For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక వారంలో మౌత్ అల్సర్ పోగొట్టే ఆమ్లా రెమెడీ

By Mallikarjuna
|

మౌత్ అల్సర్, నోటి పుండ్లు చాలా బాధ కలిగిస్తాయి. నోటిలోపల, నాలుక క్రింది బాగంలో, పెదవుల లోపలి బాగంలో పుండ్లు ఏర్పడుతుంటాయి. నోటిలో పుండ్లు ఏర్పడుట వల్ల ఆహార పానియాలు తీసుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది.

ఒక్కో సందర్భంలో నీళ్ళ తాగడానికి కూడా కష్టంగా ఉంటుంది. మౌత్ అల్సర్ వల్ల ఈ అసౌకర్యం, నొప్పి భరించలేకుండా ఉంటారు. ఈ మౌత్ అల్సర్ వల్ల అలసట, బలహీనంగా కనబడుతారు.

మౌత్ అలర్స్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే సులభ చిట్కాలుమౌత్ అలర్స్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే సులభ చిట్కాలు

home remedy for mouth ulcers

నోటిలోని కణాలు దెబ్బతిన్నప్పుడు, గాయాల వల్ల నోట్లో పుండ్లు ఏర్పడుతుంటాయి.కొంత మందిలో దంత సమస్యల వల్ల, కొన్ని మందులను వాడటం వల్ల , వ్యాధులు, అనారోగ్యకరమైన ఆహారాలు తినడం మొదలగు వాటి వల్ల నోట్లో పుండ్లు ఏర్పడుతాయి.

మౌత్ అల్సర్ ను ప్రారంభంలోనే నివారించుకోకపోవతే , సమస్య ఇంకొంచెం పెద్దది అవుతుంది. కొన్ని సందర్భాల్లో పుండ్లు పరిమాణం, మనకపోవడం వల్ల క్యాన్సర్ కు దారితీయవచ్చు.

కొంత మంది నిర్లక్ష్యం చేయడం వల్ల నోటి క్యాన్సర్ కు కారణమవుతుంది. అల్సర్ ఉన్న ప్రదేశంలో క్యాన్సర్ కణాలు వ్రుద్ది చెందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరి నోటి పుండ్లు లేదా మౌత్ అల్సర్ ను నివారించుకోవడానికి మీకోసం కొన్ని ఆయుర్వేదిక్ రెమెడీలను పరిచయం చేస్తున్నాము.

తీవ్ర నొప్పి, మంటతో ఇబ్బందిపెట్టే మౌత్ అల్సర్లకు కారణాలు..!తీవ్ర నొప్పి, మంటతో ఇబ్బందిపెట్టే మౌత్ అల్సర్లకు కారణాలు..!

home remedy for mouth ulcers

కావల్సిన వస్తువులు:

ఉసిరికాయ: 1టేబుల్ స్పూన్

తేనె: 1టేబుల్ స్పూన్

ఈ ఆయుర్వేద రెమెడీ చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, ఒక వారంలో నయం చేస్తుంది. అయితే దీన్ని రెగ్యులర్ గా ఉపయోగించాలి. ఈ హోం రెమెడీతో పాటు మంచి ఆహారం తీసుకోవడం వల్ల మంట, వాపు రాకుండా ఉంటుంది.

home remedy for mouth ulcers

రోజువారి ఆహారాల్లో పండ్లు, కూరగాయాలు ఎక్కువగా ఉండేట్లు చూసుకోవాలి. పాలు, పాల ఉత్పత్తులు ఎక్కువగా తీసుకోవాలి. కారం, నూనె పదార్థాలను, బయట తినుబండాలను నివారించాలి. ఇలా చేయడం వల్ల త్వరగా నయం అవుతుంది.

అయినప్పుటికీ మౌత్ అల్సర్ తగ్గకుండా , ఎక్కువ నొప్పితో ఇబ్బంది పెడుతుంటే, ప్రమాదకర సూచనగా గుర్తించి, వెంటనే డాక్టర్ ను కలవాలి.

టంగ్ అల్సర్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్ టంగ్ అల్సర్ నుండి తక్షణ ఉపశమనం కలిగించే హోం రెమెడీస్

home remedy for mouth ulcers

ఈ ఆయుర్వేద రెమెడీతో పాటు, డాక్టర్ సూచించే మందులను ఉపయోగించాలి.

ఉసిరికాయ ముక్కలు, లేదా ఉసిరికాయ పేస్ట్ లో తేనె కలిపి తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, నోటి పుండ్లను తగ్గిస్తుంది.

తయారుచేయు పద్దతి:

ఒక బౌల్లోనికి సూచించిన పదార్థాలను తీసుకుని, బాగా మిక్స్ చేయాలి.

ఈ పేస్ట్ ను మౌత్ అల్సర్ ఉన్న ప్రదేశంలో అప్లై చేసి, 15నిముషాలు అలాగే ఉండనివ్వాలి. అలాగే ఈ మిశ్రమాన్ని రోజుకు ఒక్కసారి తిన్నా మంచి ఫలితం ఉంటుంది.

English summary

Ayurvedic Amla Remedy To Reduce Mouth Ulcers In A Week!

Here is an amazing home remedy that can help you reduce mouth ulcers in just about a week.
Story first published:Thursday, August 17, 2017, 16:23 [IST]
Desktop Bottom Promotion