For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2018- ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాలు

ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవం 2018- ఊపిరితిత్తుల క్యాన్సర్ సంకేతాలు మరియు లక్షణాలు

|

ప్రతి సంవత్సరం, ఆగస్టు 1 వ తేదీని, ప్రపంచ ఊపిరితిత్తుల క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క ప్రభావం గురించి అవగాహన పెంచడమే ఈ రోజు యొక్క ఉద్దేశం. ఈ రోజున ఊపిరితిత్తుల క్యాన్సర్ వలన బాధపడుతున్న వ్యక్తులను సంస్మరించుకుని, వారికి మన మద్దతును ప్రకటించడమే ఈ రోజు యొక్క లక్ష్యం. గడచిన ఐదు సంవత్సరాలను తరచి చూస్తే, ఈ వ్యాధిని జయించి, మనుగడలో ఉన్న వారి శాతం అతి తక్కువగా ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు తలెత్తిన క్యాన్సర్ మరణాలలో అతిపెద్ద భాగం ఊపిరితిత్తుల క్యాన్సరుదే! ఇది ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 7.6 మిలియన్ల మంది ప్రాణాలను హరిస్తుంది. ది ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ ది స్టడీ ఆఫ్ లంగ్ క్యాన్సర్ (IASLC) వారి అధ్యయనం ప్రకారం, రొమ్ము, పెద్దప్రేగు మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లన్నింటి ప్రభావం వలన మరణించిన వారి కంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ వలన ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్యే అధికం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదు క్యాన్సర్ మరణాల్లో దాదాపుగా ఒకటి ఊపిరితిత్తుల క్యాన్సర్ వలనే అని అంచనా వేయబడింది.

2018 World Lung Cancer Day: Twelve warning signs and symptoms of lung cancer

ఊపిరితిత్తుల క్యాన్సర్ అనేది మన ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒక రకమైన క్యాన్సర్. ఊపిరితిత్తుల క్యాన్సర్ కు ధూమపానం ప్రధాన కారణం. అయితే, ఇది ధూమపానం అలవాటు లేనివారిలో కూడా సంభవించవచ్చు. భారతదేశంలో ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధి సోకడానికి, ముఖ్యంగా చిన్న వయసు వారికి, వాయు కాలుష్యం ప్రధాన కారణమని ఒక అధ్యయనం వెల్లడించింది.

ఢిల్లీలోని సర్ గంగా రామ్ హాస్పిటల్ (SGRH), , లంగ్ కేర్ ఫౌండేషన్తో కలిసి నిర్వహించిన అధ్యయనంలో, భారతదేశంలోని 50 శాతం ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగులకు ధూమపానం అలవాటు లేదు. అంతేకాక, నివేదికలో అధ్యయనం చేయబడిన రోగుల్లో, 30 శాతం మందిని ముందుగా పొరపాటున, క్షయవ్యాధిగ్రస్థులుగా నిర్ధారించి, క్యాన్సర్ చికిత్స ప్రారంభించటానికి ముందు చాలా నెలలు పాటు క్షయవ్యాధికి చికిత్సను అందించినట్టు వెల్లడించింది.

ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి? ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలను ఎలా గుర్తుపట్టాలి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ అంటే ఏమిటి? ఊపిరితిత్తుల క్యాన్సర్ అభివృద్ధి చెందుతుందనే సంకేతాలను ఎలా గుర్తుపట్టాలి?

అన్ని క్యాన్సర్ల వలె, ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా, మన శరీరం యొక్క ప్రాధమిక విభాగం అయిన కణంలో తలెత్తిన అసాధారణత యొక్క ఫలితమే! ఈ అసాధారణ కణాలు వేగంగా విభజన చెంది కణితులను ఏర్పరుస్తాయి. ఇవి నిరపాయకరమైనవైనా లేదా అపాయకరమైనవైనా కావచ్చు. అంతేకాకుండా, శరీరంలో ఇతర భాగాలలో ఏర్పడిన ప్రాణాంతక కణితుల యొక్క మెటాస్టాసిస్ కు ఊపిరితిత్తుల సాధారణంగా అనుకూలమైనవి. ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు, ఒక వ్యక్తి నుండి మరో వ్యక్తికి మారవచ్చు . పైగా ఈ లక్షణాలు సాధారణంగా, వ్యాధి పురోగమించినప్పుడు మాత్రమే బయటపడతాయి.

ఊపిరితిత్తుల క్యాన్సర్ వలన ఈ క్రింది లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి:

ఊపిరితిత్తుల క్యాన్సర్ వలన ఈ క్రింది లక్షణాలు సాధారణంగా కనిపిస్తాయి:

ఎంతకీ తగ్గని దగ్గు మరియు సమయం గడుస్తున్న కొద్దీ దగ్గు తీవ్రత పెరగడం.

దగ్గుతున్నప్పుడు రక్తం కక్కడం.

దగ్గుతున్నప్పుడు రక్తం కక్కడం.

దగ్గుతున్నప్పుడు రక్తం కక్కడం. ఇవి లంగ్ క్యాన్సర్ కు సాధారణ లక్షణాలు

 స్థిరంగా ఛాతీలో నొప్పి కలగడం

స్థిరంగా ఛాతీలో నొప్పి కలగడం

ఊపిరితిత్తుల లక్షణాలో గుర్తించుకోవల్సని మరో లక్షణం స్థిరంగా ఛాతీలో నొప్పి కలగడం

శ్వాస అందకపోవడం

శ్వాస అందకపోవడం

ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉన్నవారిలో శ్వాస సరిగాఅందకపోవడం జరుగుతుంది.

గురక

గురక

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో ఆశ్చర్యం కలిగించే లక్షణం మరొకటి గురక

గొంతు బొంగురుపోవడం

గొంతు బొంగురుపోవడం

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలలో మరొకటి గొంతు బొంగురుపోవడం

ఎముకల్లో నొప్పి

ఎముకల్లో నొప్పి

లంగ్ క్యాన్సర్ లక్షణాలో ఒకట ఎముకల్లో నొప్పి, తరచూ ఎముకల్లో నొప్పి కలగడం

తలనొప్పి

తలనొప్పి

ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాల్లో మరొకటి తరచూ తలనొప్పికి గురి అవుతుండటం

మెడ మరియు ముఖం వాపు

మెడ మరియు ముఖం వాపు

ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వారిలో మెడ మరియు ముఖం వాపు లక్షణాలు కనబడుతాయి

అతిగా బరువు కోల్పోవడం

అతిగా బరువు కోల్పోవడం

లంగ్ క్యాన్సర్ తో బాధపడే వారు అకస్మాత్త్ గా అతిగా బరువు కోల్పోవడం జరుగుతుంది

శారీరక అలసట

శారీరక అలసట

లంగ్ క్యాన్సర్ తో బాధపడే వారు తరచూ అలసటకు గురి అవుతుంటారు

. మునివేళ్ళ వాపు

. మునివేళ్ళ వాపు

ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడే వారిలో కాళ్ళు మరియు చేతుల యొక్క మునివేళ్ళ వాపు వస్తుంటాయి.

వీటిలోని ఏవైనా సంకేతాలు లేదా లక్షణాలు, నిరంతరంగా మిమ్మల్ని ఆందోళనకు గురిచేస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు డాక్టర్ను సంప్రదించాలి.

మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిరోధించవచ్చా?

మీరు ఊపిరితిత్తుల క్యాన్సర్ ను నిరోధించవచ్చా?

ఊపిరితిత్తుల క్యాన్సర్ నిరోధించడానికి ఖచ్చితమైన మార్గం ఇది లేకపోయినప్పటికి, మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీని ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

అవి -

అవి -

1. ధూమపానం మానేయడం

2. పొగను పీల్చకుండా తప్పించుకోవడం

3. ఆస్బెస్టాస్ మరియు ఇతర కార్సినోజెన్లకు దూరంగా ఉండటం

4. వివిధ రకాల పండ్లు మరియు కూరగాయలు కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం

5. వ్యాయామం చేస్తూ శారీరకంగా చురుకుగా ఉండటం

ధూమపానం చేయని వ్యక్తులలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్ కూడా సంభవించవచ్చు.

పొగకు దూరంగా ఉండటం, వ్యాధి అభివృద్ధిని నివారించడానికి మీరు పాటించవలసిన అత్యంత ముఖ్యమైన నివారణ.

English summary

2018 World Lung Cancer Day: Twelve warning signs and symptoms of lung cancer

How would you know that you are developing signs of lung cancer?Like all cancers, lung cancer results from an abnormality in the body's basic unit of life, the cell - usually in the cells that line the passages. The abnormal cells divide rapidly and form tumours, which can be benign or malignant. Also, the lung is a very common site for metastasis from malignant tumours in other parts of the body.The signs and symptoms of lung cancer can vary and usually occur only when the disease is advanced. Common symptoms of lung cancer may include:
Desktop Bottom Promotion