For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కడుపులో మంటని తగ్గించే 11 ఇంటి సహజ చిట్కాలు

మీకెప్పుడైనా మీ కడుపులో ఒక వింతైన మంటతో బాధపడ్డారా? చాలామందికి ఈ అనుభవం జరుగుతూనే ఉంటుంది మరియు ఇది కడుపులో యాసిడ్ పైకి ఆహారనాళంలోకి ఛాతీ వరకు తన్నటం వలన జరుగుతుంది. ఇది ఛాతీలో,కడుపులో అసౌకర్యం కలిగిస

|

మీకెప్పుడైనా మీ కడుపులో ఒక వింతైన మంటతో బాధపడ్డారా? చాలామందికి ఈ అనుభవం జరుగుతూనే ఉంటుంది మరియు ఇది కడుపులో యాసిడ్ పైకి ఆహారనాళంలోకి ఛాతీ వరకు తన్నటం వలన జరుగుతుంది. ఇది ఛాతీలో,కడుపులో అసౌకర్యం కలిగిస్తుంది.

ఈ కడుపులో మంట గ్యాస్ట్రైటిస్, ఆహార అలర్జీలు, ఇరిటబుల్ బొవెల్ సిండ్రోం, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, అల్సర్ పుండ్లు, పెద్దప్రేవు వ్యాధి వంటివాటి వలన కలుగుతుంది. ఇతర కారణాలు పొగతాగటం, ఊబకాయం, మందులు, మానసిక వత్తిడి, మద్యపానం మరియు సరిగా పోషకాహారం తినకపోవటం వంటివి.

మీకు కడుపులో మంటగా అన్పించినప్పుడు, మీకు గుండెల్లో మంట, గ్యాస్, వికారం లేదా వాంతులు, కడుపు ఉబ్బరం, గొంతు నొప్పి, దగ్గు, ఎక్కిళ్ళు మరియు ఆహారం మింగటంలో సమస్య ఇలాంటి లక్షణాలు ఉంటాయి.

కొన్ని మందుల వలన మీ కడుపులో మంటకి ఉపశమనం లభిస్తుంది, కానీ దాని ప్రక్కన దుష్ప్రభావాలు కూడా ఉంటాయి. కానీ మీరు ఈ కింది ఇంటి సహజచిట్కాలను ప్రయత్నిస్తే మీ కడుపులో మంటకి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

కడుపులో మంటకి సులువుగా ఉపశమనం లభించే ఇంటి చిట్కాల లిస్టును చూడండి.

1.యాపిల్ సిడర్ వెనిగర్

1.యాపిల్ సిడర్ వెనిగర్

ఆపిల్ సిడర్ వెనిగర్ కడుపులో మంటని నయం చేసే మంచి ఇంటిచిట్కాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దానిలోని క్షారగుణ ప్రభావం కడుపులోని యాసిడ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది.

2 చెంచాల పచ్చి యాపిల్ సిడర్ వెనిగర్ ను ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలపండి.

కొంచెం తేనె జతచేసి రోజుకి రెండుసార్లు తాగండి.

2.ఆలోవెరా

2.ఆలోవెరా

ఆలోవెరా కడుపులో మంటను తగ్గించి గుండెల్లో మంటను కూడా తగ్గిస్తుంది. అందులో ఉండే చల్లబర్చే లక్షణాలు గుండెల్లో మంటను, ఇతర లక్షణాలను తగ్గిస్తాయి.

అరకప్పు ఆలోవెరా రసాన్ని భోజనం ముందు తాగండి.

3.పెరుగు

3.పెరుగు

పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ మీ కడుపుకి మంచి ఉపశమనాన్ని అందిస్తాయి. అందులో ఉండే మంచి బ్యాక్టీరియా మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

భోజనం తర్వాత పెరుగును తిని మీ కడుపులో మంటను నయం చేసుకోండి.

4.చల్లని పాలు

4.చల్లని పాలు

చల్లపాలు కడుపులో గ్యాస్ట్రిక్ యాసిడ్స్ ను నియంత్రిస్తాయి. అది కడుపులో మంటను కలిగించే ఎసిడిటీ కడుపులో పెరగకుండా చూసుకుంటాయి.

భోజనం తర్వాత ఒక గ్లాసు చల్లపాలను తాగండి.

5.గ్రీన్ టీ లేదా పెప్పర్ మింట్ టీ

5.గ్రీన్ టీ లేదా పెప్పర్ మింట్ టీ

హెర్బల్ టీలైన గ్రీన్ టీ లేదా పెప్పర్ మింట్ టీ కడుపును శాంతపరుస్తాయి ఎందుకంటే వాటిలో వాపు వ్యతిరేక లక్షణాలు ఉంటాయి.

మీకు నచ్చిన టీ ఎంచుకుని, టీ బ్యాగును వేడినీటి కప్పులో నాననివ్వండి.

హెర్బల్ టీని రోజుకి రెండుసార్లు తాగండి.

6.అల్లం

6.అల్లం

అల్లం ముఖ్యమైన పోషకాలను పీల్చుకుని ఆరోగ్యకరమైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది కడుపులో మంటను తగ్గిస్తుంది.

మీరు ఒక చిన్నముక్క అల్లాన్ని తినవచ్చు లేదా అల్లం టీ తాగవచ్చు.

7.పండ్లు

7.పండ్లు

అరటిపండు, బొప్పాయి మరియు యాపిల్ వంటి పండ్లలో సహజమైన యాంటాసిడ్లు ఉండి, కడుపులో మంటను నయం చేస్తాయి.

మీకు నచ్చిన ఒక పండును తినండి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

8. చామంతి టీ

8. చామంతి టీ

చమోమిలె లేదా చామంతి టీలో చాలా పదార్థాలు కడుపులో మంటకి మంచి ఉపశమనం కలిగేలా చేస్తాయి.

2 చెంచాల ఎండపెట్టిన చామంతి పువ్వులను ఒక కప్పు వేడినీటిలో వేయండి.

5 నిమిషాలు నాననిచ్చి, వడగట్టండి.

కొంచెం తేనె జతచేసి, రోజుకి మూడుసార్లు తాగండి.

9.బాదం

9.బాదం

బాదంపప్పులలో కడుపులో యాసిడ్లను తటస్థం చేసే శక్తి ఉంటుంది, అలా మీ కడుపులో మంటనుంచి మీకు ఉపశమనం కలిగేలా చేస్తాయి.

భోజనం తర్వాత 5-6 బాదంపప్పులు తింటే మీ ప్రేగులకి మంట నుంచి విముక్తి లభిస్తుంది.

10.తులసి

10.తులసి

తులసిలో ఉండే నయం చేసే గుణాలు మరియు చల్లబర్చే లక్షణాలు మీకు మంట నుంచి వెంటనే ఉపశమనం కలిగేలా చేస్తుంది.

తులసి ఆకులను 15 నిమిషాలపాటు ఉడికించి, వడగట్టండి.

కొంచెం తేనె జతచేసి తాగండి.

11. జారిపోయే ఎల్మ్ మొక్క

11. జారిపోయే ఎల్మ్ మొక్క

జారిపోయే ఎల్మ్ కడుపులో మంటకి మంచి ఇంటి సహజ చిట్కా. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వాచిన పేగు లక్షణాలను నయం చేస్తాయి.

1 చెంచా ఈ మొక్క రసాన్ని ఒక కప్పు మరిగే నీటిలో వేసి నాననివ్వండి.

వడగట్టి రోజుకి రెండుసార్లు తాగండి.

English summary

11 Home Remedies For Burning Sensation In Stomach

The burning sensation in the stomach happens due to an acid reflux in the stomach, which comes all the way to the chest. There are medications that can help relieve you from the burning sensation, but it can have side effects. However, one can try out certain home remedies like yogurt, cold milk, ginger, etc., for an immediate relief.
Story first published:Wednesday, February 21, 2018, 12:50 [IST]
Desktop Bottom Promotion