For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యోనిలో దుర్వాస‌న పోగొట్టేందుకు 9 చిట్కాలు!

యోనిలో దుర్వాస‌న రావ‌డం అప‌రిశుభ్రానికి, సెక్స్ చేసేట‌ప్పుడు మూడ్ ఆఫ్ అవ్వ‌డానికి మాత్ర‌మే సంకేతం కాదు. అనారోగ్యాన్ని ఇది తెలియ‌జేస్తుంది.

By Sujeeth Kumar
|

ఈ స‌న్నివేశాన్ని ఒక సారి ఊహించండి. మీరు మీ ప్రియుడితో డేటింగ్ కోసం మంచి క్యాండిల్ లైట్ డిన్న‌ర్‌కు వ‌చ్చారు. అంతా ప‌ర్‌ఫెక్ట్‌గా ఉంది. ఇద్ద‌రు మాంచి మూడ్‌లో ఉన్నారు. తొంద‌ర‌గా ఇంటికి చేరుకున్నారు. ఆ త‌ర్వాత శారీరకంగా ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌వ్వాల‌ని త‌హ‌త‌హ‌లాడిపోతున్నారు.

ఫోర్‌ప్లే మొద‌లైపోతుంది. ఓర‌ల్ సెక్స్ చేయాల‌నుకుంటాడు. అప్పుడే ఏదో అయిపోయే మొత్తం మూడంతా పాడైంద‌ని చెబుతాడు. మీరు ఏమైంది అని అడిగితే దానికి అత‌డు స‌మాధానంగా ఏదో భ‌రించ‌లేని వాస‌న నా మూడ్ ఆఫ్ చేసింద‌ని చెబుతాడు. యోనిలో వ‌చ్చే వాస‌న త‌న మూడ్‌ను పాడు చేసింద‌ని చెప్ప‌గానే చాలా ఇబ్బంది ప‌డిపోవ‌డం మీ వంత‌వుతుంది. మ‌హిళ‌ల‌కు ఇది నిజంగా పెద్ద స‌మ‌స్యే.

యోనిలో దుర్వాస‌న రావ‌డం అప‌రిశుభ్రానికి, సెక్స్ చేసేట‌ప్పుడు మూడ్ ఆఫ్ అవ్వ‌డానికి మాత్ర‌మే సంకేతం కాదు. అనారోగ్యాన్ని ఇది తెలియ‌జేస్తుంది.

tips to reduce vaginal odour

యోనిలో తీవ్ర‌మైన దుర్వాస‌న స‌మ‌స్య‌ను మ‌హిళు ఎదుర్కొన్న‌ప్పుడు ఒక్కోసారి ఆ చుట్టుప‌క్క‌నున్న‌వారికి అది తెలిసిపోతుంది. ఇది చాలా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి. మొత్తానికి ఇది చాలా ద‌య‌నీయంగా ఉంటుంది.

ఈస్ట్ ఇన్ఫెక్ష‌న్ వ‌ల్ల‌, లేదా బ్యాక్టీరియ పెరుగుద‌ల వ‌ల్ల లేదా సుఖ‌వ్యాధులు సంక్ర‌మించ‌డం వ‌ల్ల, వాతావ‌ర‌ణ మార్పుల వ‌ల్ల లేదా సెర్విక‌ల్ క్యాన్స‌ర్ వ‌ల్ల ఆ ప్ర‌దేశంలో దుర్వాస‌న వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.

మంచి ప్రొఫెష‌న‌ల్ ద‌గ్గ‌రకు వెళ్లి స‌రైన ట్రీట్‌మెంట్ తీసుకోవ‌డ‌మూ ముఖ్య‌మే.. మామూలుగా మ‌న ఆరోగ్యం విష‌యం వ‌చ్చేస‌రికి ఎంతో జాగ్ర‌త్త‌గా ఉంటాం. ఎలాంటి వ్యాధులు ద‌రిచేర‌కుండా త‌గుజాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న‌కు ఫ్లూ వ‌చ్చిన‌ప్పుడు వెంట‌నే చికిత్స తీసుకుంటాం. అన్ని ర‌కాలుగా బ‌రువును అదుపులో ఉంచుకునేందుకు ప్ర‌య‌త్నం చేస్తాం. ఆరోగ్య‌క‌ర ఆహారాన్ని తింటాం. యోని ఆరోగ్యం గురించి వ‌చ్చేస‌రికి చాలా మంది మ‌హిళ‌లు దాన్ని నిర్ల‌క్ష్యం చేస్తారు. వైద్యుల ద‌గ్గ‌ర ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించ‌డానికి చాలా మొహ‌మాట‌ప‌డ‌తారు. ఐతే దీన్ని నిర్ల‌క్ష్యం చేయ‌డం వ‌ల్ల మ‌రింత జ‌టిల‌మైన స‌మ‌స్య‌లు ఏర్ప‌డే ప్ర‌మాద‌ముంది.

స‌హ‌జ‌సిద్ధంగా ఆ ప్ర‌దేశంలో దుర్వాస‌న పోగొట్టాలంటే కొన్ని చిట్కాలున్నాయి. స‌మ‌స్య మ‌రీ తీవ్ర‌రూపంగా లేక‌పోతే వీటిని ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు.

1. క‌డిగి, తుడ‌వాలి

1. క‌డిగి, తుడ‌వాలి

ఇత‌ర శ‌రీర భాగాల‌కు చేసిన మాదిరిగానే యోనిని శుభ్ర‌మైన నీటితో క‌డ‌గాలి. స్నానం చేసేట‌ప్పుడు గోరువెచ్చని నీటితో క‌డిగితే మంచిది. లేదా రోజులో రెండు, మూడు సార్లు ప్ర‌త్యేకంగా ఆ ప్ర‌దేశాన్ని క‌డ‌గాలి. ఆ త‌ర్వాత మెత్త‌ని గుడ్డ‌తో తుడ‌వాలి. దీని వ‌ల్ల అక్క‌డ ఏర్ప‌డే చెమ‌ట తొల‌గిపోతుంది.

2. ర‌సాయ‌నిక ఉత్ప‌త్తులు వాడ‌కం వ‌ద్దు

2. ర‌సాయ‌నిక ఉత్ప‌త్తులు వాడ‌కం వ‌ద్దు

యోనిని ప‌రిశుభ్రంగా ఉంచే క్ర‌మంలో స్ప్రేలు, ప‌ర్‌ఫ్యూమ్‌లు, ఆఖ‌ర‌కు స‌బ్బు కూడా వాడ‌కండి. ఇవి ఆరోగ్యంగా ఉంచుతాయ‌ని అంటారు కానీ వాస్త‌వానికి దీంట్లో ఉండే ర‌సాయ‌నాల వ‌ల్ల హాని జ‌రుగుతుంది. ఆ ప్ర‌దేశం పొడిగా మారిపోతుంది. దీంతో అక్క‌డ దుర్వాస‌న వ‌స్తుంటుంది.

3. లోదుస్తుల‌ను రెండు సార్లు మార్చండి

3. లోదుస్తుల‌ను రెండు సార్లు మార్చండి

లోదుస్తుల‌ను రోజుకు ఒక‌సారి వీలైతే రెండుసార్లు మార్చండి. దీని వ‌ల్ల చెమ‌ట ప‌ట్ట‌కుండా హాయిగా ఉంటుంది. అక్క‌డ చెమ‌ట ప‌ట్ట‌డం వ‌ల్ల ఈస్ట్ పెరుగుతుంది. దీంతో దుర్వాస‌న వ‌స్తుంది. వ‌ర్క‌వుట్ త‌ర్వాతో, వాకింగ్ వెళ్లి వ‌చ్చాక అండ‌ర్‌వేర్ మార్చుకోవ‌డం చాలా ముఖ్యం.

4. సిల్క్‌, పాలిస్ట‌ర్ లోదుస్తులు వ‌ద్దు

4. సిల్క్‌, పాలిస్ట‌ర్ లోదుస్తులు వ‌ద్దు

సిల్క్‌, లేస్‌, లెద‌ర్‌, పాలిస్ట‌ర్ తో చేసిన లోదుస్తుల వాడ‌కుండా ఉండ‌టం మేలు. అలాగే టైట్ పాంట్స్ వేసుకోవ‌డాన్ని త‌గ్గించాలి. ఇవ‌న్నీ యోని ప్రాంతాన్ని చికాకు తెప్పిస్తాయి త‌ద్వారా అక్క‌డ ఈస్ట్ పెరిగి దుర్వాస‌న వ‌చ్చే ప్ర‌మాద‌ముంది.

5. స‌హ‌జ‌సిద్ధ ద్ర‌వాల వాడ‌కం

5. స‌హ‌జ‌సిద్ధ ద్ర‌వాల వాడ‌కం

డాక్ట‌ర్‌ను సంప్ర‌దించాక స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెలైన టీ ట్రీ ఆయిల్ లాంటివి అక్క‌డ ప్ర‌యోగించ‌వ‌చ్చు. దీని వ‌ల్ల పొడిబార‌డం త‌గ్గి దుర్వాస‌న అరిక‌ట్టిన‌ట్ట‌వ‌తుంది. ఈ నూనెకు యాంటీ ఫంగ‌ల్ సుగుణాలు ఉన్నాయి. అవి ఫంగ‌స్ ను చంప‌గ‌ల‌వు.

6. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌తో...

6. యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌తో...

యాపిల్ సిడార్ వెనిగ‌ర్‌ను గోరువెచ్చ‌ని నీళ్ల‌లో వేసి యోని ప్రాంతంలో నెమ్మ‌దిగా రాయాలి. దీని వ‌ల్ల అక్క‌డ బ్యాక్టీరియా వ‌ల్ల ఏర్ప‌డిన ఇన్ఫెక్ష‌న్లు త‌గ్గుతాయి. ఇలా రోజు 20 నిమిషాల‌పాటు చేస్తే బాగుంటుంది.

7. స‌హ‌జ ఆహారాన్ని తీసుకోండి

7. స‌హ‌జ ఆహారాన్ని తీసుకోండి

పెరుగు, మ‌జ్జిగ‌, తాజా ఆకుకూర‌లు లాంటి ఆరోగ్య‌క‌ర ఆహారాన్ని తీసుకోండి. ఇవి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయి. చెడు బ్యాక్టీరియాను చంపేయ‌గ‌ల‌వు. త‌ద్వారా దుర్వాస‌న రాకుండా అరిక‌డుతుంది.

8. నీళ్లు బాగా తాగండి

8. నీళ్లు బాగా తాగండి

క‌నీసం 2 లేదా 3 లీట‌ర్ల నీటిని ప్ర‌తిరోజు తాగాలి. దీంతో పాటు క్రాన్‌బెర్రీ జ్యూస్ రోజు తాగితే మంచిది. నీళ్లు తాగ‌డం వ‌ల్ల యోనికి త‌గిన తేమ అందుతుంది. క్రాన్‌బెర్రీ జ్యూస్ ఆరోగ్య‌క‌ర‌మైన బ్యాక్టీరియాని త‌యారుచేస్తుంది. ఈ రెండు చెడు వాస‌న‌ను పోగొట్ట‌గ‌ల‌వు.

9. చ‌క్కెర త‌గ్గించండి

9. చ‌క్కెర త‌గ్గించండి

ఎక్కువ తీపి ప‌దార్థాల‌ను త‌గ్గించ‌డం మేలు. చక్కెర నేరుగా ర‌క్త మార్గంలోకి వెళుతుంది. దీని వ‌ల్ల ఆరోగ్యం ప్ర‌భావం చూపిస్తుంది. యోని ప్రాంతంలో సూక్ష్మ‌క్రిములు పెరిగి దుర్వాస‌న వ‌చ్చేందుకు అవ‌కాశాలున్నాయి.

English summary

Natural Ways To Reduce Vaginal Odour

Many women suffer from vaginal odour which can make them feel uncomfortable and embarrassed. Vaginal odour has a number of caused including yeast infection and dryness. Here are a few helpful tips which can reduce vaginal odour naturally.
Story first published:Thursday, December 21, 2017, 14:51 [IST]
Desktop Bottom Promotion