For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 7 హెచ్చరికలు కిడ్నీ వైఫల్యానికి సంకేతాలు, అమ్మాయిలు జాగ్రత్త ఉండాలి మరి

తగ్గిన రక్త సరఫరా, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం లేదా కొన్ని మందులవిషపూరిత ప్రభావం (ఇబుప్రోఫెన్ మరియు నాప్రాక్సెన్, జెంటామైసిన్ లేదా లిథియం యొక్క అధిక మోతాదుల ఫలితంగా) కిడ్నీ వైఫల్యం సంభవించవచ్చు.

|

మీ మూత్రపిండాలు సహజ సిద్దమైన ఫిల్టర్లుగా పనిచేస్తాయి, మరియు శరీరంలోని వ్యర్థాలను మరియు అధిక ద్రవాన్ని తొలగిస్తాయి. చిక్కుడు గింజ ఆకృతిలో ఉండే ఈ అవయవాలు వెన్నెముకకు ఇరువైపులా వెనుక దిగువభాగంలో ఉంటాయి. ఇవి ప్రధానంగా వడపోత విధానాలను(నెఫ్రాన్స్) కలిగి ఉంటాయి, ఇవి మీ రక్తాన్ని శుభ్రపరచి, మూత్రాన్ని సృష్టించేవిగా ఉంటాయి. దీనికి తోడు, ఎర్ర రక్త కణాల సంయోజనాన్ని ప్రేరేపించే ఎయిరోథ్రోపోయిట్ హార్మోన్లను మూత్రపిండాలు విడుదల చేస్తాయి.

మూత్రపిండాల ద్వారా ఉత్పత్తి చేయబడిన మరో ఇతర రసాయనం రెనిన్, ఇది రక్తపోటు నియంత్రణలో గొప్ప పాత్ర పోషిస్తుంది.

మూత్రపిండాలలో ఏదైనా తప్పు జరిగిన ఎడల, మీ శరీరం నెమ్మదిగా వ్యర్థాలు మరియు అధిక నీటిని తొలగించగలిగే సామర్థ్యం కోల్పోతుంది. క్రమంగా శరీరంలో వ్యర్ధాలు పేరుకుని పోయి, ఇతరత్రా వ్యాధులకు కారణంగా మారడమే కాకుండా, ప్రాణాంతకంగా కూడా మారుతుంది.

7 warning signs of kidney disease every woman should pay attention to


తగ్గిన రక్త సరఫరా, మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడం లేదా కొన్ని మందుల యొక్క విషపూరిత ప్రభావం (ఇబుప్రోఫెన్ మరియు నాప్రాక్సెన్, జెంటామైసిన్ లేదా లిథియం యొక్క అధిక మోతాదుల ఫలితంగా) కిడ్నీ వైఫల్యం సంభవించవచ్చు.

అనేక సందర్భాలలో తక్కువ కాల వ్యవధిలోనే మూత్రపిండ వైఫల్యాలు తీవ్రరూపం దాలుస్తుంటాయి.

దీర్ఘకాలిక మూత్రపిండ వైఫల్యం తరచుగా మధుమేహం, అనియంత్రిత రక్తపోటు, సంక్రమణలు, స్వీయ రోగనిరోధక లోపాలు మరియు ఊబకాయంతో సంబంధం కలిగి ఉంటుంది.

ప్రజలకు వారి మూత్రపిండాలు సరిగా పనిచేయడం లేదని తెలియకపోవడమే ప్రధానమైన సమస్యగా ఉంటుంది. క్రమంగా ఇతరత్రా అవయవాల మీద ప్రభావం చూపి, హార్మోనుల నుండి జీవక్రియల దాకా ప్రభావం చూపి, సమస్యలు జఠిలం అయిన తర్వాతనే, వైద్యుని చేత ధ్రువీకరించబడే పరీక్షలలో కిడ్నీ వైఫల్యం గురించి తెలుస్తుంటుంది. మరోవైపు, ఈ మూత్రపిండాల వ్యాధి సాధారణంగానే కొన్ని నిర్దిష్ట లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది అనేక ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో ముడిపడి, శరీరంలో తీవ్ర గందరగోళాన్ని సృష్టించగలదు..

మూత్రపిండ వ్యాధిని సూచించే ఈ హెచ్చరికల పట్ల అవగాహన కలిగి ఉండడం మేలు :

7 warning signs of kidney disease every woman should pay attention to

#1 కళ్ళు ఉబ్బడం :

వైఫల్యం చెందిన మూత్రపిండాలు, శరీరంలో తగినంత ప్రోటీన్ నిల్వలను ఉంచలేవు. క్రమంగా ఈ ప్రోటీన్ లేని కారణంగా, శరీరంలో నీటి నిలుపుదలకు మరియు కళ్ళు ఉబ్బడానికి కారణం అవుతుంది.

7 warning signs of kidney disease every woman should pay attention to

#2 అతిమూత్ర విసర్జన :

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న ప్రజలు సాధారణంగా తరచుగా మూత్ర విసర్జన అనుభూతికి లోనవుతుంటారు., ముఖ్యంగా రాత్రి సమయాలలో.

7 warning signs of kidney disease every woman should pay attention to

# 3 బలహీనత మరియు ఏకాగ్రత సమస్యలు :

మూత్రపిండాలు మీ శరీరం నుండి విష తుల్య రసాయనాలను తొలగించగల సామర్థ్యాన్ని కోల్పోతుండటం కారణంగా, ఈ పదార్థాలు రక్తంలో పేరుకుని పోయి, తీవ్రమైన అలసటకు కారణంగా మారడమే కాకుండా, మీ ఏకాగ్రతను సైతం బలహీనపరుస్తాయి. అంతేకాక, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి మూత్రపిండాలు మద్దతునిస్తాయని మీరు గుర్తుంచుకోవాలి. అనారోగ్యకర మూత్రపిండాలు ఈ పనిని సరిగ్గా చేయలేవు. ఫలితంగా, మీరు అనీమియా (రక్త హీనత) వంటి సమస్యలతో సైతం పోరాడవలసి ఉంటుంది. ఇది మైకము, అలసట మరియు జుట్టు రాలడం వంటి సమస్యలకు దారితీస్తుంది.

7 warning signs of kidney disease every woman should pay attention to

# 4 కాళ్ళ వాపు :

శరీరంలో అధిక ద్రవం పేరుకోవడం కారణంగా., సాధారణంగా అడుగులు మరియు చీలమండల వంటి, దిగువ అంత్య భాగాలలో నీరు నిల్వ చేయబడుతుంది. ఇది సోడియం నిలుపుదల ఫలితంగా ఉండవచ్చు, సాధారణంగా ఇది మూత్రపిండ వైఫల్యంతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.

7 warning signs of kidney disease every woman should pay attention to

# 5 ఆకలిని కోల్పోవడం :

ఇది అనేక ఆరోగ్య సమస్యలకు సంకేతంగా ఉంటుంది. మూత్రపిండ వైఫల్యానికి సంబంధించిన హానికరమైన పదార్ధాలు లేదా కారకాలు, ఆకలి తగ్గడానికి కారణమవుతుంది.

7 warning signs of kidney disease every woman should pay attention to

#6 చర్మం పొడిబారడం లేదా దురదకు గురవడం :

ఆరోగ్యకరమైన మూత్రపిండాలు ఖనిజాలను సమతుల్యం చేస్తూ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో దోహదం చేస్తాయి. కానీ, మూత్రపిండాల వైఫల్యం తలెత్తినప్పుడు ఎలెక్ట్రోలైట్స్ మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. క్రమంగా చర్మం, తీవ్రంగా పొడిబారడం మరియు దురదకు గురవడం వంటి సమస్యలు నెలకొంటాయి. రక్తహీనత కూడా మీ చర్మం పొడిబారడానికి మరియు గీతలకు ప్రధాన కారణం కావచ్చు.

7 warning signs of kidney disease every woman should pay attention to


# 7 కండరాల తిమ్మిరి :

కిడ్నీ వైఫల్యం ఎలెక్ట్రోలైట్ అసమతుల్యతకు కారణమవుతుందని తెలుసుకున్నాం కదా, ఇది క్రమంగా కండరాలను సైతం బలహీన పరుస్తుంది. దీని కారణం చేత, కండరాలు పట్టడం, లేదా తిమ్మిరి వంటి సమస్యలు ఎదురవుతుంటాయి.

కావున పైన చెప్పిన ఇటువంటి లక్షణాలలో ఏవైనా మీరు ఎదుర్కొంటున్నఎడల, ఏమాత్రం ఆలస్యం చేయకుండా, వైద్యుని సంప్రదించి తగుపరీక్షలు చేయించుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది.

English summary

ఈ 7 హెచ్చరికలు కిడ్నీ వైఫల్యానికి సంకేతాలుగా ఉంటాయి, ముఖ్యంగా మహిళలలో

7 warning signs of kidney disease every woman should pay attention to
Desktop Bottom Promotion