‌కు అలాంటి ఫీలింగ్స్ ఉండ‌వు. ఇత‌రుల దుర‌దృష్టానికి వాళ్ల‌కు చ‌ల‌నం ఉండ‌దు. ఇలా వాళ్లు ఉండ‌డానికి కార‌ణం ఉంది. వారి మెద‌డులో ఎమోష‌న్లకు నాడీ సంకేతాలుండ‌వు. అదే మామూలుగా ఉండే మ‌న‌కు ఉంటాయి. అందుకే సైకోపాత్‌లు ఫీల్ అవ్వ‌రు లేదా అయినా ఫీల్ అయిన‌ట్టు న‌టిస్తారు.

2. యాక్సిడెంట్లు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి

2. యాక్సిడెంట్లు కూడా సాదాసీదాగా అనిపిస్తాయి

డాక్ట‌ర్లు, స‌ర్జ‌న్‌లు త‌ప్పిస్తే రోడ్డుపైన యాక్సిడెంట్ కేసుల‌ను చూసిన వారికెవ‌రికైనా మ‌న‌సు క‌ర‌గాల్సిందే. రోడ్డు మీద బండిలో వెళుతున్న‌వారు డివైడ‌ర్‌కు త‌గిలి రెండు ముక్క‌లైన స‌న్నివేశాల‌ను చూస్తే క‌డుపు త‌రుక్కుపోవాల్సిందే. అలాంటి స‌న్నివేశాల‌ను చూసిన‌ప్పుడు సైకోపాత్‌ల హృద‌యం ద్ర‌వించ‌దు. సైకోపాత్ కిల్ల‌ర్‌ల‌కు ఎలాంటి ఫీలింగ్స్ ఉండ‌వు. ముఖ్యంగా అలాంటి భ‌యాన‌క ప్ర‌మాదాలు చూసినా కూడా వారికి మ‌న‌సులో అదో సాధార‌ణ సంఘ‌ట‌న‌లాగే క‌నిపిస్తుంటుంది.

3. అప‌రాధ భావం ఉండ‌దు

3. అప‌రాధ భావం ఉండ‌దు

సిగ్గు, బిడియం, అప‌రాధ‌బావం లాంటివి సాధార‌ణ సామాజిక భావాలు. ఇవి మ‌నుషులను తీవ్రంగా ప్ర‌భావితం చేస్తాయి. ముఖ్యంగా చిన్న‌త‌నంలో వీటిని ఎదుర్కోవ‌డం వ‌ల్ల పెద్ద‌య్యాక ప్ర‌భావంచూపిస్తాయి. ఐతే సైకోపాత్‌లు ఇలాంటి భావోద్వేగాల‌కు అతీతులు. ఈ సారి ఎవ‌రైనా పిల్లాడు కుక్క‌ను రాళ్ల‌తో కొడుతున్న‌ట్టు చూసి అత‌డిలో ఎలాంటి అప‌రాధ భావం క‌నిపించ‌క‌పోతే సైకోపాత్ ల‌క్ష‌ణాలున్న వ్య‌క్తి త‌యారవుతున్నాడ‌ని చెప్పొచ్చు.

4. భ‌యం అంటే అర్థం కాదు

4. భ‌యం అంటే అర్థం కాదు

మ‌న‌కు ఎదుర‌య్యేది మూడు ర‌కాల వ్య‌క్తిత్వాలున్న మ‌నుషులు--- ధైర్య‌వంతులు, నిజాయ‌తీప‌రులు, పిరికివాళ్లు. భ‌యాన్ని ఎలా ఎదుర్కొంటార‌నేదానిపై వీరిని వ‌ర్గీక‌రించ‌వ‌చ్చు.

పిరికివాళ్లు భ‌యం గొలిపే వాటికి దూరంగా పారిపోతారు. ధైర్య‌వంతులు భ‌యాన్ని త‌రిమేసేందుకు ఏం చేయాలో ఆలోచించి త‌గిన‌విధంగా చేస్తారు. నిజాయ‌తీప‌రులు జీవితంలో ఎలాంటి భ‌యాల‌నైనా సులువుగా జ‌యించేస్తారు.

సైకోపాత్‌లు ఈ మూడింటిలో దేనికీ చెందరు. భ‌యం అనే ప‌దమే వీరికి అర్థం కాదు. ఎక్కువ రిస్క్ ఉండే ప‌నులే చేస్తుంటారు. ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌కు అస్స‌లు భ‌య‌ప‌డ‌రు. సైకోపాత్‌ల‌కు ఎల‌క్ట్రిక్ షాక్ ఇస్తున్నాం అని చెప్ప‌గానే వ‌ణికిపోయే ల‌క్ష‌ణాలేమీ క‌నిపించ‌వు. సాధార‌ణంగా ఉండేవారికైతే చెమ‌ట‌లు ప‌ట్టేస్తాయి.

5. బాధ్య‌త తీసుకోరు

5. బాధ్య‌త తీసుకోరు

సైకోపాత్‌లకు ఉన్న మ‌రో ల‌క్ష‌ణం ఏమిటంటే వారు అస్స‌లు బాధ్య‌త తీసుకోరు. వాళ్లు చేసే త‌ప్పుల‌కు ఇత‌రుల‌ను నిందిస్తారు. త‌మ వ‌ల్ల ఏదైనా త‌ప్పు జ‌రిగినా అస్స‌లు బాధ‌ప‌డ‌రు. పైగా అదే ప్ర‌వ‌ర్త‌న‌ను తిరిగి రిపీట్‌చేస్తుంటారు.

6. ప్రేమ ప‌ద‌జాలం అర్థం కాదు

6. ప్రేమ ప‌ద‌జాలం అర్థం కాదు

సాధార‌ణ జ‌నాలకు ప్రేమ ప‌ద‌జాలం అర్థ‌మ‌వుతుంది. సైకోపాత్‌లకు భావుక‌త ప‌దాలు, ఆలోచ‌న‌లు, స‌ర‌స‌స‌ల్లాపాలు లాంటివేమీ అర్థంకావు.

7. అబ‌ద్ధ‌మాడినా గిల్టీనెస్ ఉండ‌దు

7. అబ‌ద్ధ‌మాడినా గిల్టీనెస్ ఉండ‌దు

సామాన్యులు అబ‌ద్ధం ఆడితే లోప‌ల ఏదో గిల్టీగా ఫీల‌వుతారు. సైకోపాత్‌లు మాత్రం త‌ర‌చూ అబ‌ద్ధాలు ఆడుతూనే ఎలాంటి గిల్టీనెస్ ఫీల్ కారు.

8. శ‌క్తియుక్తుల గురించి గొప్ప‌లు చెప్పుకుంటారు

8. శ‌క్తియుక్తుల గురించి గొప్ప‌లు చెప్పుకుంటారు

సైకోపాత్‌లు త‌మ శ‌క్తియుక్తుల గురించి గొప్ప‌గా చెప్పుకుంటారు. ప్ర‌తిదాంట్లోనూ గొప్ప‌ద‌నాన్ని చూసుకుంటారు. మ‌న గురించి మ‌నం ఎలా జ‌డ్జ్ చేసుకుంటామో అలా సైకోపాత్‌లు చేసుకోలేరు.

9. విప‌రీత‌మైన స్వార్థ‌ప‌రులు

9. విప‌రీత‌మైన స్వార్థ‌ప‌రులు

పైన తెలిపిన విధంగా భావోద్వేగాలు వీరికి ఉండ‌వు. అబ‌ద్ధాలు సునాయాసంగా ఆడేస్తారు, భావోద్వేగాల‌ను న‌టించ‌గ‌ల‌రు. వాళ్ల‌కు కావాల్సింది సంపాదించ‌డానికి ఎంత‌కైనా తెగిస్తారు. అమాయ‌కుల‌ను క‌లిస్తే వాళ్ల‌తో స్నేహంగా న‌టించి వారి అవ‌స‌రాల‌ను తీర్చుకునే స్వార్థ‌ప‌రులు.

10. ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌లేరు.

10. ప‌రిణామాల‌ను అంచ‌నా వేయ‌లేరు.

ఫ్ర‌స్టేష‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఆ త‌ర్వాత జ‌రిగే ప‌రిణామాల‌పై ఏ మాత్రం అంచ‌నా ఉండ‌దు. అందుకే చాలా అగ్రెసివ్‌గా, వ‌యెలెంట్‌గా ఉంటారు. వాళ్ల‌కు కావాల్సిన‌దానికోసం ఏం చేసేందుకైనా వెన‌కాడ‌రు.

ఇలాంటి వారిని గుర్తించ‌డంలో స‌హ‌క‌రించండి. ఈ క‌థ‌నాన్ని షేర్ చేసి అంద‌రికి తెలిసేలా చేద్దాం.

English summary

10 Warning Signs You Are Dealing With a Psychopath

A psychopath is an antisocial person who doesn't have a moral compass and often has predatory tendencies. No wonder so many serial killers turn out to be psychopaths. And since most of them feel little to no emotions and have the ability to mimic social behaviours to display cues of trustworthiness and honesty, it's often very difficult to recognize one when they meet and befriend you. So here are some warning signs you are dealing with a psychopath and not a genuine person.
Desktop Bottom Promotion