For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సర్ ప్రైజ్ నిమ్మలో 22 రకాల క్యాన్సర్ నిరోధక పదార్ధాలు..!

By Super Admin
|

నిమ్మకాయలు క్యాన్సర్‌ని నిరోధిస్తాయా?నిమ్మకాయలలో ఉండే లిమనాయిడ్ లాంటి పదార్ధం కొన్ని రకాల క్యాన్సర్లని నయం చేస్తుంది.

ఈ వేసవిలో నిమ్మరసాన్ని ఆస్వాదించండి.వేసవి లోనే కాదు ఆ తరువాత కూడా నిమ్మరసాన్ని తరచూ తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి మంచిది.

స్వఛ్ఛమైన నిమ్మ రసం కాకుండా నిమ్మ రుచిలోఉన్న శీతల పానీయాలవల్ల మీ ఆరోగ్యానికి ఏమాత్రం లాభం చేకూరదు.ఇలాంటి పానీయాలకి ఎంత దూరంగా ఉంటే అంత మేలు.

నిమ్మరసాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. గ్లాసు నీటిలో ఒక నిమ్మకాయ రసం తీసి కలిపి దానిలో ఒక స్పూను తేనె చేర్చి ఆ రుచిని ఆస్వాదించండి. నిమ్మలో యాంటీ క్యాన్సర్ గుణాలున్నాయి. అవేమిటో చూద్దామా.

1.

1.

నిమ్మ గుజ్జులో సిట్రస్ పెక్టిన్ అనే పదార్ధముంటుంది.ఇది రొమ్ము క్యాన్సర్ మరియూ ప్రొస్టేట్ గ్రంధి క్యాన్సర్‌ని అరికడుతుంది లేదా అడ్డుకుంటుంది.

2.

2.

నిమ్మలో ఉన్న ఫైటో న్యూట్రియెంట్స్ చాలా శక్తివంతమైనవి.కొన్ని అధ్యయనాల ప్రకారం నిమ్మ తొక్కు కొలెస్ట్రాల్‌ని తగ్గిస్తుందని చెప్తున్నాయి. అంతే కాదు వ్యాధి నిరోధక శక్తిని పెంచి కొన్ని రకాల క్యాన్సర్లని కూడా నిరోధిస్తుంది.

3.

3.

నిమ్మ తొక్కులో ఉండే లిమనాయిడ్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని అడ్డుకుంటాయి.మొత్తం మీద నిమ్మలో ఉన్న 22 రకాల పదార్ధాలు క్యాన్సర్‌ని నిరోధిస్తాయిట.

4.

4.

ఒక కొత్త అధ్యయనం ప్రకారం నిమ్మ క్యాన్సర్ అవకాశాన్ని దాదాపు 50% తగ్గిస్తుందిట.శరీరంలో వ్యర్ధాలు త్వరగా బయటకి పోవడంలో కూడా నిమ్మ సహకరిస్తుంది.

5.

5.

నిమ్మలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ని ఎదుర్కొని వృద్ధాప్యాన్ని త్వరగా దరిచేయనీయవు.నిమ్మ మీ చర్మానికి కూడా ఎంతో మంచిది.

6.

6.

నిమ్మలో యాంటీ బాక్టీరియల్ గుణాలు కూడా ఉన్నాయి.అందువల్ల నిమ్మ రసం కొన్ని రకాల ఇంఫెక్షన్లని కూడా అరికడుతుంది.

7.

7.

మీ జిహ్వ చాపల్యాన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటున్నారా? అయితే నిమ్మ రసం త్రాగండి.దానిలో ఉన్న పెక్టిన్ అనే పీచు మీకు కడుపు నిండిన భావనని కలిగిస్తుంది.ఒత్తిడిని సమర్ధవంతంగా ఎదుర్కుని వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి కూడా నిమ్మ ఉపయోగ పడుతుంది.

English summary

Do Lemons Have 22 Anticancer Compounds?

Do lemons prevent cancer? Well, some compounds like limonoids in lemons have the power to prevent certain types of cancers.
Story first published:Saturday, May 13, 2017, 11:37 [IST]
Desktop Bottom Promotion