For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కంటి ఆరోగ్యానికి ఇలా చేస్తే చాలా మేలు

కళ్లు ఒత్తిడికి లోనైప్పుడు వాటిని ఆరోగ్యంగా మార్చాలంటే ఏం చేయాలి ? అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా.

|

కళ్లు మనకు ఎంతో ముఖ్యం. నిత్యం అనేక పనులకు మనం వీటిని ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే వీటి కోసం జాగ్రత్తలు తీసుకోవాలని ఎవ్వరూ అనుకోరు. దీంతో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. టీవీ చూడడం, కంప్యూటర్‌పై పనిచేయడం, పొల్యూషన్ వల్ల కంటి సమస్యలు ఏర్పడుతుంటాయి. కంప్యూటర్ ముందు కూర్చొని విశ్రాంతిలేకుండా పని చేయుట వల్ల కళ్లు ఎక్కువగా అలసిపోతాయి.

మొబైల్ విపరీతంగా చూడడం వల్ల కళ్ల మంటలు వస్తుంటాయి. మరి కళ్లు ఒత్తిడికి లోనైప్పుడు వాటిని ఆరోగ్యంగా మార్చాలంటే ఏం చేయాలి ? అందుకోసం కొన్ని చిట్కాలు పాటించాలి. మరి అవి ఏమిటో ఒకసారి చూద్దామా.

1. కలబంద

1. కలబంద

కలబందలో ఉండే ఔషధ గుణాలు దద్దుర్లను, మంట పుట్టించడాన్ని ఆపుతాయి. కళ్లను శుభ్రం చేసుకునేందుకు కలబంద రసాన్ని వాడితే ప్రయోజనాలుంటాయి. కొద్దిగా నీటిలో కలబంద రసాన్ని వేసుకుని ఆ నీటితో కళ్లను శుభ్రం చేసుకోవొచ్చు. ఒకవేళ మీ కళ్లు ఎక్కువగా మంటగా ఉంటే కొంత కలబంద రసాన్నితీసుకుని కనుగుడ్లపై సున్నితంగా పూయండి. కొద్దిసేపు అలాగే ఉండండి. తర్వాత కళ్లను శుభ్రంగా కడుక్కోండి. ఈ విధానం కూడా మీకు బాగా పని చేస్తుంది.

2. కొబ్బరి నూనె

2. కొబ్బరి నూనె

కొబ్బరి నూనె అల్జీమర్స్, ఎపిలేప్సి వంటి వ్యాధుల నివారణకు బాగా పని చేస్తుంది. ఇందులో విటమిన్-ఎ, లౌటైన్ ఉంటుంది. ఇది కంటికి మంచి రక్షణ ఇస్తుంది. కొబ్బరి నూనెలో ఉండే పోషకాలు కంటికి సంబంధించిన సమస్యల్ని పరిష్కరించడంలో బాగా పని చేస్తాయి. ఇందులో చాలా శక్తివంతమైన ఆమ్లజనకాలు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు, యాంటీమైక్రోబయల్ గానూ పని చేస్తాయి.

కొబ్బరి నూనెలో ఉండే గుణాలన్నీ కూడా మీ కళ్లకు ఎంతో బాగా ఉపయోగపడతాయి. కొద్దిగా కొబ్బరి నూనె తీసుకోండి. అందులో పత్తిని ముంచి దాన్ని మీ కళ్లు మూసుకుని కనురెప్పలపైనే 15 నుంచి 20 నిమిషాల వరకు ఉంచుకోండి. ఇలా చేయడం వల్ల ఒత్తిడికి గురైన మీ కళ్లు ప్రశాంతంగా మారుతాయి.

3. ఆముదం

3. ఆముదం

ఆముదం కూడా కళ్లకు చాలా మంచిది. కళ్లు మండుతున్నప్పుడు కళ్ల చుట్టు ఆముదాన్ని పూసుకుంటే చాలా మంచిది. కనురెప్పపైనా కూడా పూసుకోవొచ్చు. దీంతో మంట తగ్గి ప్రశాంతంగా ఉంటుంది. దీంతో మీ కళ్లు తేమగా ఉంటాయి. అందువల్ల ఎప్పుడైనా కళ్లు మంటలుగా ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉండండి.

4. వార్మ్ కంప్రెస్

4. వార్మ్ కంప్రెస్

కళ్లు కాస్త మండుతున్నప్పుడు వార్మ్ కంప్రెస్ ద్వారా ఉపశమనం పొందొచ్చు. కాస్త గోరువెచ్చని నీటిని తీసుకుని కళ్లను శుభ్రంగా కడుక్కుంటే మంచిది. అలాగే వార్మ్ కంప్రెస్ ద్వారా కనురెప్పలకు కావాల్సిన రక్త ప్రసరణ ఈజీగా సాగుతుంది. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

5. ఒమేగా -3 ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోండి

5. ఒమేగా -3 ఫ్యాటీ ఫుడ్స్ తీసుకోండి

ఒమేగా -3 ఫ్యాటీ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల కంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కంటికి సంబంధించిన అన్ని రకాల వ్యాధులను ఇవి అరికడతాయి. సముద్రపు చేపలు, అవిసె గింజలు, చియా విత్తనాలు, నువ్వులు, బాదం, వాల్నట్ వంటి వాటిలో ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్లకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.

6. దోసకాయ

6. దోసకాయ

దోసకాయ కూడా కళ్లను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉపయోగపడుతుంది. నిద్రలేమి వల్ల కళ్లపై ప్రభావం కలుగుతుంది. ఈ సమస్యని దోసకాయ ద్వారా పరిష్కరించుకోవొచ్చు. దోసకాయ ముక్కల్ని కళ్లపై ఉంచుకోవడం వల్ల మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. అలాగే రోజ్ వాటర్ తో కళ్లను కడుకున్నా మంచి ఫలితం ఉంటుంది.

7. మీ క‌ళ్లను మూస్తూ తెరుస్తూ ఉండండి

7. మీ క‌ళ్లను మూస్తూ తెరుస్తూ ఉండండి

కొంతమంది కంప్యూటర్ పై వర్క్ చేసేవారు అసలు కనురెప్పలు కొట్టకుండా పని చేసుకుంటూ ఉంటారు. దీంతో కళ్లకు బాగా అలసట వస్తుంది. కళ్లు ఎర్రగా మారుతాయి. అందువల్ల అప్పుడప్పడు కళ్లకు రిలీఫ్ ఇస్తూ ఉండాలి. అలాగే కొందరు టీవీలు చూస్తున్నప్పడు, మరికొందరు మొబైల్ చూస్తున్నప్పడు కూడా కళ్లు ఆర్పకుండా చూస్తుంటారు. దీనివల్ల చాలా ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొద్దిసేపు పాటు కళ్లు మూసి తర్వాత తెరుస్తూ ఉండండి.

8. చల్లనిపాలు

8. చల్లనిపాలు

కళ్లు మంటగా ఉన్న లేదా పొడి బారిపోయినా ఈ సమస్యను పరిష్కరించుకునేందుకు చల్లనిపాలు బాగా ఉపయోగపడతాయి.

మీ ముఖం, కళ్లను చల్లని పాలతో తుడుచుకోండి మంచి ఫలితం ఉంటుంది.

9. అవిసె గింజల నూనె

9. అవిసె గింజల నూనె

కళ్లను కాపాడుకునేందుకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కళ్లను ఆరోగ్యంగా ఉంచుుతాయి. ఈ నూనెతో తయారు చేసిన ఆహారపదార్థాలను తినేందుకు ప్రయత్నించండి.

10. తేనె

10. తేనె

తేనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులోని ఔషధ గుణాలు కళ్లను సురక్షింగా ఉంచుతాయి. కొన్ని చుక్కల తేనె తీసుకోండి. కాస్త నీటిని తీసుకోండి. ఈ రెండింటిని ఒక గిన్నెలో పోసి కలుపుకోండి. ఆ నీటిని రెండు కళ్లలో డ్రాప్స్ మాదిరిగా రెండు చుక్కలు వేసుకోండి. దీని వల్ల కళ్లలోని మలినాలను మొత్తం బయటకు వెళ్లిపోతాయి. అయితే ఈ డ్రాప్స్ వేసుకున్న సమయంలో మీకు కాస్త మంటగా ఉంటుంది. తర్వాత ఎలాంటి ఇబ్బంది ఉండదు.

11. సోంపు గింజలు

11. సోంపు గింజలు

సోంపు గింజలు కూడా మీ కళ్లకు మంచి తేమను అందిస్తాయి.

నీటిని బాగా మరిగించండి. అందులో ఒక టేబుల్ స్పూన్ సోంపు గింజలను వేయండి. దాన్ని అలాగే 15 నిముషాల పాటు ఉంచండి. కొద్దిగా పత్తిగా తీసుకుని ఆ నీటిలో అద్ది వాటిని కళ్లను మూసి కంటి రెప్పలపై మర్దన చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది.

12. కళ్లను ఎప్పుడూ కడుగుతూ ఉండండి

12. కళ్లను ఎప్పుడూ కడుగుతూ ఉండండి

వీలైనంత వరకు మీ కళ్లను శుభ్రంగా కడుగుతూ ఉండండి. కళ్లను మూసి బేబీ షాంప్ ద్వారాగానీ లేదా రసాయనాలు లేని సబ్బు ద్వారాగానీ కళ్లను శుభ్రం చేసుకుంటూ ఉండండి. దీని వల్ల కూడా కళ్లు శుభ్రంగా మారుతాయి. ప్రశాంతంగా ఉంటాయి.

13. లావెండర్ ఆయిల్

13. లావెండర్ ఆయిల్

లావెండర్ నూనెను కూడా కళ్లకు బాగా ఉపయోగపడుతుంది. కాస్త నీరు తీసుకోండి. అందులో రెండు చుక్కల లావెండర్ నీటిని కలపండి. ఒక గుడ్డను తీసుకుని అందులో ముంచండి. దాంతో కళ్లను మూసి మర్దన చేసుకోండి. దీంతో కూడా మంచి ప్రయోజనాలు పొందుతారు.

14. చేమంతి

14. చేమంతి

కళ్లకు ప్రశాంతత చేకూర్చడంలో చేమంతి కూడా బాగా పని చేస్తుంది. చమోమిలే టీ ఇందుకు బాగా పని చేస్తుంది. పది నిమిషాల పాటు నీటిని బాగా మరిగించండి. అందులో చమోమిలే టీ బ్యాగుల్ని ఉంచండి. తర్వాత దాన్ని చల్లగయ్యే వరకు అలాగే ఉంచండి. టీ లో పత్తిని ముంచి దాంతో కళ్లపై మర్దన చేసుకోండి. దీంతో కూడా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

English summary

home remedies for dry eye syndrome

Try the following remedies to keep your eyes healthy and to prevent the dry eye disorder.
Story first published:Thursday, November 23, 2017, 16:00 [IST]
Desktop Bottom Promotion