For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చేతి వేళ్ల వాపులను ఇలా చేస్తే చిటికెలో తగ్గించుకోవొచ్చు

మనం చేసే ప్రతి చిన్న పనికి నిరంతరం మన వేళ్లను ఉపయోగిస్తాము. కానీ ఒక్కోసారి వేళ్ళ నందు స్వల్ప వాపు లేదా నొప్పి చాలా అసౌకర్యం కలిగించవచ్చు తద్వారా పని యందు ఆ వేలు ఉపయోగించడం చాలా కష్టతరం అవుతుంది.

|

మనం చేసే ప్రతి చిన్న పనికి నిరంతరం మన వేళ్లను ఉపయోగిస్తాము. కానీ ఒక్కోసారి వేళ్ళ నందు స్వల్ప వాపు లేదా నొప్పి చాలా అసౌకర్యం కలిగించవచ్చు తద్వారా పని యందు ఆ వేలు ఉపయోగించడం చాలా కష్టతరం అవుతుంది.

వేళ్లు ఎన్నో కారణాల వలన వాపుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి మరియు వస్తువులు తాకేందుకు కూడా చాలా అసౌకర్యంగా మారుతుంది. ఒక వాపు వేలు చుట్టూతా ద్రవం చేరడం మూలంగా కలుగవచ్చు, తద్వారా మంటకు లోనయ్యే అవకాశం ఉంది. కొందరు గోరుచుట్టు గా కూడా వ్యవహరిస్తుంటారు.

ఇది ఒక్కోసారి ఏదైనా పురుగుల కాటు వలన కూడా సంభవించవచ్చు, సున్నితమైన లేదా దెబ్బతిన్న ఈ వేలు చుట్టూతా ద్రవం చేరిపోయి దద్దురు, నొప్పి కలుగవచ్చు, తద్వారా ఇన్ఫెక్షన్ కి గురి కావొచ్చు. శరీరం లో ఉప్పు నిల్వలు పెరగడం, శరీరంలోని హార్మోన్ల మార్పులు మరియు తీవ్ర ఉష్ణోగ్రతకి గురవడం వంటివి కూడా ఈ వాపునకు కారణం అయ్యే అవకాశం ఉంది.

అలాగే, సెల్యులిటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్ వంటి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా వాపు వేలు ఏర్పడవచ్చు.

వేలు వాపు తేలికపాటిగా ఉంటే, మీరు సాధారణ గృహ నివారణ చిట్కాలు ప్రయత్నించవచ్చు. ఇక్కడ వేళ్లు వాపు తగ్గించడానికి ఇంటి నివారణల జాబితా పొందుపరచడం జరిగినది.

1. హైడ్రో థెరపీ

1. హైడ్రో థెరపీ

చల్లని మరియు వెచ్చని నీటి చికిత్సలను కలిగిఉన్న హైడ్రోథెరపీ, వేళ్లలోని వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. రెండు వేర్వేరు చిన్న గిన్నెలలో, వెచ్చని నీటితో మరియు చల్లని నీటితో నింపండి.

4 నిమిషాలు వెచ్చని నీటిలో వాపుతో ప్రభావితమైన వేలును ఉంచండి.తర్వాత, చల్లటి నీటిలో ఒక నిమిషం పాటు ఉంచండి.

ఈ ప్రక్రియను రోజుకు మూడుసార్లు పునరావృతం చేయండి.

2. వెచ్చని ఆయిల్ మసాజ్

2. వెచ్చని ఆయిల్ మసాజ్

వెచ్చని చమురుతో మర్దన వేళ్లు యొక్క వాపును తగ్గిస్తుంది. ఇది గాయపడిన కండరాలకు విశ్రాంతినివ్వడంతో పాటు రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది.

కొంచెం ఆవ నూనెను గోరువెచ్చగా వేడి చేసి పాత్రలోకి తీసుకోండి. ఆవాల నూనెతో మీ వేళ్లను 5 నిమిషాల పాటు మసాజ్ చేయండి.

3.ఫింగర్ వ్యాయామం

3.ఫింగర్ వ్యాయామం

మీ వాపు వేళ్లు పేలవమైన రక్త ప్రసరణ కలిగి లేదా ద్రవ నిలుపుదల కారణంగా నొప్పి అధికంగా ఉంటే. ఆ వేళ్ళకి వ్యాయామం చేయడం వల్ల వాపు తగ్గుతుంది.

మీ వేళ్ళను ఒక పిడికిలి లో ఉంచి మూసివేసి ఒక నిముషము వరకు పట్టుకోండి. నెమ్మదిగా, పిడికిలి తెరచి, ఆ వేలుని సడలించండి. రోజులో మీకు వీలైనన్ని సార్లు చేస్తూ ఉండండి.

4. ఎప్సోమ్ ఉప్పు

4. ఎప్సోమ్ ఉప్పు

ఎప్సోమ్ ఉప్పులో మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది, ఇది వాపు వేళ్లు చికిత్స కోసం ఒక ఖచ్చితమైన గృహ చికిత్స. ఇది వాపు తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతుంది.

వేడి నీటి గిన్నెలో ఎప్సోమ్ ఉప్పు 2 టేబుల్ స్పూన్లు చేర్చండి.

10 నిమిషాలు మీ వేళ్లని అందులో సోక్ చేయండి.

రోజువారీ కనీసం రెండు సార్లు చేయండి.

5. పసుపు

5. పసుపు

పసుపులో ఉండే curcumin, ఒక మంచి యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది వాపు వేళ్ల చికిత్సలో సహాయపడుతుంది.

1 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనెలో 1/2 టీస్పూన్ పసుపు పొడిని కలపండి.వాపు వేలు మీద అప్లై చేయండి. పూర్తిగా పొడిగా మారాక చల్లని నీటితో శుభ్రం చేయండి.

6. ఆపిల్ సైడర్ వెనిగర్

6. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ వాపు వేళ్ల నొప్పి నుండి తక్షణ ఉపశమనం అందిస్తుంది. దీనిలో ఉండే అధిక పొటాషియం కంటెంట్ వేళ్లలో ద్రవ నిలుపుదలని తగ్గిస్తుంది.

ఒక గిన్నెలో, నీళ్ళు తీసుకుని అందులో 2 టీ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్ ను కలపండి. ఆ నీటిలో ఒక టవల్ ను ముంచి, అదనపు నీటిని పిండివేసిన తర్వాత , 10 నిమిషాలు మీ వేళ్ల చుట్టూ టవల్ ను కొంచం గట్టిగా కప్పి ఉంచండి.

7. బ్లాక్ టీ సంచులు

7. బ్లాక్ టీ సంచులు

వేలి వాపు తగ్గించటానికి సహాయపడే అనామ్లజనకాలు మరియు టానిన్లు, బ్లాక్ టీ సంచులలో పుష్కలంగా లభిస్తాయి. బ్లాక్ టీ బ్యాగ్ ఉపయోగించి బ్లాక్ టీ సిద్దం చేయండి. గ్లాసు నుండి తొలగించిన టీ బ్యాగ్ ను 15 నిమిషాలు రిఫ్రిజిరేటర్ లో ఉంచండి.

తర్వాత 10 నిమిషాలు వాపు వేలు మీద చల్లని టీ సంచి ఉంచండి. ఒక రోజులో ఈ పని అనేక సార్లు చేయడం ద్వారా ఉపశమనం లభిస్తుంది.

8. ఐస్ ప్యాక్

8. ఐస్ ప్యాక్

మీరు వాపు వేళ్ల నొప్పిని అనుభవిస్తున్నట్లయితే, ice pack గొప్ప ఇంటి నివారణ. ఇది వాపును తగ్గిస్తుంది.

కొన్ని ice cubes ని ఒక టవల్లోకి తీసుకోండి , కనీసం 5-10 నిమిషాలు మీ వేళ్ళ మీద ఆ టవల్ ఉంచండి.

9. కలబంద

9. కలబంద

మీ వాపు వేలు, ఒక కీటకం కాటు వలన సంభవిస్తే , అప్పుడు కలబంద ఉత్తమ పరిష్కారం. కలబంద ఉపశమనం కలిగించేది, మరియు మీ వేళ్ళను త్వరితంగా పునరుద్ధరించడానికి సహాయం చేస్తుంది.

కలబంద గుజ్జుని సేకరించి మీ వాపు వెలిపై అప్లై చేయండి. రోజులో అనేక సార్లు పునరావృత్తం చేయండి.

10. ఉప్పు తీసుకోవడం తగ్గించండి

10. ఉప్పు తీసుకోవడం తగ్గించండి

అధిక ఉప్పు లేదా సోడియం తీసుకోవడం కూడా వాపు వేళ్ల వెనుక మరొక కారకంగా చెప్పవచ్చు. అధిక మొత్తంలో సోడియం వేళ్లలో ద్రవ నిలుపుదల గావిస్తుంది.

వంటలో ఉప్పు తక్కువ మొత్తం ఉపయోగించండి.

ఉప్పు కలిగి ఉన్న ఆహారం తీసుకోవలసి వస్తే తక్కువగా తీసుకోండి.

English summary

10 Home Remedies To Reduce Swelling In The Fingers

We use our fingers constantly for every little work that we do. And even a slight swelling or pain can cause discomfort, making it hard to use the swollen finger. Fingers can swell for a lot of reasons and it becomes extremely uncomfortable to touch things. A swollen finger can occur due to fluid build-up or inflammation.
Story first published:Thursday, March 22, 2018, 18:56 [IST]
Desktop Bottom Promotion