For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మదర్స్ డే స్పెషల్ : గుర్తుంచుకోండి, ‘బ్రెస్ట్ క్యాన్సర్’చాలా డేంజర్..!

మే 9న మదర్స్ డే ! సందర్భంగా ప్రతి మహిళ కొన్ని ఉపయోగకరమైన , ఆరోగ్యకరమైన విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం..?

By Lekhaka
|

ఈ మద్యకాలంలో మహిళల్లో ప్రాణాంతకంగా మారిన వ్యాధి బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన, జాగ్రత్తలు తీసుకుంటే, తప్పకుండా నివారించుకోవచ్చు. ఈ మదర్స్ డే రోజున మహిళల్లో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన చేసుకుని, రాకుండా నివారిద్దాం..

మే 9న మదర్స్ డే ! సందర్భంగా ప్రతి మహిళ కొన్ని ఉపయోగకరమైన , ఆరోగ్యకరమైన విషయాలను తెలుసుకోవడం చాలా అవసరం..?

మీరు కూడా అందకు అంగీకరించినట్లైతే , బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ముందు జాగ్రత్తలతో నివారించుకోవడం మీ తల్లి అడిగి తెలుసుకోవాలి. మోనోపాజ్ తర్వాత మహిళ శరీరంలో జరిగే అనేక మార్పుల వల్ల క్యాన్సర్ కు కారణమవ్వొచ్చు. కాబట్టి, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవగాహన కలిగి ఉండటం మంచిది?

ఇంట్లో అమ్మకు సైరన అవగాహ లేకుండా ఉండటం వల్ల వాటి లక్షణాలను కూడా గుర్తించలేని స్థితిలో చాలా మంది తల్లులు ఉంటారు. కాబట్టి, వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, హెల్త్ చెకప్స్, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కు తీసుకెళ్లాలి. బ్రెస్ట్ క్యాన్సర్ మీద అవగాహన కల్పించాలి.


బ్రెస్ట్ క్యాన్సర్ తో ప్రపంచ వ్యాప్తంగా కొన్ని మిలియన్ల మంది మహిళలు ప్రాణాలను పోగొట్టుకుంటారు. అందులో ఇండియా కూడా ఒకటి. ఒక్క సారి మానసికంగా, శారీరకంగా మార్పులు కనుక వచ్చాయంటే తర్వాత వాటిని నుండి తప్పించుకోవడం అంత సులభం కాదు .


బ్రెస్ట్ క్యాన్సర్ ను చికిత్స ద్వారా నివారించుకోవచ్చు. అయితే ఈ చికిత్స అంత సులభం కాదు. ఎందుకంటే బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్సలో కీమో థెరఫీ, రేడియోషన్, సర్జరీ వంటి ఎన్నో స్టెప్స్ ఉంటాయి. కాబట్టి, బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

ఈ మదర్స్ డేన మీ అమ్మగారిని క్లీనిక్ కు తీసుకెళ్లి, మొత్తం హెల్త్ చెకప్ చేయిచండం వల్ల ఆమె ఆరోగ్యం గురించి భవిష్యత్త్ లో ఎలాంటి భయాలు ఉండవు. అంతే కాదు, ఈ మదర్స్ డే రోజును మీరు ఆమె పట్ల మీకున్న ప్రేమను, జాగ్రత్తలు తీసుకొనే అవకాశాన్ని వినియోగించుకోవాలి. .

మదర్స్ డే స్పెషల్ గా మీ మదర్ కూడా మీ మీద మరింత రెట్టింపు ప్రేమను వ్యక్తపరుస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ను నివారించడంలో కొన్ని చిట్కాలు ఈ క్రింది విధంగా

1. ఫుడ్ హ్యాబిట్స్

1. ఫుడ్ హ్యాబిట్స్

మీ అమ్మగారు రెగ్యులర్ డైట్ లో ఏం తీసుకుంటున్నారో గుర్గించాలి. ఆమెకు ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉండవు . కాబట్టి, ఆమె ఆరోగ్యానికి భరోసానిచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుడ్స్ యొక్క ప్రాముఖ్యతను గురించి , అవి ఏవిధంగా వ్యాధులను ముఖ్యంగా క్యాన్సర్ లక్షణాలను తొలగిస్తాయో వివరించాలి.

2. రెగ్యులర్ చెకప్ కు తీసుకెళ్లాలి

2. రెగ్యులర్ చెకప్ కు తీసుకెళ్లాలి

బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో సెల్ఫ్ ఎక్జ్సామినేషన్ తప్పనిసరి. ప్రొఫిషనల్ చెకప్స్ కనీసం సంవత్సరంలో ఒకసారైనా చేయించాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్త్ లో ఫైనల్ స్టేజ్ ప్రమాదకర పరిస్థితితులను నివారించుకోవచ్చు.

3. సెల్ఫ్ ఎగ్జ్సామినేషన్

3. సెల్ఫ్ ఎగ్జ్సామినేషన్

బ్రెస్ట్ క్యాన్సర్ ను పూర్తిగా నయం చేసుకోవచ్చు. అయితే ప్రారంభ దశలో గుర్తించి చికిత్స తీసుకోవడం చాలా అవసరం. బ్రెస్ట్ లో ఎలాంటి చిన్న మార్పులు, కణతులు సెల్ఫ్ ఎగ్జ్సామినేషన్ ద్వారా గుర్తించినా వెంటనే డాక్టర్ ను కలవాలి. దాంతో డాక్టర్స్ ప్రారంభ లక్షణాలను వెంటనే గుర్గించి, చికిత్సను అందివ్వడంతో ప్రమాదకర స్థితి ఏర్పడే అవకాశాలుండవు.

4. వ్యాయామం

4. వ్యాయామం

వ్యాయామానికి మీ మదర్ ను కూడా మీ వెంట తీసుకెళ్లడం మంచిది. వ్యాయామంతో కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, అనేక వ్యాధులను నివారించుకోవచ్చు. ముఖ్యంగా క్యాన్సర్ లక్షణాలు నివారించుకోవచ్చు. మోనోపాజ్ తర్వాత ఓవరీస్ ఈస్ట్రోజన్ ఉత్పత్తి తగ్గడంతో ఫ్యాట్ సెల్స్ ఆ పనిని తీసుకుంటాయి. కాబట్టి, హెల్తీగా మరియు ఫిట్ గా ఉండటం చాలా అవసరం.

5. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలి

5. ఫ్యామిలీ హిస్టరీ తెలుసుకోవాలి

కుంటుంబంలో ఎవరైనా బ్రెస్ట్ క్యాన్సర్ తో బాధపడినట్లు తెలుసుకోవడం మంచిది. కొన్ని సందర్భాల్లో మహిళలకు హెరిడిటి వల్ల కూడా మిగిలిన వారికి వచ్చే అవకాశాలున్నాయి. అయితే అందుకు భయపడాల్సిన అవసరం లేదు. రొటీన్ హెల్త్ చెకప్స్ ను ఫాలో అయితే చాలు.

6. హార్మోన్ థెరఫీలు తగ్గించాలి

6. హార్మోన్ థెరఫీలు తగ్గించాలి

మోనోపాజ్ తర్వాత చాలా మంది మహిళలు హార్మోన్ థెరఫీని తీసుకుంటుంటారు. అయితే ఏం తీసుకుంటారన్నదానికి మీద జాగ్రత్తలు తీసుకోవాలి. హార్మోన్ థెరఫీ తీసుకునే ముందు డాక్టర్స్ సలహాలు తీసుకోవడం మంచిది. అవాంఛిత హార్మోన్స్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ను పెంచుతాయి.

7. ఆమెకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలి

7. ఆమెకు అర్థమయ్యే విధంగా అవగాహన కల్పించాలి

మీ తల్లికి క్యాన్సర్ కు గల కారణాలు, లక్షణాలు, నివారణ పద్దతులు తెలియకపోవచ్చు, ఈవిషయంలో ఆమెకు పూర్తి అవగాహన కల్పించడం మంచిది. .బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన కల్పించడంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చక్కగా సహాయపడుతుంది.

8. అవగాన తరుగతులకు హాజరవ్వడం మంచిది

8. అవగాన తరుగతులకు హాజరవ్వడం మంచిది

ఈ రోజుల్లో బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన సదస్సులు చాలా జరుగుతుంటాయి. అందులో తల్లి కూడా పాల్గొనేట్లు చేడయం వల్ల ఆమె కొన్ని ప్రయోజనాలను పొందుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నివారించుకోవడంలో ఇది ఒక బెస్ట్ టిప్.

. ఎన్విరామ్మెంటల్ ఎక్స్ఫోజర్

. ఎన్విరామ్మెంటల్ ఎక్స్ఫోజర్

తల్లిలో శారీరకంగా జరిగే మార్పులు గుర్తించాలి. వాతావరణ పరిస్థితితులు, ఇల్లల్లో వాడే కొన్ని రసాయనిక పదార్థాలు కూడా క్యాన్సర్ కు కారణమవుతాయి. ఆరోగ్య స్థితిని బట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది

English summary

Help Your Mother To Prevent Breast Cancer With These Steps

Breast cancer can be prevented if taken care of on time. Listed here are a few of the best preventive measures for your mother, on this Mother's Day.
Desktop Bottom Promotion