For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్ ఫోన్ వాడకాన్ని నియంత్రించడం ద్వారా మెదడులో కణుతులు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

|

మొబైల్ ఫోన్లు మన జీవితంతో విడదీయరాని భాగం అయ్యాయి. మనం ఇంట్లో ఉన్నా లేదా ఆఫీసులో ఉన్నా, సెల్ ఫోన్ ను ఉపయోగించకుండా ఏ పని పూర్తి కాదు.

ప్రపంచంలోని సెల్ ఫోన్ ఉపయోగించే వారి సంఖ్య రోజురోజుకు స్థిరంగా పెరుగుతూనే ఉంది. సెల్ ఫోన్లు మన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చినప్పటికీ, అవి హానికరమైన రేడియేషన్ను విడుదల చేస్తాయనేది కొట్టిపడేయలేని వాస్తవం. సెల్ ఫోన్ల వాడకం అధికమైతే, మెదడులో కణితులు ఏర్పడే అవకాశం ఉందనే వార్తలను మనం తరచుగా వింటుంటాము.

 Brain Tumour Risk Can Be Reduced By Regulating Cell Phone Usage

గత రెండు దశాబ్దాల్లో, మెదడు కణితి కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. వీటిలో అత్యధిక భాగం, సెల్ ఫోన్ల నుండి విడుదలయ్యే విద్యుదయస్కాంత రేడియేషన్ కారణంగా జరిగినవేనని చెప్తారు.

సెల్ ఫోన్ ఉపయోగానికి మరియు మెదడు కణితి ఏర్పడటానికి మధ్య సంబంధం:

సెల్ ఫోన్ ఉపయోగానికి మరియు మెదడు కణితి ఏర్పడటానికి మధ్య సంబంధం:

సెల్ ఫోన్ వాడకం వలన కలిగే నష్టాలపై నిర్వహించిన వివిధ అధ్యయనాల ప్రకారం, మీ సెల్ ఫోన్ను మీ చెవికి దగ్గరగా ఉంచినప్పుడు, రేడియోధార్మికతలో 10 నుండి 80 శాతం మెదడుకు రెండు అంగుళాలు లోనికి చొచ్చుకుపోతుందని చెప్పబడింది. పిల్లలలో ఇది ఇంకా లోపల వరకు చొచ్చుకుపోతుంది.

జఠిలమైన కేసుల్లో, దీర్ఘకాలికంగా సెల్ ఫోన్ ను ఉపయోగిస్తే, మెదడులోని న్యూరాన్లు చిట్లిపోయే అవకాశం ఉండవచ్చని అంటారు.

సెల్ ఫోన్లను దీర్ఘకాలం పాటు వినియోగిస్తే మానవ మెదడులో కణితి పెరిగే ప్రమాదాన్ని పెంచుతుంది. కొన్ని అధ్యయనాల ప్రకారం కూడా 25 సంవత్సరాలకు పైగా సెల్ ఫోన్లను ఉపయోగించినవారిలో మెదడు కణితి ప్రమాదం రెట్టింపు అవుతుందని మరియు 20 ఏళ్ల వయసుకు ముందు నుంచి మొబైల్ ఫోన్లను ఉపయోగించడం ప్రారంభించిన వారిలో మూడింతలు ఉంటుందని వెల్లడించారు.

సెల్ ఫోన్ ఉపయోగానికి మరియు మెదడు కణితి ఏర్పడటానికి మధ్య సంబంధం:

సెల్ ఫోన్ ఉపయోగానికి మరియు మెదడు కణితి ఏర్పడటానికి మధ్య సంబంధం:

ఒక రోజులో మీరు అందుకున్న కాల్స్ సంఖ్య , రోజులో మీరు సెల్ ఫోన్ ను వినియోగించే వ్యవధి పై మీ ఆరోగ్య పరిస్థితి ఆధారపడి ఉంటుంది. అతిగా సెల్ ఫోన్ వాడటం వలన మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా దారి తీస్తుంది. సెల్ ఫోన్లను మీ సమీపంలో ఉంచుకోవడం, ముఖ్యంగా నిద్రపోతున్న సమయంలో ఉంచుకున్నట్లైతే, మైగ్రెయిన్, క్రుంగబాటు, ఆందోళన మరియు నిద్రాభంగం వంటి మెదడు అనారోగ్యాన్ని కలిగించే ఇతర సమస్యలకు దారితీస్తుంది.

ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), వారి గత ఏడాది రిపోర్టులో, పది సంవత్సరాల కాలం పాటు రోజుకు 45 నిమిషాలు కంటే ఎక్కువ సమయం పాటు సెల్ ఫోన్లను ఉపయోగించే వ్యక్తుల మెదడులో కణితి (గిల్మోమా)పెరిగే అవకాశం 33 శాతం అధికంగా ఉంటుంది.

నిద్రపోతున్నప్పుడు తమ దిండు క్రింద సెల్ ఫోన్ ఉంచవలన కూడా మెదడులో కణితిలు ఏర్పడుతున్న కేసుల సంఖ్య పెరుగుతుంది. సెల్ ఫోన్ రేడియేషన్ కేవలం పెద్దలను మాత్రమే కాక పిల్లల మెదడు కార్యకలాపాలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. సెల్ ఫోన్ వాడకం వలన వారి మెదడు కణాలు సులభంగా దెబ్బతింటాయి.

WHO యొక్క ఒక విభాగం అయిన, ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్ (IARC), వారు సెల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి వెల్లడించిన తమ సమీక్షలో , సెల్ ఫోన్ వాడకం మానవులకు క్యాన్సర్ కారకమని వెల్లడించింది.

సెల్ ఫోన్ ఉపయోగానికి మరియు మెదడు కణితి ఏర్పడటానికి మధ్య సంబంధం:సెల్ ఫోన్ వాడకం వలన ఆరోగ్యానికి ప్రమాదం ఉందా?

సెల్ ఫోన్ ఉపయోగానికి మరియు మెదడు కణితి ఏర్పడటానికి మధ్య సంబంధం:సెల్ ఫోన్ వాడకం వలన ఆరోగ్యానికి ప్రమాదం ఉందా?

సెల్ ఫోన్లు తమ ఏంటెనా ద్వారా విడుదల చేసే రేడియో తరంగాల ఫ్రీక్వెన్సీ యొక్క శక్తి ఒక రకమైన నాన్ అయోనైజింగ్ రేడియేషన్. దీనికి దగ్గరగా వచ్చిన కణజాలాలు ఈ శక్తిని గ్రహించగలవు.

ఈ రేడియో తరంగాలు యొక్క శక్తి, జీవులలో వేడి పుట్టిస్తుంది. దీనిని ఆహారాన్ని వేడి చేయడానికి ఉపయోగించే మైక్రోవేవ్ ఓవెన్లలోని రేడియేషన్ తో పోల్చవచ్చు.

సెల్ ఫోన్ల నుండి వెలువడే రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి, మన శరీరంలోని ఏ భాగానికి సెల్ ఫోన్ దగ్గరగా ఉంటుందో, అది చెవి అయినా తల అయినా సంబంధం లేకుండా, అక్కడ వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఈ వేడి శరీర ఉష్ణోగ్రత యొక్క పెరుగుదలకు దారితీయనప్పటికి, ఇది దీర్ఘకాలంలో దగ్గరగా వుండే అవయవ భాగాన్ని దెబ్బతీస్తుంది.

ఎవరికి సెల్ ఫోన్ వలన అధిక ప్రమాదం ఉంది?

ఎవరికి సెల్ ఫోన్ వలన అధిక ప్రమాదం ఉంది?

రేడియేషన్ ప్రమాదం అందరిపై ఒకే విధమైన ప్రభావం చూపించినప్పటికీ, కొందరికి రేడియేషన్ వలన కలిగే హాని ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు, ప్రత్యేకించి, వారి కడుపులో ఎదుగుతున్న పిల్లలు, చిన్నపిల్లలు, కౌమారదశలో ఉన్నవారు, తండ్రులు కానీ పురుషులు (రేడియేషన్ శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తుంది) మరియు గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలు (సిగ్నల్ సరిగా ఉండనందున) ఎక్కువగా ప్రభావితమవుతారు.

పిల్లలు చిన్న వయస్సు నుండి సెల్ ఫోన్లను ఉపయోగించడం ప్రారంభించినప్పుడు, వారింకా భవిష్యత్ జీవితకాలంలో కూడా ఫోన్ వాడవలసి ఉంటుంది కనుక, దశాబ్దాలు తరబడి సెల్ ఫోన్ల ఉపయోగం వలన కలిగే హానికరమైన ఆరోగ్య సమస్యలు అన్ని వారికొచ్చే అవకాశం ఉంది. అంతేకాక, చిన్న వయసులో ఉన్న వారి శరీరాలు పూర్తిగా అభివృద్ధి చెందవు కనుక , మరియు సెల్ ఫోన్ రేడియేషన్ వారి శరీరాల్లోనికి సులభంగా చొచ్చుకుపోతుంది.

ఫోన్ లో మాట్లాడేటప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు :

ఫోన్ లో మాట్లాడేటప్పుడు తీసుకోవలసిన కొన్ని జాగ్రత్తలు :

వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రపంచంలో, సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతున్న సమయంలో, పూర్తిగా సెల్ ఫోన్ల ఉపయోగాన్ని నివారించడం కష్టసాధ్యమైన పని. అయితే, వినియోగదారులపై రేడియేషన్ ప్రభావాన్ని తగ్గించడానికి తీసుకోగలిగే చర్యలు కొన్ని ఉన్నాయి. వాటిలో కొన్ని ఆచారసాధ్యమయ్యే మార్గాలను మీ కొరకు తెలియజేస్తున్నాం:

• ఉపయోగంలో లేని సమయంలో ఫోన్ ను వీలైనంత దూరంలో ఉంచండి.

• రోజు రోజుకు సెల్ ఫోన్ లో మాట్లాడే వ్యవధి మరియు వాడుకను పరిమితం చేసుకుంటూ రండి, దీని వలన భారీ వ్యత్యాసాన్ని కనపడుతుంది. మీరు ఎక్కువ సమయం పాటు మాట్లాడవలసి వస్తే, ల్యాండ్ ఫోన్లను వినియోగించండి.

• కణజాల నష్టాన్ని నివారించడానికి కాల్స్ స్వీకరించినప్పుడు హ్యాండ్స్-ఫ్రీ మోడ్ లోకి మారండి.

. గర్భిణీ స్త్రీలు సెల్ ఫోన్ల వాడకాన్ని పరిమితం చేయాలి మరియు శిశువు యొక్క చెవికి దగ్గర్లో సెల్ ఫోన్ ను ఎప్పుడూ ఉంచకూడదు. కాల్స్ లో తక్కువ సమయం పాటు మాట్లాడండి.

• కాల్ చేయడానికి ముందు మీ సెల్ ఫోన్ సిగ్నల్ ను తనిఖీ చేయండి, సిగ్నల్ మంచిగా ఉంటే, రేడియేషన్ తక్కువగా ఉంటుంది.

• ఒక ఫోన్ ను ఛార్జింగ్ లో పెట్టినప్పుడు, అధిక రేడియేషన్ విడుదల అవుతుంది. కాబట్టి, మీరు ఉండని వేరొక రూంలో ఛార్జింగ్ లో పెట్టండి.

• మాట్లాడేటప్పుడు, రేడియో ధార్మికత సమానంగా పంపిణీ చేయబడటానికి వీలుగా, కుడి, ఎడమ చెవులకు ఫోన్ ను తరచూగా మారుస్తూ మాట్లాడండి.

. మాట్లాడటం కన్నా మెసేజ్ పంపించడానికే ప్రాధాన్యత ఇవ్వండి, ఎందుకంటే మాట్లాడటం వలన మరింత రేడియేషన్ విడుదల అవుతుంది.

• నిద్రపోతున్నప్పుడు మీ దిండు క్రింద సెల్ ఫోన్లను ఉంచవద్దు.

చివరిగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే, మొత్తానికి, సెల్ ఫోన్ మనం అవసరమైనప్పుడు ఉపయోగించుకునే ఒక సాధనం మాత్రమే, తప్పనిసరి బాధ్యత కాదు.

English summary

Brain Tumour Risk Can Be Reduced By Regulating Cell Phone Usage

Cell phones have become an inseparable part of our lives. However, there are also certain evidences linking increased use of cell phone to high risk of brain tumours. Plenty of aspects need to be taken care of when using a cell phone including the duration of talk, the signals, charging of cell phones, etc. Pregnant women,
Story first published: Wednesday, July 18, 2018, 16:30 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more