For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాయింట్ పెయిన్స్ తగ్గించుకోవడానికి 11 నేచురల్ మార్గాలు..!

జాయింట్ పెయిన్ నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిలో చాలా వరకూ ఉత్తమ ఫలితాలను అందించేవే. ఈ హోం రెమెడీస్ ను ఎటువంటి ఖర్చులేకుండా మీరు ఇంట్లోనే ప్రయత్నించవచ్చు .

|

జాయింట్ పెయిన్ నివారించడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. వాటిలో చాలా వరకూ ఉత్తమ ఫలితాలను అందించేవే. ఈ హోం రెమెడీస్ ను ఎటువంటి ఖర్చులేకుండా మీరు ఇంట్లోనే ప్రయత్నించవచ్చు . కొన్ని దీర్ఘకాలిక వ్యాధులైన టెండినైటిస్, బర్రైస్, గౌట్ మరియు ఆర్థరైటిస్ వంటివి జాయింట్ పెయిన్ కు ప్రధాన కారణం అవుతుంది. ఎప్పుడైతే మీ జాయింట్స్ నొప్పిగా అనిపిస్తుందో, అప్పుడు మన దినచర్య కొద్దిగా కష్టం అవుతుంది. అయితే నొప్పి ఒక తీవ్రస్థాయికి చేరిపనప్పుడు, డాక్టర్ ను సంప్రదించడం చాలా కష్టం అవుతుంది.

నొప్పి తీవ్రంగా ఉన్నప్పుడు, సరైన జాగ్రత్తలు మరియు చికిత్సను తీసుకోవడం చాలా అవసరం. నొప్పి భరించలేనంత తీవ్రస్థాయిలోకి చేరుకుంటే, ఇలాంటి హోం రెమెడీస్ కూడా సరిగా పనిచేయవు . అయితే మీ జాయింట్ పెయిన్స్ చాలా సాధారణంగా లేదా తక్కువగా ఉన్నప్పుడు, ఇలాంటి హోం రెమెడీస్ ను మీరు ప్రయత్నించవచ్చు. అయినా కూడా ఈ క్రింది ఉదహరించిన హోం రెమెడీస్ ఉపయోగించడానికి ముందు డాక్టర్ ను కలవడం చాలా అవసరం. మీరు ఉపయోగించే హోం రెమెడీస్ వేరే ఏ ఇతర మెడిసిన్ తో పాటు తీసుకోకూడదు. మరి జాయింట్ పెయిన్ నివారించే ఉత్తమ హోం రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం...

 ఫైబర్ రిచ్ ఫుడ్స్ :

ఫైబర్ రిచ్ ఫుడ్స్ :

జాయింట్ పెయిన్ తగ్గించుకోవడంలో డైట్ లో మార్పులు చేసుకోవడం చాలా అవసరం. డైట్ లో విటమిన్స్, ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను జోడించుకోవాలి. ప్రొసెస్ చేసిన హై క్యాలరీ ఫుడ్స్ కు పూర్తిగా దూరంగా ఉండాలి.

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ :

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ :

ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఫిష్, నట్స్, వాల్ నట్స్ వంటివి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం తప్పనిసరి.

అరటిపండ్లు :

అరటిపండ్లు :

అరటిపండ్లలో పొటాషిం అధికంగా ఉంటుంది. ఇవి ఎముకలకు లూబ్రికేషన్స్ అంధివ్వడంతో పాటు బలాన్ని చేకూర్చుతాయి.

పసుపు:

పసుపు:

పాలలో పసుపు మిక్స్ చేసి రెగ్యులర్ గా తాగుతుంటే కీళ్ళ నొప్పులు క్రమంగా తగ్గుతాయి.

వెనిగర్ :

వెనిగర్ :

హాట్ వెనిగర్ ను పెయిన్ ఫుల్ జాయింట్స్ మీద అప్లై చేసి మర్ధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జాయింట్ పెయిన్స్ ను తగ్గిస్తుంది.

యాపిల్ సైడర్ వెనిగర్ :

యాపిల్ సైడర్ వెనిగర్ :

రెండు టీస్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ లో రెండు టీస్పూన్ల తేనెను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి తాగాలి. నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలుగుతుంది.

సెలరీ:

సెలరీ:

రెగ్యులర్ డైట్ లో ధనియాలు, కొత్తమీరను చేర్చుకోవడం వల్ల జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇది స్ట్రాంగ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలది.

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్ :

యూకలిప్టస్ ఆయిల్లో కొద్దిగా కర్పూరం మిక్స్ చేసి గోరువెచ్చగా చేసి జాయింట్స్ కు అప్లై చేసి మర్ధ చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

ఎప్సమ్ సాల్ట్ :

ఎప్సమ్ సాల్ట్ :

స్నానం చేసే నీటిలో ఎప్సమ్ సాల్ట్ వేసి స్నానం చేస్తే నొప్పులు తగ్గుతాయి.

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్ :

హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్ :

కీళ్ళ నొప్పులున్న ప్రదేశంలో హాట్ అండ్ కోల్డ్ కంప్రెసర్ తో మసాజ్ చేయాలి.

వర్కౌట్స్:

వర్కౌట్స్:

రెగ్యులర్ గా వయామం, యోగ చేస్తే జాయింట్ పెయిన్స్ నుండి ఉపశమనం కలుగుతుంది.

English summary

11 Natural Ways To Get Rid Of Joint Pain Quickly

Joint pain may affect anyone due to a variety of reasons, but the most frequently affected individuals are those aged above fifty. Excessive wear and tear leads to the deterioration of bones and stiffens the joints as one ages and impairs the free movement of an individual to a great extent.
Story first published: Thursday, January 19, 2017, 18:22 [IST]
Desktop Bottom Promotion