For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే పసుపు

By Mallikarjuna
|

ఈ మద్య కాలంలో చాలా మందిలో తలనొప్పి సర్వసాధారణమైపోయింది. ఇది ఒక సహజ సమస్యగా భావిస్తున్నారు. తలనొప్పి రకాల్లో మైగ్రేన్ తలనొప్పి కూడా ఒకటి.

సాధారణంగా వచ్చే తలనొప్పి కొన్ని రోజుల వరకూ అలాగే వేధిస్తుంటే, అది మైగ్రేన్ తలనొప్పిగా మారే అవకాశం ఉంది. దాంతో తరచూ తలనొప్పితో బాధపడుతారు. తలనొప్పితో పాటు వికారం, వెలుతురు, శబ్ధాలకు సెన్సిటివిటీగా మారడం వంటివి మైగ్రేన్ లక్షణాలు. కొందరిలో మైగ్రేన్ తలనొప్పి చాలా విపరీతంగా ఉంటుంది. అలాంటి వారు తప్పనిసరిగా డాక్టర్ ను కలవాల్సిందే,

మైగ్రేన్ తలనొప్పిని చిటికెలో తగ్గించే సింపుల్ అండ్ సిల్లీ హోం రెమెడీ...మైగ్రేన్ తలనొప్పిని చిటికెలో తగ్గించే సింపుల్ అండ్ సిల్లీ హోం రెమెడీ...

home remedy for migraine

మైగ్రేన్ తలనొప్పికి సాధారణ లక్షణాలు మెడ, ముఖంలో కూడా నొప్పిగా ఉండటం , కళ్లు తిరగడం, కళ్లు మసకమసకగా కనబడటం, ముక్కుదిబ్బడ, తల బరువుగా అనిపించడం మొదలగు సాధారణ లక్షణాలు కూడా కనబడుతాయి.

మైగ్రేన్ తలనొప్పికి కారణం హార్మోనుల్లో అసమతుల్యతలు, హెరిడిటి, డిప్రెషన్, యాక్సైటి, పోషకాహార లోపం, గర్భనిరోధక మాత్రల దుష్రభావాలు, మోనోపాజ్ లక్షణాలు.

home remedy for migraine

మైగ్రేన్ తలనొప్పిని నివారించుకోవడానికి స్ట్రాంగ్ పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం చాలా ప్రమాదకరం. పెయిన్ కిల్లర్స్ వల్ల ఇతర దుష్ప్రభావాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి, ముందు జాగ్రత్తగా మైగ్రేన్ రాకుండా చూసుకోవడమే మంచిది.

మైగ్రేన్ తలనొప్పిని ఇంట్లోనే న్యాచురల్ గా తగ్గించుకోవడానికి కొన్ని రెమెడీస్ ను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..

మైగ్రేన్ తలనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించే ఫర్ఫెక్ట్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ..!!మైగ్రేన్ తలనొప్పిని ఎఫెక్టివ్ గా తగ్గించే ఫర్ఫెక్ట్ ఆయుర్వేదిక్ రెమెడీస్ ..!!

home remedy for migraine

కావల్సినవి:

పసుపు: రెండు టీస్పూన్లు

అల్లం జ్యూస్ : నాలుగు టేబుల్ స్పూన్లు

ఫ్యాక్ట్ # 1

ఈ న్యాచురల్ రెమెడీ రోజూ ఉపయోగిస్తుంటే మైగ్రేన్ తలనొప్పి తగ్గిస్తుంది. అలాగే మైగ్రేన్ తలనొప్పికి కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాలి. రెగ్యులర్ గా చిన్న పాటి వ్యాయామాలు, మెడ వ్యాయామాలు చేయాలి.

home remedy for migraine

ఫ్యాక్ట్స్ # 2

పసుపులో పవర్ ఫుల్ యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇవి తలకు ఆక్సిజన్ మరియు రక్తప్రసరణను మెరుగుపరుస్తాయి. దాంతో తలనొప్పి తగ్గుతుంది.

అల్లం పసుపులో ఉండే యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాల వల్ల తలలో ఇన్ఫ్లమేషన్, మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది.

ఉప్పుతో మైగ్రేన్ నుంచి క్షణాల్లో ఉపశమనం పొందడం ఎలా ?ఉప్పుతో మైగ్రేన్ నుంచి క్షణాల్లో ఉపశమనం పొందడం ఎలా ?

తయారీ:

1. పైన సూచించిన విధంగా పదార్థాలను తీసుకుని ఒక గ్లాసు వేడి నీటిలో కలపాలి చేయాలి.

2. ఈ రెండు పదార్థాలు బాగా కలిసే వరకూ మిక్స్ చేయాలి.

3. ఈ మిశ్రమాన్ని రోజుకు ఒకసారి , భోజనం తర్వాత తాగితే మంచి ఫలితం ఉంటుంది.

English summary

Turmeric Remedy For Migraine Headache

If you want to treat migraine headaches right at home, using natural ingredients, then here is a remedy you must try!
Story first published:Thursday, June 29, 2017, 17:21 [IST]
Desktop Bottom Promotion