For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెజీనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే నేచురల్ రెమెడీస్

వెజీనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను తగ్గించే నేచురల్ రెమెడీస్

|

వెజీనాలో నివసించే కాండిడా అల్బికన్స్ అధిక పెరుగుదల వలన వెజీనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తుతుంది. అందువలన, ఇచింగ్, ఇంఫ్లేమేషన్, పెయింఫుల్ డిశ్చార్జ్ తో పాటు ఇరిటేషన్ సమస్యలు వేధిస్తాయి. ఇది అత్యంత సాధారణమైన సమస్య. ఎక్కువ మంది మహిళల్లో ఈ సమస్యను గుర్తించవచ్చు. ఈ సమస్య ఏ సమయంలోనైనా తలెత్తుతుంది.

గతంలో ఈ సమస్యను మీరు ఎదుర్కోకపోయి ఉండవచ్చు. ఈ సమస్య తలెత్తడం ఇదే మొదటి సారి అయి ఉండవచ్చు. వెంటనే మీరు గైనకాలజిస్ట్ ను సంప్రదించాలి. వెజీనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉందని నిర్థారింపబడ్డాక తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

10 Natural Remedies To Treat Vaginal Fungal Infection

ఒకవేళ, మీకు ఇటువంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తరచుగా ఎదురైతే మీరు ఈసారి వైద్యున్ని సంప్రదించడానికి మొగ్గు చూపకపోవచ్చు. అటువంటి సమయంలో మీరు వెజీనల్ ఇన్ఫెక్షన్ నుంచి ఉపశమనం పొందేందుకు కొన్ని ప్రభావితమైన నేచురల్ రెమెడీస్ ను పాటించండి.

వెజీనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించే నేచురల్ రెమెడీస్

ఈ కింద వివరింపబడిన రెమెడీస్ వెజీనల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించేందుకు అమితంగా తోడ్పడతాయి.

ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ మరియు సపోజిటరీస్

ప్రోబయాటిక్ సప్లిమెంట్స్ మరియు సపోజిటరీస్

శరీరం మీద ఈస్ట్ మరియు బాక్టీరియా మధ్య బాలన్స్ ను రీ ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రో బయాటిక్స్ తోడ్పడతాయి. ఓరల్ ప్రోబయాటిక్స్ ను రోజువారీ రొటీన్ లో తీసుకోవడం ద్వారా వెజీనల్ ఫ్లోరాను పునరుద్ధరించవచ్చు.

గ్రీక్ యోగర్ట్:

గ్రీక్ యోగర్ట్:

యోగర్ట్ లో లాక్టోబేసిలస్ యాసిడోఫిలస్ (లైవ్ బాక్టీరియా) అనేది లభిస్తుంది. ఇది ప్రోబయాటిక్ గా వ్యవహరిస్తుంది. ఈ టైప్ అఫ్ బాక్టీరియా అనేది వల్వా లేదా వెజీనా వద్ద ఆరోగ్యకరమైన వాతావరణాన్ని పెంపొందిస్తుంది. ఇది బాక్టీరియా ఓవర్ గ్రోత్ ను అరికడుతుంది.

వెజీనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ ను తగ్గించుకునేందుకు గ్రీక్ యోగర్ట్ అనేది అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ఈ యోగర్ట్ లో షుగర్ ని జోడించకుండా తీసుకోవడం ద్వారా మెరుగైన ఫలితాన్ని పొందవచ్చు. షుగర్ కాండిడా ఫంగస్ వృద్ధిని ప్రేరేపిస్తుంది.

కొబ్బరి నూనె:

కొబ్బరి నూనె:

కోకోనట్ ఫ్లెష్ నుంచి ఈ ఫ్యాటీ ఆయిల్ ను సేకరిస్తారు. ఇది యాంటీ ఫంగల్ ఏజెంట్ గా వ్యవహరిస్తుంది. ఈ ఆయిల్ అనేక ఆరోగ్యప్రయోజనాలను అందిస్తుంది. అధ్యయనాల ప్రకారం కొబ్బరి నూనె అనేది కాండిడా అల్బికన్స్ ను నిర్మూలిస్తుంది. అందువలన, ఇది అద్భుతమైన నేచురల్ రెమెడీగా వ్యవహరిస్తుంది.

కాబట్టి, మీరు ఆర్గానిక్ మరియు స్వచ్ఛమైన కొబ్బరి నూనెను కొనడానికే ప్రాధాన్యతనివ్వండి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్ ను నిర్మూలించడానికి తోడ్పడుతుంది. కొంతమంది హెల్త్ ప్రొఫెషనల్స్ ప్రకారం, శుభ్రమైన టంపాన్ ను కొంత కొబ్బరి నూనెలో నానబెట్టి దాన్ని వెజీనాలో ప్రవేశపెడితే మెరుగైన ఫలితం లభిస్తుంది.

ఆపిల్ సిడర్ వినేగార్:

ఆపిల్ సిడర్ వినేగార్:

మీ బాత్ టబ్ లో కొంత గోరువెచ్చటి నీటిని మరియు అర కప్పు ఆపిల్ సిడర్ వినేగార్ ను జోడించండి. ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచండి. ఈ నీటితో స్నానం చేయండి. తద్వారా, డేంజరస్ మైక్రో ఆర్గనిజమ్స్ నశిస్తాయి. అయితే, కొంతమంది వినేగార్ డౌచింగ్ ను సజెస్ట్ చేస్తారు. దీని ద్వారా బాక్టీరియాను ఫ్లష్ చేయవచ్చు.

అందువలన, వెజీనల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ సమస్య నుంచి ఉపశమనం కోసం వెచ్చటి ఆపిల్ సిడర్ వినేగార్ బాత్ కు ప్రాధాన్యతనివ్వాలి.

విటమిన్ సి:

విటమిన్ సి:

రోగనిరోధక శక్తి మెరుగ్గా ఉండడమంటే శరీరం త్వరగా కోలుకోవటమని అర్థం. విటమిన్ సి డొసేజ్ తగిన మోతాదులో శరీరానికి అందితే రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. విటమిన్ సి అనేది పేరుపొందిన ఇమ్మ్యూనిటీ బూస్టర్. ఇందులో యాంటీ మైక్రోబయల్ కాంపోనెంట్స్ లభిస్తాయి. ఇవి కాండిడా ఓవర్ గ్రోత్ ను అరికడతాయి. విటమిన్ సి ని తగిన మోతాదులో తీసుకోవడానికి ప్రాధాన్యతనివ్వండి. తద్వారా, శరీరంలోని ఇమ్యూనిటీని పెంపొందించుకుని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ను అరికట్టవచ్చు.

వెల్లుల్లి:

వెల్లుల్లి:

వెల్లుల్లి లో కాండిడాను అరికట్టే అద్భుతమైన సుగుణాలు కలవు. మీ డైలీ డైట్ లో వెల్లుల్లిని తగినంత తీసుకోండి. తద్వారా, వెజీనల్ ఇన్ఫెక్షన్స్ ను దూరంగా ఉంచవచ్చు.

English summary

10 Natural Remedies To Treat Vaginal Fungal Infection

Overgrowth of Candida albicans, a fungus found in the vagina causes vaginal fungal infection which is very common amongst women. This infection causes irritation, painful discharge, inflammation & itching. Combat it naturally with the help of boric acid, probiotic supplements, tea tree oil, hydrogen peroxide, Greek yogurt,
Story first published:Monday, July 23, 2018, 13:11 [IST]
Desktop Bottom Promotion