For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీర్ణ సమస్యలను, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే 8 ఎఫెక్టివ్ హోం రెమెడీస్..!!

జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే కొన్ని ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

|

సహజంగా జీర్ణ సమస్యలనగానే...మనం తీసుకునే ఫుడ్స్ వల్లే అన్న విషయం గుర్తుంచుకోవాలి. మనం తీసుకునే ఆహారాల్లో ఆయిల్స్ అధికంగా ఉన్నా..ఫ్యాట్..కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తీసుకున్నా పొట్ట సమస్యలు తప్పవు. ఆయిల్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ తినడం వల్ల కడుపుబ్బరం , ఇతర సమస్యలకు గురి అవుతారు.

జీర్ణ సమస్యతో బాధపడుతున్నట్లు అనిపించిన వెంటనే, నొప్పి, ఉబ్బరాన్ని తగ్గించుకోవడ కోసం మార్గాన్నివెదుకుతారు. ఎందుకంటే పొట్ట సమస్యలు చాలా అసౌకర్యాన్ని కలిగిస్తాయి . ఇటువంటి పరిస్థితిలో హోం రెమెడీస్ కు మంచిని మార్గం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ఇవి వెంటనే పొట్ట నొప్పి, కడుపుబ్బరం నుండి ఉపశమనం కలిగించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

జీర్ణ సమస్యలకు వివిధ రకాల కారణాలుంటాయి. వాటిన్నింటిలో ఆహారం ముఖ్య కారణం. మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వట్లేదంటే, కడుపుబ్బరం, అసౌకర్యానికి దారితీస్తుంది.

అలాగే జీర్ణ సమస్యలకు మరో కారణం వ్యాయమ లోపం మరియు పరిశుభ్రత లోపం, నిద్రలేమి, స్మోకింగ్, ఆల్కహాల్ ఇవన్నీ కూడా జీర్ణసమస్యలకు కారణమవుతాయి. పొట్ట సమస్యలను కనుక వెంటనే చికిత్సను అందివ్వకపోతే, అది స్టొమక్ అల్సర్ కు దారితీస్తుంది. దాంతో పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.

జీర్ణ సమస్యలతో పాటు, పొట్ట ఉబ్బరాన్ని తగ్గించే కొన్ని ఎఫెక్టివ్ నేచురల్ హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

అల్లం:

అల్లం:

అల్లంలో యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉన్నాయి. ఇది జీర్ణ సమస్యలను, పొట్ట ఉబ్బరాన్ని తగ్గిస్తుంది. చిన్న అల్లం ముక్క తీసుకుని, నీళ్ళలో వేసి బాయిల్ చేయాలి. జింజర్ టీని రోజుకు రెండు సార్లు తాగితే చాలు పొట్ట సమస్యలు తగ్గిపోతాయి.

హుస్క్(సైలియం పొట్టు) :

హుస్క్(సైలియం పొట్టు) :

సైలియం పొట్టులో ఇన్ సోలబుల్ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బౌల్ మూమెంట్ ను మెరుగుపరుస్తుంది. ఒక టీస్పూన్ హుసక్ తీసుకుని, ఒక గ్లాసు నీళ్ళలో మిక్స్ చేయాలి. ఈ నీటిని రాత్రి నిద్రించడానికి ముందు తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

పసుపు:

పసుపు:

పసుపులో కుర్కుమిన్ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉండటం వల్ల అర టీస్పూన్ పసుపును ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, రోజుకు ఒకసారి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అలోవెర:

అలోవెర:

అలోవెరలో యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉన్నాయి. రెండు టీస్పూన్ అలోవెర జెల్ ను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి, ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల జీర్ణ సమస్యలను ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

వాటర్ :

వాటర్ :

రోజుకు సరిపడా నీళ్ళు తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చు. దాంతో జీర్ణ సమస్యలు కూడా నివారించబడుతాయి.

త్రుణ ధాన్యాలు :

త్రుణ ధాన్యాలు :

త్రుణ ధాన్యాల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మేజర్ న్యూట్రీషిన్ ఫుడ్. ఇది జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి, తప్పనిసరిగా త్రుణధాన్యాలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

పెరుగు:

పెరుగు:

బెస్ట్ ప్రోబయోటిక్ పెరుగు. పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. జీర్ణ సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. రెగ్యులర్ డైట్ లో ఒక కప్పు పెరుగు చేర్చుకోవడం మంచిది.

 ఓట్ మీల్:

ఓట్ మీల్:

ఓట్స్ లో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది. ఒక రోజుకు ఒక బౌల్ ఓట్ మీల్ తీసుకోవడం మంచిది. ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది.

English summary

8 Effective Home Remedies To Get Rid Of Digestive Problems

A few of the best home remedies for digestive problems are explained in this article.
Desktop Bottom Promotion