For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మజిల్ వీక్నెస్ ను సహజంగా తగ్గించేందుకు ఉపయోగపడే 12 అద్భుతమైన హోమ్ రెమెడీస్

విపరీతమైన వర్కవుట్ తరువాత లేదా శరీరానికి కొన్ని టాస్క్స్ ని పెర్ఫార్మ్ చేయడానికి తగిన శక్తి లేకపోవడం వలన మజిల్ వీక్ నెస్ అనే మజిల్ డిజార్డర్ ఏర్పడుతుంది. మజిల్ వీక్ నెస్ లేదా మజిల్ స్ట్రెంత్ బలహీనపడటం

|

విపరీతమైన వర్కవుట్ తరువాత లేదా శరీరానికి కొన్ని టాస్క్స్ ని పెర్ఫార్మ్ చేయడానికి తగిన శక్తి లేకపోవడం వలన మజిల్ వీక్ నెస్ అనే మజిల్ డిజార్డర్ ఏర్పడుతుంది. మజిల్ వీక్ నెస్ లేదా మజిల్ స్ట్రెంత్ బలహీనపడటం అనేది శరీరంలోని మజిల్ మూవ్మెంట్ లేదా కాంట్రాక్షన్ సరిగ్గా లేకపోవడం వలన సంభవిస్తుంది.

మజిల్స్ మధ్య కో ఆర్డినేషన్ లోపం తలెత్తడం, మజిల్ కుదింపులు ఏర్పడటం, తరచూ పడిపోతున్నట్టు, గుచ్చుకున్నట్టు అనిపించడం అలాగే మజిల్స్ అదరడం వంటివి మజిల్ వీక్నెస్ కి సంబంధించిన కొన్ని లక్షణాలు.

ఇది, రాను రాను దీర్ఘకాల మజిల్ వీక్నెస్ కి దారితీస్తుంది. అలాగే, మజిల్ వీక్నెస్ కలిగేందుకు ఇతర హెల్త్ కండిషన్స్ కూడా తమవంతు పాత్ర పోషిస్తాయి. వాటిని సరైన సమయంలో ట్రీట్ చేయనప్పుడు, మజిల్స్ క్షీణించి దెబ్బతినడం ప్రారంభిస్తాయి.

అదృష్టవశాత్తూ, మజిల్ వీక్నెస్ ని క్యూర్ చేసేందుకు కొన్ని మెడికేషన్స్ పనిచేస్తాయి. అయితే, కొన్ని హోంరెమెడీస్ ని పాటించడం ద్వారా మజిల్ వీక్నెస్ ను త్వరగా ఇంటివద్దే క్యూర్ చేసుకోవచ్చు.

మజిల్ వీక్నెస్ ను తగ్గించే సులభమైన హోమ్ రెమెడీస్ ని పరిశీలించండి మరి.

1. పాలు మరియు లికోరైస్ తో హనీ

1. పాలు మరియు లికోరైస్ తో హనీ

ఈ రెమెడీ మజిల్ వీక్నెస్ ను తగ్గించేందుకు అమితంగా తోడ్పడుతుంది. తద్వారా, ఫ్యాటిగ్ సమస్యను కూడా నిర్మూలిస్తుంది.

రెండు టేబుల్ స్పూన్ల హనీ ని ఒక టేబుల్ స్పూన్ లికోరైస్ ని కలిపి ఈ మిశ్రమాన్ని గ్లాసుడు వెచ్చని పాలలో కలపాలి.

ఈ మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు తీసుకోవాలి.

2. ఆయిల్ మసాజ్:

2. ఆయిల్ మసాజ్:

క్రమం తప్పకుండా ఆయిల్ మసాజ్ ను చేయడం ద్వారా మజిల్ వీక్నెస్ ను తగ్గించుకోవచ్చు. ఇది మజిల్స్ ను రిలాక్స్ చేయడానికి ఉపయోగపడటంతో పాటు మజిల్స్ ని బలపరచడానికి కూడా ఉపయోగపడుతుంది.

వెచ్చటి మస్టర్డ్ ఆయిల్ ను కొబ్బరి నూనెలో కలిపి ఈ మిశ్రమాన్ని ప్రభావిత ప్రాంతంపై అప్లై చేయాలి. ఈ ప్రదేశాన్ని పదిహేను నిమిషాలపాటు మసాజ్ చేయాలి. ఈ పద్దతిని రోజుకు కొన్ని సార్లు పాటించాలి.

3. ఎప్సమ్ సాల్ట్:

3. ఎప్సమ్ సాల్ట్:

మెగ్నీషియం అనేది ఎప్సమ్ సాల్ట్ లో అధికంగా లభిస్తుంది. ఇది శరీరంలోని మెగ్నీషియం లెవెల్స్ ని పెంపొందించేందుకు తోడ్పడుతుంది. తద్వారా, మజిల్ వీక్నెస్ ను తగ్గిస్తుంది.

రెండు కప్పుల ఎప్సమ్ సాల్ట్ ను మీ బాత్ వాటర్ లో జోడించి ఆ నీటితో 20 నిమిషాల పాటు స్నానం చేస్తే తగిన ఫలితం లభిస్తుంది. ఈ రెమెడీని వారానికి ఒకసారి పాటించాలి.

4. విటమిన్ డి:

4. విటమిన్ డి:

దృఢమైన ఎముకల కోసం విటమిన్ డి అత్యవసర పడుతుంది. ఇది మజిల్ వీక్నెస్ ను కూడా క్యూర్ చేస్తుంది. ఈ విటమిన్ లోపం వలన మజిల్ వీక్నెస్ ఏర్పడుతుంది.

ఉదయపు ఎండ శరీరానికి కనీసం 15 నిమిషాల పాటు తగిలేలా జాగ్రత్త వహించండి. విటమిన్ డి రిచ్ ఫుడ్స్ అయినా ఆరెంజ్, మ్యాకేరిల్, సాల్మన్లను ఎక్కువగా తీసుకోండి.

5. ఉసిరికాయ:

5. ఉసిరికాయ:

ఉసిరికాయ లేదా ఆమ్లాలో ఔషధ గుణాలు అధికం. ఇవి మజిల్ వీక్నెస్ ను తగ్గిస్తాయి.

ఉసిరికాయను పచ్చిగా తీసుకోవచ్చు లేదా తేనెతో కలిపి తీసుకోవడం వలన ఉసిరిలోని యాసిడిక్ ఫ్లేవర్ తగ్గుతుంది.

6. అరటిపండ్లు

6. అరటిపండ్లు

అరటిపండులో పొటాషియంతో పాటు మజిల్స్ ఆరోగ్యాన్ని పెంపొందించే వివిధ ఎసెన్షియల్ మినరల్స్ కలవు. పొటాషియం అనేది మజిల్స్ ని దృఢంగా ఉంచేందుకు తోడ్పడుతుంది. అందుకే, అరటిపండ్లను రెగ్యులర్ గా తీసుకోవాలి.

రెండు బాగా పండిన అరటిపండ్లను తేనెతో కలిపి తీసుకోవాలి.

బనానా మిల్క్ షేక్ ను తీసుకున్నా మంచిదే.

7. వ్యాయామం

7. వ్యాయామం

మజిల్ వీక్నెస్ ను క్యూర్ చేసేందుకు వ్యాయామమనేది బెస్ట్ ఎక్సర్సైజ్ గా పనికొస్తుంది. వాకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్ లేదా బైకింగ్ ని 30 నిమిషాల పాటు చేయడం వలన వీక్ మజిల్స్ బలపడతాయి. 30 నిమిషాలపాటు ఎక్సర్సైజ్ చేయడం మంచిది.

8. ఎగ్స్

8. ఎగ్స్

మజిల్ వీక్నెస్ పై అలాగే అలసటపై పోరాడేందుకు ఎగ్స్ అనేవి విపరీతంగా ఉపయోగపడతాయి. వీటిలోనుండే ప్రోటీన్ అనేది మజిల్స్ ని బిల్డ్ చేయడానికి అలాగే వాటిని రిపెయిర్ చేయడానికి ఉపయోగపడుతుంది. బ్రేక్ఫాస్ట్ లో రోజూ 2 ఎగ్స్ ని తీసుకోవడం మంచిది.

9. పాలు

9. పాలు

మజిల్ వీక్నెస్ పై పోరాటం సాగించేందుకు పాలు అమితంగా ఉపయోగపడతాయి. ఇందులో నుండే కేల్షియం ఎముకలను అలాగే మజిల్స్ ని బిల్డ్ చేసేందుకు తోడ్పడుతుంది. రోజూ ఒకటి లేదా రెండు గ్లాసుల పాలు తాగడం మంచిది.

10. పొటాటో

10. పొటాటో

మజిల్ వీక్నెస్ ను ట్రీట్ చేసేందుకు పొటాటో అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుంది. ఇందులో లభించే పొటాషియం వలన మజిల్స్ బలపడతాయి. కొన్ని పొటాటోలను నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఆ తరువాత వాటి జ్యూస్ ని మరుసటి ఉదయాన్నే తీసుకోవాలి.

11. మంచినీళ్లను తీసుకోవాలి:

11. మంచినీళ్లను తీసుకోవాలి:

మజిల్ వీక్నెస్ అనేది డీహైడ్రేషన్ వలన కూడా కలుగుతుంది. మంచినీళ్లను తీసుకోవడం ద్వారా మజిల్స్ బలపడతాయి. తద్వారా మజిల్స్ బలహీనత తగ్గుతుంది.

12. రోజూ 10 గ్లాసుల నీళ్లను తీసుకోవాలి.

12. రోజూ 10 గ్లాసుల నీళ్లను తీసుకోవాలి.

అలాగే ఎక్కువ పండ్లను తీసుకోవాలి. వాటర్ మెలన్, కుకుంబర్ మరియు కోకోనట్ పండ్లలో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని ప్రిఫర్ చేయాలి.

English summary

12 Home Remedies To Cure Muscle Weakness Naturally

Muscle weakness is a common muscle disorder that mostly occurs after an intense workout or when your body doesn't have enough strength to perform tasks. Muscle weakness or reduced muscle strength happens when your body isn't able to produce muscle movement or contraction.
Story first published:Saturday, February 17, 2018, 17:57 [IST]
Desktop Bottom Promotion