For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్యాన్సర్ తో పోరాడి..క్యాన్సర్ ను నివారించే ఎఫెక్టివ్ ఫుడ్స్

మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నివారించవచ్చు అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు.

|

ప్రస్తుతం అందరినీ భయపెడుతున్న భూతం క్యాన్సర్. ఒకటి కాదు రెండు.. రకరకాల క్యాన్సర్ లు శరీరంలోని అన్ని భాగాలకు వస్తున్నాయి. చర్మం నుంచి కాలేయం వరకు ప్రతి అవయవానికి అటాక్ అవుతోంది క్యాన్సర్. ఇంత ప్రాణాంతకమైన క్యాన్సర్ ని ముందుగానే రాకుండా నివారించాలి. క్యాన్సర్ ఒక్కసారి అటాక్ అయిందంటే కష్టం. కాబట్టి.. ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి కాబట్టి.. ముందు జాగ్రత్తలు పాటిస్తే.. మంచిది.

 Check Out These Foods; These Helps Fight Cancer Effectively

మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ ని నివారించవచ్చు అనే విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అందుకే.. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే.. మనం క్యాన్సర్ కి దూరంగా ఉండవచ్చో తెలుసుకుందాం..క్యాన్సర్ ను అరికడిదాం..

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ :

కోకో లో కొన్నిరకాల ఫ్లెవనాయిడ్స్ మరియు పెంటమీర్ వంటి ఎఫెక్టివ్ కంటెంట్ క్యాన్సర్ ఎదుర్కోగల లక్షణాలను కలిగి ఉంటుంది. డార్క్ చాక్లెట్ కోకో అధికంగా ఉంది. కోకలో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి క్యాన్సర్ కు సంబంధించిన ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది. క్యాన్సర్ ను నివారిస్తుంది .

బెర్రీస్ :

బెర్రీస్ :

క్యాన్సర్ నివారించే ఫేమస్ ఫుడ్స్ లో బెర్రీస్ గ్రేట్ ఫుడ్ . ఇందులో యాంటీఆక్సిడెంట్స్, విటమిన్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. హిమాలయా గోజిబెర్రీ ఏసియా బెర్రీ గ్రేట్ ఫుడ్ . వీటిలో క్యాన్సర్ ఫైటింగ్ గుణాలు అద్భుతంగా ఉంటాయి.

 గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

గ్రీన్ టీ ఈసీసీజీని కలిగి ఉంటుంది. దీనిలోని పోలిఫినాల్‌ అనేది క్యాన్సర్‌ సెల్‌ పెరుగుదలను క్రమంలో ఉంచుతుంది. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏ లెవల్స్‌ పై ప్రభావం చూపుతుంది. అనేక పరిశోధనల్లో 6 కప్పులు గ్రీన్ టీ తాగే వారిలో బ్లడ్ క్యాన్సర్ రిస్క్ తగ్గినట్లు కనుగొన్నారు. అంతే కాదు, గ్రీన్ టీలో బరువు తగ్గించే గుణాలు కూడా అధికంగా ఉన్నాయి. ఇది కరోనరీ డిసీజ్ లను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ లెవల్స్ ను మ్యానేజ్ చేస్తుంది. న్యూరాలజికల్ వ్యాధులను నివారిస్తుంది.

సుపు:

సుపు:

పసుపులో బాడీ డిటాక్సిఫైయింగ్ గుణాలు అధికంగా ఉన్నాయి. ఇవి శరీరంను డిటాక్సిఫై చేయడంతో పాటు, క్యాన్సర్ ను నివారిస్తాయి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీసెప్టిక్ లక్షణాలు అధికంగా కంగా ఉంటాయి. పసుపులో ఉండే కుర్కుమిన్ క్యాన్సర్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లి దంచిన లేదా కత్తిరించిన వెల్లుల్లి, వంటలలో వాడటానికి ముందు 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా చేయటం వల్ల అల్లిసిన్ అనే ఫైటోకెమికల్ తయారవుతుంది. ఇది అనేక రకాల వ్యాధులను కలిగించే కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది.

టమోటో

టమోటో

టమోటోలో లైకోపిన్ అనే పోషకం ఎక్కువగా ఉండే టొమాటోలు ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రోస్టేట్ క్యాన్సర్‌ను సమర్థంగా నివారించవచ్చు. అలాగే పాలీఫీనాల్స్ ఎక్కువగా ఉండే గ్రీన్-టీ, దానిమ్మ కూడా ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల వ్యాప్తిని సమర్థంగా అదుపు చేస్తాయి. ఇక క్రూసిఫెరస్ జాతి శాకాహారాలైన బ్రొకోలీ, కాలీఫ్లవర్‌తో ప్రోస్టేట్ క్యాన్సర్‌ను నివారించవచ్చుని చాలా అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

ఆకుకూరలు

ఆకుకూరలు

ఆకుకారల్లోని పోషక విలువలు డీఎన్‌ఏ డ్యామేజ్‌ కాకుండా చేస్తుంది. అలాగే ట్యూమర్లను సక్రమమైన పద్ధతిలో ఉంచుతాయి. నాన్‌ ఎంజీవో సోయా బీన్‌ క్యాన్సర్‌ కారకాలను నిర్మూలిస్తాయి. అంతేకాదు ఈస్ట్రోజన్‌ ఎక్కువగా ఉత్పత్తి కాకుండా కంట్రోల్ లో ఉంచుతుంది.

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలు

పండ్లు, కూరగాయలపై ఉండే తొక్కను తీసేసి తినడం ప్రస్తుతం అందరికీ ఉన్న అలవాటు. కానీ ఈ తొక్కలు క్యాన్సర్ కారకాలను నశింపచేసే ఫైటోకెమికల్స్ లను కలిగి ఉంటాయి. అలాగే కూరగాయలను ఎక్కువ సమయం వండికూడదు. ఎందుకంటే అవి నీటిలో కరిగే విటమిన్ లను కోల్పోతాయి.

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్

గ్రేప్ ఫ్రూట్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కు కారణం అయ్యే న్యూట్రోజెన్ కాంపౌండ్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. కాబట్టి, మీరు ప్రతి రోజూ ఒక గ్రేప్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కోలన్, బ్లాడర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించుకోవచ్చు.

ఆపిల్స్

ఆపిల్స్

ఆపిల్స్ రోజుకు ఒక్క ఆపిల్ తింటే డాక్టర్ అవసరం ఉండదు!రెడ్ ఆపిల్స్ ను వారానికి ఒక సారి తిన్నా క్యాన్సర్ ను నేచురల్ గా తగ్గించుకోవచ్చు . ఆపిల్స్ యొక్క రెడ్ స్కిన్ లో క్యాన్సర్ కారకాలను ఎదుర్కొనే ప్రోటీన్స్ కలిగి ఉంటుంది. మహిళల్లో ట్యూమర్స్ ఏర్పడకుండా ఎదుర్కోవాలంటే రెడ్ ఆపిల్స్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

దానిమ్మ

దానిమ్మ

దానిమ్మ దానిమ్మల్లో ఎలాజిక్ యాసిడ్స్ కలిగి ఉంటాయి. ఈ యాసిడ్స్ ఫైటోన్యూట్రీయంట్స్ అంటారు. ఇవి క్యాన్సర్ ను ఎదుర్కోవడంలో సహాయపడుతాయి.

విటమిన్ సి

విటమిన్ సి

విటమిన్ సి నిమ్మ, కమలా వంటి విటమిన్ సి ఉండే.. పండ్లు తీసుకోవడం మంచిది. ఇవి క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి. అలాగే విటమిన్‌‌ డి, విటమిన్‌ ఈ ఉండే ఆహార పదార్థాలు కూడా క్యాన్సర్‌ రాకుండా నివారిస్తాయి.

English summary

Check Out These Foods; These Helps Fight Cancer Effectively

Read about certain foods that help to fight cancer.
Desktop Bottom Promotion