For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంగస్తంభన సమస్యను పారద్రోలే ఆహార పదార్థాలు !

|

లైంగిక చర్యలో మీరు అసమర్థుడిగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు మీ జీవితంలో ప్రధాన ఇబ్బందులు ఎదురవుతాయి. నేటి రోజువారీ జీవితం ఒత్తిడులతోనూ & బిజీ షెడ్యూల్తో కూడినదుగా ఉండటంతో అంగస్తంభన అనేది నేటి యువతలో చాలా సాధారణమైన సమస్యగా ఉంది.

అంగస్తంభన అంటే ఏమిటి?

లైంగిక సంభోగ సమయంలో పురుషుల అంగాన్ని అసమర్థమైన (గట్టిపడలేని) స్థితిలో ఉండటం. దీనినే 'నపుంసకత్వము'గా సూచిస్తారు. మీరు తరచుగా అంగస్తంభనను ఎదుర్కొంటుంటే, అది ఒక ఒత్తిడితో కూడిన రోజు కంటే మరింత తీవ్రమైన పరిణామాలను కలుగజేయవచ్చు.

Adding These Foods In Your Diet May Help Fight Erectile Dysfunction

అంగస్తంభన లక్షణాలు:

ఈ కింది లక్షణాలు ఏవైనా రెండు నెలల కన్నా ఎక్కువ ఉంటే, మీరు మీ వైద్యుడిని సంప్రదించవలసిన అవసరం తప్పనిసరిగా ఉంది.

• లైంగిక సంభోగ సమయంలో మీరు తగిన సామర్థ్యాన్ని కలిగిలేకపోవడం.

• సెక్స్లో ఆసక్తి లేకపోవడం.

• ఒక అంగస్తంభనను సాధించలేకపోవడం.

మీరు మీ డాక్టర్ను సంప్రదించినప్పుడు, అతను కొన్ని పరీక్షలను నిర్వహించిన తర్వాత చివరిగా వచ్చిన ఫలితాలను బట్టి ఒక నిర్ధారణకు రాగలడు. ఈ ఏర్పడడానికి గల లోపాలను గుర్తించి, చికిత్స చేయడానికి సంపూర్ణమైన శారీరక పరీక్ష అవసరం.

మీ జీవనశైలిలోనూ, తీసుకునే ఆహారంలోనూ కొన్ని మార్పులను చెయ్యడం ద్వారా మీరు అంగస్తంభన సమస్యకు చికిత్సను అందించి, దానిని పూర్తిగా నివారించడానికి సహాయపడతాయి.

మీ డాక్టర్ సూచించిన చికిత్సలతో పాటు, మీ జీవనశైలిని & ఆహార నియమాలను సరైన క్రమంలో సవరించడం ద్వారా మీరు చాలా మెరుగుదలను తీసుకురావచ్చు. దీనిలో భాగంగా వ్యాయామంతో ఆరోగ్యకరమైన బరువును కలిగి చాలా అవసరం.

మద్యపానం & ధూమపానం నుండి దూరంగా ఉండండి. మీ ఒత్తిడి స్థాయిలను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. వీటితో పాటు, బాగా సమతుల్య, పోషకాలను కలిగిన ఆహారమును తీసుకోవడం చాలా ముఖ్యం. అంగస్తంభన సమస్యను దూరం చేసేందుకు సహాయపడే ఆహారాల గూర్చి మీరు తెలుసుకోవాలి, ఆ వివరాలను తెలుసుకోవడం కోసం పూర్తిగా ఈ వ్యాసాన్ని చదవండి.

అంగస్తంభన సమస్యపై పోరాటానికి సహాయపడే ఆహార పదార్థాలు :

పరిశోధనకు కావలసిన సమాచార కొరత ఉన్నప్పటికీ, కొన్ని ఆహారాలు అంగస్తంభన సమస్యకు చికిత్స చెయ్యడంలో సహాయపడతాయి. మీరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు, అటువంటి ఆహారాలను మీ డైట్లో చేసుకోవడంలో ఎలాంటి హాని లేదు. అంగస్తంభన సమస్యను నివారించడానికి మాత్రలను & పంపులను ఉపయోగించకుండా, మీ రోజువారీ ఆహారంలో ఈ క్రింది తెలిపిన ఆహారాలను చేర్చండి.

• పుచ్చకాయ:

• పుచ్చకాయ:

ఇది సహజసిద్ధమైన "వయాగ్రా" గా పిలవబడుతుంది, పుచ్చకాయలో సిట్రులిన్ అనే ఒక అమైనో ఆమ్లమును కలిగి ఉంటుంది, ఇది ఒక అంగస్తంభన చికిత్సకు మందులు ఏ విధంగా అయితే రక్తనాళాలకు విశ్రాంతిని చేకూర్చి, పొడవుగా చేయడంలో సాయపడుతున్న అదేవిధంగా ఇది కూడా అదే పనితనాన్ని కలిగి ఉంటున్నాయి. కొన్ని అధ్యయనాలు కూడా ఈ పండు కూడా మీ లైంగిక సామర్థ్యమును పెంచుతుందని కూడా నిరూపించబడింది. లైకోపీన్తో పూర్తిగా నిండి ఉన్న ఈ పుచ్చకాయ మీ గుండెకు, చర్మానికి & ప్రోస్టేట్కు చాలా మంచిది.

• కాఫీ:

• కాఫీ:

మనకు శక్తినందించే పానీయాలలో ఇది ఒకటి. ఉదయాన్నే (లేదా) పని చేసి బాగా అలసిపోయిన తర్వాత, కాఫీ మీలో ఉన్న శక్తి స్థాయిలను బాగా పెంచగలదు. మీ లైంగిక జీవితాన్ని సంపూర్ణం చేసే వాటిలో కాఫీ ఒకటే ఉంది. ఒక అధ్యయనం ప్రకారం, రోజుకు కనీసం 2-3 కప్పుల కాఫీని తాగే పురుషులు అంగస్తంభన సమస్యతో తక్కువగా బాధపడుతున్నారు. ఎందుకంటే కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచుతుంది.

• డార్క్ చాక్లెట్:

• డార్క్ చాక్లెట్:

మీ గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిదని అందరూ భావిస్తారు, అలాగే ఇవి కూడా ఇతర అవయవాల సక్రమమైన పనితీరుకు బాగా సహాయపడతాయి. కొన్ని రుచికరమైన డార్క్ చాక్లెట్లు రక్తపోటును తగ్గించి, రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఎందుకంటే వీటిలో ఫ్లవనాయిడ్స్ చాలా అధిక మోతాదులో ఉన్నాయి. డార్క్ చాక్లెట్లు మీ శరీరం నుంచి నైట్రిక్ ఆక్సైడ్ను మరింతగా ఉత్పత్తి చేసేందుకు వీలు కల్పిస్తుంది, ఇది అంగస్తంభన సమస్యను దూరం చేసేందుకు సహాయపడుతుంది. అంగస్తంభన సమస్యను పోగొట్టే మందుల పనితీరు కూడా ఇదే ప్రధాన అంశంపై పని చేస్తుంది.

• నట్స్:

• నట్స్:

అర్జినైన్ అనే అమైనో ఆమ్లము, మన శరీరం నైట్రిక్ ఆక్సైడ్ను ఉత్పత్తి చేయడానికి వినియోగించబడుతుంది, ఈ అర్జినైన్లతోనే నట్స్ పూర్తిగా నిండివుంటాయి. మీ రోజువారీ ఆహారంలో కొంచెం నట్స్ను చేసుకోవడం చాలా మంచిది. ఈ నట్స్ ఫోల్లిక్ ఆమ్లం, ఫైబర్ & విటమిన్ E వంటి ఇతర వనరులను కూడా మనకు అందిస్తుంది.

• వెల్లుల్లి:

• వెల్లుల్లి:

ధమనుల గోడలపై ఫలకాన్ని ఏర్పడటం వల్ల రక్త ప్రవాహం నెమ్మదించి మీ లైంగిక జీవితానికి ప్రధాన అవరోధంగా మారుతుంది. వెల్లుల్లి మీ ధమనులలో ఉన్న అడ్డంకుల్ని తొలగించి, మీ ధమనులు ఆరోగ్యకరమైనవిగా ఉండేలా నిర్ధారిస్తుంది.

• జ్యూస్:

• జ్యూస్:

ద్రాక్షరసాలలో కనిపించే పోషకాలు మీ శరీరం ఉత్పత్తి చేసే నైట్రిక్ ఆక్సైడ్ల స్థాయిల మొత్తాన్ని పెంచుతాయి. దానిమ్మ జ్యూస్ కూడా అదే ప్రభావాన్ని కలిగి ఉంటాయి.

• ఆకుపచ్చని ఆకుకూరలు:

• ఆకుపచ్చని ఆకుకూరలు:

శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను ప్రేరేపించడం ఈ ఆకుకూరలు కూడా పోషకాల కేంద్రంగా ఉన్నాయి.

• పెప్పర్స్:

• పెప్పర్స్:

మీ ఆహారంలో ఘాటైన పెప్పర్స్ను కలుపుకోవడం వల్ల, ఖచ్చితంగా మీ జీవితంలో ప్రేమను ఆస్వాదించవచ్చు. ఇది ధమనులకు విశ్రాంతిని చేకూర్చి, శరీరంలో ఉన్న అన్ని అవయవాలకు (పురుషాంగంతో సహా) రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి.

• ఫిష్:

• ఫిష్:

కొవ్వు చేపలలో ఉన్న ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మీ శరీరంలోని నైట్రిక్ ఆక్సైడ్ స్థాయిలను పెంచుతాయి. ఇది రక్తపోటును తగ్గిస్తుంది.

English summary

Adding These Foods In Your Diet May Help Fight Erectile Dysfunction

When a man is unable to maintain his erection, it could be because of erectile dysfunction (ED). Including certain foods in your diet and following a healthy lifestyle can help in fighting ED. Including coffee, watermelon, dark chocolate, oyesters, nuts, olive oil, green leafy veggies, fruit juices, fatty fishes and peppers in your diet can help lower the risk.
Desktop Bottom Promotion