For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

దానిమ్మ జ్యూస్ లో నువ్వుల పొడి కలిపి తాగితే, బలహీనత, రక్తహీనత సమస్యలుండవు

|

సహజంగా అయితే ప్రెండ్స్ మీట్, పార్టీలు అంటే చాలా హుషారుగా ఉంటారు. స్నేహితులతో కలిసి పార్టీలు చేసుకుని, డ్యాన్సులు వేస్తుంటారు. అయితే కొంతసేపటికే అలసిపోయినట్లు అనిపించి అక్కడ నుండి వచ్చేస్తుంటారు.

డ్యాన్స్ చేసేప్పుడు, నడక, పరుగు వంటి వ్యాయామ వంటి సాధారణమైన పనులు చేసేప్పుడు అలసిపోవడం సహజం.

అయితే అలా కాకుండా రోజంతా మీరు అలసిపోయినట్లు, ఎప్పుడూ అలసట, నీరంగా ఉన్నట్లు అనిపిస్తే మాత్రం ఆరోగ్య పరంగా కొన్ని లక్షణాలను సూచిస్తుంది.

ఒక్క రోజుకు 3 ఖర్జూరాలు చాలు మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి..! ఒక్క రోజుకు 3 ఖర్జూరాలు చాలు మిమ్మల్ని హెల్తీగా ఉంచడానికి..!

దానిమ్మ జ్యూస్ లో నువ్వుల పొడి కలిపి తాగితే, బలహీనత, రక్తహీనత సమస్యలుండవు

ఎందుకంటే మన శరీరం వివిధ రకాల కణాలు, అవయవాలు, రక్తం, రక్తకణాలతో తయారుచేయబడినది. మన శరీరం ఒక సిస్టమ్. ఇది పనిచేయాలంటే శరీరానికి సరిగా రక్తం సరఫరా అవ్వాలి. రక్తంతో పాటు ప్రతి అవయవానికి ఆక్సిజన్ సరఫరా అయినప్పుడు ప్రతి అవయవం ఆరోగ్యంగా ఉంటుంది.

అంతే కాదు శరీరంలో కార్బన్ డై యాక్సైడ్ ను తొలగించడానికి కూడా రక్తం చాలా అవసరం. కాబట్టి, శరీరానికి రక్తసరఫర చాలా ముఖమని గుర్తించుకోవాలి. ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్ లెట్స్ తో రక్తం తయారవుతుంది. ఎర్ర రక్తకణాలలో హీమోగ్లోబిన్ అనబడే ప్రోటీనులుంటాయి. ఇవి శరీరంలోని కార్బన్ డై యాక్సైడ్ ను బయటకు పంపే ముఖ్యమైన విధిని నిర్వహిస్తుంది.

అలాగే తెల్ల రక్త కణాలు వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. దాంతో శరీరానికి వ్యాధులు సోకకుండా నివారిస్తుంది.

దానిమ్మ జ్యూస్ లో నువ్వుల పొడి కలిపి తాగితే, బలహీనత, రక్తహీనత సమస్యలుండవు

ఇక ప్లేట్ లెట్స్ కూడా రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది. ఎక్కువ రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. రక్తంలో ఎప్పుడైతే ఎర్ర రక్తకణాలు తగ్గుతాయో, అప్పుడు హీమోగ్లోబిన్ లెవల్స్ తగ్గిపోతాయి. రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గితే అనీమియాకు గురి కావల్సి వస్తుంది.

అలసట, శ్వాసలో ఇబ్బందులు, బలహీనంగా ఉండటం, పాలిపోయిన చర్మం, తలనొప్పి, మెనుష్ట్రువల్ బ్లీడింగ్ , ఇవన్నీ అనీమియా (రక్తహీనతకు) ముఖ్యమైన లక్షణాలు.

అనీమియా లక్షణాలను గుర్తించిన వెంటనే తగిని చికిత్స, జాగ్రత్తలు తీసుకోకపోతే, పరిస్థితి మరింత తీవ్రమవుతుంది.

అనీమియాను నివారించే ఒక ఎఫెక్టివ్ హోం రెమెడీ ఈ క్రింది విధంగా ఉంది..

అనీమియా (రక్తహీనత) లోపంను నివారించే 18 హోం రెమెడీస్ అనీమియా (రక్తహీనత) లోపంను నివారించే 18 హోం రెమెడీస్

దానిమ్మ జ్యూస్ లో నువ్వుల పొడి కలిపి తాగితే, బలహీనత, రక్తహీనత సమస్యలుండవు

కావల్సినవి:
దానిమ్మ జ్యూస్ - 1 గ్లాసు
నువ్వుల పొడి - 1 టేబుల్ స్పూన్,

ఇంట్లో స్వయంగా తయారుచేసుకునే ఈ నేచురల్ రెమెడీ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. రెగ్యులర్ గా తగిన మోతాదులో తీసుకోవడం వల్ల త్వరగా అనీమియా సమస్య నుండి బయటపడవచ్చు.

ఈ హోం రెమెడీతో పాటు, రెగ్యులర్ డైట్ లో తగిన మార్పులు చేసుకోవాలి. రోజువారి ఆహారాల్లో ఐరన్ ఎక్కువగా ఉన్న బీట్ రూట్, ఆకుకూరలు, మాంసాహారం వంటి ఆహారాలను చేర్చుకోవాలి.

అలాగే ఆహారాలను అల్యూమినియం, స్టీల్ పాత్రల్లో వండటం కంటే, ఐరన్ పాత్రల్లో తయారుచేసుకుని తినడం వల్ల కొంత వరకూ ప్రయోజనం ఉంటుంది.

అనీమియా నివారించడానికి ఆయుర్వేద చిట్కాలు అనీమియా నివారించడానికి ఆయుర్వేద చిట్కాలు

హీమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటే, వెంటనే ట్రీట్మెంట్ చేయించుకుని డాక్టర్ సూచనల్ని పాటించాలి.

దానిమ్మ, నువ్వులు కాంబినేషన్ లో ఐరన్, ప్రోటీన్స్ అధికంగా ఉండటం వల్ల, ఇవి ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలను ఉత్పత్తి చేస్తుంది. దాంతో హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి.

హీమోగ్లోబిన్ లెవల్స్ నార్మల్ గా వచ్చినప్పుడు, అనీమియా నేచురల్ గా నార్మల్ కు వస్తుంది.

ఎలా తయారుచేసుకోవాలి:
నువ్వులను పొడిని ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ లో వేసి బాగా కలపాలి.
రెండూ బాగా కలిసే వరకూ కలపాలి.
ఈ హోం మేడ్ న్యాచురల్ డ్రింక్ ను ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత 2 నెలలు క్రమం తప్పకుండా తాగితే అనీమియా సమస్య నుండి బయటపడవచ్చు.

English summary

Try This Simple Home Remedy To Treat Anaemia & Weakness!

Try This Simple Home Remedy To Treat Anaemia & Weakness!,If not treated at the right time, anaemia can lead to serious health complications. So, here is a home remedy to help treat anaemia, naturally.
Desktop Bottom Promotion