For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్రం నురగ..నురుగ్గా ఉంటే ఆరోగ్య సమస్యలున్నట్లు అర్థం!

By Lekhaka
|

మీరు మూత్రానికి వెళ్ళినపుడు, యూరిన్ స్పష్టంగా ఉంటే, మీరు ఆరోగ్యంగా ఉన్నట్టే. కానీ మూత్రం ముదురు రంగులో, దుర్వాసనతో, బుడగలతో ఉంటే శరీరంలో ఏదో సమస్య ఉన్నట్టు సంకేతం.

కొన్నిసార్లు, మీరు ఎక్కువ ఫోర్స్ తో మూత్రం పోసినపుడు, బుడగలు కూడా రావొచ్చు. కొన్నిసార్లు, మీరు మీ యూరినల్స్ ని డిటర్జెంట్ తో కడిగినపుడు, మీరు మూత్రం పోసిన తరువాత బుడగలు రావొచ్చు. కాబట్టి, అలాంటి సందర్భాలలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు.

కానీ ప్రతి రోజూ బుడగలు రావడం గమనిస్తే, వెంటనే వైద్యుడిని సంప్రదించడం అవసరం. నురుగుతో కూడిన మూత్రానికి ఇక్కడ కొన్ని కారణాలు ఇవ్వబడ్డాయి.

డిహైడ్రేషన్

డిహైడ్రేషన్

నురుగుతో కూడిన మూత్రం డిహైడ్రేషన్ వల్ల కూడా కావొచ్చు. మీకు డిహైడ్రేషన్ అయితే, మీ మూత్రంలో ప్రోటీన్స్, కొన్ని రసాయనాలు అధిక స్థాయిలో పెరగవచ్చు. డీహైడ్రేషన్ నివారించుకోవడానికి ఎక్కువ నీరు తాగాలి.

గర్భధారణ

గర్భధారణ

గర్భధారణ సమయంలో నురుగుతో కూడిన మూత్రం రావడం సాధారణం. గర్భధారణ సమయంలో, ఊపిరితిత్తులు అధిక పనిని కలిగి ఉంది, ప్రోటీన్ మూత్రంలోకి వెళ్ళడానికి నురగ కారణం కావొచ్చు.

ఒత్తిడి

ఒత్తిడి

మీరు ఆదుర్దాగా లేదా ఒత్తిడిగా ఉన్నపుడు, మీ మూత్రం నురగగా లేదా బుడగలుగా మారుతుంది. యూరిన్ లో ఉంటే ప్రోటీన్, ఆల్బుమిన్ కారణం కావొచ్చు.మూత్రపిండాలు ఒత్తిడికి గురయితే, మూత్రంలో ప్రోటీన్స్ లీక్ అవుతుంది.

మధుమేహం

మధుమేహం

మధుమేహం కూడా మూత్రపిండాలపై ప్రభావం చూపించి, మూత్రం నురగగా ఉండడానికి కారణమవుతుంది. అధిక బ్లడ్ షుగర్ స్థాయి మూత్రపిండాలకు చెడు చేస్తుంది.

మూత్రంలో ప్రోటీన్లు

మూత్రంలో ప్రోటీన్లు

మూత్రంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉంటే, ఆ స్ధితిని ప్రోటీన్యూరియా అంటారు. మూత్రపిండాలు ప్రోటీన్ ని సరిగా ఫిల్టర్ చేయలేకపోతే, వైద్యుడిని సంప్రదించడం మంచిది.

UTI

UTI

మూత్రనాళాలు బాక్టీరియా బారిన పడినపుడు, నురగతో కూడిన మూత్రం వచ్చే అవకాశం ఉంది. UTI కూడా మూత్రంలో ప్రోటీన్ లీకేజ్ ని కలిగిస్తుంది.

గుండె సమస్యలు

గుండె సమస్యలు

మూత్రంలో నురుగుకు గుండె సమస్యల లక్షణాలు కావొచ్చు. మూత్రంలో ప్రోటీన్ అధిక స్థాయిలో ఉన్నపుడు గుండెపోటు వంటి సమస్యలకు దారితీయవచ్చు.

English summary

Reasons For Bubbles In Urine

When you pass urine, if the water is clear, your health is fine. But if the urine has a dark shade, odor and bubbles in it then it could indicate some problem.
Desktop Bottom Promotion