For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మెడిసిన్ (లేదా) సర్జరీల వంటివి అవసరం లేకుండానే గురకను నివారించడం ఎలా ?

మెడిసిన్ (లేదా) సర్జరీల వంటివి అవసరం లేకుండానే గురకను నివారించడం ఎలా ?

|

రాత్రంతా నిరంతరమైన గురక శబ్దం వల్ల మీరు నిద్రను కోల్పోతున్నారు, అవునా ? మీ భాగస్వామి (లేదా) రూమ్మేట్ కోరిక మేరకు ప్రతిరోజూ రాత్రి మీరు డ్రాయింగ్ గదిలో నిద్రించాలా ? మీరు ఇలాంటి పరిస్థితుల నుండి బయట పడటం కోసం తగిన చర్యలు తీసుకోవడానికి ఇదే సరైన సమయం.

సాధారణ వయోజనులలో 45 శాతం మంది గురక తీసిన వారు ఉన్నప్పటికీ, వారు ఇటువంటి అనారోగ్యంతో బాధపడుతున్నారని చాలా కొద్ది మాత్రమే తెలుసుకుంటారు. మీ కుటుంబ సభ్యులు కలుసుకునే సమావేశాలలో దీని గురించి మాట్లాడుకునే జోకులు వేసుకోవడం అనేది ప్రారంభం మాత్రమే కాగా, దీని పర్యవసానంగా మీ జీవిత భాగస్వామి తరచుగా వేరొక బెడ్రూమ్లోకి వెళ్లి నిద్రపోవడానికి దారితీస్తాయి. అవును, అనేక వివాహ బంధాలలో ఈ సమస్య ప్రముఖ "విలన్గా" ఉన్నది. ఆ విషయాన్ని పక్కన పెడితే, గురక సమస్యతో బాధపడే 75శాతం మంది ప్రజలు స్లీప్-అప్నియాకు గురవుతున్నారు, ఈ పరిస్థితి వల్ల మీరు నిద్రలో ఉన్నప్పుడు - మీరు శ్వాసను తీసుకోవడంలో ఎదురయ్యే అంతరాయాల వల్ల భవిష్యత్తులో మీకు గుండె వ్యాధులు ఎదురయ్యే ప్రమాదముంది.

How To Beat Snoring Without Medicine Or Surgery?

మరికొందరు, ఈ గురక సమస్యను దూరంగా ఉంచటానికి ప్రమాదకరమైన మాత్రలను & స్ప్రే లను ఉపయోగిస్తూ, స్వీయ చికిత్సను పొందేందుకు ప్రయత్నిస్తారు. ఇలాంటి చికిత్సా విధానాల్లో దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు సరైన చికిత్సను పొందడం కోసం మీ డాక్టర్ను సంప్రదించడం తప్పనిసరి. ఎందుకంటే, గురకను చికిత్స చేయడానికి అనేకరకాలైన ఔషధాలు మార్కెట్లో లభ్యమయ్యేనప్పటికీ వాటిలో చాలామటుకు సరైన శాస్త్రీయ అధ్యయనాలు లేకుండానే విక్రయించబడుతున్నాయి. వీటికి బదులుగా మీరు సహజసిద్ధమైన పరిష్కారమార్గాలను పాటించడానికి ప్రయత్నించండి, ఇలా చేయడం వల్ల మీ మౌలిక జీవన శైలిలో మార్పులను తీసుకువచ్చి మీ గురకను ఆపడానికి సహాయం చేస్తాయి.

1. శరీర అధిక బరువును తగ్గించుకోండి :-

1. శరీర అధిక బరువును తగ్గించుకోండి :-

అధిక బరువు గల వ్యక్తులలో గురుక తలెత్తే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయని అనేక పరిశోధనలో నిరూపించబడ్డాయి. శరీరంలో అధిక కొవ్వు చేరటం వల్ల, అది మీ మెడ ప్రాంతంలో శ్వాస సంబంధిత మార్గాలకు అడ్డుగా ఏర్పడటం ద్వారా మీరు ఒత్తిడితో కూడిన శ్వాసను పీల్చుకునేలా చేస్తుంది. ఈ కారణంచేతనే చాలామంది గురకను తీస్తుంటారు.

మీరు సరైన ఆహారాన్ని తీసుకొని, తరచుగా వ్యాయామాన్ని చేయటం వల్ల శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగి, తీవ్రమైన గురక ప్రభావాన్ని నెమ్మదించేలా చేస్తుంది.

2. స్వతహాగానే మీ సొంత సలై నాసల్ను తయారుచేసుకోండి :-

2. స్వతహాగానే మీ సొంత సలై నాసల్ను తయారుచేసుకోండి :-

కొన్నిసార్లు జలుబు, అలర్జీ రినైటిస్ (లేదా) సైనస్ వంటి అంటువ్యాధులు మీ గురకకు కారణం కూడా కావచ్చు. ఇవన్నీ కూడా మీ ముక్కు అంతర్గత లైనింగ్ పొరకు వాపును కలిగించేలా దారితీస్తూ, మీ మృదువైన అంగిలికి ఇబ్బందులను కలిగించవచ్చు.

3. కొన్ని ప్రత్యేక వ్యాయామాలను సాధన చేయాలి :

3. కొన్ని ప్రత్యేక వ్యాయామాలను సాధన చేయాలి :

- మీ గురకను క్రమంగా తగ్గించడానికి లక్ష్యంగా చేసుకున్న కొన్ని సున్నితమైన కండరాలపై ప్రభావం చూపేలా కొన్ని ఫేషియల్ ఎక్సర్సైజులను చేయాలి. ఈ రకమైన వ్యాయామాలు గొంతు, దవడ, నాలుక కండరాలను బలపరచడంలో కూడా సహాయపడతాయి.* మీ కింద దవడను బాగా కిందకి తెరచి, పళ్ళు బయటకు కనబడేలా 10 సెకన్లపాటు అలానే తెరిచి ఉంచండి. ఇలా రోజులో అనేకసార్లు చేయడానికి ప్రయత్నించండి.

* మీ నాలుకను నేరుగా బయటకు పెట్టి, సాధ్యమైనంతవరకు చాపడానికి ప్రయత్నించండి. ఇలా మీరు మీ నాలికతో పెదాలు చివరల వరకు తాకుతూ ఉండేలా అటుఇటు తిప్పుతూ ఉండండి. ఇలా చాలాసార్లు చేయడం వల్ల మీ నాలుక తిన్నగా ఉంటుంది.

మీరే మంచం మీద పడుకొనే ముందు మీ తల కాస్త పైకి ఎత్తుగా ఉండేలా దిండును ఉంచండి. మీరు పక్కకు తిరిగి పడుకోవటం వల్ల మీకు గురక వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

4. ధైమ్ ఆయిల్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి :-

4. ధైమ్ ఆయిల్ను ఉపయోగించడానికి ప్రయత్నించండి :-

ఈ ఆయిల్లో ఉండే అద్భుతమైన యాంటీవైరల్, యాంటీ పరాసిటిక్, యాంటీ ఫంగల్ లక్షణాల గూర్చి యుగాల కాలం నాటి నుంచి మానవులకి బాగా తెలుసు. ఈ సమ్మేళనాలు అన్నీ కలిపి మనకు నాణ్యమైన నిద్రను అందిస్తాయి.

ఈ నూనెతో మీ పాదాల కింద మర్ధనా చేయడానికి ప్రయత్నించండి. మీరు ఈ నూనెను నేరుగా వాడాలనుకున్నట్లయితే 2 చుక్కలు కంటే ఎక్కువ వాడకూడదు. గర్భిణి స్త్రీలు లేదా రక్తపోటు ఉన్నవారు ఈ ధైమ్ ఆయిల్ను ఉపయోగించడానికి బదులుగా యూకలిప్టస్ (లేదా) పెప్పర్మింట్ ఆయిల్ ఉపయోగించమని సిఫారస్ చేయబడింది.

5. వేపోరైజర్ (లేదా) తేమను అందించే సాధనాలను మీతో ఉంచుకోండి :-

5. వేపోరైజర్ (లేదా) తేమను అందించే సాధనాలను మీతో ఉంచుకోండి :-

కొన్నిసార్లు కఠినమైన పొడి గాలి మీ ముక్కు & గొంతు పొరలలో ఒక ఉత్ప్రేరకాన్ని సృష్టించి గురకకు కారణం అవుతుంది. అయితే ఈ సమస్యను పరిష్కరించడానికి మీ బెడ్ రూమ్లో గాలిని చల్లబరిచే సాధనాలను ఉపయోగించండి. ఈ సాధనాలకు కొన్ని చుక్కల రోజ్మేరీ (లేదా) పెప్పర్మింట్ ఆయిల్ను కూడా జత చేయవచ్చు.

అప్పటికీ మీరు గురకతో ఇబ్బంది పడినట్లయితే మీరు వెంటనే డాక్టర్ను సంప్రదించండి. అలర్జీలు ప్రభలమయ్యే సమయంలో మీ శ్వాస మార్గమును క్లియర్గా ఉంచడానికి మీ డాక్టర్ సూచించిన డికోన్జెస్టాంట్లు & యాంటిహిస్టామైన్ల వంటి మందులను తప్పక ఉపయోగించండి. నిద్రపోయే ముందు మీరు ఆవిరిని కొద్ది నిమిషాల పాటు పీల్చడం ద్వారా మంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

6. ఆల్కహాల్ను వినియోగించవద్దు :-

6. ఆల్కహాల్ను వినియోగించవద్దు :-

ఆల్కహాల్ మీ గొంతు వెనక ఉన్న కండరాలకు విశ్రాంతిని తగ్గించేలా చేస్తుంది. నిద్రపోయే 4-5 గంటల ముందు మద్యపానం చేయడం వల్ల, గురకను మరింతగా ప్రేరేపిస్తుంది. సాధారణంగా గురక సమస్య లేనివారు, మద్యం సేవించిన తరువాత గురక తీయడాన్ని మనము నిశితంగా పరిశీలించవచ్చు.

7. మీరు ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉండండి :-

7. మీరు ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉండండి :-

మీరు తీసుకునే రకరకాల పానీయాల వల్ల మీరు ఎల్లప్పుడూ హైడ్రేట్గా ఉంటారు. ఒకవేళ మీరు డీహైడ్రేషన్కు గురైనప్పుడు, మీ మృదువైన అంగిలిలో స్రావాల ఉత్పత్తి మందగించడం వల్ల, ఆ ప్రాంతంలో ఉన్న కండరాలు పొడిగా మారి మరింత ఎక్కువ గురకను సృష్టించేలా చేస్తాయి. ఒక రోజులో పురుషుల శరీరానికి ఆహార పదార్ధాలు & ఇతర పానీయాల నుంచి మొత్తంగా 16 కప్పుల నీరు అవసరమవుతుంది.

8. నాసల్ డిలేటర్స్ :-

8. నాసల్ డిలేటర్స్ :-

ఈ రకమైన ఉపకరణాన్ని ముక్కు లోపలి భాగంలో అమర్చి ఉపయోగించడం ద్వారా మీరు తీసుకునే గాలి నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తోంది. మీరు ముక్కుదిబ్బడ సమస్యను కలిగి ఉన్నప్పుడు సరైన రీతిలో శ్వాసను తీసుకోలేరు, అలాంటప్పుడు మీరు ఈ ఉపకరణాన్ని ఉపయోగించడం ద్వారా రాత్రి నిద్రలో సరైన శ్వాసను మీకు అందిస్తుంది. దీనివల్ల గురక బాధ ఉండదు.

English summary

How To Beat Snoring Without Medicine Or Surgery?

Being the brunt of jokes at family gatherings is just the beginning, but, for some, snoring spouses have often eventually led to sleeping in separate bedrooms. And more dangerously, some of you are self-treating yourself with over-the-counter pills and sprays. Try these basic lifestyle changes to help yourself stop snoring.
Story first published:Thursday, August 9, 2018, 18:00 [IST]
Desktop Bottom Promotion