For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మూత్ర విసర్జనలో అసహ్యమైన దుర్వాసనకు కారణమేంటి..?

ఉదాహరణకు జ్వరం రావడానికి ముందు అలసటగా, చలిగా అనిపిస్తుంది.వెంటనే ప్రికాషన్స్ తీసుకుంటే జ్వరం నుండి ఉపశమనం పొందుతారు. అదే విధంగా ఇతర వ్యాధులను గుర్తించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి.

|

మూత్ర సమస్యల్లో ఒకటి మూత్రంలో వాసన. ఇంది ఎందుకు వస్తుంది? శరీరానికి సరిపడా నీళ్ళు త్రాగకుండా మరియు మూత్రం వెళ్ళాల్సి వచ్చినప్పుడు వెళ్ళకుండా అలాగే కొన్ని గంటలు సమయం ఉండటం వల్ల, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇలాంటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. అంతే కాదు ఈ సమస్యకు కొన్ని అంతర్గత జబ్బులు కూడా కారణం అవుతాయి.

అయితే ఇలాంటి సమస్య ఉన్నవారు ఇబ్బందికి గురి అవుతారు. ముఖ్యంగా ఇతరుల బాత్ రూమ్ లను ఉపయోగించినప్పుడు ఇబ్బందికరంగా మరియు విచారణ కరంగా ఉంటుంది. అంతే కాదు యూరిన్ లో ఇటువంటి భయంకరమైన వాసన ఉన్నప్పుడు కొన్ని ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యలను సూచిస్తుంది.

యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించే హోంమేడ్ రెసిపీస్

ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి కొన్ని హోం రెమెడీలు ఉన్నాయి?సాధారణంగా ఈ సమస్యలకు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ మరియు యూరిన్ లో పస్ సెల్స్ పోవడం, బ్యాక్టీరియా వల్ల మూత్రం వాసన వస్తుంది. ఈ సమస్య స్త్రీ మరియు పురుషులిద్దరిలోనూ ఉంటుంది. సాధారణంగా ఈ సమస్యను ఎక్కువగా స్త్రీలలో ఉంటుంది. స్త్రీలలో యురెత్రా ఇన్ఫ్లమేషన్ కు గురిఅయినప్పుడు, మూత్రంలో మార్పులు వస్తాయి.

మూత్రం వాసనకు మరో కారణం కూడా ఉన్నది డీహైడ్రేషన్ వల్ల కూడా మూత్రం వాసన వస్తుంది. ఇది మీ ఆరోగ్య స్థితిగతులను తెలియజేస్తుంది . కాబట్టి, మీకు ఇలాంటి సమస్య ఎదురైనప్పుడు వెంటనే తగిజ జాగ్రత్తలు తీసుకుంటే ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. యూరిన్ లో వాసన రావడానికి కొంత మంది కొన్ని దీర్ఘకాలిక వ్యాధుల లక్షణాలను సూచిస్తే, మరికొందరిలో తాత్కాలిక లక్షణాలు కనబడి మాయమవుతుంటాయి.

యోని దురద(వైజినల్ ఇచ్చింగ్ )ను నివారించుకోవడానికి 10 ఎఫెక్టివ్ హోం రెమెడీస్.!

ఉదాహరణకు జ్వరం రావడానికి ముందు అలసటగా, చలిగా అనిపిస్తుంది.వెంటనే ప్రికాషన్స్ తీసుకుంటే జ్వరం నుండి ఉపశమనం పొందుతారు. అదే విధంగా ఇతర వ్యాధులను గుర్తించడానికి కూడా కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. లక్షణాలను బట్టి ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఇతర సమస్యలు తలెత్తకుండా నివారించుకోవచ్చు. యూరిన్ స్మెల్ బ్యాడ్ గా రావడానికి కొన్ని ఆశ్చర్యపరిచే రీజన్స్ ఈ క్రింది విధంగా..

 డయాబెటిస్ :

డయాబెటిస్ :

యూరిన్ చిక్కగా, తెల్లగా మరియు దుర్వాసన కలిగి ఉన్నట్లైతే, తప్పకుండా డయాబెటిస్ ను ఒకసారి చెక్ చేయించుకోవాలి. యూరిన్ లో ఎక్సెస్ బ్లడ్ షుగర్ ఉన్నట్లైతే యూరిన్ వాసన రావడానికి ప్రధాన కారణాల్లో ఇది ఒకటి.

ఎక్సెస్ మల్టీ విటమిన్ :

ఎక్సెస్ మల్టీ విటమిన్ :

యూరిన్ లో అసాధారణ లక్షణాలు కనబడినప్పుడు, ముందుల వాసన వచ్చిందంటే, ఎక్కువగా మల్టీవిటమిన్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నట్లు గుర్తించాలి. డాక్టర్ ను కలిసి డోసేజ్ ను తగ్గించుకోవాలి.

 డీహైడ్రేషన్ :

డీహైడ్రేషన్ :

శరీరం డీహైడ్రేషన్ కు గురైనా కూడా యూరిన్ లో వాసన వస్తుంది. డీహైడ్రేషన్ వల్ల చాలా ఎక్కువ వాసన వస్తుంది. కాబట్టి, ప్రతి రోజూ వాటర్ ను ఎక్కువగా తీసుకోవాలి.

మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ :

మైక్రోబయల్ ఇన్ఫెక్షన్స్ :

బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు గురైనప్పుడు, ఇన్ఫెక్షన్ యూరిన్ స్ట్రెమ్ లోకి చేరినప్పుడు, వాసన మరింత చెడుగా వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో డాక్టర్ ను కలిసి వెంటనే టెస్ట్ చేయించుకోవడం మంచిది.

యూరిన్ ఎక్కువ సమయం బిగబట్టి ఉంచుకోవడం :

యూరిన్ ఎక్కువ సమయం బిగబట్టి ఉంచుకోవడం :

యూరిన్ వెళ్ళాలి అనిపించినప్పుడు వెంటనే వెళ్ళకుండా, అలాగే ఎక్కువ సమయం ఉన్నట్లైతే బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. అది క్రమంగా యూరిన్ లో వాసనకు గురిచేస్తుంది.

కొన్ని రకాల వెజిటేబుల్స్ తిన్నప్పుడు :

కొన్ని రకాల వెజిటేబుల్స్ తిన్నప్పుడు :

ఆస్పరాగస్, టర్నిప్స్, ఉల్లిపాయలు, వెల్లుల్లి వంటివి ఎక్కువగా తిన్నా కూడా వాటిలో ఉండే ఎంజైమ్స్ యూరిన్ మీద ప్రభావం చూపుతాయి. దాంతో యూరిన్ లో చెడు వాసన వస్తుంది.

యూటిఐ:

యూటిఐ:

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ తో పోరాడే వారు , బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తో బాధపడే వారులో జెనెటెల్స్ మీద ప్రభావం చూపి, యూరిన్ స్మెల్ బ్యాడ్ గా రావడానికి కారణమవుతుంది.

English summary

Surprising Reasons Your Urine Smells Bad!

If you have noticed that your urine smells extremely pungent or it has a "weird" odour lately, then, you must not brush it off, as there are a few dangerous health complications that can cause your urine to smell bad.
Desktop Bottom Promotion