For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వెన్నుపట్టేసే నొప్పి నుండి ఉపశమనానికి 10 సింపుల్ ఇంటిచిట్కాలు

|

వీపులోని కండరాలు సంకోచించి వ్యాకోచిస్తున్నప్పుడు ఏమన్నా ఇబ్బంది కలిగితే, వెన్ను పట్టేస్తుంది లేదా నెప్పి చేస్తుంది. చాలామటుకు వెన్నునొప్పి కిందవైపు నడుం దగ్గరే వస్తుంటాయి. ఈ నొప్పి ఏదన్నా భారీ వస్తువులు ఎత్తడం, సడెన్ గా నిద్రలేవటం, జెర్క్ తో కదలటం,ఉన్నట్టుండి మంచం దిగటం వంటి వాటివల్ల వస్తుంది.

ఇతర కారణాలు స్థూలకాయం, శరీరాకృతి సమంగా లేకపోవటం, నీరు తగినంత లేకపోవటం, ఎలక్ట్రోలైట్లు తగ్గిపోవటం, సరైన స్థితుల్లో పడుకోకపోవటం, నిటారుగా కూర్చుని, నిల్చోలేకపోవటం వంటివి. వెన్నెముకకి ఏమైనా గాయం, దెబ్బ వలన కూడా ఇది రావచ్చు.

10 Simple Home Remedies For Back Spasms

చాలామటుకు వెన్నుపట్టేసే సమస్యలు మీ రోజువారీ పనులకి ఆటంకంగా ఉండేంత నొప్పి పెడతాయి. ఉపశమనం కోసం మీరు కొన్ని సింపుల్ ఇంటి చిట్కాలు ప్రయత్నించవచ్చు, నొప్పి చాలా ఎక్కువగా ఉంటే, డాక్టర్ దగ్గరకి తప్పక వెళ్ళండి.

వెన్ను పట్టేయడం వంటివి వెంటనే ఆ సమయంలో నయం చేయకపోతే, అది మీ వెన్నెముకపై ప్రభావం చూపించి పరిస్థితి తీవ్రంగా మారవచ్చు.

ఇంట్లోనే సహజ చిట్కాలతో వెన్నుపట్టేసే సమస్య నుండి ఎలా విముక్తి పొందవచ్చో తెలుసుకోడానికి చదవండి.

1.సరిపోయేంత విశ్రాంతి తీసుకోండి

1.సరిపోయేంత విశ్రాంతి తీసుకోండి

మీకు వెన్ను పట్టేసినట్టు అన్పించగానే, వెంటనే మీ వీపుకి విశ్రాంతినివ్వండి. మీరు కదులుతూనే ఉంటే, అది నొప్పిని మరింత పెంచవచ్చు.

వెల్లకిలా నిటారుగా కదలకుండా పడుకోండి.

దిండును మీ కాళ్ళ కింద పెట్టుకుని వెన్నెముకపై వత్తిడిని తగ్గించండి.

2.తేమ ఉన్న వెచ్చదనాన్ని అందించండి

2.తేమ ఉన్న వెచ్చదనాన్ని అందించండి

నొప్పి ఉన్నచోట మొదటి 72 గంటల పాటు తేమ ఉండే వేడిని అందేలా చూడండి. ఇలా చేయటం వలన వెన్ను నొప్పి నుండి ఉపశమనం కలిగి, రక్తప్రసరణ కూడా పెరుగుతుంది.

ఒక తువ్వాలును గోరువెచ్చని నీటిలో ముంచి పిండండి.

ఈ తువ్వాలును నొప్పి ఉన్నచోట 10 నిమిషాలు ఉంచండి.

రోజులో ఇలా చాలాసార్లు చేయండి.

3.చల్లని కాపడం

3.చల్లని కాపడం

మీకు ఎప్పుడైనా వెన్నునొప్పి వచ్చినపుడు, ఐస్ ప్యాక్ కాపడం పెట్టుకోండి. ఇది బెణుకులకి, గాయాలకి కూడా మంచిదే. చల్లదనం వాపును తగ్గిస్తుంది, అది నొప్పిని కూడా త్వరగా నెమ్మదింపచేస్తుంది.

కొన్ని ఐస్ క్యూబ్ లను తువ్వాలుతో చుట్టండి.

దాన్ని నొప్పి ఉన్నచోట 15 నిమిషాలు ఉంచండి.

ఈ పద్ధతినే ప్రతి గంటకి ఒకసారి పాటించండి.

4.పచ్చని ఆవాల గింజలను తినండి

4.పచ్చని ఆవాల గింజలను తినండి

పసుపుపచ్చని ఆవాల గింజలను తినటం వలన మీ నోట్లోని నాడులపై అవి ప్రభావం చూపిస్తాయి.అవి వెన్నునొప్పిని కలిగించే నాడులను నియంత్రిస్తాయి.

1 చెంచా పసుపుపచ్చని ఆవగింజలను తిని వెన్నునొప్పి నుండి ఉపశమనం పొందండి.

5.మసాజ్

5.మసాజ్

నొప్పి ఉన్నచోట సింపుల్ గా నెమ్మదిగా మసాజ్ చేస్తే చాలు, వెన్నునొప్పి తగ్గుతుంది. మసాజ్ చేయటం వలన రక్తప్రసరణ పెరుగుతుంది.

గోరువెచ్చని కొబ్బరి నూనె, ఆలివ్ నూనెను కలిపి నొప్పి ఉన్నచోట పట్టించండి.

ఆ ప్రదేశాన్ని నెమ్మదిగా 10 నిమిషాల పాటు మసాజ్ చేయండి.

రోజులో ఇలా చాలాసార్లు చేయండి.

6.ఎండు క్యాప్సికం కారం పొడి

6.ఎండు క్యాప్సికం కారం పొడి

ఎండు క్యాప్సికంలో కాప్సాయిసిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది బాధను తగ్గించే, ఇంకా వాపును తగ్గించే లక్షణాలను కలిగి వుండి, వెన్నునొప్పి నుంచి ఉపశమనం అందిస్తుంది.

½ చెంచా ఎండు క్యాప్సికం కారంపొడి, 1 చెంచా గోరువెచ్చని ఆలివ్ నూనెను కలపండి.

ఈ మిశ్రమాన్ని సమస్య ఉన్నచోట రాయండి.

30 నిమిషాల తర్వాత కడిగేయండి.

7.చామంతి

7.చామంతి

ఆయుర్వేద మొక్క అయిన చామంతిలో వాపు వ్యతిరేక లక్షణాలుండే ఫ్లేవనాయిడ్లు ఎక్కువగా ఉండి, వెన్ను పట్టేయడాన్ని తగ్గిస్తుంది. పట్టేసిన కండరాలకి త్వరగా ఉపశమనం వచ్చేలా చేసి, నొప్పి నుంచి విశ్రాంతిని, ప్రశాంతతని అందిస్తుంది.

కొన్ని చుక్కల చామంతి నూనెను 2 చెంచాల కొబ్బరినూనెతో కలపండి.

నొప్పి ఉన్నచోట దీన్ని రోజుకి 3 సార్లు రాయండి.

8. ఎప్సం సాల్ట్

8. ఎప్సం సాల్ట్

ఎప్సం ఉప్పులో మెగ్నీషియం ఉండి, పట్టేసిన కండరాలకి ఉపశమనం, విశ్రాంతిని ఇస్తుంది. వెన్నునొప్పి వచ్చిన మొదటి 48 గంటల తర్వాత ఎప్సం ఉప్పును వాడండి. 2 చెంచాల ఎప్సం ఉప్పును మీరు స్నానం చేసే నీరులో కలపండి. 20 నిమిషాలు ఆ నీటిలో ఉంటే, మీ నొప్పి తగ్గుతుంది.

9.స్ట్రెచింగ్ వ్యాయామాలు

9.స్ట్రెచింగ్ వ్యాయామాలు

మీ కిందివైపు నడుముపై ఎక్కువ వత్తిడి కలగకుండా బలపడేట్లు చేయటానికి కొన్ని స్ట్రెచింగ్ వ్యాయామాలను నెమ్మదిగా చేయండి.

వెల్లకిలా మంచం మీద పడుకుని మీ చేతులను కిందకి మీ పక్కనే పెట్టుకోండి.

మెల్లగా మీ వీపును కిందవైపుకి నెట్టండి.

ఈ స్థితిలో 12 సెకన్ల పాటు ఉంచండి.

10. హైడ్రేషన్

10. హైడ్రేషన్

శరీరంలో సరిగ్గా ఎలక్ట్రోలైట్ల సమతుల్యం ఉండకపోతే, అది వెన్నుపట్టేయడానికి దారితీస్తుంది. అందుకని మీ శరీరంలో తగినంత నీరు ఉండాలి.

టైం ప్రకారం మంచి నీళ్ళు తాగుతూ ఉండండి.

నీరు ఎక్కువ ఉండే పండ్లు, కూరలను తినండి.


English summary

10 Simple Home Remedies For Back Spasms

Back spasms occur when there are painful contractions or cramps in the muscles of the back. This mostly happens in the lower area of the back. You can try out some simple home remedies to cure back spasms such as massaging, cold compress, stretching your back, eating yellow mustard, etc.
Desktop Bottom Promotion