For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సాధారణ జలుబు గురించి మీకు ఇంతవరకూ తెలియని 9 ఆశ్చర్యకర నిజాలు!

|

మన జీవితాలలో మనందరం ఎప్పుడోఅప్పుడు జలుబును కొన్నిసార్లు అనుభవించే ఉంటాం,కదా? జలుబనేది ఏ వయస్సు వారికైనా, స్త్రీ పురుషులెవరికైనా, ప్రపంచవ్యాప్తంగా తరచుగా వచ్చే ఒక స్థితి మరియు అది ఎంత సాధారణమంటే దాని పేరును కూడా కామన్ కోల్డ్ గా వ్యవహరిస్తారు.

ఈ స్థితి పెద్దలోలకన్నా చిన్నపిల్లల్లో ఎక్కువగా చూడవచ్చు ఎందుకంటే పిల్లల రోగనిరోధక వ్యవస్థ కొంచెం బలహీనంగా ఉంటుంది. రోగనిరోధక శక్తి తక్కువ వున్న పెద్దవారికి కూడా జలుబు రావచ్చు.

జలుబు అనేది బ్యాక్టీరియా లేదా వైరస్ ఇన్ఫెక్షన్ వలన శరీరానికి సోకుతుంది. ఇది ఇతర లక్షణాలైన జ్వరం, దగ్గు, తలనొప్పి, వణుకు వంటి వాటితో కలిపి వస్తుంది.

9 Surprising Facts About Common Cold You Never Knew!

సాధారణంగా, జలుబు చేసినప్పుడు, ఇతర లక్షణాలైన జ్వరం,తలనొప్పుల వంటి వాటితో పోలిస్తే తగ్గటానికి ఎక్కువ సమయం పడుతుంది.

జలుబు చేసినప్పుడు, రోజువారీ పనులు చేసుకోటం కొంచెం కష్టమవుతాయి, ఎందుకంటే దాని లక్షణాలు అనుక్షణం అసౌకర్యంగా ఉంటాయి.

జలుబు లక్షణాలు తలనొప్పి, ముక్కు కారుతుండటం, శ్వాస తీసుకోవటంలో కష్టాలు, ముక్కులో దురద,తలనొప్పులు, ముక్కుదిబ్బడ, అలసట మొదలైనవి.

అయితే మీకు తెలియని కొన్ని జలుబు యొక్క వాస్తవాలు ఇవిగో, తెలుసుకోండి.

నిజం#1 పెద్దవారికి ఏడాది 2-5సార్లు జలుబు వస్తుంది

నిజం#1 పెద్దవారికి ఏడాది 2-5సార్లు జలుబు వస్తుంది

గణాంకాల ప్రకారం మరియు సాధారణ జలుబు వచ్చిన చాలామందిపై జరిపిన అధ్యయనాల ప్రకారం పెద్దవారికి ఏడాదికి 2-5సార్లు జలుబుచేస్తుంది, అదే పన్నెండేళ్లలోపు పిల్లలకి ఏడాదికి 6-10సార్లు సగటున జలుబు రావచ్చు! మనం ఇంతకుముందే చదివినట్లు, పిల్లల్లో రోగనిరోధకశక్తి బలహీనంగా ఉంటుంది, అందుకే వారు తరచుగా జలుబుకి గురౌతారు.

 నిజం#2; 60ఏళ్ల వయస్సున్నవారు లేదా అంతకన్నా పెద్దవారికి జలుబు తరచుగా వస్తుంది

నిజం#2; 60ఏళ్ల వయస్సున్నవారు లేదా అంతకన్నా పెద్దవారికి జలుబు తరచుగా వస్తుంది

పన్నెండేళ్ల లోపు పిల్లలకి ఎలాఅయితే జలుబు వస్తుందో, 60ఏళ్ళు లేదా అంతకన్నా పైబడ్డ వయస్సు వారికి కూడా జలుబు తరచుగా వస్తుంది. ఎందుకంటే 60ఏళ్ళ వయస్సు తర్వాత వ్యక్తి యొక్క రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. అందుకని మీ రోగనిరోధక వ్యవస్థను ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంచుకోటానికి ప్రయత్నించడం మంచిది.

నిజం#3 రైనోవైరస్ – జలుబును కలిగించే వైరస్

నిజం#3 రైనోవైరస్ – జలుబును కలిగించే వైరస్

జలుబును కలిగించే వైరస్ ను రైనోవైరస్ అంటారు. ఈ వైరస్ లు భూమిపై ఎప్పటినుంచో ఉన్నాయి, ప్రాచీన ఈజిప్ట్ వైద్య పుస్తకాలలో కూడా వీటి గురించి రాసి ఉంది. ఈ రైనోవైరస్ లు చాలా తీవ్ర వాతావరణ పరిస్థితులు, ప్రదేశాలలో నివసించగలవు, అందుకే ఇన్ని సంవత్సరాలు నిలవగలిగింది మరియు మనుషుల శరీరంలో కూడా నశించటానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది!

నిజం#4 మానవశరీరం బయట రైనోవైరస్ 48 గంటల పాటు జీవించగలదు!

నిజం#4 మానవశరీరం బయట రైనోవైరస్ 48 గంటల పాటు జీవించగలదు!

రైనోవైరస్ ఎంత బలమైనదంటే అది జీవుల బయట 48 గంటల వరకు జీవించగలదు, అంటే రెండు రోజులు! అందుకని ఒక వ్యక్తి జలుబు వైరస్ ఉన్న ఉపరితలాన్ని టచ్ చేసినప్పుడు, వారికి త్వరలోనే జలుబు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రైనోవైరస్ కంప్యూటర్ కీబోర్డులు, ఫోన్లు, కిచెన్ గట్టులు,ఎలివేటర్ బటన్లు, లైట్ స్విచ్ లు, షాపింగ్ మాల్ కార్ట్ లు, టాయిలెట్ టిష్యూరోల్స్ మొదలైనవాటిపై జీవించగలదు.

నిజం#5; సాధారణ జలుబు చిన్నపిల్లల్లో మరియు వృద్ధులలో న్యుమోనియాకి దారితీస్తుంది

నిజం#5; సాధారణ జలుబు చిన్నపిల్లల్లో మరియు వృద్ధులలో న్యుమోనియాకి దారితీస్తుంది

సాధారణంగా, జలుబు ప్రాణాంతకమైనది కాదు మరియు దానితో వచ్చే చిన్న చిన్న ఇబ్బందులు అవంతట అవే తగ్గిపోతాయి. అందుకని,ఎవరూ జలుబును అంతగా పట్టించుకోరు. కానీ అరుదుగా, ప్రత్యేకంగా పిల్లల్లో మరియు వృద్ధులలో, జలుబు ఇతర అనారోగ్యాలైన న్యుమోనియా మరియు శ్వాసకోస సమస్యలకి దారితీస్తాయి, అవి ప్రాణాంతకమైనవి.

నిజం#6 విటమిన్ సి జలుబు రాకుండా నివారిస్తుంది

నిజం#6 విటమిన్ సి జలుబు రాకుండా నివారిస్తుంది

సాధారణ నమ్మకం ఏంటంటే జలుబు వచ్చినపుడు విటమిన్ సి టాబ్లెట్లు వేసుకోవటం జలుబు వైరస్ ను నిర్మూలించే మంచి పద్ధతి అని భావిస్తారు. కానీ పరిశోధనల ప్రకారం, జలుబుతో ఉన్నప్పుడు విటమిన్ సి తీసుకోవడం వలన ఎక్కువ ప్రయోజనం ఉండదు. కానీ నిజానికి, ఇతర సమయాలలో, క్రమం తప్పకుండా , విటమిన్ సి తీసుకోవడం వలన మీ రోగనిరోధక శక్తి బలపడి, తరచుగా జలుబులు రాకుండా ఉంటాయి.

నిజం#7; జలుబు లాలాజలం లేదా లైంగిక ద్రవాల ద్వారా వ్యాపించదు

నిజం#7; జలుబు లాలాజలం లేదా లైంగిక ద్రవాల ద్వారా వ్యాపించదు

చాలామంది జంటలు జలుబు ఉన్నప్పుడు ముద్దుపెట్టుకోవడం లేదా సెక్స్ ను వాయిదా వేస్తారు ఎందుకంటే ముద్దుతో జలుబు వైరస్ వ్యాపిస్తుందని భావిస్తారు. కానీ పరిశోధనల ఫలితాల ప్రకారం లాలాజలం మరియు లైంగిక ద్రవాల ద్వారా, సెక్స్ జరిగినప్పుడు జలుబు వైరస్ లు వ్యాపించే అవకాశం చాలా తక్కువ. మరియు జలుబు సాధారణంగా గాలి మరియు నీటి ద్వారా వ్యాపిస్తుంది. కానీ కొన్ని జలుబు వైరస్ రకాలు చర్మం చర్మం తగిలినప్పుడు కూడా వ్యాపించవచ్చు కూడా.

నిజం#8 జలుబుతో ఉన్నప్పుడు ఒకసారి తుమ్మితే 1 లక్ష వరకు సూక్ష్మజీవులు గాల్లోకి చేరతాయి!

నిజం#8 జలుబుతో ఉన్నప్పుడు ఒకసారి తుమ్మితే 1 లక్ష వరకు సూక్ష్మజీవులు గాల్లోకి చేరతాయి!

జలుబు ఉన్నవారు ఒకసారి తుమ్మినపుడు దాదాపు ఒక లక్ష సూక్ష్మజీవులను గాలిలోకి వదులుతారు! మరియు వాటిల్లో కొన్ని సూక్ష్మజీవులు అదే గాలిని దగ్గర్లో ఉన్న ఒక ఆరోగ్యకరమైన వ్యక్తి పీల్చినపుడు అతనికి సోకుతాయి. ఇక అతను కూడా జలుబు బారిన పడతాడు.

నిజం#9 భోజనం చేసేముందు చేతులు కడుక్కోవటం వలన జలుబు రాదు

నిజం#9 భోజనం చేసేముందు చేతులు కడుక్కోవటం వలన జలుబు రాదు

నిపుణుల ప్రకారం, జలుబుని నివారించే ప్రభావవంతమైన పద్ధతుల్లో రోగనిరోధక శక్తిని ఆరోగ్యంగా ఉంచుకోటంతో పాటు ఇదొకటి, మీ చేతులను తరచూ కడుక్కోవటం, ముఖ్యంగా తినేముందు కడగటం అవసరం. మన చేతులు తరచుగా జలుబును కలిగించే వైరస్ లున్న ఉపరితలాలపై సులభంగా చేరుతూ ఉంటాయి, కడగటం వలన ఈ స్థితి రాకుండా నివారించవచ్చు.

English summary

9 Surprising Facts About Common Cold You Never Knew!

Common cold is one of the most prevalent conditions that affects humans. This condition has no treatment and the immune system has to fight it on its own. Adults fall sick with the flu around 2-4 times a year on an average, but kids are affected by it almost 6-10 times every year!
Story first published:Friday, February 16, 2018, 18:12 [IST]
Desktop Bottom Promotion