For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కారణాల వల్లే మూత్రం భయంకర వాసన వస్తుంది!

By Lekhaka
|

కొన్నిసార్లు, మూత్రం వాసన అమ్మోనియాలా ఉండొచ్చు. కానీ అలా ఎందుకు జరుగుతుంది? అవును, మీ మూత్రంలో అనవసర పదార్ధాలు(వ్యర్థాలు), టాగ్జిన్లు అధిక స్థాయిలో ఉండడం వల్ల వాసన రావొచ్చు.

మీరు తీసుకునే ఆహరం, పానీయాల అలవాట్లు, అంటువ్యాధుల వల్ల కూడా మీ మూత్రం అమ్మోనియాలా వాసన రావొచ్చు. అయితే, ఆ వాసన ఒకరోజు లేదా రెండు రోజులు ఉండొచ్చు, దానివల్ల మీరు నిద్ర చెడగోట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాసన పోకపోతే, వెంటనే వైద్యుడిని సంప్రదించండి.

Does Your Urine Smell Like Ammonia? Here Are The Reasons!

మీ మూత్రం వాసన అమ్మోనియాలా ఉందా? కారణాలు ఇక్కడ ఉన్నాయి! మూత్రంలో అమ్మోనియా వాసనకు కొన్ని ఔషధాలు కూడా కారణం కావొచ్చు. మూత్రంలో అమ్మోనియా వాసనకు గల కారణాలేంటో తెలుసుకుందాం..

డిహైడ్రేషన్

డిహైడ్రేషన్

డిహైడ్రేషన్ కారణం కావొచ్చు. అదే అయితే, తగినంత నీరు తాగడమే దీనికి పరిష్కారం. వ్యర్ధ పదార్ధాలు కరిగి, అమ్మోనియా వాసన పోతుంది.

మూత్రం ప్రధానంగా నీటిని కలిగి ఉంటుంది. దానితోపాటు, ఉప్పు, కొన్ని రసాయనాలు కూడా అందులో ఉంటాయి. ఆ రసాయనాలు ఒకచోటికి చేరినపుడు, మూత్రం అమ్మోనియా లాగా వాసన వస్తుంది.

మధుమేహం

మధుమేహం

మధుమేహం వల్ల కూడా వాసన రావొచ్చు. మధుమేహం వల్ల లివర్ లో కీటోన్లు వృద్ధిచెంది, మూత్రం అమ్మోనియా లాగా వాసన వస్తుంది.

మూత్రపిండాలలో రాళ్లు

మూత్రపిండాలలో రాళ్లు

మూత్రపిండాలలో రాళ్లు కూడా దీనికి కారణం కావొచ్చు. బ్లాడర్ స్టోన్స్ తో బాధపడేవారు ఎప్పుడూ ఈ సమస్యతో బాధపడుతూ ఉంటారు.

లివర్ వ్యాధి

లివర్ వ్యాధి

లివర్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం వాసన రావొచ్చు. టాగ్జిన్ ని తొలగించడంలో లివర్ ఫిఫలమైతే మూత్రంలో అమ్మోనియా అధిక స్థాయిలో పెరిగి, అదే వాసన వస్తుంది.

ఆహరం

ఆహరం

కొన్ని ఆహారపదార్ధాలు, కొన్ని ఔషధాలు కూడా ఈ వాసనకు కారణం కావొచ్చు. మీరు పదేపదే ఆకుకూరలు అదేపనిగా తింటూ ఉంటే, మూత్రం వాసన అమోనియా లాగా వస్తుంది.

అంతేకాకుండా, మీ ఆహారంలో విటమిన్ B6 ఉంటే, దీనివల్ల కూడా వాసన రావొచ్చు. ప్రోటీన్ అధికంగా ఉన్న ఆహరం తీసుకున్నా మూత్రం వాసన వస్తుంది.

కిడ్నీ వ్యాధి

కిడ్నీ వ్యాధి

మూత్రంలో ఆమ్మోనియా స్థాయిలను నియంత్రించడంలో కిడ్నీలు కష్టంతో పనిచేస్తాయి. కిడ్నీలు బలహీనంగా ఉన్నపుడు లేదా మూత్రంలో ఆమ్లం ఎక్కువగా ఉన్నపుడు, వాసన మరింత ఎక్కువగా ఉంటుంది.

మూత్రనాళాల ఇన్ఫెక్షన్

మూత్రనాళాల ఇన్ఫెక్షన్

మూత్రనాళాల ఇన్ఫెక్షన్ వల్ల కూడా మూత్రం చెడు వాసన వస్తుంది. పిత్తాశయంలో బాక్టీరియా వల్ల వాసన వస్తుంది. బాక్టీరియా మూత్రనాళాల లోకి చేరినపుడు, మూత్రం వాసన వస్తుంది.

గర్భధారణ

గర్భధారణ

కొంతమంది గర్భిణీ స్త్రీలలో, మూత్రంలో వాసన సమస్య రావొచ్చు. కానీ మళ్ళీ, గర్భధారణ సమయంలో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఇలా రావొచ్చు.

English summary

Does Your Urine Smell Like Ammonia? Here Are The Reasons!

At times, your urine may smell like ammonia. But why does that happen? Well, high levels of waste products and toxins in your urine is the major reason for that smell.
Story first published: Wednesday, June 14, 2017, 22:38 [IST]
Desktop Bottom Promotion