For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

శస్త్రచికిత్స లేకుండా మూత్రపిండాల్లో రాళ్ళు తొలగించే 12 సహజ మార్గాలు

|

మన మూత్రపిండాలు మన విసర్జన వ్యవస్థలో చాలా ముఖ్యమైన భాగం. అవి రక్తం నుండి అవాంఛిత కణాలు తొలగించి, మూత్రం రూపంలో శరీరం నుండి వాటిని బయటకు విసర్జించడానికి రాత్రి మరియు పగలు అని తేడా లేకుండా నిరంతరం పని చేస్తాయి.

మన మూత్రపిండాలు నిఫ్ఫన్స్ అని పిలవబడే మిలియన్ల కొద్దీ చిన్న కణాలతో తయారు చేయబడతాయి. అవి మూత్రపిండాలలోకి ప్రవేశించిన మలినాలను మరియు రక్తామును ఫిల్టర్ చేస్తాయి (వడపోస్తాయి). అలా శుభ్రమైన రక్తం శరీరంలో ప్రసరణ కోసం తిరిగి పంపించబడుతుంది.

మన మూత్రపిండాలు సేకరించిన నీటిలోని వ్యర్థాలను కలిపితే "మూత్రముగా" ఏర్పడతాయి, చివరికి అవి మన శరీరం నుంచి బయటకు విసర్జించబడుతుంది. ఇవే మూత్రపిండాలు యొక్క ప్రాథమిక విధులు.

మూత్రపిండాలను మంచి ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మనము తగినంత నీటిని తాగటం అవసరం అని మన పెద్దల నుండి మనము వింటున్న మాట ఇది. ఎందుకంటే, మన మూత్రపిండాలు చాలా వ్యర్థాలు బయటకు వెళ్తాయి.

మూత్రపిండాలు మన శరీరంలో ఉన్న వ్యర్ధ పదార్ధాలన్నింటిని నీటితో కలిపి, మన శరీర వ్యవస్థ నుండి బయటకు విసర్జింపజేస్తాయి. మన శరీరంలో తగినంత నీరు లేకపోతే, మూత్రపిండాలలో వ్యర్థం యొక్క పెరుగుదల పెరుగుతూపోతుంది. అలా ఆ వ్యర్థాలన్నీ కలిసి మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడేటటువంటి ఒక పరిస్థితికి దారితీస్తుంది.

కిడ్నీల్లో రాళ్లు ఎలా ఏర్పడుతుందంటే మూత్రపిండాలలో నీటి కొరత ఉన్నందున, శరీరంలో ఉన్న వ్యర్ధాలు రూపంలో ఉన్న నీటి ఖనిజాలు - స్ఫటికీకరణంగా రూపాంతరం చెందటం వలన అలా ఏర్పడతాయి. అలా ఆ రాళ్లను మూత్రకోశములోనికి ప్రవేశించి, మూత్రము ద్వారా బయటకు తరలి పోయేటప్పుడు, అవి తీవ్రమైన నొప్పిని కలిగించేదిగా ఉంటుంది.

మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడేందుకు అతి ముఖ్యమైన అంశం డీహైడ్రేషన్ (నిర్జలీకరణం). వంశపారంపర్య (లేదా) గౌట్ వంటి ఇతర కారకాలు వల్ల కూడా కిడ్నీలో రాళ్ళను కలిగించవచ్చు.

అలాంటి సమయంలో ఈ మూత్రపిండాలలో ఉన్న రాళ్ళను వెంటనే తొలగించటం చాలా ముఖ్యం. మూత్రపిండాల రాళ్ల నిర్మాణం చిన్నగా ఉంటే, అవి సహజంగానే మూత్ర మార్గము గుండా బయటకు వెళతాయి. కానీ కొన్నిసార్లు, రాళ్లు పెద్దగా ఉండటం వల్ల శస్త్రచికిత్స అవసరమవుతుంది.

12 Natural Ways To Get Rid Of Kidney Stones Without Surgery

ఈ రాళ్ళను తీసివేసే శస్త్రచికిత్స ప్రమాదకరమైనది మరియు తర్వాత నయం కావడానికి చాలా సమయం పడుతుంది. చాలామంది ప్రజలు మూత్రపిండాల రాళ్ళను తీసివేసేందుకు సహజమైన నివారణ చికిత్స కోసం ఆసక్తిని చూపిస్తారు. ప్రకృతి యొక్క శక్తి చాలా బలమైనదిగా ఉన్నందున, ఇది దాదాపు అన్ని రకాల మానవ రుగ్మతలకు ఉపశమనం కలిగించగలదు.

కాబట్టి, మీరు మూత్రపిండాల రాళ్ళతో బాధపడుతున్నట్లయితే, క్రింద పేర్కొన్న అన్ని సహజ నివారణలను గమనించండి. ఇవి ఖచ్చితంగా మూత్రపిండాలలో ఉన్న రాళ్ళు నుండి మీకు చాలా వరకూ అవసరమైన ఉపశమనాన్ని కలుగజేస్తుంది.

శస్త్రచికిత్స లేకుండా మూత్రపిండాల్లో రాళ్ళు వదిలించుకోవడానికి ఇక్కడ 12 సహజ మార్గాలు ఉన్నాయి-

6 రోజుల్లో కిడ్నీ స్టోన్స్ తొలగించే ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్6 రోజుల్లో కిడ్నీ స్టోన్స్ తొలగించే ఎఫెక్టివ్ హోం ట్రీట్మెంట్

1) అధికంగా నీరు త్రాగండి :

1) అధికంగా నీరు త్రాగండి :

మూత్రపిండాలలో రాళ్లకు ప్రధాన కారణం డీహైడ్రేషన్ (నిర్జలీకరణం), నీరు ఎక్కువగా త్రాగడం వల్ల ఈ సమస్యను పరిష్కరించడానికి సహాయపడుతుంది. మీరు అధిక మొత్తంలో నీటిని త్రాగితే, ఇది స్వయంచాలకంగా మూత్రపిండాలులోకి ప్రవేశించి, విషాన్ని కరిగిస్తుంది. అందువల్ల, ఇది ప్రస్తుత మూత్రపిండాల రాళ్ళ సమస్యను మాత్రమే కాకుండా, ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో మళ్ళీ ఎదురుకాకుండా నిరోధిస్తుంది.

2) ఆపిల్ ను పులియబెట్టి తీసిన రసము (ఆపిల్ సైడర్ వెనిగర్) :

2) ఆపిల్ ను పులియబెట్టి తీసిన రసము (ఆపిల్ సైడర్ వెనిగర్) :

మూత్రపిండములోని రాళ్ళను సహజసిద్ధంగా తొలగించడంలో ACV చాలా బాగుంది. దీనిలో ఉన్న సిట్రిక్-యాసిడ్ కిడ్నీలో రాళ్ళను కరిగించడానికి సహాయం చేస్తుంది. దాని ఆల్కలైజింగ్ లక్షణాల కారణంగా వ్యర్ధాలను తింటాయి మరియు అంతర్గతంగా మూత్రపిండాలను శుభ్రపరుస్తాయి.

ఒక గ్లాసులో 2 స్పూనుల ACV ని తీసుకొని, దానికి వెచ్చని నీటిని జతచేసి కలిపి సేవించండి, ఇలా రోజువారీగా త్రాగటం వలన మూత్రపిండాలలో రాళ్ళను తగ్గించడానికి సహాయపడుతుంది.

3) బేకింగ్ సోడా :

3) బేకింగ్ సోడా :

బేకింగ్ సోడాలోని యాసిడ్, ప్రస్తుతం మూత్రపిండాల్లోని యూరిక్ యాసిడ్ను తటస్థీకరిస్తుంది మరియు వాటి పరిమాణమును తగ్గిస్తుంది. బేకింగ్ సోడా కూడా మూత్రపిండాల మరియు మూత్రనాళము యొక్క వాపులను తగ్గిస్తుంది.

ఒక గ్లాసులో ½ టీస్పూన్ బేకింగ్ సోడాను తీసుకొని, దానిని నీటితో కలిపి ప్రతిరోజు తీసుకోవడం వలన మూత్రపిండాల రాళ్ళు సహజంగానే బయటకు పోతాయి.

4) తులసి ఆకులు (బాసిల్) :

4) తులసి ఆకులు (బాసిల్) :

తులసి ఆకులు అద్భుతమైన సహజమైన వనమూలికలు మరియు వీటిని భారతీయ ఆయుర్వేదంలో విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. తులసి ఆకులు మూత్రపిండాలలో గల రాళ్ళను సహజంగానే బయటకు వైపుగా తొలగించటానికి ప్రోత్సహించబడతుంది. ఇది ఒక నిర్విషీకరణ (detoxifier) వలె పనిచేస్తుంది మరియు మూత్రపిండాల్లో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది కూడా ఒక పెయిన్కిల్లర్గా పనిచేస్తుంది.

3-4 తులసి ఆకులు చూర్ణమును ఒక పేస్ట్ లా తయారు చేయవచ్చు. ఈ పేస్ట్ ను, ఒక టీ స్పూను తేనెతో ప్రతిరోజూ వినియోగిస్తే దాని ఫలితం తెలుస్తుంది.

కిడ్నిలో రాళ్ళను తొలగించే సులభ చిట్కాలుకిడ్నిలో రాళ్ళను తొలగించే సులభ చిట్కాలు

5) నిమ్మకాయ జ్యూస్ మరియు ఆలివ్ ఆయిల్ :

5) నిమ్మకాయ జ్యూస్ మరియు ఆలివ్ ఆయిల్ :

మూత్రపిండాలు రాళ్ళు తొలగించడానికి వీటి కలయిక చాలా శక్తివంతమైనది. నిమ్మ రసంలో గల ఆమ్ల లక్షణాలు మూత్రపిండాలలోని రాళ్ళ పరిమాణాన్ని తగ్గిస్తాయి మరియు ఆలివ్ నూనె వాటిని శరీరంలో నుండి బయటకు సులభంగా తొలగించుటలో సహాయపడుతుంది.

నిమ్మ రసంలో ఉన్న సిట్రిక్ యాసిడ్ వల్ల మూత్రపిండాల ఆరోగ్యాన్ని మరింతగా మెరుగుపరుస్తుంది మరియు అదే పునరావృత నిర్మాణం తగ్గిస్తుంది. మరోవైపు ఆలివ్ నూనె, చాలా అవసరమైన సరళత్వాన్ని అందిస్తుంది, అందుచే మూత్రపిండాల రాళ్ళు సహజంగానే బయటకు వెళ్తాయి.

తాజాగా పిండిన 2 టీస్పూన్ల నిమ్మరసమునకు, అంతే సమాన పరిమాణంలో ఉన్న ఆలివ్ నూనెతో కలిపి ప్రతిరోజూ త్రాగాలి.

6) పుచ్చకాయ :

6) పుచ్చకాయ :

విత్తనాలు కలిగిన నీటి పుచ్చకాయ, ఇటీవల కాలంలో మూత్రపిండాల్లోన్ని రాళ్ళు చికిత్సకు ఒక సరళమైన సహజ పరిహారమని చెప్పవచ్చు. పుచ్చకాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మాకు తెలుసు, కానీ అందులోని విత్తనాలు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి. ఈ చిన్న విత్తనాలు విరోచనాలను కలుగచేసే లక్షణాలను కలిగి ఉన్నట్లుగా ప్రసిద్ధి చెందాయి.అవి శక్తివంతమైన ప్రక్షాళనకారులుగా మరియు మూత్రపిండాలు వ్యర్థాలను, ఇతర విషపూరిత పదార్ధాలను బయటకు తరిమికొట్టడానికి సహాయపడతాయి. ఇది మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది మరియు ఆరోగ్యకరమైన మూత్రపిండాలకు అవసరమైన రక్త సరఫరాను నియంత్రిస్తుంది.

విత్తనాలు కలిగిన ఈ పుచ్చకాయ, మూత్రపిండాల్లో రాళ్ళ చికిత్స కోసం ఒక అద్భుతమైన నివారిణిగా పనిచేస్తుంది. ఒక లీటరు నీటిని వేడి చెయ్యండి. వాటికి గుప్పెడు పుచ్చకాయ విత్తనాలను జోడించండి. ఒక అరగంట సేపు ఆ మిశ్రమాన్ని బాగా మరిగించాక, దానిని బాగా చల్లార్చి,ఆ తర్వాత తినండి.

7) దానిమ్మ రసం :

7) దానిమ్మ రసం :

దానిమ్మపండు రసం యొక్క రక్తస్రావ నివారిణిగా ఉన్న లక్షణాలు, మూత్రపిండాల్లో రాళ్ళను తొలగించే చికిత్సకు సహాయపడతాయి. ఇది మూత్రపిండాలు మరియు మూత్ర నాళాలపై ఉన్న రాళ్ళను విచ్ఛిన్నం చేస్తుంది. వీటిని సులభంగా శరీరం నుండి బయటకు తరలిస్తుంది. అంతేకాక, దానిమ్మరసం మన శరీరానికి అవసరమైన హైడ్రేషన్ (ఆర్ద్రీకరణ)ను అందిస్తుంది.

దానిమ్మపండు విత్తనాలు 1 కప్పు,

2 కప్పుల నీటితో జతచేయ్యాలి. ఆ తాజారసాన్ని ఆస్వాదించండి.

8) ఆకుకూరలు (సెలెరీ) :

8) ఆకుకూరలు (సెలెరీ) :

ఇది మూత్రపిండాలలో రాళ్ళ సమస్యకు ఉపయోగించే పాత చికిత్సా విధానము. మూత్రపిండాల నుండి వ్యర్ధల తొలగింపు ప్రక్రియను సెలేరీ వేగవంతం చేస్తుంది. ఇది కూడా మూత్రపిండాలలో ఆల్కలీన్ స్థాయిలను తిరిగి క్రమబద్ధీకరిస్తుంది. మూత్రపిండాలలో రాళ్ళను తొలగించటానికి సహాయపడేందుకు మూత్రమును ఉత్పత్తి చేసేందిగా మూత్రపిండమును ప్రేరేపిస్తుంది.

సెలెరీ ఆకుల సమూహమును, నీటితో ఉన్న ఒక కుండలో ఉడకబెట్టాలి. ఇది ప్రతిరోజూ తయారుచేసుకుని వినియోగించుకోవాలి.

9) అరటి కాండము :

9) అరటి కాండము :

అరటి కాండము మూత్ర పిండాలలోని రాళ్ళను తొలగించడంలో అత్యంత ప్రభావశీలిగా పనిచేస్తుందని పురాతన గ్రంథాలలో చెప్పబడినది.

ఇది అత్యధికంగా మూత్రవిసర్జనను ప్రేరేపిస్తుంది మరియు మూత్రపిండాలలోని రాళ్ళను విచ్ఛిన్నం చేస్తుంది. అరటి కాండం యొక్క రసాన్ని నిరంతరాయంగా తీసుకుంటే అవి మూత్రపిండాలు రాళ్ళను సహజంగానే తొలగించటానికి సహాయపడుతుంది.

అరకప్పు తరిగిన అరటి కాండమును తీసుకోని, పాలలో కలిపి ఒక రాత్రంతా అలానే ఉంచండి. ఉదయాన్నే చిటికెడు చక్కెరను మరియు దాల్చినచెక్కను జోడించండి, ప్రతి మిశ్రమమును బాగా కలిపి సేవించండి.

10) మొక్కజొన్న ఊక (కార్న్ హెయిర్) :

10) మొక్కజొన్న ఊక (కార్న్ హెయిర్) :

మొక్కజొన్న సమ్మేళనంగా పిలువబడే కార్న్ హెయిర్, మొక్కజొన్న ఊకలో కనిపిస్తుంటుంది, సాధారణంగా దీనిని అందరూ విస్మరిస్తారు. కానీ మీరు ఇది చదివిన తరువాత, అది కూడా మూత్రపిండాలలో రాళ్ళ సమస్యకు చికిత్స చేసేందుకు సహాయం చేయవచ్చని తెలుసుకొని ఆశ్చర్యపోతారు, అవునా !! మొక్కజొన్న ఊక ఒక మూత్రవిసర్జనను, అనగా ఇది మూత్రం యొక్క ప్రవాహాన్ని పెంచుతుంది.

ఇది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడకుండా నిరోధించడానికి మరియు ఒక నొప్పి సంహారినిగా పనిచేస్తుంది. ఇది అలాగే మూత్రపిండాలలో గల వాపును తగ్గిస్తుంది.

గుప్పెడు మొక్కజొన్న ఊకను ఒక కప్పు నీటిలో వేసి 10 నిమిషాలపాటు మరగనివ్వాలి, ఆ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత సేవించాలి.

11) కిడ్నీ బీన్స్ :

11) కిడ్నీ బీన్స్ :

సాధారణంగా వీటిని మన దేశంలో రాజ్మా అని కూడా పిలుస్తారు, వాటి పేరు కూడా అవి మూత్రపిండాలు కోసం అద్భుతమైన పనిచేసేవిగా సూచిస్తుంది. వీటిలో ఫైబర్ ఎక్కువగా ఉంటాయి మరియు ఏ రకమైన మూత్రపిండ వ్యాధులకు చికిత్స చేయటానికి ఇవి మంచి ఉపకారినిగా ఉంటాయి.

వీటిని నీటితో కలిపి 2-3 గంటలు తక్కువ మంట మీద ఉడికించాలి. ఆ పానీయాన్ని చల్లబరచి, రోజులో ఎక్కువ సార్లు నీటిని తీసుకోవటం వల్ల మంచి ఫలితాలను పొందగలరు.

12) ముల్లంగి జ్యూస్ :

12) ముల్లంగి జ్యూస్ :

మూత్రపిండాలలోని రాళ్ళను కరిగించాలంటే, దాని సహజ రూపంలో ఉన్న కూరగాయలను తినే కంటే - ముల్లంగి రసం మరింత ప్రభావవంతంగా ఉంటుందని చెప్పబడింది. ముల్లంగి రసంలో ఉన్న ఖనిజాలు మూత్రపిండాల్లోన్ని రాళ్ళను ముక్కలు ముక్కలుగా విడగొట్టి మరియు సులభంగా బయటికి పంపించడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తుంది.

సగం కప్పు ముల్లంగి ముక్కలను తీసుకొని, నీటిలో వేసి అరగంట పాటు ఉడికించాలి. ఆ రాళ్లు పూర్తిగా కరిగిపోయిన వరకూ ఈ నీటిని ప్రతిరోజూ తాగుతూ ఉండాలి.

English summary

12 Natural Ways To Get Rid Of Kidney Stones Without Surgery

The surgery to remove these stones is risky and it takes a lot of time to heal afterwards. That is why most people opt for natural remedies to remove kidney stones. The power of Nature is so strong that it can provide relief from almost all human ailments. So, if you are suffering from kidney stones, make note of all the natural remedies mentioned below. These will surely give you the much-needed relief from kidney stones. Here are 12 natural ways to get rid of kidney stones without surgery-
Desktop Bottom Promotion