For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిప్రెషన్ వల్ల కలిగే 7 ఆరోగ్య సమస్యలు !

దేశంలోని 12 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య సర్వేను - బెంగుళూరులో ఉన్న "నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్" ద్వారా నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, భారతదేశంల

|

డిప్రెషన్ అనేది మెదడుకు సంబంధించిన రుగ్మత, ఇది భారతదేశం మొత్తం జనాభాలో 4.5 శాతం మంది డిప్రెషన్కు గురవుతుంటాయి. ఈ ఆర్టికల్లో, డిప్రెషన్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి మనము చర్చించుకుంటాం !

దేశంలోని 12 రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం జాతీయ మానసిక ఆరోగ్య సర్వేను - బెంగుళూరులో ఉన్న "నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్" ద్వారా నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం, భారతదేశంలో డిప్రెషన్ బారిన పడిన ప్రజలు మొత్తం జనాభాలో 2.7 శాతంగా ఉన్నారని అంచనా వేయబడింది.

డిప్రెషన్ అనేది తరచుగా బాధపడటం వంటి గందరగోళ పరిస్థితులకి చెందినదని అందరూ అనుకుంటారు కానీ, అది కాదు. డిప్రెషన్ అనేది అతిశయోక్తితో కూడిన బాధను వ్యక్తపరిచే క్లిష్టమైన సంక్లిష్ట రూపం. డిప్రెషన్ అనేది, అంతర్లీనముగా ఉన్న దుఃఖం నుంచి మొదలవుతుంది, కానీ 2-3 రోజుల నుంచి అదే పరిస్థితి కొనసాగితే ఆందోళనకరమైనదని మనము భావించాలి.

10 Health Problems Caused By Depression

ఈ డిప్రెషన్కు కారణమైనవి ఏమిటి ? తగాదాలు, వివాదాలు, మరణం, కొన్ని మందుల ప్రభావం, జన్యుపరమైన అంశాలు, తీవ్రమైన అనారోగ్యం వంటి కొన్ని కారణాలు కాగలవు. డిప్రెషన్ను బయట పెట్టే అత్యంత సాధారణ లక్షణాలు - దీర్ఘకాలంగా అలసటతో ఉండటం, సెక్స్లో ఆసక్తి లేకపోవటం, ఆకలి మందగించడం, నిద్రలేమి, ఎక్కువగా ఏడవటం, సరిగ్గా తినలేకపోవడం, మీ గూర్చి మీరే జాగ్రత్తలు తీసుకోకపోవడం (లేదా) ఏమి సాధించిన సంతోషంగా లేకపోవడం వంటి కొన్ని లక్షణాలను మీరు కలిగి ఉంటారు.

డిప్రెషన్, శారీరక అనారోగ్యమును & అనేక వ్యాధుల ప్రబలమవ్వడానికి & ఇతర అనారోగ్యముల బారిన పడే ప్రమాదాలను పెంచుతుంది. డిప్రెషన్ వలన కలిగే అనారోగ్య సమస్యలను గూర్చి మనము ఇప్పుడు చూద్దాం.

క్యాన్సర్ :

క్యాన్సర్ :

మీరు క్యాన్సర్ను కలిగి ఉన్నప్పుడు చాలా విచారంతో, కోపంతో (లేదా) దిగులుతో బాధపడతారు. కానీ 'క్లినికల్ డిప్రెషన్' అనేది క్యాన్సర్ రోగులలో ముఖ్యంగా, జీర్ణశయాంతర క్యాన్సర్లతో బాధపడుతున్న (ఇది కడుపు / ప్యాంక్రియాస్ను ప్రభావితం చేస్తుంది) వారిలో ఇది చాలా సాధారణంగా కనిపిస్తుంది, అలాంటి వారిలో డిప్రెషన్ను పెంచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తరచుగా ఎందుకు ఇలా జరుగుతుందో ఆరోగ్య నిపుణులు ఖచ్చితంగా తెలియదు, కానీ వివిధ సిద్ధాంతాలు మాత్రం రోగనిరోధక వ్యవస్థలోనూ & జన్యుపరమైన మార్పులను మాత్రం సూచించాయి.

దీర్ఘకాలిక నొప్పులు :

దీర్ఘకాలిక నొప్పులు :

కీళ్ళనొప్పులు, పార్శ్వపు నొప్పి, వెన్నునొప్పి (లేదా) డిప్రెషన్ వంటి పరిస్థితుల వల్ల ఈ దీర్ఘకాలిక నొప్పులు ఏర్పడవచ్చు. ఈ నొప్పులు మానసికమైన మార్పులు తాపజనకమైన గుర్తుల అనుసంధానమును కలిగి ఉండటం వల్ల డిప్రెషన్కు దారితీస్తుంది. ఉదాహరణకు:- ఫైబ్రోమైయాల్జియా ఉన్న వ్యక్తులు సగటు వ్యక్తి కంటే డిప్రెషన్ను కలిగివుండే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువ.

థైరాయిడ్ సమస్యలు :

థైరాయిడ్ సమస్యలు :

ఒక వ్యక్తిలో ఉండే థైరాయిడ్ గ్రంధి, వారి శరీర జీవక్రియను నియంత్రించడంలో పూర్తి బాధ్యతను వహిస్తుంది. హైపర్ థైరాయిడిజం & హైపోథైరాయిడిజం డిప్రెషన్కు దారితీస్తుంది, అయితే మీరు తక్కువ థైరాయిడ్ స్థాయిలను కలిగి ఉన్నప్పుడు ఇలా జరగడమనేది సర్వసాధారణం. థైరాయిడ్ను కలిగి ఉన్న వారిలో జుట్టు రాలిపోవటం, బరువు పెరగడం / కోల్పోవడం, అలసట & జలుబును వంటి లక్షణాలను కలిగి ఉంటారు.

డయాబెటిస్ :

డయాబెటిస్ :

డిప్రెషన్, టైపు 1 డయాబెటిస్ & టైపు 2 డయాబెటిస్ వంటి వివిధ రకాలు ఒకదానితో ఒకటి సంబంధమును కలిగి ఉండవచ్చు. డయాబెటిస్ రోగులు తరచుగా మానసిక మార్పులతో తరచుగా బాధపడుతుంటారు అలాగే, డిప్రెషన్ను కలిగి ఉండటం వల్ల వీరు మందులను తీసుకోవడం, మంచి ఆహారాలను తినడం వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను వదిలేయడం వల్ల డయాబెటిస్ను మరింత అధ్వాన్నంగా చేస్తుంది. డిప్రెషన్ & డయాబెటిస్లు రెండూ ఒకే రకమైన మార్గాలను కలిగి ఉండటం వల్ల ఈ వ్యాధిగ్రస్తులలో మానసికమైన, హార్మోన్లపరమైన, అలాగే రోగనిరోధకతలోనూ పెద్ద మార్పులు రావచ్చు.

గుండె జబ్బులు :

గుండె జబ్బులు :

గుండె జబ్బులు ఉన్న ప్రజలు తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం, డిప్రెషన్తో హార్ట్-ఎటాక్ సమస్యను ఎదుర్కొంటున్న వారు 33% మంది ఉన్నారు. డిప్రెషన్ ను కలిగిన వ్యక్తులలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ డిప్రెషన్ వల్ల మీరు సరిగ్గా తినడానికి, వ్యాయామం చేయడానికి (లేదా) మందులను వినియోగించడాన్ని మరింత కష్టతరం చేస్తుంది.

హెచ్.ఐ.వి (HIV) :

హెచ్.ఐ.వి (HIV) :

హెచ్.ఐ.వి / ఎయిడ్స్ వంటి వ్యాధులను కలిగి ఉన్నవారు కూడా డిప్రెషన్ బారిన పడుతున్నారు. అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ తెలిపిన వివరాల ప్రకారం, హెచ్.ఐ.వి (HIV) వైరస్ మెదడును నేరుగా నాశనం చేస్తుంది, ఇది డిప్రెషన్ (లేదా) హెచ్.ఐ.వి డిమెన్షియాకు దారితీస్తుంది. మీరు హెచ్.ఐ.వి (HIV) / ఎయిడ్స్ (AIDS) లను కలిగి ఉంటే, మీరు ఖచ్చితంగా డిప్రెషన్ స్క్రీనింగ్ పొందాలి.

ఇన్ఫెక్షన్లు :

ఇన్ఫెక్షన్లు :

ఇన్ఫ్లుఎంజా, హెర్పెస్ & హెపటైటిస్-సి వంటి అనేక ఇన్ఫెక్షన్లు డిప్రెషన్తో ముడిపడివుంటాయి. క్షయగా పిలవబడే మరొక ఇన్ఫెక్షన్ కొన్ని యాంటిడిప్రెసెంట్ల అభివృద్ధికి సంబంధించి బాధ్యతను కలిగి ఉంటుంది. ఇన్ఫ్లమేటరీలో వచ్చే మార్పులు ఇలాంటి సాధారణమైన సంబంధాన్ని కలిగి ఉంటుందని, నిపుణులు చెబుతున్నారు.

English summary

7 Health Problems Caused By Depression

Depression is often confused as sadness, but it's not. Depression is more exaggerated and a complex form of sadness. Depression starts from an underlying period of sadness, but the situation should be deemed alarming if it continues for more than 2 to 3 days. The health problems caused by depression are infections, HIV/AIDS, cancer, chronic pain, diabetes, etc.
Desktop Bottom Promotion