For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంగీ జ్వరం.. ఈ జ్యూస్ లతో తగ్గుతుంది

By Y BHARATH KUMAR REDDY
|

డెంగీ ఈ వ్యాధి పేరు వినగానే అందరికీ వెన్నులో వణుకు పుడుతుంది. శరీరంలో ప్లేట్‌లెట్లు తగ్గిపోయి.. మనిషి నీరసంగా తయారవుతాడు. ప్రస్తుతం అందరినీ భయపిస్తున్న జ్వరం ఇదే. దీన్ని నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకరం. కానీ కొద్దిగా అవగాహన పెంచుకుంటే అంతగా భయపడాల్సిన అవసరం లేదు. సాధారణంగా దోమ కాటు ద్వారా డెంగీ వైరస్‌ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఐదారు రోజుల్లో డెంగీ జ్వరం లక్షణాలు మనలో కనిపిస్తాయి. అకస్మాత్తుగా తీవ్రజ్వరం వస్తుంది. తీవ్రమైన తలనొప్పి వస్తుంది. ఒళ్లు, కీళ్ల నొప్పులు ఎక్కువవుతాయి. వాంతులవుతాయి. ఆకలి వేయదు. మొదట ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అందువల్ల ఏ లక్షణాలతో జ్వరం వచ్చినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డెంగీ యాంటిజెన్‌ పరీక్ష (ఎన్‌.ఎస్‌-1) చేయించుకుని నిర్ధారించుకోవాలి. ఈ పరీక్ష ద్వారా జ్వరం వచ్చిన మొదటి రోజే అది డెంగీనో కాదో అనే విషయం తేలిపోతుంది. ఈడిస్‌ ఈజిప్టై దోమ వల్ల డెంగీ వస్తుంది. దీన్ని టైగర్‌ దోమ అని కూడా అంటారు. అపరిశుభ్రత వల్లే దోమలు విజృంభించి, డెంగీ ప్రబలుతుంది. అందువల్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే డెంగీతో పోరాడే శక్తి ఉన్న కొన్ని జ్యూస్ లు కూడా తీసుకోవాలి. దీంతో మీ శరీరాన్ని హైడ్రేట్ గా మారుతుంది. రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య పెంచడానికి కూడా ఈ జ్యూస్ ఉపయోగతాయి. మరి అవి ఏమిటో ఒక్కసారి తెలుసుకుందామా.

1) దానిమ్మ జ్యూస్

1) దానిమ్మ జ్యూస్

దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్ గా ఉంటాయి. ఇది ప్లేట్లెట్ కౌంట్ ను పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. శరీరంలోని లింఫోసైట్లు పెరిగేందుకు దోహదం చేస్తుంది. ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఒక కప్పు దానిమ్మపండు విత్తనాలు తీసుకోండి. రెండు కప్పుల నీటిని తీసుకుని రెండింటిని మిక్స్ చేయండి. జ్యూస్ తయారు చేసుకుని తాగండి. ఇలా రెగ్యులర్ గా చేస్తే డెంగీ బారి నుంచి బయటపడొచ్చు. ఇలా చేస్తే బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి రోజుకి రెండుసార్లు దాన్నిమ్మ జ్యూస్ తాగడం వల్ల డెంగ్యూ నివారించవచ్చు.

2) కలబంద

2) కలబంద

కలబందలో బ్యాక్టీరియా, వైరస్‌, వ్యాధు లను నివారించే శక్తి ఉంది. ఇందులో అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. మన శరీరంలో అమైనో ఆమ్లాలు తగ్గితే ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. అమైనో యాసిడ్స్ తగ్గకుండా కలబంద జ్యూస్ బాగా సహాయచేస్తుంది. అలాగే జ్వరాలకు సంబంధించిన వైరస్ లపై దాడి చేసే గుణాలు కలబందకు ఉంటాయి. మీరు వేగంగా తిరిగి కోలుకునేందుకు కలబంద జ్యూస్ తోడ్పడుతుంది. కలబంద జ్యూస్ మీకు మార్కెట్లలో విరివిరగా లభిస్తుంది.

3) బొప్పాయి ఆకుల జ్యూస్

3) బొప్పాయి ఆకుల జ్యూస్

బొప్పాయి ఆకులు డెంగీ జ్వరానికి మంచి మందులా పని చేస్తాయి. డెంగీ జ్వ‌రం వ‌చ్చిన వారు బొప్పాయి ఆకుల ర‌సం తాగితే ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. ర‌క్తం వృద్ధి చెందుతుంది. త్వ‌ర‌గా జ్వ‌రం నుంచి కోలుకుంటారు. తాజా బొప్పాయి ఆకులను తీసుకోండి. వాటికి కొద్దిగా నీరు కలిపి పేస్ట్ గా చేసుకోండి. దాన్ని రోజు 4-5 మోతాదులో తింటూ ఉండండి. దీంతో డెంగీ జ్వరం నుంచి మీరు బయటపడొచ్చు. ఇది.. బ్లడ్ ప్లేట్ లెట్స్ ని ఊహించని రీతిలో పెంచుతుంది.

4) జామ జ్యూస్

4) జామ జ్యూస్

జామపండు ఆరోగ్యానికి దివ్యౌషధం. ఇది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది. జామపండ్లలో విటమిన్-సీ, క్యాల్షియం మెండుగా లభిస్తాయి. ఇందులో ఉండే విటమిన్-సీ , విటమిన్ ఎ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే డీహైడ్రేట్ బారిన పడకుండా మేలు చేస్తుంది. రెండు జామ పండ్లను కట్ చేసుకోండి. కొద్దిగా నీరు తీసుకోండి. రెండింటిని మిక్స్ చేసి జ్యూస్ గా చేసుకోండి. దీనివల్ల మీరు మంచి ఫలితం పొందుతారు.

5) వేప ఆకుల జ్యూస్

5) వేప ఆకుల జ్యూస్

రోగ నిరోదక శక్తిని పెంచడంలో వేప చాలా బాగా పని చేస్తుంది. ఇది శరీరంలో తెల్ల రక్త కణాలను పెంచుతుంది. అంటువ్యాధులపై వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. తాజా వేప ఆకులను పేస్ట్ మాదిరిగా తయారు చేసుకోండి. ఒక స్పూన్ పేస్ట్ ను తీసుకుని గ్లాస్ వాటర్ లో మిక్స్ చేసుకోండి. ఆ వాటర్ ను రోజులో రెండుసార్లు తాగండి. దీనివల్ల డెంగీ నుంచి విముక్తి కలిగే అవకాశం ఉంది.

6. ఉసిరి జ్యూస్

6. ఉసిరి జ్యూస్

ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల శరీరంలో ఇమ్యునిటీ లెవెల్ పెరుగుతుంది. వేగంగా.. డెంగ్యూ ఫీవర్ తగ్గుతుంది. ఎలాంటి జ్వరం లక్షణాల నుంచైనా మీరు ఈజీగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉసిరి జ్యూస్ మార్కెట్లో విరివిగా లభిస్తుంది. లేదంటే తాజా ఉసిరికాయలతో ఇంట్లో కూడా మీరు జ్యూస్ తయారు చేసుకోవొచ్చు.

7) తులసి జ్యూస్

7) తులసి జ్యూస్

తులసి మొక్క మన అందరికీ తెలిసిందే. ఇందులో అనేక ఔషధ గుణాలుంటాయి. ఇది డెంగ్యూకి వ్యతిరేకంగా చాలా ప్రభావవంతంగా పోరాడుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కొన్ని తాజా తులసి ఆకులను తీసుకోండి. వాటిని పేస్ట్ లాగా చేసుకోండి. ఆ మిశ్రమాన్ని నీటిలో కలుపుకుని తాగండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మంచి ఫలితాలుంటాయి.

8) క్యారెట్, దోసకాయ నిమ్మకాయ జ్యూస్

8) క్యారెట్, దోసకాయ నిమ్మకాయ జ్యూస్

క్యారట్లలో విటమిన్ -ఎ ఎక్కువగా ఉంటుంది. నిమ్మలో విటమిన్ -సి ఎక్కువగా ఉంటుంది. దోసకాయలు బాడీలో న్యాచురల్ ప్లూయడ్స్ పెంపొందించుకోవడానికి తోడ్పడుతాయి. ఇక ఈ మూడింటితో తయారు చేసే జ్యూస్ మీలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే డెంగ్యూకు సంబంధించిన వైరస్ లపై వ్యతిరేకంగా పోరాడే గుణాలు ఇందులో ఉంటాయి. ఈ మూడింటిని తీసుకుని కట్ చేసుకోండి. ఒక్కోదాన్ని సగం కప్పు ప్రకారం సిద్ధం చేసుకోండి. ఒక కప్పు నీరు తీసుకుని, ఆ ముక్కల్ని అందులో కలపండి. తర్వాత జ్యూస్ గా తీసుకుని రోజుకు రెండుసార్లు ప్రకారం తాగండి. మంచి ఫలితం ఉంటుంది.

9. బార్లీ గడ్డి జ్యూస్

9. బార్లీ గడ్డి జ్యూస్

బార్లీ గడ్డి జ్యూస్ ద్వారా కూడా డెంగీని తగ్గించుకోవొచ్చు. బార్లీ గడ్డిలో అన్ని రకాల పోషక పదార్ధాలు ఉంటాయి. ఇన్ఫెక్షన్ నుంచి శరీరాన్ని కాపాడే గుణం దీనికి ఉంటుంది. శరీరంలో రోగనిరోధక కణాలను పెంచగలుతుంది. శరీరంలోని మలినాలను తొలగించడానికి బాగా పని చేస్తుంది. యాంటీ వైరస్ గుణాలు ఇందులో ఉండడంల వల్ల డెంగీ నివారణకు బాగా ఉపయోగపడుతుంది.

10) ఆరెంజ్ జ్యూస్

10) ఆరెంజ్ జ్యూస్

ఇందులో విటమిన్ సీ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ ఆరంజ్ జ్యూస్ లో పుష్కలంగా ఉంటాయి. డెంగ్యూ వైరస్ ని నివారించడానికి రోజూ ఆరంజ్ జ్యూస్ తాగాలి. రోగి త్వరగా కోలుకొనేందుకు ఆరెంజ్ జ్యూస్ సహాయపడుతుంది. ఇందులో అమ్లజనకాలు ఎక్కువగా ఉంటాయి. ఆరెంజ్ జ్యూస్ మూత్రపిండాల పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. బాడీలోని మలినాలను బయటకుపంపడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మార్కెట్లో మనకు రెడీమేడ్ గా ఆరెంజ్ జ్యూస్ దొరుకుతుంది. లేదంటే ఇంట్లో తయారు చేసుకోవడం ఉత్తమం.

11) కివి జ్యూస్

11) కివి జ్యూస్

కివి పళ్లలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లెడ్ ప్లేట్లెట్లను పెంచుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఇవి చాలా అవసరం. అన్నిపండ్ల కన్నా కివి పండ్లు చాలా త్వరగా కోలుకునే శక్తిని శరీరానికి ఇస్తాయి. అందువల్ల వీటికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వండి. కివీ జ్యూస్ ను ఎక్కువగా తాగడం వల్ల త్వరగా కోలుకుంటారు.

English summary

11 Effective Juices For Dengue Fever

One such disease which is becoming more common in our country is dengue. Dengue is a tropical disease which is spread through mosquitoes which carry the dengue virus. Mosquitoes breed in places with stagnant water. The common symptoms of dengue include fever, joint pain and head ache. It can affect any age group. The vaccines against this disease are still in the testing stage and hence there are no proper medications available for this disease as of now.
Story first published:Friday, November 10, 2017, 10:00 [IST]
Desktop Bottom Promotion