For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు తరచూ విసుగుకు గురవుతున్నారా? అయితే, ఈ మెడికల్ రీజన్స్ మీ విసుగుకు కారణమవవచ్చు!

|

చిన్న చిన్న కారణాలకే మీరు మీ చుట్టూ ఉన్నవారిపై విసుగు ప్రదర్శిస్తూ ఉంటారా? ఎప్పుడూ విసుగ్గా, చిరాగ్గా ఉంటారా? మీ విసుగుకు అలాగే చిరాకుకు ఎటువంటి కారణం ఉండదా?

అయితే, మీ ప్రవర్తన సాధారణంగా లేదు. ఈ విషయాన్ని మీరు గుర్తించాలి. ప్రతి వ్యక్తిలో వయసుతో అలాగే జెండర్ తో సంబంధం లేకుండా కొన్ని సార్లు విసుగు కనిపిస్తుంది. కొన్ని ఎక్స్టెర్నల్ ఫ్యాక్టర్స్ వలన ఇలా జరుగుతుంది. ఇది సాధారణ విషయమే!

మానవులు సంఘజీవులు. కాబట్టి వారికి సంఘంతో ఆరోగ్యకర సంబంధాలు ఉండాలి. వర్క్ ప్లేస్ లో కానివ్వండి పెర్సనల్ లైవ్స్ లో కానివ్వండి ఆరోగ్యకర సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రాముఖ్యతనివ్వాలి.

ఉదాహరణకి, వర్క్ ప్లేస్ లో ఎవరినైనా తరచూ విసుక్కుంటే మేనేజ్మెంట్ నుంచి మీకు ముప్పు రావచ్చు. అక్కడ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి కూడా తలెత్తవచ్చు. మేనేజ్మెంట్ ఫైర్ చేసే ప్రమాదం ఉండవచ్చు.

కాబట్టి, భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ముఖ్యం. ఒకవేళ, ఎమోషన్స్ పై నియంత్రణ లేకపోతే మీ ఆరోగ్యస్థితిని ఒకసారి మీరు పరిశీలించుకోవాలి.

చికాకు, విసుగు తరచూ కలగడానికి గల మెడికల్ రీజన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

1. క్రానిక్ పెయిన్:

1. క్రానిక్ పెయిన్:

సాధారణంగా, ఏదైనా శారీరక నొప్పితో బాధపడేవారిలో ఇరిటేషన్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని ఏదైనా భాగంలో క్రానిక్ పెయిన్ సమస్య ఉంటే మీరు తరచూ ఇరిటేషన్ కి గురవుతారని ఒక అధ్యయనం స్పష్టం చేస్తోంది. నొప్పి వలన స్ట్రెస్ పెరుగుతుంది. దాంతో స్ట్రెస్ హార్మోన్స్ విడుదలవుతాయి. ఇవి ఒక వ్యక్తికి ఆగ్రహాన్ని ఆలాగే ఇరిటేషన్ ని కలిగిస్తాయి. క్రానిక్ పెయిన్ అనేది మీ చికాకుకు ఒక కారణం అయి ఉండవచ్చు.

2. మైల్డ్ డిప్రెషన్:

2. మైల్డ్ డిప్రెషన్:

డిప్రెషన్ లో వివిధ రకాలున్నాయి. మైల్డ్ డిప్రెషన్ అందులో ఒకరకమైనది. మనలో చాలా మంది డిప్రెషన్ వలన విపరీతమైన బాధ అలాగే విరక్తి కలుగుతాయని అనుకుంటారు. మైల్డ్ డిప్రెషన్ గురించి వారికి అవగాహన లేదు. అయితే, మైల్డ్ డిప్రెషన్ వలన తరచూ అకారణంగా చికాకు కలుగుతుంది. మెదడులోని కెమికల్స్ బాలన్స్డ్ గా లేకపోవటం వలన ఇలా జరుగుతుంది. ఈ కండిషన్ కి చికిత్స అవసరం.

3. ఆందోళన:

3. ఆందోళన:

డిప్రెషన్ తో ఇబ్బంది పడే వారిలాగానే, యాంగ్జైటీ డిజార్డర్స్ తో ఇబ్బంది పడే వారిలో కూడా విపరీతమైన చికాకు కనిపిస్తుంది. వీరు, ఎల్లప్పుడూ ఇరిటేటెడ్ గా ఉంటారు. చిన్న చిన్న కారణాలకు అలాగే ఒక్కోసారి ఎటువంటి కారణం లేకుండా కూడా వీరు ఇరిటేషన్ కు గురవుతారు. బ్రెయిన్ కెమికల్స్ అసమతుల్యం అవడం వలన ఇరిటేషన్ కలుగుతుంది. ఆందోళనతో కూడిన చికాకు ఇది.

4. గుండె సమస్యలు:

4. గుండె సమస్యలు:

ఈ రోజుల్లో గుండె సమస్యలు సాధారణంగా మారిపోయాయి. ముఖ్యంగా, 40 ఏళ్ళు పైబడిన వారిలో గుండె సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. మళ్ళీ, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తించాలి. మనలో చాలా మందికి ఈ విషయం తెలియదు. గుండె జబ్బుల వలన కూడా కాన్స్టెంట్ ఇరిటబిలిటీ సమస్య ఎదురవుతుంది. ఈ విషయాన్ని ఇటీవలి అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. గుండె జబ్బుల వలన బ్రెయిన్ కి ఆక్సీజెనెటేడ్ బ్లడ్ సరఫరా సరిగ్గా ఉండదు. దాంతో, ఇరిటబిలిటీతో పాటు యాంగర్ ఇష్యూస్ తలెత్తుతాయి. బ్రెయిన్ కి తగిన మోతాదులో ఆక్సీజన్ అందకపోవటం వలన ఇలా జరుగుతుంది.

5. ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫారిక్ డిజార్డర్:

5. ప్రీమెన్స్ట్రువల్ డిస్ఫారిక్ డిజార్డర్:

ఈ డిజార్డర్ సిండ్రోమ్ లో మహిళల బ్రెయిన్ లో హార్మోన్ల హెచ్చుతగ్గులను గమనించవచ్చు. పీరియడ్స్ కి చాలా కాలం ముందుగానే ఈ సమస్యను గుర్తించవచ్చు. అందువలన, మూడ్ స్వింగ్స్ తో పాటు ఇరిటబిలిటీ ఎక్కువకాలం కొనసాగుతుంది. పీరియడ్ కి రెండు రోజుల ముందుగా ఈ లక్షణాలు ఎదురైతే దానిని PMS అనంటారు. ఇది సాధారణ సమస్యే. కానీ, పైన వివరించిన కండిషన్ కు చికిత్స అవసరపడుతుంది.

6. డిమెన్షియా:

6. డిమెన్షియా:

వయసు పెరిగే కొద్దీ, బ్రెయిన్ సెల్స్ క్షీణించడం ప్రారంభమవుతాయి. ఈ సమస్యను వృద్ధులు ఎక్స్పీరియన్స్ చేస్తారు. డిమెన్షియా మరియు అల్జీమర్ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. మెమరీ ప్రాబ్లెమ్స్ అలాగే కాగ్నిటివ్ ఎబిలిటీస్ తో పాటు మరిన్ని బ్రెయిన్ ఫంక్షన్స్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉంది. కాన్స్టెంట్ ఇరిటబిలిటీ అనేది డిమెన్షియాకి సంబంధించిన ముఖ్యలక్షణం. నిజానికి,దీనిని డిమెన్షియా కి ఎర్లీ సైన్ గా భావించవచ్చు.

7. హైపోథైరాయిడిజం:

7. హైపోథైరాయిడిజం:

ఈ కండిషన్ లో థైరాయిడ్ గ్లాండ్ అనేది ఎక్కువగా థైరాయిడ్ హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడం జరుగుతుంది. శరీరానికి అవసరమైన వాటికంటే ఎక్కువగా థైరాయిడ్ గ్లాండ్స్ ఉత్పత్తి జరుగుతుంది. అందువలన, శరీరంలో అనేక సమస్యలు కనిపిస్తాయి. హార్మోన్ల హెచ్చుతగ్గులు కూడా ఏర్పడతాయి. వీటి వలన ఇరిటబిలిటీ కలుగుతుంది. అకారణంగా చికాకు కలుగుతుంది.

English summary

8 Medical Reasons Why You Feel Irritated All The Time!

Irritability is an emotion in which people feel angry or annoyed with certain things or people around them. When a person is constantly irritated for tiny reasons, it could be because of some medical reasons which can trigger irritability in people, some of these medical conditions which cause anxiety in people are hypothyroidism, ADHD, dementia, etc.
Desktop Bottom Promotion