For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డేంజర్ : యూరిన్ లో బ్లడ్ క్లాట్స్..దేనికి సంకేతం..!!

మూత్రంలో రక్తం కనిపించడాన్ని ఆయుర్వేదంలో 'రక్తమూత్రం' అంటారు. బారతీయ శస్త్ర చికిత్సా పితామహుడు సుశృతుడు ఈ లక్షణాన్ని 'రక్తమేహం' అని కూడా పిలిచాడు. ఇది ప్రధానంగా పిత్తదోషం పెరగటం వలన ఏర్పడుతుంది.

|

మూత్రంలో రక్తం కనిపించడాన్ని ఆయుర్వేదంలో 'రక్తమూత్రం' అంటారు. బారతీయ శస్త్ర చికిత్సా పితామహుడు సుశృతుడు ఈ లక్షణాన్ని 'రక్తమేహం' అని కూడా పిలిచాడు. ఇది ప్రధానంగా పిత్తదోషం పెరగటం వలన ఏర్పడుతుంది కనుక ఈ స్థితికి 'అథోగత రక్త పిత్తం' అన్న పర్యాయపదం కూడా ఉంది. మూత్రంలో రక్తం పడటాన్ని హెమటురియా అంటారు.

సెక్స్ తర్వాత ఖచ్చితంగా యూరిన్ పాస్ చేయడానికి గల 7 కారణాలు..?

మూత్రంలో రక్తం కనిపిస్తున్నప్పుడు ఎవరికైనా ఆందోళన కలుగుతుంది. కొద్దిపాటి రక్తమే స్రవిస్తున్నప్పటికి అది మూత్రం అంతటితోనూ కలవడం వలన హెచ్చు రక్తం పోతున్నట్లుగా భ్రమ కలిగి ఆందోళన పెరుగుతుంది. దీన్ని సీరియస్ గా హెల్త్ సమస్యగా తీసుకోవడం చాలా అవసరం.

Blood Clots In Urine? Read This!!

యాభై ఏళ్లు పైబడిన వారిలో ఇలా రక్తం పడే లక్షణం కనిపిస్తున్నప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ప్రత్యేకంగా పొగ తాగేవాళ్లలో వాళ్ల స్మోకింగ్ అలవాటు వల్ల బ్లాడర్‌లో చిన్న చిన్న గడ్డల వల్ల కూడా ఇది రావచ్చు. ఇదిగాక ప్రోస్టేట్ గ్లాండ్ ఎన్‌లార్జిమెంట్ వల్ల లేదా ఇతరత్రా మూత్రంలో ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఇలా మూత్రంలో రక్తం రావచ్చు. కారణం ఏమైనా ఇలా నొప్పి లేకుండా మూత్రంలో రక్తం పడితే అల్ట్రాసౌండ్ స్కానింగ్, సిస్టోస్కోపీ, మూత్రపరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలి. ముందు స్మోకింగ్ అలవాటును పూర్తిగా ఆపేయాలి. అయితే తక్కువ వయస్సున్న వారిలో ఇలా మూత్రంలో రక్తం పడితే అది ఎక్కువశాతం ఇన్ఫెక్షన్ల వల్లనే కాబట్టి అంతగా భయపడాల్సిన అవసరం లేదు.

పురుషుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ కు మెయిన్ రీజన్స్ ....!!

అయితే శరీరంలో సాఫీగా జరగాల్సిన రక్తప్రసరణకు అంతరాయం కలిగించే బ్లడ్ క్లాట్స్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగా జరగకపోతే ప్రాణాలకే ప్రమాదం . అందుకే డీవిటి, వీన్స్ లో బ్లడ్ క్లాట్స్ సమస్యలున్నవారు జీవితాంతం బ్లడ్ తిన్ గా మార్చే టాబ్లెట్స్ మీద ఆధారపడుతుంటారు. అలాగే స్టాకిన్స్ కూడా వేసుకోవల్సి వస్తుంది. బ్లడ్ క్లాట్స్ శరీర భాగాల నుండి యూరినరీ ట్రాక్ లోకి చేరినప్పుడు , అది యూరిన్ పాస్ కానివ్వకుండా బ్లాక్ చేస్తుంది. దాంతో బ్లాడర్ లో నొప్పి, కొన్ని సందర్బాల్లో రక్తస్రావం యూరినరీ ట్రాక్, బ్లాడర్, కిడ్నీలలో జరగవచ్చు. దాంతో బ్లడ్ క్లాట్స్ ను యూరిన్ లో గమనించవచ్చు. యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ గురించి మరికొన్ని వాస్తవాలు మీకోసం..

 ఫ్యాక్ట్ #1

ఫ్యాక్ట్ #1

వైదపరిభాషలో యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ ను హెమటూరియా గా పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ ను సాధారణ కంటి చూపుతో పసిగట్టలేము. ఇటువంటి పరిస్థితి మైక్రోస్కోపిక్ హెమటూరియాగా భావిస్తారు.

ఫ్యాక్ట్ # 2

ఫ్యాక్ట్ # 2

ఎక్కువగా స్మోకింగ్ చేసే వారిలో కిడ్నీ సమస్యలు అధికంగా ఉంటాయి. ఇది యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ కు దారితీస్తుంది. కాబట్టి, వెంటనే స్మోకింగ్ మానేయడం మంచిది.

ఫ్యాక్ట్ #3

ఫ్యాక్ట్ #3

యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ పడటాన్ని కిడ్నీ స్టోన్స్ మరియు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కు సంకేతం. ఇటువంటి పరిస్థితిలో అసిడిక్ బెవరేజెస్ ను తీసుకోవడం మానేయాలి. టీ, కాఫీ మరియు సిట్రస్ ఫ్రూట్స్ తినడం మానేయాలి. ఎక్కువగా నీళ్ళు తాగడం వల్ల ఒక రకంగా సహాయపడ్డా, డాక్టర్ ను కలవడం తప్పనిసరి.

ఫ్యాక్ట్ #4

ఫ్యాక్ట్ #4

బ్లాడర్ లేదా కిడ్నీ వ్యాధులు, యురేత్ర లేదా బ్లాడర్ ఇన్ఫ్లమేషన్ (వాపు), యూరినరీ ట్రాక్ లో ఇన్ఫెక్షన్స్, ప్రొస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్, బ్లాడర్ క్యాన్సర్, ఎన్ లార్జ్డ్ ప్రొస్టేట్, రీనల్ ఫెయిల్యూర్, మెడికేషన్స్, ఇంటర్నల్ గాయాల, సర్జరీ, కిడ్నీ బయోప్సి వంటి కారణాల వల్ల యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ పడవచ్చు.

ఫ్యాక్ట్ #5

ఫ్యాక్ట్ #5

రక్తంలో ప్లేట్ లెట్ కౌంట్, సికెల్ సెల్స్ డిసీజ్ వంటి వ్యాధుల వల్ల కూడా యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ పడే అవకాశం ఉండి.

ఫ్యాక్ట్ # 6

ఫ్యాక్ట్ # 6

యూరిన్ లో బ్లడ్ క్లాట్ లక్షణాలు : మూత్రవిసర్జనలో నొప్పి, లేదా మంట, వికారం, జ్వరం, వాంతులు, బరువు తగ్గడం, ఇంటర్ కోర్స్ సమయంలో నొప్పి, యూరిన్ పాస్ చేయడం డిఫికల్ట్ గా ఉండటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

ఫ్యాక్ట్ #7

ఫ్యాక్ట్ #7

యూరిన్ లో బ్లడ్ క్లాట్స్ పడటానికి ఖచ్చితమైన కారణాలను డాక్టర్ గుర్తించడం ద్వారా సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం. యూరిన్ చాలా డార్క్ గా వస్తున్నా కూడా డాక్టర్ ను సంప్రదించడం మంచిది.

English summary

Blood Clots In Urine? Read This!!

If you see blood in urine, it could be a serious issue. It means you are bleeding from inside. Sometimes, blood in urine isn't even visible to naked eye. In such a case, only a lab test can confirm the same.
Story first published: Thursday, February 16, 2017, 13:16 [IST]
Desktop Bottom Promotion