For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కుంకుమ పువ్వు ఇలా తింటే ఎలాంటి కంటి సమస్యలైనా..అలా..దూరమౌతాయి..!!

|

సఫ్రాన్ (కుంకుమ పువ్వు) పేరు వినగానే మొదట గర్భిణీలకు పాలలో కలిపి ఇచ్చేది అని గుర్తుకువస్తుంది. కుంకుమ పువ్వులో యాంటీఆక్సిడెంట్స్ మరియు కెరోటినాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా నేచురల్ కెరోటినాయిడ్స్ తో పాటు క్రోసిన్, క్రోసిటిన్ , పిక్రోక్రోసిన్ మరియు ఫ్లెవనాయిడ్స్ అధికంగా ఉన్నాయి. ఇవన్నీ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా కళ్ళ లెన్స్ మరియు రెటీనా హెల్త్ ను కాపాడుతాయి.

ఇంకా ఇందులో టెర్పైన్, టెర్పైన్ ఆల్కహాల్ వంటి కంటెంట్స్ కూడా ఉన్నాయి. కుంకుమపువ్వులో సఫ్రానల్ ముఖ్యమైన పదార్థం. ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది. కుంకుమ పువ్వు మాస్కులార్ డీజనరేషన్ ను నివారిస్తుందన్న విషయం మీకు తెలుసా? కంటిలోపలో సెంటర్ పార్ట్ లో ఉండే భాగాన్ని మాస్కులా అని పిలుస్తారు.

కంటి మద్యభాగంలో ఉండే రెటీనా మన కళ్లకు కావల్సిన లైట్ సెన్సింగ్ సెల్స్(వెలుతురును చూడగలిగే కణాలు) ను కలిగి ఉంటుంది. ప్రారంభ దశలో ఎలాంటి కంటి సమస్యలు, ద్రుష్టి సమస్యలుండవు కానీ, వయస్సు పెరిగే కొద్ది మాస్కులర్ డ్యామేజ్ వల్ల కంటిచూపును కోల్పోవల్సి వస్తుంది.

How To Use Saffron To Improve Your Eyesight

కంటి సమస్యలను నివారించుకోవడంలో కుంకుమ పువ్వు గొప్పగా సహాయపడుతుందని అంటున్నారు నిపుణులు. కుంకుమ పువ్వు రెటీనాలో పిగ్మెంటెడ్ సెల్స్ కు ఆక్సిడేటివ్ డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది.

కుంకుమ పువ్వును రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల రెటినల్ సెల్స్ పనితీరును, స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా వయస్సు పైబడే వారిలో వచ్చే మాస్కులర్ డీజనరేషన్ మరియు ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తుంది. అయితే కుంకుమపువ్వును రెగ్యులర్ డైట్ లో ఏవిధంగా చేర్చుకోవాలి. ఎలా ఉపయోగించాలన్న విషయాలను పూర్తిగా తెలుసుకోవాలి. ఆ తర్వాతే కుంకుమపువ్వు మీ డైలీ డైట్ లో ఒక భాగం అవుతుంది.

కుంకుమ పువ్వులో ఉండే క్రోసిన్ యాంటీఆక్సిడెంట్, ఆల్ఫా టోకోఫెరోల్ కంటే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇది రెటినాల్ సెల్స్ కు రక్షణ కల్పిస్తుంది. రెటీనా లైట్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది . కుంకుమ పువ్వులో ఇంకా యాంటీ కార్సినోజెనిక్, ఇమ్యూన్ మాడ్యులేంటింగ్ న్యూరో ప్రొటక్టివ్ లక్షణాలు అధికంగా ఉన్నాయి.

మరి కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే కుంకుమ పువ్వును ఏవిధంగా తీసుకోవాలో చూద్దాం..

1. కళ్ళ ఆరోగ్యానికి సఫ్రాన్ టాబ్లెట్స్

1. కళ్ళ ఆరోగ్యానికి సఫ్రాన్ టాబ్లెట్స్

కుంకుమ పువ్వుతో తయారుచేసిన టాబ్లెట్ ను ఓరల్ గా తీసుకోవడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. ఇది రెటినాల్ సెల్స్ కు ఎఫెక్టివ్ గా రక్షణ కల్పిస్తుంది. అయితే రోజూ దీన్ని 20 మిల్లీగ్రాముల డోస్ కలిగిన టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఐసైట్ మెరుగుపడుతుంది. రెటీనాల్ సెల్స్ కు రక్షణ కల్పించడంతో పాటు, డ్యామేజ్ అయిన సెల్స్ ను రిపేర్ చేస్తుంది.

2. సఫ్రాన్ వాటర్

2. సఫ్రాన్ వాటర్

ఒక కప్పు వేడి నీటిలో 8-10కుంకుమ పువ్వు రేకులను వేయాలి. 10 నిముషాలు మూత పెట్టి వేడి చేయాలి. 10 నిముషాల తర్వాత స్టౌ ఆఫ్ చేసి గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఉదయం మరియు సాయంత్రం సమయాల్లో తాగాలి.

3. సఫ్రాన్ టీ

3. సఫ్రాన్ టీ

ఒక టీ కప్పు వేడి పాలను తీసుకుని అందులో 10 కుంకుమపువ్వు రేకులను వేయాలి. 5 నిముషాలు ఈ పాలను వేడి చేయాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి వేడి గా ఉన్నప్పుడే తీసుకోవచ్చు.

4. సలాడ్స్ లో కుంకుమపువ్వు

4. సలాడ్స్ లో కుంకుమపువ్వు

మీకు నచ్చిన ఫ్రూట్స్ లేదా వెజిటేబుల్ సలాడ్స్ లో 20 మిల్లీ గ్రాములు కుంకుమ పువ్వును చిలకరించి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంను జోడించి అరటీస్పూన ఉప్పు కలిపి అన్ని బాగా మిక్స్ చేసి తినడం వల్ల మాస్కులర్ డీజనరేషన్ ను నివారించుకోవచ్చు.

5. సఫ్రాన్ రైస్

5. సఫ్రాన్ రైస్

కుంకుమ పువ్వును వివిద రకాల వంటల్లో ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా బిర్యానీకి ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలా వంటలకు ఉపయోగించే పద్దతి ఫాలో అవ్వడం మంచిదే. కుంకుమ పువ్వును నీటితో మిక్స్ చేసి వంట్లో , రైస్ ఐటమ్స్ లో మిక్స్ చేసుకోవచ్చు..

6. కుంకుమపువ్వు మరియు తేనె

6. కుంకుమపువ్వు మరియు తేనె

కుంకుమపువ్వు పౌడర్ ను 20 మిల్లీగ్రాములు తీసుకుని, అందులో తేనె మిక్స్ చేయాలి. ఈ రెండింటి మిశ్రమాన్ని తినడం వల్ల రెటినాల్ రెస్పాన్స్ పెరుగుతుంది. రెటినీల్ సెన్సిటివిటి పెరగుతుంది. కంటి చూపు మెరుగుపడుతుంది.

7. వంటలకు ఉపయోగించాలి:

7. వంటలకు ఉపయోగించాలి:

కుంకుమ పువ్వును కొద్దిగా తీసుకుని, చేతిలోకి తీసుకుని నలిపి వంటల్లో జోడించాలి. దీన్ని సింపుల్ గా రెగ్యులర్ గా వండే వంటల్లో జోడిస్తే చాలు, ఏదో ఒక రకంగా శరీరానికి అంది, కంటి చూపుకు సహాయపడుతుంది.

కుంకుమ పువ్వును ఏదో ఒక రకంగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మాస్కులర్ డీజనరేషన్, హెరిడిటి వల్ల వచ్చ కంటి సమస్యలను నివారిస్తుంది.

English summary

How To Use Saffron To Improve Your Eyesight

Saffron can restore the function and structure of retinal cells that are damaged by age-related macular degeneration and oxidative stress. There aremany ways to include saffron in your diet. We will explain some simple methods to make saffron a part of your daily diet.
Desktop Bottom Promotion