For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

థైరాయిడ్ వలన కలిగే అలసటను అధిగమించడానికి ఎనిమిది మార్గాలు

థైరాయిడ్ వలన కలిగే అలసటను అధిగమించడానికి ఎనిమిది మార్గాలు

|

హైపోథైరాయిడిజంతో బాధపడేవారు, నిరంతరం అలసట మరియు నిస్సత్తువతో ఉన్నట్లు భావించడం చాలా సాధారణం. అయితే, మీరు కూడా ఈ కోవకు చెందిన వారు అయితే, మీ శక్తిని పునరుజ్జీవింపచేయడానికి పలు మార్గాలు ఉన్నాయి.

8 Tips for Battling Fatigue When You Have Thyroid Problems,It is incredibly common for those with hypothyroid problems to feel constantly tired and fatigued. However, if you fall into that category, there are still ways to revitalize your energy.Here are 8 tips to help you do just that in a completely natural way.

ఇప్పుడు మీ కొరకు, పూర్తిగా సహజ మార్గంలో ఇది సాధించడానికి ఉపయోగపడే 8 చిట్కాలను తెలియజేస్తున్నాము.

1. సంపూర్ణ ఆహార సప్లిమెంట్లు

1. సంపూర్ణ ఆహార సప్లిమెంట్లు

థైరాయిడ్ పనితీరు సక్రమంగా లేకపోయినా లేదా హైపోథైరాయిడిజంకు గురైనా,మీరు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కీలకం. మీరు తీసుకునే ఆహారం బంగారమంత ఖరీదైనది అయినా అయినా, అందులో చాలా పోషకాలలో లేకపోవచ్చు. సంపూర్ణ ఆహార సప్లిమెంట్లు, మీ ఆహారంలో లోపించిన పోషకాలు మరియు విటమిన్లను అందించడం ద్వారా మీకు సహాయపడుతుంది. ఈ లోపాలను గుర్తించడానికి, ఒకసారి రక్త పరీక్షను చేసి చూడాలి.

2. అడ్రినల్ అలసట?

2. అడ్రినల్ అలసట?

మీ శరీరంలోని మూత్రపిండాలపై ఉండే, అడ్రినల్ గ్రంథులు ఒత్తిడితో కూడిన పరిస్థితులను అధిగమించడంలో మీకు సహాయం పడతాయి. సరిగ్గా పని చేస్తున్నప్పుడు, అవి కార్టిసోల్, ఆడ్రినలిన్ మరియు DHEA ను విడుదల చేస్తారు. ప్రస్తుత గజిబిజి జీవితం కారణంగా, అడ్రినల్ గ్రంధులు పనిచేయక, నిష్ఫలంగా మారిపోయేలా చేస్తుంది.

3. మీరు సరిగ్గా నిద్ర పోతున్నారని నిర్ధారించుకోండి

3. మీరు సరిగ్గా నిద్ర పోతున్నారని నిర్ధారించుకోండి

మీరు సరిగ్గా నిద్రపోకపోతే, మీ శరీరం సరిగ్గా పనిచేయదు. ప్రతిరాత్రి తప్పనిసరిగా 8 గంటల పాటు నిద్ర పోయేట్టు చూసుకోవాలి మరియు దీనిని ఒక అలవాటుగా మార్చుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే నేల మీద నిద్రించండి.

4. మీ రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉండేట్లు చూసుకోండి

4. మీ రక్తంలో చక్కెర స్థాయిని సమతుల్యంగా ఉండేట్లు చూసుకోండి

ఒక ఆరోగ్యకరమైన థైరాయిడ్ స్థాయిని కొనసాగించచడానికి, మీ రక్తంలో చక్కెర స్థాయిని తప్పనిసరిగా సరైన పరిధిలో ఉంచుకోవాలి. అధిక గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన కార్బోహైడ్రేట్లను భుజించడం వలన, ప్యాంక్రియాస్ సాధారణం కన్నా ఎక్కువ ఇన్సులిన్ ను స్రవిస్తాయి. ఇది హైపోగ్లైసీమియాకు దారితీసి, క్రమంగా టైప్ 2 మధుమేహంను కలుగజేస్తుంది. అటువంటి సమయంలో కీటోజనిక్ ఆహారం తీసుకుంటే, రక్తంలో చక్కెరల అసమతుల్యతను పరిష్కరించుకోవచ్చు.

5. అనబాలిక్ వ్యాయామాలను లక్ష్యంగా చేసుకోండి.

5. అనబాలిక్ వ్యాయామాలను లక్ష్యంగా చేసుకోండి.

అనాబాలిక్ వ్యాయామం (కార్డియో మరియు బరువుల శిక్షణ వంటిది), కెటబాలిక్ చర్యకు వ్యతిరేక ఫలితమిస్తుంది. యోగా మరియు తాయ్ చి వంటి వ్యాయామ పద్దతులు, అనబాలిక్ వ్యాయామం యొక్క రూపాలు. కెటబాలిక్ వ్యాయామం వలె కండరాల నొప్పి, శరీరంపై ఒత్తిడి మరియు అలసటను కలిగించవు.

6. విటమిన్ B12 తీసుకోండి

6. విటమిన్ B12 తీసుకోండి

విటమిన్ B12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. ఆరోగ్యకరంగా మరియు క్రియాశీలకంగా ఉండటానికి అవసరమైన, శక్తి ఉత్పత్తిలో సహాయపడుతుంది. హషిమోటో వంటి థైరాయిడ్ సంబంధిత పరిస్థితులు బి 12లోపం మూలాన కలుగుతాయి. అలసటతో మరియు బలహీనమైన అనుభూతి చెందే అవకాశం కూడా ఉంటుంది.

B12 శక్తి ఉత్పాదన, డి. ఎన్. ఏ సంశ్లేషణ మరియు రక్తం ఏర్పడటానికి బాధ్యత వహిస్తుంది కనుక అది లోపించినప్పుడు మనం అలసిపోతాము.

7. చలువ కళ్ళద్దాలను వదిలేయండి

7. చలువ కళ్ళద్దాలను వదిలేయండి

అవును, కళ్ళద్దాలను పెట్టుకుంటే మీరు సూపర్ కూల్ గా కనిపించవచ్చు కానీ సూర్యుని సహజ కిరణాలు, మీ కంటిని తాకినప్పుడు, మీ శరీర ఎండోక్రైన్ వ్యవస్థ ప్రేరేపింపబడుతుంది. మీరు పనులలో నిమగ్నమయినప్పుడు, మీ సన్ గ్లాసెస్ ను కారులో వదిలివేయడానికి ప్రయత్నించండి. వాస్తవానికి, మీ భద్రతకు అవసరమైనప్పుడు తప్ప ( డ్రైవింగ్ చేస్తున్నప్పుడు) తప్ప, సాధ్యమైనంతవరకు వాటిని నివారించడానికి ప్రయత్నించండి.

మీరు సన్ గ్లాసెస్ ధరించినప్పుడు, మీ కళ్ళకు అడ్డుగా నల్ల అద్దం ఉండటం మూలాన తక్కువ కాంతి మరియు రేడియేషన్ కాంతిని చేరడం వలన, మీ శరీరం అతినీలలోహిత కాంతి మరియు రేడియేషన్ నుండి సంరక్షణను కల్పించే చర్యలను తగ్గిస్తుంది.

8. కొంత ఐరన్ తీసుకోండి

8. కొంత ఐరన్ తీసుకోండి

ఐరన్ ను ఉపయోగించి మన శరీరంలో ఉత్పత్తి చేయబడే ఒక ప్రోటీన్, రక్త కణాల ద్వారా శరీరానికి అవసరమైన ఆక్సిజన్ ను బట్వాడా చేయటానికి సహాయపడుతుంది. మీ రక్తంలో ఐరన్ తక్కువగా ఉన్నప్పుడు, మీరు చాలా నీరసాన్ని అనుభూతి చెందుతారు. శరీరానికి బలహీనంగా అనిపించడంతో పాటుగా, చికాకుగా మరియు ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు భావించడం గమనించవచ్చు.

ఐరన్ లోపం అనేది సాధారణంగా వైద్యులు, రోగుల వద్ద నుండి వచ్చే ఫిర్యాదులలో ఒకటి. దీనిని ఎరుపు-రంగుతో కూడిన ఆహార పదార్థాలను తినడం ద్వారా సులభంగా నివారించవచ్చు.

English summary

8 Tips for Battling Fatigue When You Have Thyroid Problems

8 Tips for Battling Fatigue When You Have Thyroid Problems,It is incredibly common for those with hypothyroid problems to feel constantly tired and fatigued. However, if you fall into that category, there are still ways to revitalize your energy.Here are 8 tips to help you do just that in a completely natural way.
Story first published:Monday, September 10, 2018, 17:08 [IST]
Desktop Bottom Promotion