For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ సమయంలో నిద్రలేమి సమస్యలను నివారించే 8 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!

మహిళలకు నెలసిరి ఒక వేధించే సమస్య. ఎందుకంటే ఈ సమయంలో పొట్ట ఉబ్బరం, క్రాంప్స్ మరియు పొట్టనొప్పి వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి.

By Lekhaka
|

మహిళలకు నెలసిరి ఒక వేధించే సమస్య. ఎందుకంటే ఈ సమయంలో పొట్ట ఉబ్బరం, క్రాంప్స్ మరియు పొట్టనొప్పి వంటి లక్షణాలు అధికంగా ఉంటాయి. అంతే కాదు పీరియడ్స్ సమయంలో నిద్రపట్టడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. ఈ సమయంలో చాలా మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కుంటారు . పీరియడ్స్ లో నిద్రలేమి సమస్యను నివారించుకోవడానికి లైఫ్ స్టైల్ మరియు ఫుడ్స్ హ్యాబిట్స్ మార్చుకోవడం మంచిది.

పీరియడ్స్ లో పొట్టనొప్పి, క్రాంప్స్ మాత్రమే కాదు, ఇతర అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కుంటారు, వాటిలో ఇరిటేషన్, మూడ్ స్వింగ్, బ్రెస్ట్ టండర్ నెస్, బ్యాక్ ఏక్, మరికొన్ని ఇతర సమస్యలను కూడా ఎదుర్కుంటారు.

ఇవన్నీ కూడా పీరియడ్స్ సమయంలో సరిగా నిద్రలేకపోవడం వల్ల ఇతర అనారోగ్య సమస్యలకు కూడా ఎదురవుతాయి. పీిరియడ్స్ సమయంలో సరిగా నిద్రపట్టకపోతే ఖచ్చితంగా ఏం జరగుతుంది?

ముఖ్యంగా హార్మోనుల్లో మార్పులు. పీరియడ్స్ సమయంలో ప్రొజెస్ట్రాన్, మరియు ఈస్ట్రోజెన్స్ పూర్తిగా తగ్గిపోతాయి. ఇవి కూడా నిద్రలేమి సమస్యకు ఒక ఖచ్చితమైన కారణమని చెప్పవచ్చు.

సమతుల ఆహారం తీసుకోవడం, జీవనశైలిలో మార్పులను చేసుకోవడం వల్ల వల్ల పీరియడ్స్ సమయంలో కూడా మంచి నిద్రపొందడానికి సహాయపడుతుంది. పీరియడ్స్ సమయంలో కూడా బాగా నిద్రపట్టాలంటే కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా..

1. కెఫిన్ ఉన్న ఆహార పానియాలకు దూరంగా ఉండాలి:

1. కెఫిన్ ఉన్న ఆహార పానియాలకు దూరంగా ఉండాలి:

కెఫిన్ ఉండే కాఫీలు, టీలు తాగడం వల్ల నిద్రను పాడు చేస్తుంది. మెనుష్ట్రువల్ పెయిన్, క్రాంప్స్ తగ్గించుకోవడానికి టీ, కాఫీలను ఎక్కువగా తాగుతుంటారు. అయితే ఇవి నిద్ర మీద తీవ్ర ప్రభావం చూపుతాయి. దాంతో నిద్రలేమి సమస్య. కాబట్టి, పీరియడ్స్ సమయంలో కెఫినేటెడ్ పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

2.రాత్రి నిద్రించడానికి ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది:

2.రాత్రి నిద్రించడానికి ముందు ఆల్కహాల్ తీసుకోకపోవడం మంచిది:

ఆల్కహాల్ నిద్రలేమికి కారణమవుతుంది. ఆల్కహాల్ తాగడం వల్ల రాత్రుల్లో మద్యమద్యలో నిద్రలేవాల్సి వస్తుంది. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో ఆల్కహాల్ తీసుకోకూడదు. నిద్రలేమికే కాదు, ఇతర అనారోగ్య సమస్యలకు కూడా కారణమవుతుంది.

3.రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం చేయకూడదు:

3.రాత్రి నిద్రించడానికి ముందు వ్యాయామం చేయకూడదు:

పీరియడ్స్ సమయంలో వ్యాయమం చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు.ఎక్కువ శ్రమకలిగించే, కండరాలనొప్పులు కలిగించే వ్యాయామాలు కాకుండా, సింపుల్ గా బ్రిస్క్ వాక్, జాగింగ్ వంటివి చేయడం వల్ల మంచి నిద్రపడుతుంది.

4. విటమిన్ డి:

4. విటమిన్ డి:

విటమిన్ డికి మంచి మూలం సూర్య రశ్మి. ఉదయం పడే లేలేత సూర్య కిరణాల నుండి శరీరం విటమిన్ డి గ్రహిస్తుంది. విటమిన్ డి సప్లిమెంట్ తినడం కంటే, ఎండలలో కొద్ది సమయం ఉండటం మంచిది. ఇది లెప్టిన్ అనే హార్మోన్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది పొట్ట ఉబ్బరం నివారిస్తుంది. మంచి నిద్రపట్టడానికి సహాయపడుతుంది.

5. ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం:

5. ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం:

డే టైమ్ లో ద్రవాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సోడియం ఫ్లష్ అవుట్ అవుతుంది. పొట్ట ఉబ్బరాన్ని నివారిస్తుంది. పీరియడ్స్ సమయంలో ఎక్కువగా పొట్ట ఉబ్బరం సమస్యలను నివారించుకోవడానికి ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి.

6. క్యాల్షియం:

6. క్యాల్షియం:

రోజూ శరీరానికి సరిపడా క్యాల్షియం అందుతుందో లేదో చూసుకోవాలి. పొట్ట ఉబ్బరం తగ్గించే వాటిలో క్యాల్షియం కూడా ఒకటి. నిద్రలేమి సమస్యను నివారించడంలో క్యాల్షియం కూడా సహాయపడుతుంది.అందువల్ల క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.

7. స్నాక్స్ తీసుకోవడం మానేయాలి:

7. స్నాక్స్ తీసుకోవడం మానేయాలి:

నిద్రించడానికి ముందు ఎక్కువ స్నాక్స్ తినడం మానేయాలి. ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో స్నాక్స్ , స్వీట్స్ తినడం తగ్గించాలి. పొట్ట నిండుగా ఉన్న అనుభూతితో జీర్ణమవ్వడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. ఇవి నిద్రలేమికి కారణమవుతాయి.

8. నట్స్ తినాలి:

8. నట్స్ తినాలి:

రాత్రుల్లో ఎక్కువ ఆకలిగా ఉన్నట్లైతే కొన్ని నట్స్ తినడం మంచిది. ఇవి నిద్రలేమి సమస్యను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

English summary

8 Amazing Ways To Get Rid Of Sleep Problem (Insomnia) During Menstruation

Stomach bloating, cramps and severe pain during menstruation makes it difficult for one to get a good night's sleep. If you are one among the sufferers then all these can be avoided with certain changes in lifestyle and food habits.
Story first published: Tuesday, January 3, 2017, 7:55 [IST]
Desktop Bottom Promotion