For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊపిరితిత్తులకి ఆరోగ్యకరమైన డైట్ ; 10 బెస్ట్ ఫుడ్స్

ఊపిరితిత్తులకి ఆరోగ్యకరమైన డైట్ ;10 బెస్ట్ ఫుడ్స్

|

ఊపిరితిత్తులు శరీరంలో చాలా ముఖ్యమైన అవయవం, ఇవి శరీరం సరిగ్గా పనిచేసేలా చేస్తాయి.అందుకని ఈ ఆర్టికల్ లో మనం ఊపిరితిత్తులకి ఆరోగ్యకరమైన డైట్ గురించి చర్చిద్దాం.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్యూహెచ్ ఓ) ప్రకారం, 235 మిలియన్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు.భారతదేశంలో వాతావరణ కాలుష్యం, పొగ తాగేవారి సంఖ్య పెరగటం వలన, శ్వాసకోస సమస్యలు ఎక్కువయ్యాయి.

10 Best Foods For Healthy Lungs

ఈ కాలుష్యం నిండిన గాలిని ఊపిరితిత్తులు వరుసగా పీలుస్తూపోతే, ఈ కలుషితాలు శ్వాసకోస సమస్యలైన బ్రాంకైటిస్, ఆస్తమా, న్యుమోనియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి వాటి రిస్క్ ను పెంచుతూ పోతాయి.

అందుకని మీ ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపర్చటానికి, ఈ కింది ఆహార పదార్థాలు ఎక్కువగా తినండి.

ఊపిరితిత్తులకి ఆరోగ్యకరమైన డైట్ ఏంటో తెలుసుకోవడానికి చదవండి.

అల్లం

అల్లం

అల్లంలో ఉండే వాపు వ్యతిరేక లక్షణాలు శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఇది ఊపిరితిత్తులలో విషపదార్థాలను తొలగించి, కలుషితాలను పోగొట్టేలా చేస్తుంది. ఈ దినుసు జలుబు నెమ్మును , శ్వాసనాళాన్ని ఫ్రీగా గాలి వెళ్ళేలా చేసి, ఊపిరితిత్తులకి రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది,అలా ఊపిరితిత్తుల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

వెల్లుల్లిలో ఉండే ఫ్లేవనాయిడ్లు గ్లుటాథయోన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి. ఇవి విషపదార్థాలను,కార్సినోజన్లను తొలగించటానికి సాయపడి ఊపిరితిత్తులు సరిగా పనిచేసేలా చేస్తాయి. ఒక అధ్యయనంలో వారానికి రెండుసార్లు మూడు పచ్చి వెల్లుల్లిపాయలు తిన్నవారికి ఊపిరితిత్తుల క్యాన్సర్ 44 శాతం తక్కువగా వస్తుందని తేలింది.

సంపూర్ణ ధాన్యాలు

సంపూర్ణ ధాన్యాలు

మీ ఆహారంలో బ్రౌన్ రైస్, కినోవా,సంపూర్ణ ధాన్యాలు ఉండేలా చూసుకోండి. డైట్ లో సింపుల్ కార్బొహైడ్రేట్లైన మఫిన్స్, పాస్తా,అన్నం, వైట్ బ్రెడ్ మొదలైనవి ఉంటే కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తిని పెంచి ఊపిరితిత్తులపై ఒత్తిడి పెంచుతాయి.

కాఫీ

కాఫీ

మీకు ఒక కప్పు కాఫీ ఆస్తమా లక్షణాలను తగ్గిస్తుందని తెలుసా? కెఫీన్ బ్రోంకోడైలేటర్ గా పనిచేసి ఆస్తమా పేషెంట్లలో దిబ్బడ పడ్డ శ్వాసనాళాలను తెరిచి, శ్వాసకోస కండరాల అలసటను తగ్గిస్తుంది. పరిశోధనల్లో తేలింది ఏంటంటే పొద్దున్నే కాఫీ ఒక కప్పు తాగటం వల్ల ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి.

గ్రీన్ టీ

గ్రీన్ టీ

గ్రీన్ టీలో ఉండే యాంటిఆక్సిడెంట్లు శరీరాన్ని శాంతబర్చి, వాపులను తగ్గించి, బాగయ్యేలా చేస్తాయి. క్వెర్సెటిన్ అనే యాంటిఆక్సిడెంట్ సహజమైన యాంటీహిస్టమైన్ గా పనిచేసి అలర్జీ లక్షణాలను కలిగించే హిస్టమిన్ విడుదలను నెమ్మది చేస్తుంది.

సాల్మన్

సాల్మన్

సాల్మన్ లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఊపిరితిత్తుల్లోని వాపును తగ్గించి, ఊపిరితిత్తుల వ్యాధులున్నవారిలో బ్యాక్టీరియాతో పోరాడుతాయి. సాల్మనే కాక, మాకెరెన్,ట్రౌట్, సార్డిన్స్,హెర్రింగ్ ఈ చేపలన్నీ ఊపిరితిత్తులకి మంచివి.

యాపిల్స్

యాపిల్స్

ఒక పరిశోధనలో తేలింది ఏంటంటే రోజూ యాపిల్ జ్యూస్ తాగేవారికి జలుబు తక్కువగా వస్తుంది. ఇంకో ప్రముఖ అధ్యయనంలో ప్రెగ్నెన్సీ సమయంలో రోజూ యాపిల్ జ్యూస్ తాగిన స్త్రీలకి ఆస్తమో లేని పిల్లలు పుడతారు. ఇది ఎందుకంటే యాపిల్స్ లో ఉండే ఫినోలిక్ కాంపౌండ్స్, ఫ్లేవనాయిడ్లు శ్వాసనాళంలో వాపులను తగ్గిస్తాయి.

విత్తనాలు

విత్తనాలు

విత్తనాలు ఊపిరితిత్తులకి సూపర్ ఫుడ్ల వంటివి. గుమ్మడి విత్తనాలు,అవిసె గింజలు,పొద్దుతిరుగుడు విత్తనాలలో శరీరానికి కావాల్సిన మెగ్నీషియం ఎక్కువగా ఉండి ఆస్తమాని తగ్గించటంలో సాయపడుతుంది. మెగ్నీషియం శ్వాసనాళంలో కండరాలని విశ్రాంతపరిచి, వాపును తగ్గిస్తుంది,అలా శ్వాస మెరుగుపడుతుంది. చేతుల్లో పట్టినన్ని విత్తనాలను తీసుకుని స్మూతీలా మిక్సీ పట్టండి.

ఆరెంజ్ రంగు పళ్ళు,కాయగూరలు

ఆరెంజ్ రంగు పళ్ళు,కాయగూరలు

ఆరెంజ్ రంగు పళ్ళు,కాయగూరలైన బొప్పాయ,గుమ్మడికాయలు,ఆరెంజిలు తినండి.ఈ ఆహారపదార్థాలలో ఊపిరితిత్తులకి సాయపడే యాంటిఆక్సిడెంట్లయిన విటమిన్ సి ఉంటుంది, ఇది ఇన్ఫెక్షన్లను, వాపును తగ్గిస్తుంది.

పెప్పర్

పెప్పర్

క్యాప్సికంలో కాప్సైసిన్ ఉంటుంది, ఇది పై మరియు కింది శ్వాసనాళాల్లో మ్యూకస్ పొరలను కొన్ని స్రావాలను స్రవించేలా చేసి కాపాడుతుంది. అందుకని వండుతున్నప్పుడు ఈ రకపు క్యాప్సికంను ఆహారంలో జతచేయటం లేదా ఆస్తమా లక్షణాలను తగ్గించటానికి సయెన్నె పెప్పర్ టీ తాగటమో చేయవచ్చు

ఈ ఆర్టికల్ ను షేర్ చేయండి!

మీకు ఈ ఆర్టికల్ చదవటం నచ్చితే, మీ దగ్గరివారితో పంచుకోండి.


English summary

10 Best Foods For Healthy Lungs

Lungs are an important organ of the body that play a vital role in helping the body function properly. So, in this article, we will be discussing the healthy diet for lungs.
Story first published:Thursday, July 19, 2018, 18:27 [IST]
Desktop Bottom Promotion