For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలుష్యం వల్ల వచ్చే దుష్ప్రభావాల నుండి మిమల్ని మీరుకాపాడుకోవడానికి ఆయుర్వేద చిట్కాలు!!

మన శరీరంలో కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి 10 ముఖ్యమైన ఆహారాల జాబితా ఇక్కడ ఉంది అవేంటో తెలుసుకుందామా మరి.

By Ashwini Pappireddy
|

మన దేశంలో గాలి కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, ధ్వని కాలుష్యం .....మొదలైనవి ఎప్పుడు చర్చనీయాంశకమైన అంశాలు. మన దేశం ఇలాంటి కాలుష్యాలతో నిండిపోవడం వలన మన దేశానికి చెడ్డ పేరుని తీసుకువస్తోంది మరియు దీనివలన కలిగే చెడు ప్రభావాలను ప్రజలు ఇప్పటికే రుచి చూస్తున్నారు.

మన దేశ రాజధాని లో ప్రస్తుతం ఉన్నటువంటి కాలుష్య పరిస్థితుల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదనుకుంటాను. నిజం చెప్పాలంటే ఇప్పటి పరిస్థితి ఎలావుందంటే, మనం రోజూ పీల్చుకుంటున్న కలుషితమైన గాలి ఒక రోజుకి 2 కట్టల సిగరెట్స్ ని తాగడం వలన కలిగే ప్రమాదంతో సమానంగా ఉందంటే మీరే అర్థం చేసుకోండి. ఒకప్పుడు ధూమపానం చేసేవాళ్ళ జీవితాలు మాత్రమే ప్రమాదంలో ఉండేవి. కానీ ఇప్పుడు ఇలాంటి కాలుష్యాల వలన ఎలాంటి చెడు అలవాట్లు లేని సాధారణ వక్త్యులు కూడా ప్రమాదానికి లోనయ్యే అవకాశాలు ఎక్కువగా వున్నాయి.

వాహనాలు లేదా యంత్రాల నుండి విడుదలయ్యే కొన్ని విషపూరిత వాయువులు వాతావరణంలోకి ప్రవేశించి, వాతారవరణాన్ని కలుషితం చేసి దాని జీవితకాలాన్ని తగ్గిస్తోంది. కార్బన్ డయాక్సైడ్ లేదా సల్ఫర్ డయాక్సైడ్ వంటి హానికరమైన వాయువులు మానవుల ఊపిరితిత్తులలోకి ప్రవేశించినప్పుడు చాలా సమస్యలకు కారణమవుతాయి.

కాలుష్యం అనేది మానవులకి అనేక రకాల ఆరోగ్య సమస్యలను తెచ్చి పెడుతుంది. శ్వాస తీసుకోవడానికి కష్టంగా అనిపించడం మరియు ఉబ్బసం వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఏర్పడుతాయి. చాలామంది గుండె జబ్బు బారిన పడటానికి కాలుష్యం కూడా ఒక కారణంగా వుంది. వాతావరణంలో మరియు గాలిలో కార్బన్ డయాక్సైడ్ ఎక్కువైనప్పుడు, మనశరీరానికి అవసరమైన ఆక్సిజన్ అందనప్పుడు మన శరీరం లోని అవయవాలు వాటి కార్యకలాపాలను సరిగా నిర్వహించలేకపోతాయి అలాంటి సందర్భాలలో శ్వాసకోశ సమస్యలు ఏర్పడుతాయి.

మనందరం కాలుష్యం నుండి సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలని కోరుకున్నా, అది ప్రతిచోటా ఉంటుంది. అలాంటప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది మరియు మన శరీరం మీద దాని ప్రభావం పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అయితే, బయట వున్న కాలుష్యం నుండి మన శరీరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి?

మీ సమాధానం ఆయుర్వేదం అని చెప్పవచ్చు. మనందరికీ బాగా తెలిసిన అత్యంత శక్తివంతమైన సైన్స్ కి కూడా అంతుపట్టని ఎన్నో విషయాలకి ఆయుర్వేదం లో సమస్యలకు పరిష్కారం వుంది. మన శరీరం నుండి కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి కొన్ని ఆహార పదార్థాల జాబితాని తెలియజేసింది.ఈ ఆహారాల పదార్థాలు హానికరమైన కాలుష్యానికి వ్యతిరేకంగా వుండి శరీరం యొక్క ప్రతిఘటన శక్తిని పెంచుతాయి మరియు శరీర సహజంగా నయం చేయడానికి కూడా సహాయపడతాయి.

మన శరీరంలో కాలుష్యం యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి 10 ముఖ్యమైన ఆహారాల జాబితా ఇక్కడ ఉంది అవేంటో తెలుసుకుందామా మరి.

1) అల్లం

1) అల్లం

నిరంతరం మన శరీరం కాలుష్యానికి గురవడంవలన క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. అల్లం లో

వుండే యాంటి ఇన్ఫ్లమేటరీ మరియు క్యాన్సర్ కి కారణమైన వాటితో పోరాడుతుంది. ఇది రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు మరియు ఆక్సిజన్ను గ్రహించే రక్తం యొక్క సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది శరీరంలోని వ్యర్ధ పదార్ధాలను సులభంగా తొలగించి, దానిని అణచివేస్తుంది. ఇది మనం తీసుకొనే ఆహారం నుండి ఖనిజాలను పీల్చుకోవడం మరియు రోగనిరోధకత మరియు శ్వాస క్రియలను పెంచుతుంది.ఈ సూపర్ ఫుడ్ నుండి మరిన్ని లాభాలను పొందడానికి ప్రతిరోజూ తాజా అల్లాన్ని మీ ఆహారంలో జోడించండి.

2) పసుపు

2) పసుపు

పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మన శరీరంలో స్వేచ్ఛ గా తిరుగుతున్న హానికరమైన ప్రభావాలను తగ్గిస్తుంది. ఇది మన ఊపిరితిత్తులను కాపాడుకోవడానికి మరియు వాటిని ఆరోగ్యంగా వుంచుకోవడంలో

చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఆస్త్మా చికిత్స విషయంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది మనలో ఏర్పడే వృద్ధాప్య సంకేతాలతో పోరాడి మరియు మన శరీరం మీద కాలుష్య ప్రభావాలను తగ్గిస్తుంది.

చిటికెడు పసుపు మరియు నెయ్యి ని కలిపి ఆ మిశ్రమాన్ని మీ ఛాతీ ప్రాంతానికి రాసుకోండి.

అంతేకాకుండా, రోజువారీ పాల లో పసుపు కలుపుకొని తాగడం వల్ల రోగనిరోధకత పెరుగుతుంది.

3) వేప

3) వేప

మనం బయట తీసుకుంటున్న ప్రతి గాలి కలుషితమైనప్పుడు, మనం ఎక్కువ సమయం ఇంట్లోనే గడపడటం కంటే వేరే చేసే మంచి పని ఉండదు. దీనికి తగినట్లే వాయు కాలుష్యం గాలి శుద్దీకరణదారుల విక్రయాలు కూడా బాగా పెరిగాయి. కానీ వారు సాపేక్షంగా మీకు కొత్త టెక్నాలజీ అని చెప్పి మీ జేబులకు చిల్లులు పెట్టవచ్చు. అలాంటప్పుడు మనమెందుకు సహజమైన గాలిని శుద్ధిచేసే వాటిని ప్రయత్నించకూడదు?

మన చుట్టూ వున్న గాలిని శుభ్రపర్చడానికి ఇంటిచుట్టూ మొక్కలను పెంచుకోవడం ఒక ఉత్తమ మార్గం. వేపను ఒక గృహనిర్మాణంగా పరిగణించనప్పటికీ, సూర్యకిరణాలు పడే ప్రదేశాల్లో చిన్న మొక్కలను ఉంచడం ద్వారా మీ చుట్టూ వున్న గాలిని శుద్ధి చేస్తుంది. తాజాగా కలుషితం కానటువంటి గాలిని నిరంతరం సరఫరా చేయడానికి మీ ఇంటి బయట మొక్కలను పెంచుకోవచ్చు. అంతేకాక, క్యాన్సర్ కణాలను అణచివేయడానికి కూడా వేపే ఆకులను తినవచ్చు, ఇవి కలుషిత వాతావరణాలలో గుణించగల ధోరణిని కలిగి ఉంటాయి. ఇది బే వద్ద ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది మరియు బహిరంగ కాలుష్యాలకు వ్యతిరేకంగా ఊపిరితిత్తులను రక్షిస్తుంది.

దీనిని మీరు వేప నూనె రూపంలో మీ ఆహారంలో తీసుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండటానికి ప్రతి రోజు ఈ నూనెను కొన్ని చుక్కలను తీసుకోండి.

4) తులసి

4) తులసి

ఇంటిదగ్గర పెంచుకొనే ఇంకొక మొక్క తులసి ఇది గాలిని శుభ్రపరచడంలో గొప్పగా పనిచేస్తుంది.ఇది ఒక తులసి మొక్క దాదాపు అందరి హిందూ మతస్థుల ఇంట్లో కనిపిస్తుంది. ఇది ధూళి కణాలు శోషించడం ద్వారా దాని చుట్టూ వున్న గాలి శుభ్రపరుస్తుంది. మొక్క చుట్టూ వున్న గాలి నాణ్యతని మెరుగుపరుస్తుంది. తులసి మన ఊపిరితిత్తులలో గాలి కాలుష్యం యొక్క ప్రభావాలను ఎదుర్కోవడంలో చాలా శక్తివంతమైనది. తులసి రసం ని తరచూ తీసుకోవడం వలన శ్వాస కోశ మార్గాలలో వుండే అడ్డుని తొలగిస్తుంది.

తులసి రసం మార్కెట్లో విస్తృతంగా అందుబాటులో ఉంది.

5) త్రిఫల

5) త్రిఫల

త్రిఫల అనేది మూడు ఆయుర్వేద ఔషధాల కలయిక, దాదాపుగా ప్రతి మానవ వ్యాధిని నయం చేయగల శక్తి దీనికి ఉంది. దీని గురించి అన్ని ప్రాచీన పుస్తకాలలో విస్తృతంగా ప్రస్తావించబడింది. ఇది పూర్తిగా మానవ శరీరాన్ని మెరుగుపరుస్తుంది మరియు కాలుష్య ప్రభావాలను నిరాకరిస్తుంది. ఇది వ్యతిరేక సంఘాల ఉత్పత్తిని ప్రోత్సహించడం ద్వారా రోగనిరోధకతను పెంచుతుంది. ఇది శ్వాస మార్గములను మరియు సైనస్ను శుభ్రపరచుటలో కూడా చాలా బాగా పనిచేస్తుంది.

మార్కెట్లో త్రిఫల పొడి సులభంగా లభిస్తుంది. ప్రతి రాత్రి 1 టీస్పూన్ తేనె తో 1 టేబుల్ స్పూన్ ని తినండి.

6) దానిమ్మ రసం

6) దానిమ్మ రసం

దానిమ్మ రసం కణాల పునరుత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది రోగనిరోధకతను పెంచుతుంది మరియు ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పండ్లలో యాంటీ-ఆక్సిడెంట్లు అత్యధికంగా ఉంటాయి. ఇది మన హృదయంలో కాలుష్య ప్రభావాలను తగ్గిస్తుంది మరియు దానిలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

తాజాగా అమ్మమ్మ చేసిన రసం ఎల్లప్పుడూ ప్యాక్ లలో వుండే రసం కంటే ఆరోగ్యకరమైనది. దీనిని తయారుచేయడానికి కొన్ని దానిమ్మ గింజలలో కొంత నీటిని కలిపి బాగా గ్రైండ్ చేసుకొని తాగి ఆనందించండి.

7) (పెప్పర్మిట్) మిరియాల నూనె తో ఆవిరి

7) (పెప్పర్మిట్) మిరియాల నూనె తో ఆవిరి

కాలుష్యం అనవసరమైన ధూళి కణాలను మా నాసికా శ్లేష్మం యొక్క శ్లేష్మ పొరలో ఉండేందుకు

కారణమవుతుంది. ఇది నాసికా రంధ్రాలు మంటకి గురికావడం, ఇంకా శ్వాసని కష్టతరం చేస్తుంది. ముక్కు లో చుక్కలు వేసుకోవడం లేదా మందులను ఉపయోగించడం వలన పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.ముక్కు నుండి దుమ్ము మరియు వ్యర్ధాలను తీసివేయడానికి ఉత్తమ మార్గం మిరియాల ఆవిరి. మిరియాల నూనెను ఉపయోగించి ఆవిరి తీసుకోవడం వలన మన శ్వాసకోశంలోకి లోతుగా వెళ్లి, శ్లేష్మ రద్దీని పోగొడుతుంది. ఇది ఆస్తమా మరియు బ్రోన్కైటిస్ యొక్క లక్షణాలను కూడా తగ్గిస్తుంది.వేడి నీటిలో మిరియాల నూనె ని యొక్క కొన్ని చుక్కలను వేసి, మీ తలపై ఒక టవల్ తో కప్పుకొని ఆవిరి పీల్చుకోండి.

కావాలనుకుంటే అందులో, కొన్ని చుక్కల కొబ్బరి నూనెను ఒక టేబుల్ స్పూన్ కలుపుకోవచ్చు. యూకలిప్టస్ నూనె మరియు మిరియాల నూనెతో సమాన మొత్తాలను కలపండి మరియు దీనిని ఒక రోగనిరోధకంగా కూడా వాడతారు.

8)ధనియా(కారమ్) విత్తనాలు

8)ధనియా(కారమ్) విత్తనాలు

ధనియా విత్తనాలు ఒక అద్భుతమైన కాలుష్య నివారుణులు.ఇది శ్వాసనాళాలను శుభ్రపరిచి మరియు శ్వాస సమస్యలను నివారిస్తుంది. ఇది రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది.ధనియా విత్తనాలు కొన్ని తరాలనుండి ఆస్తమా కోసం ఒక గొప్ప ఔషధంగా చెప్పబడుతోంది.

కొన్ని ధనియా విత్తనాలను తీసుకొని మరియు ఒక శుభ్రమైన గుడ్డలో ఉంచి మూసివేయండి దీనిని కొంచం మంటల్లో వేడిచేసి, మీ ఛాతీ మీద కాస్సేపు ఉంచండి. అలాగే, కొన్ని ధనియా విత్తనాలను మరిగే నీటిలో వేసి ఆవిరి పీల్చుకోవడం వలన కూడా లాభదాయకంగా ఉంటుంది.

9) గుగ్గులు

9) గుగ్గులు

గుగ్గులు లో వుండే అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ మరియు మన శరీరానికి నష్టం కలిగించే

హానికరమైన రాసులనుండి రక్షించడానికి సహాయపడుతుంది. ఇది ఊపిరితిత్తులు మరియు నాసికా రంధ్రాల యొక్క వాపును తగ్గగించడం లో కూడా సహాయపడుతుంది. దీనిలో వున్న ప్రత్యేక సమ్మేళనాలు కాలుష్యాన్ని ఆకర్షిస్తాయి మరియు శరీరం నుంచి వాటిని తొలగించడంలో సహాయపడుతుంది, ఇది నిర్విషీకరణకు దారితీస్తుంది. ప్రతి రాత్రి పడుకోవడానికి ముందు గుగ్గులు పొడిని తీసుకోవాలి. 1 టబుల్స్పూన్ గుగ్గులు ని ఒక గ్లాస్ నీటిలో కలిపి తీసుకోవచ్చు. రుచికోసం కావాలనుకుంటే తేనెని కలుపుకోవచ్చు.

10) ఇంట్లో వండిన ఆహారం

10) ఇంట్లో వండిన ఆహారం

వేడి వేడిగా ఇంట్లో వండిన ఆహారం చాలా శుభ్రంగా, ఆరోగ్యకరంగా మరియు రుచిగా ఉంటుంది. ఇలాంటి ఆహారం మీ శ్రేయస్సు కోసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మన శరీరం సహజంగా అన్ని వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. ఒక ఆరోగ్యకరమైన ఆహారం ఒక మంచి మరియు బలమైన రోగనిరోధక వ్యవస్థకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడం వల్ల మన ఊపిరితిత్తులను, హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మానవులైనటువంటి మనం తల్లి లాంటి ప్రకృతి నుండి నిరంతరం జబ్బు న బారిపడకుండా కాపాడుతుంది.

English summary

Ayurvedic Remedies To Prevent Pollution Side Effects

Pollution causes a lot of health problems in humans, especially respiratory problems like breathing difficulties and asthma. A lot of heart diseases have also been linked to pollution. There are a few ayurvedic remedies that help to prevent the side effects of pollution. Know about these remedies here.
Desktop Bottom Promotion